Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad * - Übersetzungen

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Anʿām   Vers:
وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖۤ اِذْ قَالُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰی بَشَرٍ مِّنْ شَیْءٍ ؕ— قُلْ مَنْ اَنْزَلَ الْكِتٰبَ الَّذِیْ جَآءَ بِهٖ مُوْسٰی نُوْرًا وَّهُدًی لِّلنَّاسِ تَجْعَلُوْنَهٗ قَرَاطِیْسَ تُبْدُوْنَهَا وَتُخْفُوْنَ كَثِیْرًا ۚ— وَعُلِّمْتُمْ مَّا لَمْ تَعْلَمُوْۤا اَنْتُمْ وَلَاۤ اٰبَآؤُكُمْ ؕ— قُلِ اللّٰهُ ۙ— ثُمَّ ذَرْهُمْ فِیْ خَوْضِهِمْ یَلْعَبُوْنَ ۟
మరియు వారు: "అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు."[1] అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్ ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను: "అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడి పత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చుపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రితాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?" ఇంకా ఇలా అను:"అల్లాహ్ యే (దానిని అవతరింపజేశాడు)." ఆ పిదప వారిని, వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు!
[1] చూడండి, 10:2 మరియు 17:94.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَلِتُنْذِرَ اُمَّ الْقُرٰی وَمَنْ حَوْلَهَا ؕ— وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ یُؤْمِنُوْنَ بِهٖ وَهُمْ عَلٰی صَلَاتِهِمْ یُحَافِظُوْنَ ۟
మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది మరియు ఇది ఉమ్ముల్ ఖురా (మక్కా)[1] మరియు దాని చుట్టు ప్రక్కలలో ఉన్నవారిని హెచ్చరించటానికి అవతరింపజేయ బడింది. మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమాజ్ లను క్రమబద్ధంగా పాటిస్తారు.
[1] అదే అల్లాహ్ (సు.తా.) ఆరాధన కొరకు మొట్టమొదట నిర్మించబడిన ఆలయం క'అబహ్. అదే ఖిబ్లా, అదే మక్కా. ('తబరీ - ఇబ్నె - 'అబ్బాస్ ర'ది.'అ.) కథనం ఆధారంగా). చూడండి, 3:96.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ قَالَ اُوْحِیَ اِلَیَّ وَلَمْ یُوْحَ اِلَیْهِ شَیْءٌ وَّمَنْ قَالَ سَاُنْزِلُ مِثْلَ مَاۤ اَنْزَلَ اللّٰهُ ؕ— وَلَوْ تَرٰۤی اِذِ الظّٰلِمُوْنَ فِیْ غَمَرٰتِ الْمَوْتِ وَالْمَلٰٓىِٕكَةُ بَاسِطُوْۤا اَیْدِیْهِمْ ۚ— اَخْرِجُوْۤا اَنْفُسَكُمْ ؕ— اَلْیَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَقُوْلُوْنَ عَلَی اللّٰهِ غَیْرَ الْحَقِّ وَكُنْتُمْ عَنْ اٰیٰتِهٖ تَسْتَكْبِرُوْنَ ۟
మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: "నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: "అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!"[1] అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది![2]
[1] ఇక్కడ పేర్కొన్న శిక్ష చనిపోయిన తరువాత మరియు పునరుత్థాన దినానికి ముందు ఉండే బ'ర్జఖ్ కాలంలో ఇవ్వబడే శిక్ష. [2] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 450 మరియు 422.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ جِئْتُمُوْنَا فُرَادٰی كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ وَّتَرَكْتُمْ مَّا خَوَّلْنٰكُمْ وَرَآءَ ظُهُوْرِكُمْ ۚ— وَمَا نَرٰی مَعَكُمْ شُفَعَآءَكُمُ الَّذِیْنَ زَعَمْتُمْ اَنَّهُمْ فِیْكُمْ شُرَكٰٓؤُا ؕ— لَقَدْ تَّقَطَّعَ بَیْنَكُمْ وَضَلَّ عَنْكُمْ مَّا كُنْتُمْ تَزْعُمُوْنَ ۟۠
మరియు వాస్తవంగా, మేము మొదటి సారి మిమ్మల్ని పుట్టించినట్లే, మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా, మీరు మీ వీపుల వెనుక వదలి వచ్చారు. మరియు మీరు అల్లాహ్ కు సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన మీ సిఫారసుదారులను, మేము మీతో పాటు చూడటం లేదే! వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగి పోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి.
Arabische Interpretationen von dem heiligen Quran:
 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Anʿām
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad - Übersetzungen

Übersetzt von Abdur-Rahim Ibn Muhammad.

Schließen