ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد * - فهرس التراجم

PDF XML CSV Excel API
تنزيل الملفات يتضمن الموافقة على هذه الشروط والسياسات

ترجمة معاني سورة: الممتحنة   آية:

سورة الممتحنة - సూరహ్ అల్-ముమ్తహనహ్

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا عَدُوِّیْ وَعَدُوَّكُمْ اَوْلِیَآءَ تُلْقُوْنَ اِلَیْهِمْ بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوْا بِمَا جَآءَكُمْ مِّنَ الْحَقِّ ۚ— یُخْرِجُوْنَ الرَّسُوْلَ وَاِیَّاكُمْ اَنْ تُؤْمِنُوْا بِاللّٰهِ رَبِّكُمْ ؕ— اِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهَادًا فِیْ سَبِیْلِیْ وَابْتِغَآءَ مَرْضَاتِیْ تُسِرُّوْنَ اِلَیْهِمْ بِالْمَوَدَّةِ ۖۗ— وَاَنَا اَعْلَمُ بِمَاۤ اَخْفَیْتُمْ وَمَاۤ اَعْلَنْتُمْ ؕ— وَمَنْ یَّفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని - వారి మీద ప్రేమ చూపిస్తూ - వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి[1]. మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి నా మార్గంలో ధర్మయుద్ధం కొరకు వెళితే (ఈ సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి). వారి పట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలా చేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయినవాడే!
[1] 'హుదైబియా సంధి అయిన కొన్ని రోజుల తరువాత మక్కా ముష్రిక్ లు దానిని ఉల్లంఘిస్తారు. దానికి దైవప్రవక్త ('స'అస) రహస్యంగా యుద్ధసన్నాహాలు ప్రారంభిస్తారు. 'హా'తిబ్ బిన్ అబీ బల్త్అ (ర.'ది.'అ.) అనే బదరీ 'స'హాబి ఈ విషయాన్ని ఒక పత్రం మీద వ్రాసి మక్కాకు పోయే ఒక స్త్రీకి ఇస్తాడు. ఈ విషయం దైవప్రవక్త ('స'అస) కు వహీ ద్వారా తెలుస్తుంది. అతను ('స'అస) అలీ, ముఖ్దాద్ మరియు 'జుబైర్ (ర'ది.'అన్హుమ్)లతో: రవ్'దయే'ఖా'ఖ్, దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆమె దగ్గర ఒక ఉత్తరం ఉంది. దానిని తీసుకురండి!' అని పంపుతారు. వారు ఆ ఉత్తరాన్ని ఆమె తల వెంట్రుకల నుండి తీయించి తెస్తారు. 'హా'తిబ్ (ర'ది.'అ.) ను ప్రశ్నించగా: 'నేను ఖురైషును కాను. నా భార్యాపిల్లలు మక్కాలో నిస్సహాయులుగా ఉన్నారు. నేను ఖురైషులకు ఈ వార్త ఇస్తే వారు నా భార్యాపిల్లల పట్ల కనికరులుగా ఉంటారని ఇలా చేశాను.' అని అంటాడు. దైవప్రవక్త ('స'అస) అతని సత్యాన్ని తెలుసుకొని అతనిని క్షమిస్తారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స.'బుఖారీ, 'స.ముస్లిం).
التفاسير العربية:
اِنْ یَّثْقَفُوْكُمْ یَكُوْنُوْا لَكُمْ اَعْدَآءً وَّیَبْسُطُوْۤا اِلَیْكُمْ اَیْدِیَهُمْ وَاَلْسِنَتَهُمْ بِالسُّوْٓءِ وَوَدُّوْا لَوْ تَكْفُرُوْنَ ۟ؕ
ఒకవేళ వారు మీ మీద ప్రాబల్యం వహిస్తే, వారు మీకు విరోధులవుతారు. మరియు కీడుతో మీ వైపుకు తమ చేతులను మరియు తమ నాలుకలను చాపుతారు[1]. మరియు మీరు కూడా సత్యతిరస్కారులై పోవాలని కోరుతారు.
[1] అంటే తమ చేష్టలతో మరియు మాటలతో మిమ్మల్ని వేధిస్తారు.
التفاسير العربية:
لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ ۛۚ— یَوْمَ الْقِیٰمَةِ ۛۚ— یَفْصِلُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు.[1] ఆయన పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
[1] చూడండి, 80:34.
التفاسير العربية:
قَدْ كَانَتْ لَكُمْ اُسْوَةٌ حَسَنَةٌ فِیْۤ اِبْرٰهِیْمَ وَالَّذِیْنَ مَعَهٗ ۚ— اِذْ قَالُوْا لِقَوْمِهِمْ اِنَّا بُرَءٰٓؤُا مِنْكُمْ وَمِمَّا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؗ— كَفَرْنَا بِكُمْ وَبَدَا بَیْنَنَا وَبَیْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَآءُ اَبَدًا حَتّٰی تُؤْمِنُوْا بِاللّٰهِ وَحْدَهٗۤ اِلَّا قَوْلَ اِبْرٰهِیْمَ لِاَبِیْهِ لَاَسْتَغْفِرَنَّ لَكَ وَمَاۤ اَمْلِكُ لَكَ مِنَ اللّٰهِ مِنْ شَیْءٍ ؕ— رَبَّنَا عَلَیْكَ تَوَكَّلْنَا وَاِلَیْكَ اَنَبْنَا وَاِلَیْكَ الْمَصِیْرُ ۟
వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది." ఇక ఇబ్రాహీమ్ తన తండ్రితో: "నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు." అని మాత్రమే అనగలిగాడు.[1] (అల్లాహ్ తో ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము[2] మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలుతున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది.
[1] కాని అతని తండ్రి ముష్రిక్ గా మరణించిన తరువాత ఇబ్రాహీమ్ ('అ.స.) తన తండ్రితో సంబంధం తెంపుకున్నాడు. చూడండి, 9:114 మరియు చూడండి, 195:47-48.
[2] తవక్కల్: అంటే వీలైనంత వరకు ప్రయత్నం చేసి, ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) పై నమ్మకం ఉంచుకొని, అల్లాహ్ (సు.తా.)పై ఆధారపడాలి. అలా చేయకుండా అల్లాహ్ (సు.తా.) పైన మాత్రమే ఆధారపడి ఉంటామనడం తగినది కాదు. దైవప్రవక్త ('స'అస) దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. అతడు తన ఒంటెను బయటవిడిచి లోపలికి వెళ్తాడు. దైవప్రవక్త ('స'అస) అడగ్గా ఇలా అంటాడు: 'నేను ఒంటెను అల్లాహ్ కు అప్పగించి వచ్చాను.' దైవప్రవక్త ('స'అస) అంటారు: 'ఇది తవక్కల్ కాదు. మొదట దానిని కట్టి ఉంచు తరువాత అల్లాహ్ (సు.తా.) పై ఆధారపడు!' (తిర్మిజీ')
التفاسير العربية:
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۚ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు[1] మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు."
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:85.
التفاسير العربية:
لَقَدْ كَانَ لَكُمْ فِیْهِمْ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ یَرْجُوا اللّٰهَ وَالْیَوْمَ الْاٰخِرَ ؕ— وَمَنْ یَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟۠
వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి[1] - వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి).
[1] చూడండి, 33:21.
التفاسير العربية:
عَسَی اللّٰهُ اَنْ یَّجْعَلَ بَیْنَكُمْ وَبَیْنَ الَّذِیْنَ عَادَیْتُمْ مِّنْهُمْ مَّوَدَّةً ؕ— وَاللّٰهُ قَدِیْرٌ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్ (ప్రతిదీ చేయగల) సమర్ధుడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
التفاسير العربية:
لَا یَنْهٰىكُمُ اللّٰهُ عَنِ الَّذِیْنَ لَمْ یُقَاتِلُوْكُمْ فِی الدِّیْنِ وَلَمْ یُخْرِجُوْكُمْ مِّنْ دِیَارِكُمْ اَنْ تَبَرُّوْهُمْ وَتُقْسِطُوْۤا اِلَیْهِمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ ۟
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. [1] నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు[2].
[1] ఎలాంటి సత్యతిరస్కారులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలో వారి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి: మీరు కేవలం ముస్లింలు అయినందుకు మీతో శత్రుత్వం వహించి మీతో పోరాడని వారితో, రెండు: మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి విడిచి పొమ్మని బవలంతం చేయని వారితో! మూడు: మీకు విరుద్ధంగా ఇతర సత్యతిరస్కారులకు సహాయపడని వారితో!
[2] చూదైవప్రవక్త ('స'అస) ను అస్మా బిన్తె అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'అన్హా), ముష్రిక్ రాలైన తన తల్లితో ఎలా వ్యవహరించాలని అడిగారు. అతను ('స'అస) ఇలా జవాబిచ్చారు: 'నీ తల్లితో రక్త సంబంధాన్ని ఉంచుకో!' ('స'హీ 'హ్ ముస్లిం, 'స'హీ 'హ్ బు'ఖారీ) మరొక విషయం ఏమిటంటే బంధువులు కాని సత్యతిరస్కారులతో కూడ న్యాయంగా ప్రవర్తించాలి.
التفاسير العربية:
اِنَّمَا یَنْهٰىكُمُ اللّٰهُ عَنِ الَّذِیْنَ قَاتَلُوْكُمْ فِی الدِّیْنِ وَاَخْرَجُوْكُمْ مِّنْ دِیَارِكُمْ وَظَاهَرُوْا عَلٰۤی اِخْرَاجِكُمْ اَنْ تَوَلَّوْهُمْ ۚ— وَمَنْ یَّتَوَلَّهُمْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుద్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహం చేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు.[1]
[1] చూడండి, 5:51.
التفاسير العربية:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا جَآءَكُمُ الْمُؤْمِنٰتُ مُهٰجِرٰتٍ فَامْتَحِنُوْهُنَّ ؕ— اَللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِهِنَّ ۚ— فَاِنْ عَلِمْتُمُوْهُنَّ مُؤْمِنٰتٍ فَلَا تَرْجِعُوْهُنَّ اِلَی الْكُفَّارِ ؕ— لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ یَحِلُّوْنَ لَهُنَّ ؕ— وَاٰتُوْهُمْ مَّاۤ اَنْفَقُوْا ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ اَنْ تَنْكِحُوْهُنَّ اِذَاۤ اٰتَیْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ ؕ— وَلَا تُمْسِكُوْا بِعِصَمِ الْكَوَافِرِ وَسْـَٔلُوْا مَاۤ اَنْفَقْتُمْ وَلْیَسْـَٔلُوْا مَاۤ اَنْفَقُوْا ؕ— ذٰلِكُمْ حُكْمُ اللّٰهِ ؕ— یَحْكُمُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి.[1] అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి.[2] (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి.[3] ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
[1] 6వ హిజ్రీలో జరిగిన 'హుదైబియా ఒప్పందంలో ఏ వ్యక్తి అయినా మక్కా నుండి మదీనాకు వెళ్ళపోతే ఆ వ్యక్తిని మక్కావారు - తిరిగి ఇవ్వమని అడిగితే - ఇవ్వాలి అనే షర్త్ ఉండింది. కాని అందులో స్త్రీపురుషుల విషయం స్పష్టంగా లేదు. దానిని బట్టి ముస్లింయి మదీనాకు వచ్చిన స్త్రీలను వాపసు ఇవ్వండి అని మక్కా ముష్రిక్ లు కోరగా, ఈ ఆయత్ అవతరింప జేయబడింది. వారు కేవలం ఇస్లాం కొరకే వచ్చారని నిర్ధారణ చేసుకోవాలని ఆజ్ఞ ఉంది. యుక్త వయస్కుడైన పురుషునికి లేక స్త్రీకి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ఈ ఆయత్ అవతరించక ముందు చాలా మంది ముస్లింల భర్తలు లేక భార్యలు ముష్రికులుగా ఉండేవారు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) బిడ్డ 'జైనబ్ (ర. 'అన్హా) భర్త అబుల్ 'ఆ'స్ బిన్ రబీ'అ, ముష్రిక్ గా ఉండేవారు. అతను బద్ర్ యుద్ధపు కొంత కాలం తరువాత ఇస్లాం స్వీకరించి మదీనాకు వచ్చారు.
[2] 'ఉమర్ (ర'ది.'అ.) గారి ఇద్దరు భార్యలు ముష్రికులు. ఈ ఆయత్ అవతరణ తరువాత అతను వారికి విడాకులిచ్చారు.
[3] ఒక స్త్రీ ఇస్లాం స్వీకరించగానే ఆమె ముష్రిక్ భర్తతో ఆమె వివాహబంధం వెంటనే తెగిపోతుంది. అతడు ఆమె నుండి తన మహ్ర్ వాపసు తీసుకోవచ్చు.
التفاسير العربية:
وَاِنْ فَاتَكُمْ شَیْءٌ مِّنْ اَزْوَاجِكُمْ اِلَی الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَاٰتُوا الَّذِیْنَ ذَهَبَتْ اَزْوَاجُهُمْ مِّثْلَ مَاۤ اَنْفَقُوْا ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ ۟
మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)[1]! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి.
[1] 'ఆఖబ్ తుమ్ (దీని మరొక వ్యాఖ్యానం) : ప్రతీకారం తీసుకునే అవకాశం దొరికితే అంటే, ముష్రికుల భార్యలు కూడా ముస్లింలై, ముస్లింల దగ్గరికి వస్తే వారి - ఆ ముస్లిం అయిన స్త్రీల - మహ్ర్ వారి మొదటి ముష్రిక్ భర్తలకు చెల్లించక, దాని నుండి ఏ ముస్లింల భార్యలైతే ముష్రికులై వెళ్ళిపోయారో ఆ పురుషులకు చెల్లించాలి.
التفاسير العربية:
یٰۤاَیُّهَا النَّبِیُّ اِذَا جَآءَكَ الْمُؤْمِنٰتُ یُبَایِعْنَكَ عَلٰۤی اَنْ لَّا یُشْرِكْنَ بِاللّٰهِ شَیْـًٔا وَّلَا یَسْرِقْنَ وَلَا یَزْنِیْنَ وَلَا یَقْتُلْنَ اَوْلَادَهُنَّ وَلَا یَاْتِیْنَ بِبُهْتَانٍ یَّفْتَرِیْنَهٗ بَیْنَ اَیْدِیْهِنَّ وَاَرْجُلِهِنَّ وَلَا یَعْصِیْنَكَ فِیْ مَعْرُوْفٍ فَبَایِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బైఅత్) చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పించము అని మరియు దొంగతనం చేయము అని మరియు వ్యభిచారం చేయము అని మరియు తమ సంతానాన్ని హత్య చేయము అని మరియు తమ చేతుల మద్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించము అని మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపము అని, ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బైఅత్) తీసుకో [1] మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] చూఈ విధమైన ప్రమాణం దైవప్రవక్త ('స'అస) ఇస్లాం స్వీకరించి, ముష్రికులను వదలి వచ్చే స్త్రీల చేత చేయించే వారు. మరియు 8వ హిజ్రీలో మక్కా విజయం తరువాత కూడా చేయించారు. కానీ శపథం చేయించేటప్పుడు దైవప్రవక్త ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు అంటే చేతిపై చేయి పెట్టి ప్రమాణం చేయించలేదు, కేవలం వారి నోటితో మాత్రమే ప్రమాణం చేయించారు! ('స'హీ'హ్ బు'ఖారీ - 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం).
التفاسير العربية:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَیْهِمْ قَدْ یَىِٕسُوْا مِنَ الْاٰخِرَةِ كَمَا یَىِٕسَ الْكُفَّارُ مِنْ اَصْحٰبِ الْقُبُوْرِ ۟۠
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన జాతి వారిని స్నేహితులుగా చేసుకోకండి.[1] వాస్తవానికి గోరీలలో ఉన్న సత్యతిరస్కారులు, నిరాశ చెందినట్లు వారు కూడా పరలోక జీవితం పట్ల నిరాశ చెంది ఉన్నారు.
[1] చూడండి, 58.14
التفاسير العربية:
 
ترجمة معاني سورة: الممتحنة
فهرس السور رقم الصفحة
 
ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد - فهرس التراجم

ترجمة معاني القرآن الكريم إلى اللغة التلغو، ترجمها عبد الرحيم بن محمد.

إغلاق