పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం వచనం: (77) సూరహ్: సూరహ్ అన్-నిసా
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ قِیْلَ لَهُمْ كُفُّوْۤا اَیْدِیَكُمْ وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ۚ— فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ یَخْشَوْنَ النَّاسَ كَخَشْیَةِ اللّٰهِ اَوْ اَشَدَّ خَشْیَةً ۚ— وَقَالُوْا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَیْنَا الْقِتَالَ ۚ— لَوْلَاۤ اَخَّرْتَنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیْبٍ ؕ— قُلْ مَتَاعُ الدُّنْیَا قَلِیْلٌ ۚ— وَالْاٰخِرَةُ خَیْرٌ لِّمَنِ اتَّقٰی ۫— وَلَا تُظْلَمُوْنَ فَتِیْلًا ۟
"మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు?[1] అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.
[1] ఇస్లాం ఆరంభ దినాలలో మొట్టమొదట, మక్కా ముస్లింలకు సహనం వహించండి, నమా'జ్ చేయండి మరియు 'జకాత్ ఇవ్వండి, అని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అప్పుడు వారి ఆర్థిక మరియు భౌతిక పరిస్థితులు జిహాద్ కు అనుకూలంగా లేకుండెను. అయినా వారు, జిహాద్ కొరకు తొందర పెట్టేవారు. కాని ఇప్పుడు మదీనా మునవ్వరాకు వచ్చిన తరువాత వారి పరిస్థితులు మెరుగైన తరువాత వారిని జిహాద్ చేయమని ఆజ్ఞాపిస్తే వారెందుకు వెనుకంజ వేస్తున్నారని ఈ ఆయత్ ప్రశ్నిస్తున్నది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం వచనం: (77) సూరహ్: సూరహ్ అన్-నిసా
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

ఖుర్ఆన్ యొక్క అర్థాలను తెలుగులొ అనువదించడం. దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం