Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Houd   Aya:
وَیٰقَوْمِ لَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مَالًا ؕ— اِنْ اَجْرِیَ اِلَّا عَلَی اللّٰهِ وَمَاۤ اَنَا بِطَارِدِ الَّذِیْنَ اٰمَنُوْا ؕ— اِنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَلٰكِنِّیْۤ اَرٰىكُمْ قَوْمًا تَجْهَلُوْنَ ۟
ఓ నా జాతి వారా సందేశాలను చేరవేయటంపై నేను మీ నుండి ఎటువంటి ధనాన్ని ఆశించటం లేదు.నా ప్రతిఫలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది.మరియు మీరు గెంటివేయమని కోరిన పేద విశ్వాసపరులను నా సమావేశముల నుండి నేను దూరంచేయను.నిశ్చయంగా వారు ప్రళయదినాన తమ ప్రభువును కలుసుకుంటారు.మరియు ఆయన వారికి వారి విశ్వాసపరముగా ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.కానీ నేను మిమ్మల్ని మీరు పేదవిశ్వాసపరులను గెంటివేయమని కోరినప్పుడు ఈ పిలుపు యొక్క వాస్తవాన్ని అర్ధం చేసుకోని జాతి వారిగా భావిస్తున్నాను.
Tafsiran larabci:
وَیٰقَوْمِ مَنْ یَّنْصُرُنِیْ مِنَ اللّٰهِ اِنْ طَرَدْتُّهُمْ ؕ— اَفَلَا تَذَكَّرُوْنَ ۟
ఓ నాజాతి వారా ఒక వేళ నేను ఈ విశ్వసపరులందరిని ఏ పాపము లేకుండా దౌర్జన్యంగా గెంటివేస్తే నా నుండి అల్లాహ్ శిక్షను ఎవరు దూరం చేస్తారు ?.ఏమీ మీరు గుణపాఠం నేర్చుకోరా,మీకు ఎక్కువ ప్రయోజనం కల,ఎక్కువ లాభదాయకమైన కార్యాల కై ప్రయత్నం చేయరా ?!.
Tafsiran larabci:
وَلَاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآىِٕنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَیْبَ وَلَاۤ اَقُوْلُ اِنِّیْ مَلَكٌ وَّلَاۤ اَقُوْلُ لِلَّذِیْنَ تَزْدَرِیْۤ اَعْیُنُكُمْ لَنْ یُّؤْتِیَهُمُ اللّٰهُ خَیْرًا ؕ— اَللّٰهُ اَعْلَمُ بِمَا فِیْۤ اَنْفُسِهِمْ ۖۚ— اِنِّیْۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ ۟
ఓ నాజాతి వారా నా వద్ద అల్లాహ్ నిధులు ఉన్నాయని వాటిలో ఆయన ప్రసాధించిన ఆహారోపాది ఉన్నదని ఒక వేళ మీరు విశ్వసిస్తే నేను దాన్ని మీపై ఖర్చు చేస్తాను అని మీతో అనటంలేదు.మరియు నాకు అగోచర విషయాల గురించి జ్ఞానం ఉన్నదని మీతో అనటం లేదు.నేను దైవదూతల్లోంచి అని మీతో అనటం లేదు కాని నేనూ మీలాగా మనిషిని.మరియు మీరు మీ దృష్టిలో అల్పముగా,చిన్నవారిగా భావించేవారిని అల్లాహ్ మేలు చేయడని సన్మార్గం చూపడని అనటం లేదు.అల్లాహ్ కి వారి సంకల్పాల గురించి,వారి స్థితుల గురించి బాగా తెలుసు.నిశ్చయంగా ఒక వేళ నేను దాన్నివాదిస్తే (దావా) అల్లాహ్ శిక్షకు అర్హత కలిగిన దుర్మార్గుల్లోంచి అయిపోతాను.
Tafsiran larabci:
قَالُوْا یٰنُوْحُ قَدْ جَادَلْتَنَا فَاَكْثَرْتَ جِدَالَنَا فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
వారు మొండితనముతో,అహంకారముతో ఇలా పలికారు : ఓ నూహ్ నిశ్చయంగా నీవు మాతో గొడవపడ్డావు,మాతో వాదించావు.అప్పుడు నీవు మాతో గొడవను,వాదనను అధికం చేశావు.అయితే ఒక వేళ నీవు నీ వాగ్దానములో సత్యవంతుడివే అయితే నీవు మాతో వాగ్దానం చేసిన శిక్షను మా వద్దకు తీసుకుని రా.
Tafsiran larabci:
قَالَ اِنَّمَا یَاْتِیْكُمْ بِهِ اللّٰهُ اِنْ شَآءَ وَمَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ ۟
నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నేను మీ వద్దకు శిక్షను తీసుకుని వచ్చేవాడిని కాను.దాన్ని మీ వద్దకు తలచుకుంటే అల్లాహ్ మాత్రమే తీసుకుని వస్తాడు.ఒక వేళ అల్లాహ్ మీకు శిక్షించదలచుకుంటే మీరు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరు.
Tafsiran larabci:
وَلَا یَنْفَعُكُمْ نُصْحِیْۤ اِنْ اَرَدْتُّ اَنْ اَنْصَحَ لَكُمْ اِنْ كَانَ اللّٰهُ یُرِیْدُ اَنْ یُّغْوِیَكُمْ ؕ— هُوَ رَبُّكُمْ ۫— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟ؕ
మరియు ఒక వేళ మీ మొండితనం వలన అల్లాహ్ మిమ్మల్ని సన్మార్గము నుండి తప్పించదలచుకుంటే,మిమ్మల్ని సన్మార్గము నుండి పరాభవమునకు లోను చేయదలచుకుంటే నా హితబోధన,నా సలహాలు మీకు ప్రయోజనం చేకూర్చవు.ఆయనే మీ ప్రభువు.ఆయనే మీ వ్యవహారాలకు యజమాని.ఒక వేళ ఆయన తలచుకుంటే మిమ్మల్ని అపమార్గమునకు గురి చేస్తాడు.ప్రళయదినాన ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు.ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
Tafsiran larabci:
اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ— قُلْ اِنِ افْتَرَیْتُهٗ فَعَلَیَّ اِجْرَامِیْ وَاَنَا بَرِیْٓءٌ مِّمَّا تُجْرِمُوْنَ ۟۠
నూహ్ అలైహిస్సలాం జాతి వారి అవిశ్వాసమునకు కారణం ఆయన తీసుకుని వచ్చిన ఈ ధర్మమును ఆయన అల్లాహ్ పై కల్పించుకున్నారని వారు భావించేవారు.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను దాన్ని కల్పించుకుంటే నా పాపము యొక్క శిక్ష నా ఒక్కడిపై ఉంటుంది.మరియు నేను మీ తిరస్కారము యొక్క కొంచెము పాపమును కూడా మోయను.నేను దాని నుండి నిర్దోషిని.
Tafsiran larabci:
وَاُوْحِیَ اِلٰی نُوْحٍ اَنَّهٗ لَنْ یُّؤْمِنَ مِنْ قَوْمِكَ اِلَّا مَنْ قَدْ اٰمَنَ فَلَا تَبْتَىِٕسْ بِمَا كَانُوْا یَفْعَلُوْنَ ۟ۚ
మరియు అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం వైపునకు వహీ చేశాడు ఓ నూహ్ మీ జాతి వారిలోంచి ముందు విశ్వసించిన వారు తప్ప ఇంకా విశ్వసించరు.అయితే ఓ నూహ్ ఈ సుదీర్ఘమైన కాలము మధ్యలో వారు పాల్పడిన తిరస్కారము,ఎగతాళి చేయటం వలన మీరు బాధపడకండి.
Tafsiran larabci:
وَاصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَوَحْیِنَا وَلَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ— اِنَّهُمْ مُّغْرَقُوْنَ ۟
మరియు మీరు మా కళ్ళ ముందు,మా సంరక్షణలో మేము వహీ ద్వారా మీకు ఓడను ఎలా చేయాలని మీకు సూచించిన విధంగా ఓడను తయారు చేయండి.అవిశ్వాసము ద్వారా తమపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి గడువు ఇవ్వమని కోరుతూ నీవు నాతో మాట్లాడకు.అవిశ్వాసము పై వారి మొండితనము వలన వారు తమకు శిక్షగా నిశ్చయంగా తుఫానులో ఖచ్చితంగా వారు ముంచివేయబడుతారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• عفة الداعية إلى الله وأنه يرجو منه الثواب وحده.
అల్లాహ్ వైపు పిలిచేవాడి పవిత్రత మరియు అతడు ఆయన ఒక్కడి నుండి మాత్రమే ప్రతిఫలం కోరుకుంటాడు.

• حرمة طرد فقراء المؤمنين، ووجوب إكرامهم واحترامهم.
పేద విశ్వాసపరులను గెంటివేయటం నిషిద్ధత మరియు వారిని గౌరవించటం,ఆదరించటం అనివార్యము.

• استئثار الله تعالى وحده بعلم الغيب.
అగోచర జ్ఞానము మహోన్నతుడైన ఒకే ఒక అల్లాహ్ కు ప్రత్యేకము.

• مشروعية جدال الكفار ومناظرتهم.
అవిశ్వాసపరులతో వాదించటం,వారితో చర్చించటం ధర్మబద్దము.

 
Fassarar Ma'anoni Sura: Houd
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa