Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans * - Übersetzungen


Übersetzung der Bedeutungen Surah / Kapitel: Asch-Schūrā   Vers:
وَالَّذِیْنَ یُحَآجُّوْنَ فِی اللّٰهِ مِنْ بَعْدِ مَا اسْتُجِیْبَ لَهٗ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِنْدَ رَبِّهِمْ وَعَلَیْهِمْ غَضَبٌ وَّلَهُمْ عَذَابٌ شَدِیْدٌ ۟
మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ధర్మ విషయంలో ప్రజలు దాన్ని స్వీకరించిన తరువాత కూడా అసత్య వాదనల ద్వారా వాదిస్తున్నారో,ఈ వాదించే వారి వాదనలన్ని వారి ప్రభువు వద్ద,విశ్వాసపరుల వద్ద నిర్ధకమైపోతాయి,రాలిపోతాయి. వాటికి ఎటువంటి ప్రభావము ఉండదు. వారిపై వారి అవిశ్వాసము వలన, సత్యమును తిరస్కరించటం వలన అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం కురుస్తుంది. మరియు ప్రళయ దినమున వారిని నిరీక్షిస్తున్న కఠిన శిక్ష వారి కొరకు కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَللّٰهُ الَّذِیْۤ اَنْزَلَ الْكِتٰبَ بِالْحَقِّ وَالْمِیْزَانَ ؕ— وَمَا یُدْرِیْكَ لَعَلَّ السَّاعَةَ قَرِیْبٌ ۟
అల్లాహ్ యే ఎటువంటి సందేహం లేని ఖుర్ఆన్ ను సత్యముతో అవతరింపజేశాడు. మరియు ఆయన ప్రజల మధ్య న్యాయముగా తీర్పునివ్వటం కొరకు న్యాయమును అవతరింపజేశాడు. వీరందరు తిరస్కరించే ప్రళయము దగ్గరలోనే ఉన్నది. మరియు ప్రతీ రాబోయేది దగ్గరలోనే ఉన్నదని తెలుసు.
Arabische Interpretationen von dem heiligen Quran:
یَسْتَعْجِلُ بِهَا الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِهَا ۚ— وَالَّذِیْنَ اٰمَنُوْا مُشْفِقُوْنَ مِنْهَا ۙ— وَیَعْلَمُوْنَ اَنَّهَا الْحَقُّ ؕ— اَلَاۤ اِنَّ الَّذِیْنَ یُمَارُوْنَ فِی السَّاعَةِ لَفِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟
దాన్ని విశ్వసించని వారు దాని తొందరగా రావటమును కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎటువంటి లెక్క తీసుకోవటమును గాని ప్రతిఫలమును గాని ఏ శిక్షను గాని విశ్వసించరు. మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు దానిలో ఉన్న వారి పరిణామము నుండి వారి భయము వలన దాని నుండి భయపడుతారు. మరియు అది ఎటువంటి సందేహము లేని సత్యమని ఖచ్చితమైన జ్ఞానముతో వారు తెలుసుకుంటారు. వినండి నిశ్ఛయంగా ఎవరైతే ప్రళయం విషయంలో వాదిస్తారో మరియు దాని గురించి తగువులాడుతారో మరియు దాని వాటిల్లే విషయంలో సందేహపడుతారో వారు సత్యము నుండి దూరంగా అపమార్గములో ఉన్నారు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَللّٰهُ لَطِیْفٌ بِعِبَادِهٖ یَرْزُقُ مَنْ یَّشَآءُ ۚ— وَهُوَ الْقَوِیُّ الْعَزِیْزُ ۟۠
అల్లాహ్ తన దాసుల పట్ల దయ గలవాడు. ఆయన తాను తలచుకున్న వారికి ఆహారోపాధిని కలిగిస్తాడు. మరియు అతని కొరకు పుష్కలంగా ప్రసాదిస్తాడు. మరియు తాను తలచుకున్న వారిపై వివేకంగా, కారుణ్యంగా కుదించివేస్తాడు. మరియు ఆయన ఎవరూ ఓడించని బలవంతుడు,తన శతృవులతో ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు.
Arabische Interpretationen von dem heiligen Quran:
مَنْ كَانَ یُرِیْدُ حَرْثَ الْاٰخِرَةِ نَزِدْ لَهٗ فِیْ حَرْثِهٖ ۚ— وَمَنْ كَانَ یُرِیْدُ حَرْثَ الدُّنْیَا نُؤْتِهٖ مِنْهَا ۙ— وَمَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ نَّصِیْبٍ ۟
ఎవరైతే పరలోక ప్రతిఫలమును దానికి తగిన ఆచరణలను చేస్తూ కోరుకుంటాడో మేము అతని కొరకు అతని పుణ్యమును అధికం చేస్తాము. కాబట్టి ప్రతి పుణ్యము దానికి పది రెట్ల నుండి ఏడువందల రెట్లకు ఇంకా చాలా అధిక రెట్లకు పెరుగుతుంది. మరియు ఎవరైతే ఇహలోకమునొక్కటినే కోరుకుంటాడో మేము అతనికి అందులో అతని కొరకు నిర్ణయించబడిన భాగమును ప్రసాదిస్తాము. మరియు అతని కొరకు పరలోకములో దానిపై అతను ఇహలోకమును ప్రాధాన్యతను ఇవ్వటం వలన ఎటువంటి భాగము ఉండదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ لَهُمْ شُرَكٰٓؤُا شَرَعُوْا لَهُمْ مِّنَ الدِّیْنِ مَا لَمْ یَاْذَنْ بِهِ اللّٰهُ ؕ— وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِیَ بَیْنَهُمْ ؕ— وَاِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
ఏమీ ఈ ముష్రికులందరి కొరకు అల్లాహ్ కాకుండా ఇతర దైవాలు ఉన్నారా. మరియు వారు వారి కొరకు ధర్మములో అల్లాహ్ వారి కొరకు తన తో పాటు సాటికల్పించటమును,ఆయన ధర్మసమ్మతం చేసిన వాటిని నిషేధించటమును,ఆయన నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేయటమును అనుమతించని వాటిని ధర్మబద్ధం చేశారా ?. ఒక వేళ అల్లాహ్ విభేదించుకునే వారి మధ్య తీర్పు కొరకు నిర్ణీత సమయమును నిర్దేశించి,ఆయన వారిని అప్పటి వరకు గడువు ఇస్తానని తెలిపి ఉండకపోతే వారి మధ్య తీర్పు చేసి ఉండేవాడు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తొ పాటు సాటి కల్పించటం ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినవారి కొరకు ప్రళయదినమున వారి కొరకు నిరీక్షించే బాధాకరమైన శిక్ష కలదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
تَرَی الظّٰلِمِیْنَ مُشْفِقِیْنَ مِمَّا كَسَبُوْا وَهُوَ وَاقِعٌ بِهِمْ ؕ— وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فِیْ رَوْضٰتِ الْجَنّٰتِ ۚ— لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ— ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِیْرُ ۟
ఓ ప్రవక్తా షిర్కు ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన వారు తాము చేసుకున్న పాపము వలన కలిగే శిక్ష నుండి భయపడుతుండగా మీరు చూస్తారు. మరియు శిక్ష వారిపై ఖచ్చితంగా వచ్చిపడుతుంది. అప్పుడు పశ్చాత్తాపముతో ఖాళీగా ఉన్న భయము వారికి ప్రయోజనం కలిగించదు. మరియు అల్లాహ్ పై, ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి వారికి భిన్నంగా సత్కర్మలు చేసిన వారు స్వర్గవనములలో సుఖభోగాలను అనుభవిస్తుంటారు. వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే ఎన్నటికి అంతం కాని రకరకాల అనుగ్రహాలు కలవు. అదే పెద్ద అనుగ్రహము దానికి ఏ అనుగ్రహము సమానము కాదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• خوف المؤمن من أهوال يوم القيامة يعين على الاستعداد لها.
ప్రళయదినము యొక్క భయాందోళనల నుండి విశ్వాసపరుని భయము దాని కొరకు సిద్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది.

• لطف الله بعباده حيث يوسع الرزق على من يكون خيرًا له، ويضيّق على من يكون التضييق خيرًا له.
తన దాసులపై అల్లాహ్ యొక్క దయ ఉన్నది అందుకనే ఆయన ఎవరి కొరకైతే మేలైనదో వారికి పుష్కలంగా ఆహారోపాధిని ప్రసాదిస్తాడు. ఎవరి కొరకైతే కుదించటం మేలైనదో వారిపై కుదించివేస్తాడు.

• خطر إيثار الدنيا على الآخرة.
పరలోకముపై ఇహలోకమును ప్రాధాన్యతనివ్వటం యొక్క ప్రమాదము.

 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Asch-Schūrā
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans - Übersetzungen

Vom Tafsirzentrum für Quranwissenschaften herausgegeben.

Schließen