Check out the new design

Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Surə: ət-Tovbə   Ayə:
كَیْفَ یَكُوْنُ لِلْمُشْرِكِیْنَ عَهْدٌ عِنْدَ اللّٰهِ وَعِنْدَ رَسُوْلِهٖۤ اِلَّا الَّذِیْنَ عٰهَدْتُّمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ— فَمَا اسْتَقَامُوْا لَكُمْ فَاسْتَقِیْمُوْا لَهُمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُتَّقِیْنَ ۟
ఓ ముస్లిములారా సుల్హె హుదేబియా (హుదేబియా ఒడంబడిక) లో మస్జిదుల్ హరాం వద్ద మీరు ఒప్పందము చేసుకున్న ముష్రికుల ఒప్పందము తప్ప ముష్రికుల కొరకు అల్లాహ్ వద్ద,ఆయన ప్రవక్త వద్ద ఏవిధమైన ఒప్పందము,రక్షణ ఉండటం సరి కాదు.అయితే వారు మీ కొరకు మీ మధ్య,వారి మధ్య ఉన్న ఒప్పందమును భంగపరచకుండా దాని పై స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై భంగపరచకుండా స్థిరంగా ఉండండి.నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన ఆదేశాలను పాటిస్తూ తాను వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ దైవభీతి కలవారిని ఇష్టపడుతాడు.
Ərəbcə təfsirlər:
كَیْفَ وَاِنْ یَّظْهَرُوْا عَلَیْكُمْ لَا یَرْقُبُوْا فِیْكُمْ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— یُرْضُوْنَكُمْ بِاَفْوَاهِهِمْ وَتَاْبٰی قُلُوْبُهُمْ ۚ— وَاَكْثَرُهُمْ فٰسِقُوْنَ ۟ۚ
వారి కొరకు ఒప్పందము,రక్షణ ఎలా సాధ్యము.వాస్తవానికి వారు మీకు శతృవులు.ఒక వేళ వారు మీపై విజయం పొందితే వారు మీ విషయంలో అల్లాహ్ ను కాని,ఏ విధమైన బంధుత్వమును కాని,ఏ విధమైన ఒప్పందమును కాని లెక్కచేయరు.అంతే కాక మిమ్మల్ని బాధాకరమైన శిక్షలకు గురి చేస్తారు.వారి నాలుకలతో మాట్లాడే మంచి మాటల ద్వారా మిమ్మల్ని వారు సంతోషపెడుతారు.కాని వారి హృదయాలు వారి నాలుకలను స్వీకరించవు.వారు ఏమంటున్నారో తెలియదు.వారిలో చాలా మంది తమ ఒప్పందాలను భంగపరచటం వలన అల్లాహ్ విధేయత నుండి తొలిగిపోయారు.
Ərəbcə təfsirlər:
اِشْتَرَوْا بِاٰیٰتِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا فَصَدُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ— اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
అల్లాహ్ యొక్క ఆయతులు అందులో నుంచి ఒప్పందాలను పూర్తి చేయటమును అనుసరించటమునకు బదులుగా,ప్రత్యామ్నాయముగా అల్పమైన ధర అయిన ప్రాపంచిక శిధిలాలు వేటి ద్వారా నైతే వారు తమ మనో వాంఛనలు,తమ కోరికలకు చేరుకుంటారో కోరుకున్నారు.తాము స్వయాన సత్యాన్ని అనుసరించటం నుండి ఆగిపోయారు.ఇతరులను సత్యము నుండి ఆపివేశారు.నిశ్చయముగా వారు చేసే కార్యము చెడ్డదైనది.
Ərəbcə təfsirlər:
لَا یَرْقُبُوْنَ فِیْ مُؤْمِنٍ اِلًّا وَّلَا ذِمَّةً ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُعْتَدُوْنَ ۟
వారిలో ఉన్న శతృత్వం వలన వారు ఒక విశ్వాసపరుని విషయంలోఅల్లాహ్ ను కాని ఏ బంధుత్వంను కాని ఏ ఒప్పందమును కాని లెక్క చేయరు.వారిలో ఉన్న దుర్మార్గము,దురాక్రమణ గుణాల వలన వారు అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారు.
Ərəbcə təfsirlər:
فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ ؕ— وَنُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
అయితే ఒక వేళ వారు తమ అవిశ్వాసము నుండి అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడి (తౌబా చేసి),రెండు సాక్షములను (షహాదతైన్ లను) పలికి,నమాజులను నెలకొల్పి,తమ సంపదల నుండి జకాతును చెల్లిస్తే వారు ముస్లిములైపోయారు.మరియు వారు ధర్మం ప్రకారం మీ సోదరులు.మీ కొరకు ఏవి ఉన్నవో వారి కొరకు అవే ఉన్నవి,మీపై (బాధ్యతగా) ఏవి ఉన్నవో వారిపై అవే ఉన్నవి.వారితో యుద్ధం చేయటం మీ కొరకు ధర్మసమ్మతం కాదు.అయితే వారి ఇస్లాం స్వీకరించటం వారి రక్తములను,వారి సంపదలను,వారి మానమర్యాదలను పరిరక్షిస్తుంది.మరియు మేము ఆయతులను విడమరచి చెబుతున్నాము, తెలుసుకునే జనుల కొరకు వాటిని స్పష్టపరుస్తున్నాము.వారే వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.మరియు వాటి ద్వారా ఇతరులకు ప్రయోజనం చేకురుస్తారు.
Ərəbcə təfsirlər:
وَاِنْ نَّكَثُوْۤا اَیْمَانَهُمْ مِّنْ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوْا فِیْ دِیْنِكُمْ فَقَاتِلُوْۤا اَىِٕمَّةَ الْكُفْرِ ۙ— اِنَّهُمْ لَاۤ اَیْمَانَ لَهُمْ لَعَلَّهُمْ یَنْتَهُوْنَ ۟
నిర్ణీత వ్యవధిలో యుద్ధమును వదిలివేయటం పై మీతో ఒప్పందం చేసిన ఈ ముష్రికులందరు ఒక వేళ తమ ఒప్పందాలను,తమ ప్రమాణాలను భంగ పరచి,మీ ధర్మములో లోపాలను చూపి,దానిని అవహేళన చేస్తే మీరు వారితో యుద్ధం చేయండి.వారు అవిశ్వాసము యొక్క నాయకులు,మరియు దాని అధికారులు.వారి రక్తమును చిందించటము నుండి ఆపే ఎటువంటి ప్రమాణాలు కాని ఒప్పందాలు కాని వారి కొరకు లేవు.అయితే వారు తమ అవిశ్వాసము నుండి,తమ ఒప్పందాలను భంగపరచటం నుండి,తాము ధర్మములో లోపము చూపటం నుండి దూరంగా ఉంటారని ఆశిస్తూ మీరు వారితో యుద్ధం చేయండి.
Ərəbcə təfsirlər:
اَلَا تُقَاتِلُوْنَ قَوْمًا نَّكَثُوْۤا اَیْمَانَهُمْ وَهَمُّوْا بِاِخْرَاجِ الرَّسُوْلِ وَهُمْ بَدَءُوْكُمْ اَوَّلَ مَرَّةٍ ؕ— اَتَخْشَوْنَهُمْ ۚ— فَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشَوْهُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా తమ ఒప్పందాలను,ప్రమాణాలను భంగపరచి ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లంను మక్కా నగరము నుండి వెలివేయటానికి దారున్నద్వాలో తాము
సమావేశమై ప్రయత్నం చేశారో అటువంటి జాతితో మీరు ఎందుకు పోరాడటం లేదు.వారే ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం రక్షణలో ఉన్నకుజాఅ తెగకు వ్యతిరేకముగా ఖురైష్ రక్షణలో ఉన్న బకర్ తెగకు సహాయము చేసి మొదట మీతో యుద్ధమును మొదలు పెట్టారు.ఏమి మీరు వారితో భయపడుతున్నారా,అయితే మీరు వారితో యుద్ధము విషయంలో ముందడుగు వేయకండి.నిజానికి మీరు విశ్వాసవంతులే అయితే మీరు భయపడటానికి అల్లాహ్ సుబహానహువ తఆలా ఎక్కువ హక్కుదారుడు.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• دلَّت الآيات على أن قتال المشركين الناكثين العهد كان لأسباب كثيرة، أهمها: نقضهم العهد.
వాగ్దానాలను భంగ పరిచే ముష్రికులతో యుద్ధం చేయటమునకు చాలా కారణములు ఉన్నవి,వాటిలో వారు ఒప్పందాలను భంగపరచటం ప్రాధాన్యమైనది అన్న విషయంపై ఆయతులు సూచిస్తున్నవి.

• في الآيات دليل على أن من امتنع من أداء الصلاة أو الزكاة فإنه يُقاتَل حتى يؤديهما، كما فعل أبو بكر رضي الله عنه.
నమాజు పాటించటం నుండి,జకాతు చెల్లించటం నుండి ఆగిపోయేవాడు ఆ రెండింటిని పాటించేవరకు పోరాడబడుతాడు అన్న దానిపై ఆయతుల్లో ఆధారమున్నది.ఏ విధంగానైతే అబూబకర్ రజిఅల్లాహు అన్హు చేశారో.

• استدل بعض العلماء بقوله تعالى:﴿وَطَعَنُوا فِي دِينِكُمْ﴾ على وجوب قتل كل من طعن في الدّين عامدًا مستهزئًا به.
అల్లాహ్ యొక్క ఈ వాక్కు "వ తఅనూ ఫీ దీనికుమ్" (وَطَعَنُوا فِي دِينِكُمْ) ద్వారా కొందరు ధార్మిక విధ్వాంసులు ధర్మ విషయంలో కావాలని,హేళన చేస్తూ లోపాలను చూపే ప్రతి వ్యక్తిని హతమార్చటం అనివార్యము అని ఆధారం చూపారు.

• في الآيات دلالة على أن المؤمن الذي يخشى الله وحده يجب أن يكون أشجع الناس وأجرأهم على القتال.
ఒకే అల్లాహ్ తో భయపడే విశ్వాసపరుడు యుద్ధంలో ప్రజల్లోకెల్ల ధైర్యవంతుడు,వారిలోకెల్ల సాహసవంతుడై ఉండటం తప్పనిసరి అనటానికి ఆయతుల్లో ఆధారమున్నది.

 
Mənaların tərcüməsi Surə: ət-Tovbə
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. - Tərcumənin mündəricatı

Tərcümə "Quran araşdırmaları Təfsir Mərkəzi" tərəfindən yayımlanmışdır.

Bağlamaq