Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Al'bakara   Aya:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ۙ— اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَیْنَا ؕ— وَاِنَّاۤ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ ۟
ఆ తరువాత వారు ఇలా పలుకుతూ తమ మొండితనంలో కొనసాగిపోయారు : దాని లక్షణాలను మాకు మరింత స్పష్టపరచటానికి నీ ప్రభువుతో మా కొరకు వేడుకో. ఎందుకంటే ఈ ప్రస్తావించబడిన లక్షణాలతో వర్ణించబడిన ఆవులు చాలా ఉండేవి వాటిలో నుండి దాన్ని మేము గుర్తించలేకపోతున్నాము. జిబాహ్ చేయటమునకు కోరబడిన ఆవు వైపునకు అల్లాహ్ తలచుకుంటే వారు పొందుతారని దృవీకరిస్తూ.
Tafsiran larabci:
قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِیْرُ الْاَرْضَ وَلَا تَسْقِی الْحَرْثَ ۚ— مُسَلَّمَةٌ لَّا شِیَةَ فِیْهَا ؕ— قَالُوا الْـٰٔنَ جِئْتَ بِالْحَقِّ ؕ— فَذَبَحُوْهَا وَمَا كَادُوْا یَفْعَلُوْنَ ۟۠
అప్పుడు మూసా వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఈ ఆవు యొక్క లక్షణం ఏమిటంటే అది దున్నటంలో గాని భూమికి నీరు వేయటంలో గాని పనిచేయటానికి ఉపయోగించబడి ఉండకూడదు. మరియు అది లోపముల నుండి సురక్షితంగా ఉండాలి. మరియు దాని పసుపు రంగు కాకుండా వేరే రంగు గుర్తు అందులో ఉండకూడదు. అప్పుడు వారు ఇలా పలికారు : ఇప్పుడు నీవు ఆవును పూర్తిగా నిర్వచించే ఖచ్చితమైన లక్షణమును తీసుకుకుని వచ్చావు. వాదనలు మరియు మొండి తనం వలన వారు దగ్గర దగ్గర దాన్ని జిబాహ్ చేసే స్థితిలో లేని తరువాత కూడా దాన్ని జిబాహ్ చేశారు.
Tafsiran larabci:
وَاِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِیْهَا ؕ— وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟ۚ
మరియు మీలో నుండి ఒక వ్యక్తిని మీరు హత్య చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు పరస్పరం సమర్ధించుకున్నారు. ప్రతి ఒక్కరు తన తరపు నుండి హత్య నిందను సమర్ధించుకుని దాన్ని ఇతరుల మీద మోపసాగారు. చివరకు మీరు పరస్పరం తగువులాడసాగారు. మరియు అల్లాహ్ ఆ నిర్దోషి హత్యను దేనినైతే మీరు దాస్తున్నారో బయట పెడతాడు.
Tafsiran larabci:
فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَا ؕ— كَذٰلِكَ یُحْیِ اللّٰهُ الْمَوْتٰی وَیُرِیْكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
అప్పుడు మేము మీతో ఇలా పలికాము : మీరు జిబాహ్ చేయమని ఆదేశించబడిన ఆవు ఒక భాగముతో మీరు హతుడిపై కొట్టండి. నిశ్చయంగా హత్య చేసిన వాడు ఎవడో అతడు తెలియపరచటానికి అల్లాహ్ అతడిని తొందరలోనే జీవింపజేస్తాడు. ఈ మృతుడిని జీవింపజేసినట్లే అల్లాహ్ ప్రళయదినమున మృతులను జీవింపజేస్తాడు. మరియు తన సామర్ధ్యంపై సూచించే ఆధారాలను మీకు చూపిస్తాడు. బహుశా మీరు వాటిని అర్ధం చేసుకుని మహోన్నతుడైన అల్లాహ్ పై వాస్తవంగా విశ్వాసం కనబరుస్తారని.
Tafsiran larabci:
ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ فَهِیَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ؕ— وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا یَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَشَّقَّقُ فَیَخْرُجُ مِنْهُ الْمَآءُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَهْبِطُ مِنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఆ పిదప మీ హృదయములు ఈ వాక్చాతుర్యమైన హితోపదేశములు,అద్భుతమైన అద్భుతాల తరువాత కఠినంగా అయిపోయినవి. చివరికి అవి రాళ్ళ వలె అయిపోయినవి, అంతే కాదు వాటి కన్న ఎక్కువ కఠినంగా మారిపోయినవి. అవి తమ స్థితి నుండి ఎన్నడు మారవు. ఇక రాళ్ళు మారుతాయి. నిశ్చయంగా కొన్ని రాళ్ళ నుంచి సెలయేరులు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా వాటిలో నుంచి కొన్ని పగిలి దాని నుండి నీరు బయటకు వచ్చి భూమిలో ప్రవహించే ఊటలు ఏర్పడుతాయి. వాటి నుండి ప్రజలు మరియు పశువులు ప్రయోజనం చెందుతారు. మరియు వాటిలో నుండి కొన్ని అల్లాహ్ భయభీతి వలన పర్వతాల పై నుండి క్రిందికి రాలి పడతాయి. మరియు మీ హృదయములు అలా కాదు. మరియు మీరు చేస్తున్న వాటి నుండి అల్లాహ్ పరధ్యానంలో లేడు. కాని దాని గురించి ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
اَفَتَطْمَعُوْنَ اَنْ یُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِیْقٌ مِّنْهُمْ یَسْمَعُوْنَ كَلٰمَ اللّٰهِ ثُمَّ یُحَرِّفُوْنَهٗ مِنْ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ یَعْلَمُوْنَ ۟
ఓ విశ్వాసులారా ఏమీ మీరు యూదుల స్థితి వాస్తవికత మరియు వారి మొండితనము తెలిసిన తరువాత కూడా వారు విశ్వసిస్తారని మరియు మీకు ప్రతిస్పందిస్తారని ఆశిస్తున్నారా ?. వాస్తవానికి వారి పండితుల్లోంచి ఒక వర్గము తౌరాతులో మీపై అవతరింపబడిన అల్లాహ్ వాక్కును వింటున్నది. ఆ తరువాత వాటి పదాలను మరియు వాటి అర్ధాలను తాము వాటిని అర్ధం చేసుకున్న తరువాత వాటిని గుర్తించిన తరువాత మార్చివేస్తున్నారు. వాస్తవానికి వారికి తమ మహా నేరము గురించి తెలుసు.
Tafsiran larabci:
وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰی بَعْضٍ قَالُوْۤا اَتُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَیْكُمْ لِیُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
యూదుల వైరుధ్యాలు మరియు వారి కుట్రల్లోంచి వారిలోని కొందరు విశ్వాసపరులతో కలిస్తే వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీని మరియు ఆయన సందేశము సరవటం గురించి వారి ముందు అంగీకరించేవారు. కాని యూదులు పరస్పరం ఏకాంతంలో కలిసినప్పుడు ఈ అంగీకారాల వలన పరస్పరం దూషించుకునేవారు. ఎందుకంటే ముస్లిములు వారి నుండి దైవ దౌత్య నిజాయితీ గురించి జరిగిన విషయంలో వారికి విరుద్ధంగా వాటి ద్వారా వాదనలను స్థాపించేవారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• أن بعض قلوب العباد أشد قسوة من الحجارة الصلبة؛ فلا تلين لموعظة، ولا تَرِقُّ لذكرى.
కొంతమంది దాసుల హృదయములు గట్టి రాళ్ళ కన్న ఎక్కువగా కఠినంగా ఉంటాయి. అవి ఏ హితబోధన వలన కూడా మెత్తగా అవ్వవు మరియు ఏ ఉపదేశము వలన మృధువుగా మారవు.

• أن الدلائل والبينات - وإن عظمت - لا تنفع إن لم يكن القلب مستسلمًا خاشعًا لله.
సూచనలు మరియు ఆధారాలు ఒక వేళ అవి ఎంత గొప్పవైన హృదయము అల్లాహ్ కు వినయంగా లొంగకపోతే ప్రయోజనం కలిగించవు.

• كشفت الآيات حقيقة ما انطوت عليه أنفس اليهود، حيث توارثوا الرعونة والخداع والتلاعب بالدين.
యూదుల మనస్సులు దేన్ని కలిగి ఉన్నాయో దాని వాస్తవికతను ఆయతులు వెల్లడించాయి ఎందుకంటే వారు బుద్ధిలేమి మరియు మేసం చేయటం,ధర్మం పట్ల ఆటలాడటమునకు వారసులయ్యారు.

 
Fassarar Ma'anoni Sura: Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa