Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans * - Übersetzungen


Übersetzung der Bedeutungen Surah / Kapitel: Yūnus   Vers:
وَاِذَاۤ اَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّنْ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُمْ اِذَا لَهُمْ مَّكْرٌ فِیْۤ اٰیَاتِنَا ؕ— قُلِ اللّٰهُ اَسْرَعُ مَكْرًا ؕ— اِنَّ رُسُلَنَا یَكْتُبُوْنَ مَا تَمْكُرُوْنَ ۟
మేము ముష్రికులకు వారికి కలిగిన అనావృష్టి,కష్టాల తరువాత వర్షము ద్వారా,సస్యశామలం తో అనుగ్రహమును ప్రసాధించినప్పుడు వారు వెంటనే మా ఆయతుల పట్ల ఎగతాళి చేయటం,తిరస్కరించటం జరుగుతుంది.ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ ఎత్తులు వేయటంలో శీఘ్రుడు,మిమ్మల్ని క్రమక్రమంగా తీసుకుని వెళ్ళటంలో,శిక్షించటంలో వేగవంతుడు.నిశ్చయంగా సంరక్షకులైన దైవదూతలు మీరు వేసే కుయుక్తులను వ్రాస్తున్నారు.వాటిలోంచి ఏవీ వారి నుండి తప్పించుకోవు. అలాంటప్పుడు వారి సృష్టి కర్త నుండి ఎలా తప్పించుకోగలరు ?.మరియు అల్లాహ్ మీరు వేసిన ఎత్తులకు తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
هُوَ الَّذِیْ یُسَیِّرُكُمْ فِی الْبَرِّ وَالْبَحْرِ ؕ— حَتّٰۤی اِذَا كُنْتُمْ فِی الْفُلْكِ ۚ— وَجَرَیْنَ بِهِمْ بِرِیْحٍ طَیِّبَةٍ وَّفَرِحُوْا بِهَا جَآءَتْهَا رِیْحٌ عَاصِفٌ وَّجَآءَهُمُ الْمَوْجُ مِنْ كُلِّ مَكَانٍ وَّظَنُّوْۤا اَنَّهُمْ اُحِیْطَ بِهِمْ ۙ— دَعَوُا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ۚ۬— لَىِٕنْ اَنْجَیْتَنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِیْنَ ۟
ఓ ప్రజలారా అల్లాహ్ ఆయనే ఎవరైతే మిమ్మల్ని మీ కాళ్ళపై,మీ పశువులపై, భూమి పై నడిపింపజేస్తున్నాడు.మరియు ఎవరైతే మిమ్మల్ని ఓడల్లో సముద్రంలో నడిపింపజేస్తున్నాడో.మీరు సముద్రం లో ఓడల్లో ఉన్నప్పుడు అవి మీతోపాటు అనుకూలమైన గాలిని తీసుకుని నడవసాగాయి.అప్పుడు ఈ అనుకూలమైన గాలితో ప్రయాణికులు సంతోషపడ్డారు.వారు తమ సంతోషములో ఉన్నప్పుడు వారిపై బలమైన గాలి వీసినది.మరియు నలుమూలల నుండి సముద్రపు అల వారిపై వచ్చిపడినది.వారందరూ నాశనం అయిపోయారే అనుకుని తాము ఆయనతోపాటు వేరే ఇతరులని సాటికల్పించని ఒక్కడైన అల్లాహ్ ను ఇలా పలుకుతూ వేడుకున్నారు : ఒకవేళ నీవు వినాశనమును చేసే ఈ ముప్పు నుండి మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా నీవు మాకు ప్రసాదించిన అనుగ్రహాలపై నీకు కృతజ్ఞతలు తెలుపుకునేవారిలోంచి అయిపోతాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَلَمَّاۤ اَنْجٰىهُمْ اِذَا هُمْ یَبْغُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ— یٰۤاَیُّهَا النَّاسُ اِنَّمَا بَغْیُكُمْ عَلٰۤی اَنْفُسِكُمْ ۙ— مَّتَاعَ الْحَیٰوةِ الدُّنْیَا ؗ— ثُمَّ اِلَیْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఎప్పుడైతే ఆయన వారి అర్ధనను స్వీకరించి వారిని ఈ ముప్పు నుండి రక్షించాడో అప్పుడు వారందరూ అవిశ్వాసము,అవిధేయకార్యములు,పాపములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను రేకెత్తిస్తున్నారు.ఓ ప్రజలారా మీరు మేలుకోండి మీ దౌర్జన్యాల దుష్పరిణామము మీపైనే ఉంటుంది.మీ దుర్మార్గము అల్లాహ్ కు నష్టం కలిగించదు.దానితో మీరు ఇహలోకములోనే ప్రయోజనం చెందుతారు.అది కూడా అంతం అయిపోతుంది.ఆ తరువాత ప్రళయదినాన మీ మరలటం మా వైపునే అవుతుంది.అప్పుడు మేము మీరు పాల్పడిన పాపముల గురించి మీకు సమాచారమిస్తాము.మరియు వాటి పరంగానే మేము మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّمَا مَثَلُ الْحَیٰوةِ الدُّنْیَا كَمَآءٍ اَنْزَلْنٰهُ مِنَ السَّمَآءِ فَاخْتَلَطَ بِهٖ نَبَاتُ الْاَرْضِ مِمَّا یَاْكُلُ النَّاسُ وَالْاَنْعَامُ ؕ— حَتّٰۤی اِذَاۤ اَخَذَتِ الْاَرْضُ زُخْرُفَهَا وَازَّیَّنَتْ وَظَنَّ اَهْلُهَاۤ اَنَّهُمْ قٰدِرُوْنَ عَلَیْهَاۤ ۙ— اَتٰىهَاۤ اَمْرُنَا لَیْلًا اَوْ نَهَارًا فَجَعَلْنٰهَا حَصِیْدًا كَاَنْ لَّمْ تَغْنَ بِالْاَمْسِ ؕ— كَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
మీరు ప్రయోజనం చెందుతున్న ఇహలోక జీవితం అది వేగముగా అంతం అయిపోవటంలో ఉపమానం ఆ వర్షం మాదిరిగా ఉన్నది దేని ద్వారానైతే ప్రజలు తినే ధాన్యాలు,ఫలాలు,పశువులు తినే గడ్డి,మొదలగున్నవి కలిసి పెరుగుతున్నాయి.చివరికి నేల తన రంగును కాంతివంతంగా చేసుకుని తన రకరకాల మొక్కల ద్వారా అందంగా తయారవుతుంది.దాని వాసులు అది మొలకెత్తించిన వాటిని కోయటంలో,తృంచటంలో సామర్ధ్యం కలవారని భావిస్తారు.మా తీర్పు దానిని వినాశనం చేస్తూ వస్తుంది.మేము దాన్ని అది దగ్గరి కాలంలో చెట్లను,మొక్కలను మొలకెత్తించలేనట్లుగా కోసివేస్తాము.మేము ప్రాపంచిక స్థితిని,వేగముగా అంతం అయిపోవటాన్ని మీకు స్పష్టపరచినట్లు ఆధారాలను,ఋజువులను యోచన చేసే వారి కొరకు గుణపాఠం నేర్చుకునే వారి కొరకు స్పష్టపరుస్తున్నాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاللّٰهُ یَدْعُوْۤا اِلٰی دَارِ السَّلٰمِ ؕ— وَیَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మరియు అల్లాహ్ ప్రజలందరిని శాంతి నిలయమైన తన స్వర్గము వైపునకు పిలుస్తున్నాడు.అందులో ప్రజలు ఆపదల నుండి,దుఃఖముల నుండి భద్రంగా ఉంటారు.మరియు వారు మరణం నుండి భద్రంగా ఉంటారు.మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని ఈ శాంతి నిలయమునకు చేరవేసే ఇస్లాం ధర్మమును అనుగ్రహిస్తాడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• الله أسرع مكرًا بمن مكر بعباده المؤمنين.
అల్లాహ్ తన దాసుల్లోంచి విశ్వాసపరులపై ఎత్తులు వేసే వారి పై శీఘ్రంగా ఎత్తులు వేస్తాడు.

• بغي الإنسان عائد على نفسه ولا يضر إلا نفسه.
మనిషి యొక్క దౌర్జన్యము అతని పైనే మరలుతుంది.అతను కేవలం తన స్వయమునే నష్టం కలిగించుకుంటాడు.

• بيان حقيقة الدنيا في سرعة انقضائها وزوالها، وما فيها من النعيم فهو فانٍ.
ఇహలోకము సమాప్తమవటం,అంతమైపోవటం యొక్క వేగములో వాస్తవికత ప్రకటన.మరియు అందులో ఉన్న అనుగ్రహాలు అన్నీ అంతమైపోతాయి.

• الجنة هي مستقر المؤمن؛ لما فيها من النعيم والسلامة من المصائب والهموم.
స్వర్గము అందులో ఉన్న అనుగ్రహాలు,ఆపదలు,దుఃఖాల నుండి భద్రత మూలంగా విశ్వాసపరుని నివాస స్థలము.

 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Yūnus
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans - Übersetzungen

Vom Tafsirzentrum für Quranwissenschaften herausgegeben.

Schließen