Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (1) Surə: əl-Ənfal

సూరహ్ అల్-అన్ఫాల్

Surənin məqsədlərindən:
الامتنان على المؤمنين بنصر الله لهم في بدر، وبيان سنن النصر والهزيمة.
బదర్ లో అల్లాహ్ సహాయం ద్వారా విశ్వాసపరులపై ఉపకారము మరియు విజయ ఓటముల సిద్దాంతాల ప్రకటన.

یَسْـَٔلُوْنَكَ عَنِ الْاَنْفَالِ ؕ— قُلِ الْاَنْفَالُ لِلّٰهِ وَالرَّسُوْلِ ۚ— فَاتَّقُوا اللّٰهَ وَاَصْلِحُوْا ذَاتَ بَیْنِكُمْ ۪— وَاَطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗۤ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా మీ సహచరులు యుద్ధప్రాప్తి గురించి దానిని ఏ విధంగా పంచిపెట్టాలి ?,దానిని ఎవరికి పంచిపెట్టాలి ? అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఓ ప్రవక్తా మీరు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలకండి : యుద్ధప్రాప్తి అల్లాహ్ కు ,ప్రవక్తకు చెందినది. దాన్ని ఖర్చు చేయటం గురించి,పంచిపెట్టటం గురించి ఆదేశము అల్లాహ్ ది,ఆయన ప్రవక్తది. అయితే కేవలం మీరు దానిని అనుసరించాలి,అంగీకరించాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మరియు మీ మధ్య ఉన్న సంబంధాలను త్రెంచుకోవటం, ముఖము చాటి వేయటంను పరస్పర ప్రేమతో,బంధుత్వాలను కలపటం ద్వారా,మంచి నడవడితో,మన్నింపు వైఖరితో సరిదిద్దుకోండి. మరియు మీరు నిజంగా విశ్వాసపరులే అయితే అల్లాహ్ పై విధేయతను,ఆయన ప్రవక్తపై విధేయతను మీపై తప్పనిసరి చేసుకోండి. ఎందుకంటే విశ్వాసము విధేయత చూపటంపై,అవిధేయత కార్యాల నుండి దూరంగా ఉండటంపై ప్రోత్సహిస్తుంది. ఈ ప్రశ్న బదర్ సంఘటన జరిగిన తరువాతది.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• ينبغي للعبد أن يتعاهد إيمانه ويُنمِّيه؛ لأن الإيمان يزيد وينقص، فيزيد بفعل الطاعة وينقص بضدها.
దాసుడు తన విశ్వాసమును పరిరక్షించటం,దానిని ఆశించటం తప్పనిసరి. ఎందుకంటే విశ్వాసం పెరుగుతుంది ,తరుగుతుంది. విధేయత కార్యాల ద్వారా పెరుగుతుంది,దానికి విరుద్ధ కార్యాల (అవిధేయ కార్యాల ) ద్వారా తరుగుతుంది.

• الجدال محله وفائدته عند اشتباه الحق والتباس الأمر، فأما إذا وضح وبان فليس إلا الانقياد والإذعان.
సత్యం సందేహస్పదంగా ఉన్నప్పుడు,ఆదేశము గందరగోళం అయినప్పుడు వాదనకు స్థానం ఉన్నది,దాని ప్రయోజనం ఉన్నది. (సత్యం) స్పష్టమైనప్పుడు,బహిర్గతం అయినప్పుడు అనుసరించటం,స్వీకరించటం తప్ప వేరే మార్గం లేదు.

• أَمْر قسمة الغنائم متروك للرّسول صلى الله عليه وسلم، والأحكام مرجعها إلى الله تعالى ورسوله لا إلى غيرهما.
యుద్ధప్రాప్తిని పంచి పెట్టే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అప్పజెప్పటం జరిగింది. ఆదేశాల అభయ స్థానము అల్లాహ్,ఆయన ప్రవక్త వైపున కలదు వారిరువురు కాకుండా ఇతరుల వైపు కాదు.

• إرادة تحقيق النّصر الإلهي للمؤمنين؛ لإحقاق الحق وإبطال الباطل.
విశ్వాసపరుల కొరకు దైవిక విజయాన్ని సాధించాలనే సంకల్పం సత్యాన్ని సత్యంగా,అసత్యాన్ని అసత్యంగా నిరుపించటం కొరకే.

 
Mənaların tərcüməsi Ayə: (1) Surə: əl-Ənfal
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tərcumənin mündəricatı

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Bağlamaq