Check out the new design

Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Surə: əl-Həcc   Ayə:
یٰۤاَیُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوْا لَهٗ ؕ— اِنَّ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَنْ یَّخْلُقُوْا ذُبَابًا وَّلَوِ اجْتَمَعُوْا لَهٗ ؕ— وَاِنْ یَّسْلُبْهُمُ الذُّبَابُ شَیْـًٔا لَّا یَسْتَنْقِذُوْهُ مِنْهُ ؕ— ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوْبُ ۟
ఓ ప్రజలారా ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది దాన్ని మీరు శ్రద్దతో వినండి మరియు దాని నుండి మీరు గుణపాఠం నేర్చుకోండి. నిశ్ఛయంగా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే విగ్రహాలు,మొదలుగునవి వాటి అశక్తి వలన ఒక ఈగనూ అది చిన్నదైనప్పటికీ సృష్టించలేరు. ఒక వేళ వారందరు కలిసి దాన్ని సృష్టించాలన్నా సృష్టించలేరు. ఈగ వారిపై ఉన్న ఏదైన మంచి వస్తువును,దాని లాంటి దాన్ని ఎత్తుకెళ్ళినా దాని నుండి దాన్ని రక్షించటమునకు వారికి శక్తి లేదు. ఈగను సృష్టించటం నుండి,దాని నుండి తమ వస్తువులను రక్షించటం నుండి వారి బలహీనత వలన దాని కన్న పెద్ద వాటి గురించి వారి బలహీనత స్పష్టమవుతుంది. అలాంటప్పుడు మీరు వాటి బలహీనత ఉన్నా కూడా అల్లాహ్ ను వదిలి వాటిని ఎలా ఆరాధిస్తున్నారు ?!. ఆరాధించబడిన విగ్రహమై ఈ అర్ధించేవాడు ఎవడైతే తన నుండి ఈగ ఏదైతే లాక్కుటుందో దాన్ని కాపాడుకోడో బలహీనుడైపోయాడు. మరియు ఈ అర్ధించబడేవాడు ఏదైతే ఈగ ఉన్నదో బలహీనమైపోయింది.
Ərəbcə təfsirlər:
مَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ ۟
వారు అల్లాహ్ తో పాటు ఆయన యొక్క కొన్ని సృష్టితాలను ఆరాధన చేసినప్పుడు వారు అల్లాహ్ ను ఏవిధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించలేదు. నిశ్ఛయంగా అల్లాహ్ ఎంతో బలవంతుడు. భూమ్యాకాశములను,వాటిలో ఉన్న వారిని ఆయన సృష్టించటం ఆయన యొక్క బలము,సామర్ధ్యములో నుంచిది. ఆధిక్యుడు ఆయనను ఎవరూ ఓడించలేరు,దీనికి విరుద్ధంగా ముష్రికుల విగ్రహాలు. అవి బలహీనమైనవి,అవమానించబడినవి.అవి ఏమీ సృష్టించవు.
Ərəbcə təfsirlər:
اَللّٰهُ یَصْطَفِیْ مِنَ الْمَلٰٓىِٕكَةِ رُسُلًا وَّمِنَ النَّاسِ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟ۚ
పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ దైవ దూతల్లోంచి కొందరిని సందేశహరులుగా ఎన్నుకున్నాడు. మరియు అలాగే ప్రజల్లోంచి కొందరిని సందేశహరులుగా ఎన్నుకున్నాడు. అయితే ఆయన జిబ్రయీల్ లాంటి కొంత మంది దైవ దూతలను దైవ ప్రవక్తల వద్దకు సందేశాలను ఇచ్చి పంపిస్తాడు. ఆయన అతన్ని మానవుల్లోంచి సందేశహరుల వద్దకు పంపించాడు. మరియు ఆయన మానవుల్లోంచి ప్రవక్తలను ప్రజల వద్దకు పంపిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తల విషయంలో ముష్రికులు ఏదైతే చెబుతున్నారో వినేవాడును,తన సందేశాలను చేరవేయటానికి ఆయన ఎంచుకున్న వారిని చూసేవాడును.
Ərəbcə təfsirlər:
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟
పరిశుద్ధుడైన ఆయనకు దైవ దూతల్లోంచి ఆయన ప్రవక్తలు,ప్రజలు వారి సృష్టించబడటమునకు ముందు,వారి మరణము తరువాత వారు దేనిపైనైతే ఉన్నారో తెలుసు. ప్రళయ దినాన వ్యవహారాలన్ని ఒక్కడైన అల్లాహ్ వైపునకే మరలించబడుతాయి. ఎప్పుడైతే ఆయన తన దాసులను మరణాంతరం లేపుతాడో వారు ముందు చేసుకున్న కర్మల పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Ərəbcə təfsirlər:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ارْكَعُوْا وَاسْجُدُوْا وَاعْبُدُوْا رَبَّكُمْ وَافْعَلُوا الْخَیْرَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటి ద్వారా ఆచరించేవారా మీరు మీ నమాజులలో ఒక్కడైన అల్లాహ్ కొరకే రుకూ చేయండి,సాష్టాంగపడండి. మరియు మీరు కోరుకున్న దాని ద్వారా సాఫల్యం పొందుతారని,మీరు భయపడే వాటి నుండి విముక్తి చెందుతారని ఆశిస్తూ మీరు దానధర్మాలు,బంధుత్వాలను కలపటం లాంటి మంచి కార్యాలను చేయండి.
Ərəbcə təfsirlər:
وَجَاهِدُوْا فِی اللّٰهِ حَقَّ جِهَادِهٖ ؕ— هُوَ اجْتَبٰىكُمْ وَمَا جَعَلَ عَلَیْكُمْ فِی الدِّیْنِ مِنْ حَرَجٍ ؕ— مِلَّةَ اَبِیْكُمْ اِبْرٰهِیْمَ ؕ— هُوَ سَمّٰىكُمُ الْمُسْلِمِیْنَ ۙ۬— مِنْ قَبْلُ وَفِیْ هٰذَا لِیَكُوْنَ الرَّسُوْلُ شَهِیْدًا عَلَیْكُمْ وَتَكُوْنُوْا شُهَدَآءَ عَلَی النَّاسِ ۖۚ— فَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاعْتَصِمُوْا بِاللّٰهِ ؕ— هُوَ مَوْلٰىكُمْ ۚ— فَنِعْمَ الْمَوْلٰی وَنِعْمَ النَّصِیْرُ ۟۠
మరియు మీరు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటమును చిత్తశుద్ధితో ఆయన మన్నత కొరకు చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మరియు ఆయన మీ ధర్మమును అందులో ఎటువంటి ఇబ్బంది గాని,కఠినత్వమును గాని లేకుండా సులభతరంగా చేశాడు. ఈ సులభతరమైన ధర్మమే మీ తండ్రి అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మము. మరియు ఆయన పూర్వ గ్రంధాల్లో,ఖుర్ఆన్ లో మిమ్మల్ని ముస్లిములని నామకరణం చేశాడు. ప్రవక్త తనకు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడినదో వాటిని మీకు చేరవేశారని మీపై సాక్షిగా అవటానికి మరియు మీరు పూర్వ జాతుల వారిపై వారి ప్రవక్తలు వారికి సందేశాలు చేరవేశారని అనటమునకు సాక్షిగా అవటానికి. అయితే మీరు దానిపై నమాజులను పరిపూర్ణ పధ్ధతిలో పాటించటం ద్వారా అల్లాహ్ కి కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును చెల్లించండి. మీరు అల్లాహ్ తో మొరపెట్టుకోండి,మీ వ్యవహారముల్లో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉండండి. పరిశుద్ధుడైన ఆయన తాను విశ్వాసపరుల్లోంచి ఎవరినైతే రక్షిస్తాడో వారి కొరకు ఎంతో శ్రేష్టమైన సంరక్షకుడు. మరియు వారిలో నుండి ఆయనను సహాయమును అర్ధించే వారి కొరకు శ్రేష్టమైన సహాయం చేసేవాడు. అయితే మీరు ఆయన రక్షణనే కోరుకోండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఆయనతోనే సహాయమును అర్ధించండి ఆయన మీకు సహాయం చేస్తాడు.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• أهمية ضرب الأمثال لتوضيح المعاني، وهي طريقة تربوية جليلة.
అర్ధాలను స్పష్టపరచటానికి ఉదాహరణలను ఇవ్వటం యొక్క ప్రాముఖ్యత. మరియు ఇది గొప్ప పోషణా పద్దతి.

• عجز الأصنام عن خلق الأدنى دليل على عجزها عن خلق غيره.
అల్పమైన దాన్ని సృష్టించటం లో విగ్రహాల బలహీనత ఇతర వాటిని సృష్టించటంలో వాటి బలహీనతకు ఆధారము.

• الإشراك بالله سببه عدم تعظيم الله.
అల్లాహ్ తో పాటు సాటి కల్పించటమునకు కారణం అల్లాహ్ ను గౌరవించకపోవటం.

• إثبات صفتي القوة والعزة لله، وأهمية أن يستحضر المؤمن معاني هذه الصفات.
అల్లాహ్ కొరకు బలము,ఆధిక్యత రెండు గుణములను నిరూపించటం,ఈ గుణముల అర్ధములను విశ్వాసపరుడు గుర్తుంచుకోవటం యొక్క ప్రాముఖ్యత.

 
Mənaların tərcüməsi Surə: əl-Həcc
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. - Tərcumənin mündəricatı

Tərcümə "Quran araşdırmaları Təfsir Mərkəzi" tərəfindən yayımlanmışdır.

Bağlamaq