ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (71) ߝߐߘߊ ߘߏ߫: ߛߘߍߞߎߘߎ߲ ߠߎ߬ ߝߐߘߊ
وَسِیْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی جَهَنَّمَ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ یَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ یَتْلُوْنَ عَلَیْكُمْ اٰیٰتِ رَبِّكُمْ وَیُنْذِرُوْنَكُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَی الْكٰفِرِیْنَ ۟
మరియు దైవదూతలు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారిని నరకం వైపునకు గుంపులు గుంపులుగా అవమానపరచి తోలుతారు. చివరికి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దానిపై బాధ్యులుగా నియమింపబడిన దైవదూతల్లోంచి దాని పర్యవేక్షకులు దాని తలపులను తెరుస్తారు. మరియు వారు వారితో మందలింపులతో ఇలా పలుకుతూ అభివందనములు చేస్తారు : ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన ప్రవక్తలు తమపై అవతరింపబడిన మీ ప్రభువు ఆయతులను మీపై చదువుతూ మరియు మిమ్మల్ని ప్రళయదినమున కలవటం గురించి అందులో ఉన్న కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడుతూ రాలేదా ?. అవిశ్వాసపరులు స్వయంగా అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : ఎందుకు కాదు. వాస్తవానికి ఇదంత జరిగింది. మరియు అవిశ్వాసపరులపై శిక్ష యొక్క వాక్కు అనివార్యమైనది. మరియు మేము అవిశ్వసిస్తూ ఉండేవారము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• ثبوت نفختي الصور.
రెండు సూర్ల (బాకా) ఊదటం యొక్క నిరూపణ

• بيان الإهانة التي يتلقاها الكفار، والإكرام الذي يُسْتَقبل به المؤمنون.
అవిశ్వాసపరులు అందుకునే అవమానము మరియు విశ్వాసపరులు పొందే గౌరవ ప్రకటన.

• ثبوت خلود الكفار في الجحيم، وخلود المؤمنين في النعيم.
నరకములో అవిశ్వాసపరులు శాశ్వతంగా ఉండటం మరియు విశ్వాసపరులు అనుగ్రహాల్లో శాశ్వతంగా ఉండటం యొక్క నిరూపణ.

• طيب العمل يورث طيب الجزاء.
శ్రేష్ఠమైన ఆచరణ శ్రేష్ఠమైన ప్రతిఫలమునకు వారసులను చేస్తుంది.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (71) ߝߐߘߊ ߘߏ߫: ߛߘߍߞߎߘߎ߲ ߠߎ߬ ߝߐߘߊ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ߘߊߕߎ߲߯ߠߌ߲