Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans * - Übersetzungen


Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Ḥajj   Vers:
وَیَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ وَلَنْ یُّخْلِفَ اللّٰهُ وَعْدَهٗ ؕ— وَاِنَّ یَوْمًا عِنْدَ رَبِّكَ كَاَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ ۟
ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుండి అవిశ్వాసపరులు ఇహలోకములో తొందరగా వచ్చే శిక్ష గురించి,పరలోకంలో ఆలస్యంగా వచ్చే శిక్ష గురించి వేటి గురించి అయితే వారికి హెచ్చరించబడినదో మీతో తొందరపెడుతున్నారు. మరియు అల్లాహ్ తాను వారితో చేసిన వాగ్దానమును భంగపరచడు. తొందరగా వచ్చేది వారిపై బదర్ రోజులో వచ్చి పడింది. మరియు నిశ్ఛయంగా ఒక రోజు పరలోకములో శిక్ష అందులో ఉన్న శిక్ష కారణంగా మీరు ఇహ లోకములో లెక్క వేేసే వెయ్యి సంవత్సరముల మాదిరిగా ఉంటుంది.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَمْلَیْتُ لَهَا وَهِیَ ظَالِمَةٌ ثُمَّ اَخَذْتُهَا ۚ— وَاِلَیَّ الْمَصِیْرُ ۟۠
మరియు చాలా బస్తీల వారిని శిక్ష నుండి గడువునిచ్చాను. వారు తమ అవిశ్వాసం వలన దుర్మార్గులై ఉన్నారు. వారిని క్రమ క్రమంగా తీసుకెళ్ళటానికి నేను దానిని (శిక్షని) వారిపై తొందర చేయలేదు. ఆ తరువాత నేను వారిని కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష ద్వారా పట్టుకున్నాను. ప్రళయదినాన నా ఒక్కడి వైపే వారి మరలటం ఉన్నది. అప్పుడు వారి అవిశ్వాసం వలన నేను వారికి శాస్వతమైన శిక్షను ప్రసాదిస్తాను.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَكُمْ نَذِیْرٌ مُّبِیْنٌ ۟ۚ
ఓ ప్రజలారా నేను మాత్రం మిమ్మల్ని హెచ్చరించేవాడిని,నేను ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేరవేస్తాను. నా హెచ్చరించటంలో స్పష్టమైన వాడిని.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟
అయితే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తారో వారి కొరకు వారి పాపముల మన్నింపు వారి ప్రభువు వద్ద ఉన్నది. వారి కొరకు స్వర్గములో అంతం కాని గౌరవప్రదమైన ఆహారము కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ سَعَوْا فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟
మరియు ఎవరైతే మా ఆయతులను తిరస్కరించటంలో.అల్లాహ్ ను అశక్తుడిని చేస్తారని,అతని నుంచి తప్పించుకుంటారని,అప్పుడు ఆయన వారిని శిక్షించడని అనుకుని ప్రయత్నం చేశారో వారందరు నరక వాసులు. ఏ విధంగా ఒక స్నహితుడు తన స్నేహితునికి అట్టిపెట్టుకుని ఉంటాడో ఆ విధంగా వారు దాన్ని అట్టిపెట్టుకుని ఉంటారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ وَّلَا نَبِیٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰۤی اَلْقَی الشَّیْطٰنُ فِیْۤ اُمْنِیَّتِهٖ ۚ— فَیَنْسَخُ اللّٰهُ مَا یُلْقِی الشَّیْطٰنُ ثُمَّ یُحْكِمُ اللّٰهُ اٰیٰتِهٖ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟ۙ
ఓ ప్రవక్తా మేము మీకన్న మునుపు ప్రవక్తల్లోంచి గాని సందేశహరుల్లోంచి గాని ఎవరిని పంపించిన అతను అల్లాహ్ గ్రంధమును చదివినప్పుడు షైతాను అతని ఖిరాఅత్ లో కలుషితం చేసేవాడు దాని వలన అది దైవ వాణి అని ప్రజలకు సందేహం కలిగేది. అప్పుడు అల్లాహ్ షైతాను కలుషితం చేసిన కల్తీని వ్యర్ధ పరచి తన ఆయతులను స్థిరపరిచేవాడు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. తన సృష్టించటంలో,తన తఖ్దీరులో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
لِّیَجْعَلَ مَا یُلْقِی الشَّیْطٰنُ فِتْنَةً لِّلَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْقَاسِیَةِ قُلُوْبُهُمْ ؕ— وَاِنَّ الظّٰلِمِیْنَ لَفِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟ۙ
షైతాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖిరాఅత్ లో కల్తీ చేస్తాడు అల్లాహ్ అతని కల్తీని కపటుల కొరకు,ముష్రికుల్లోంచి ఎవరి హృదయములు కఠినమైపోయాయో వారి కొరకు అల్లాహ్ పరీక్షగా చేయటానికి. నిశ్ఛయంగా కపటుల్లోంచి,ముష్రికుల్లోంచి దుర్మార్గులైన వారు అల్లాహ్ కొరకు ,ఆయన ప్రవక్త కొరకు శతృత్వములో ఉన్నారు. మరియు సత్యము నుండి,సన్మార్గము నుండి దూరంగా ఉన్నారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَّلِیَعْلَمَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّكَ فَیُؤْمِنُوْا بِهٖ فَتُخْبِتَ لَهٗ قُلُوْبُهُمْ ؕ— وَاِنَّ اللّٰهَ لَهَادِ الَّذِیْنَ اٰمَنُوْۤا اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మరియు అల్లాహ్ ఎవరికైతే జ్ఞానమును ప్రసాదించాడో వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఖుర్ఆన్ ఓ ప్రవక్తా అది అల్లాహ్ మీ వైపు దైవ వాణి ద్వార చేరవేసిన సత్యం అని తెలుసుకోవాలి. అప్పుడు వారు దానిపై విశ్వాసమును అధికం చేసుకుంటారు,వారి హృదయములు దాని కొరకు అణకువభావమును కలిగి ఉండి భీతిపరులై ఉంటాయి. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ దానిపై విశ్వాసమును కనబరచిన వారికి ఎటువంటి వంకరతనం లేని సత్య మార్గమైన సన్మార్గము వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. దాని కొరకు వారి అణుకువభావమునకు వారికి ప్రతిఫలంగా.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَا یَزَالُ الَّذِیْنَ كَفَرُوْا فِیْ مِرْیَةٍ مِّنْهُ حَتّٰی تَاْتِیَهُمُ السَّاعَةُ بَغْتَةً اَوْ یَاْتِیَهُمْ عَذَابُ یَوْمٍ عَقِیْمٍ ۟
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు మీపై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ విషయంలో పదేపదే సందేహంలో పడి ఉంటారు,వారి వద్దకు వారు అదే స్థితిలో ఉన్నప్పుడు ప్రళయం అకస్మాత్తుగా వచ్చేంత వరకు లేదా ఎటువంటి కారుణ్యము,మేలు లేని దినపు శిక్ష వారిపై వచ్చిపడేంత వరకు దానిపైనే ఉంటారు. మరియు అది వారి కొరకు ప్రళయదినము.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• استدراج الظالم حتى يتمادى في ظلمه سُنَّة إلهية.
దుర్మార్గునికి అతడు తన దుర్మార్గంలో పెరిగిపోయేంత వరకు గడువు నివ్వటం దైవ సంప్రదాయము.

• حفظ الله لكتابه من التبديل والتحريف وصرف مكايد أعوان الشيطان عنه.
మార్పు చేర్పుల నుండి,వక్రీకరణ నుండి,షైతాను సహాయకుల కుతంత్రాల జరపటం నుండి అల్లాహ్ తన గ్రంధమునకు రక్షణ కల్పించటం.

• النفاق وقسوة القلوب مرضان قاتلان.
కపటత్వము,హృదయముల కఠినత్వము రెండు వినాశపూరిత రోగాలు.

• الإيمان ثمرة للعلم، والخشوع والخضوع لأوامر الله ثمرة للإيمان.
విశ్వాసము జ్ఞానము కొరకు ఫలం. మరియు అల్లాహ్ ఆదేశములపై అణకువ,నిమమ్రత విశ్వాసము కొరకు ఫలము.

 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Ḥajj
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans - Übersetzungen

Vom Tafsirzentrum für Quranwissenschaften herausgegeben.

Schließen