Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (72) Surə: əl-Maidə
لَقَدْ كَفَرَ الَّذِیْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ هُوَ الْمَسِیْحُ ابْنُ مَرْیَمَ ؕ— وَقَالَ الْمَسِیْحُ یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اعْبُدُوا اللّٰهَ رَبِّیْ وَرَبَّكُمْ ؕ— اِنَّهٗ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ حَرَّمَ اللّٰهُ عَلَیْهِ الْجَنَّةَ وَمَاْوٰىهُ النَّارُ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ ۟
నిశ్చయంగా – అల్లాహ్ కానటువంటి మర్యం కుమారుడైన ఈసాహ్ మసీహ్ ని “ఈయనే అల్లాహ్” అని ఆయనకు దైవత్వమును ఆపాదించి – క్రైస్తవులు అవిశ్వాసులై పోయారు. (వాస్తవం ఏమిటంటే) మర్యమ్ కుమారుడైన మసీహ్ అలైహిస్సలాం స్వయంగా వారితో అన్నారు : ఓ ఇస్రాయీలు సంతతివారా మీరు ఏకైకుడైన అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడా. మనమందరం ఆయన ఆరాధన చేయటంలో సమానులం. ఎందుకంటే ఇతరులను అల్లాహ్ తో పాటు సాటి కల్పించే వాడిపై స్వర్గంలో ప్రవేశించుటను అల్లాహ్ శాశ్వతంగా నిషేధించాడు. మరియు నరకాగ్నియే అతని నివాస స్థలము. అల్లాహ్ వద్ద అతనికి తోడ్పడేవారు, సహాయపడేవారు ఎవరూ ఉండరు. అతని కోసం వేచి ఉన్న శిక్ష నుండి రక్షించే రక్షకుడు ఎవడూ ఉండడు.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• بيان كفر النصارى في زعمهم ألوهية المسيح عليه السلام، وبيان بطلانها، والدعوةُ للتوبة منها.
మసీహ్ అలైహిస్సలామునకు దైవత్వం ఉన్నదని క్రైస్తవుల విశ్వాసములో తిరస్కారమున్నదని ప్రకటన, అది కూడా సరైనది కాదని ప్రకటన, దాని నుండి తౌబా కొరకు పిలుపు.

• من أدلة بشرية المسيح وأمه: أكلهما للطعام، وفعل ما يترتب عليه.
మసీహ్ అలైహిస్సలాం, ఆయన తల్లిగారు వారిద్దరూ భోజనం తినటం,దానికి సంబంధించిన కార్యాలు చేయటం వారిద్దరు మనుషులే అనటానికి ఆధారాలు.

• عدم القدرة على كف الضر وإيصال النفع من الأدلة الظاهرة على عدم استحقاق المعبودين من دون الله للألوهية؛ لكونهم عاجزين.
దైవాలుగా ఆరాధించబడుతున్న వాటికి నష్టమును ఆపటానికి, లాభాన్ని చేకూర్చటానికి సామర్ధ్యం లేకపోవటం వారికి దైవత్వం లేదనటానికి, మరియు వారు నిస్సహాయులు అనడానికి ప్రత్యక్ష ఆధారాలు.

• النهي عن الغلو وتجاوز الحد في معاملة الصالحين من خلق الله تعالى.
అల్లాహ్ యొక్క సృష్టిలో పుణ్యాత్ములను గౌరవించే విషయంలో హద్దుమీరడం నుండి, అతిక్రమించడం నుండి వారింపు (కూడా ఉంది దీనిలో).

 
Mənaların tərcüməsi Ayə: (72) Surə: əl-Maidə
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tərcumənin mündəricatı

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Bağlamaq