Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (196) Sura: Suratu Al'bakara
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِ ؕ— فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰی یَبْلُغَ الْهَدْیُ مَحِلَّهٗ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ بِهٖۤ اَذًی مِّنْ رَّاْسِهٖ فَفِدْیَةٌ مِّنْ صِیَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍ ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ ۥ— فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَی الْحَجِّ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ فِی الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْ ؕ— تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ— ذٰلِكَ لِمَنْ لَّمْ یَكُنْ اَهْلُهٗ حَاضِرِی الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟۠
అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హజ్,ఉమ్రాలను పూర్తి చేయండి. ఆ రెండిటిని పూర్తి చేయటం నుండి అనారోగ్యం,శతృవుల వలన ఆపబడినప్పుడు మీరు ఒంటె,ఆవు,గొర్రెల్లోంచి అందుబాటులో ఉన్న దేనినైన ఒకదానిని మీ ఇహ్రామ్ దీక్ష నుండి హలాల్ అవ్వటం కొరకు ఖుర్బానీగా ఇవ్వండి. ఖుర్బానీ దాని స్థానమునకు చేరే వరకు మీ శిరో ముండనం కాని,వెంట్రుకలను కత్తిరించటం కాని చేయకూడదు,ఒక వేళ హరమ్ ప్రాంతంలో ప్రవేశించడం నుంచి ఆపబడితే మీరు ఆపబడిన ప్రాంతంలోనే జిబహ్ చేయండి. ఒకవేళ హరమ్ నుండి ఆపబడకపోతే హరమ్లోనే ఖుర్బానీ ఇచ్చే రోజున లేదా దాని తరువాత తష్రీఖ్ దినాల్లో జిబాహ్ చేయండి. మీలో నుంచి ఎవరైన అనారోగ్యానికి గురైనా లేదా అతని తలలో పేలు వేరే వాటి వలన ఏదైన బాధ ఉన్న కారణంగా శిరో ముండనం చేసుకోవచ్చు,ఆతనిపై ఎటువంటి దోషము లేదు. కాని అతను మూడు రోజులు ఉపవాసముండాలి లేదా ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి లేదా ఒక జంతువును జిబాహ్ చేసి హరమ్ ప్రాంతంలోని పేదవారిలో పంచి పరిహారంగా చల్లించాలి. మీరు భయాందోళనలో కాకుండా ప్రశాంతతలో ఉన్నప్పుడు మీలో నుంచి ఎవరైన హజ్ మాసములో ఉమ్రా చేసి ప్రయోజనం పొందదలుచుకుని ఇహ్రామ్ నుంచి బయటకు వచ్చి హజ్ కొరకు ఇహ్రామ్ కట్టేవరకు ఇహ్రామ్ స్థితిలో ఆపబడిన కార్యాల నుండి లబ్ది పొందదలుచుకంటే ఒక గొర్రెను జిబాహ్ చేయాలి లేదా ఒక ఒంటెలో లేదా ఒక ఆవులో ఏడుగురు భాగస్వాములు కావచ్చు. ఖుర్బానీ ఇవ్వలేని వారు దానికి బదులుగా హజ్ దినాల్లో మూడు రోజులు ఉపవాసం పాటించాలి,ఇంకా ఇంటికి వాపసు అయిన తరువాత పది రోజుల ఉపవాసాలు పూర్తి అవటం కొరకు ఏడు రోజులు ఉపవాసం ఉండాలి. ఈ హజ్జె తమత్తు లో ఖుర్బానీ తప్పనిసరిగా ఇవ్వటం,స్థోమత లేనివాడు ఉపవాసాలుండటం హరమ్ ప్రాంతం వారు కాకుండా దూర ప్రాంతముల నుండి హజ్ కొరకు వచ్చిన వారి కొరకు వర్తిస్తుంది. అల్లాహ్ నిర్దేశించిన వాటిని పాటించటంలో,ఆయన హద్దులను గౌరవించటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఆదేశాలను వ్యతిరేకించే వారిని ఆయన కఠినంగా శిక్షిస్తాడని మీరు తెలుసుకోండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• مقصود الجهاد وغايته جَعْل الحكم لله تعالى وإزالة ما يمنع الناس من سماع الحق والدخول فيه.
ఆదేశమును అల్లాహ్ మన్నత కొరకు చేయటం,సత్యమును వినటము నుండి,సత్యములో ప్రవేశించటం నుండి ప్రజలను ఆటంకం కలిగించే వాటిని దూరం చేయటం జిహాద్ (ధర్మ పోరాటం) ఉద్దేశము,లక్ష్యము.

• ترك الجهاد والقعود عنه من أسباب هلاك الأمة؛ لأنه يؤدي إلى ضعفها وطمع العدو فيها.
జిహాద్ ను వదిలి వేయటం,దాని నుండి వెనుకంజ వేయటం ఉమ్మత్ వినాశనమునకు కారణమవుతుంది.ఎందుకంటే అది ఉమ్మత్ ని బలహీనతకు చేరుస్తుంది,వారిలో శతృవులు దురాశను చూపుతారు.

• وجوب إتمام الحج والعمرة لمن شرع فيهما، وجواز التحلل منهما بذبح هدي لمن مُنِع عن الحرم.
హజ్ మరియు ఉమ్రా ఫ్రారంభించిన వారికి వాటిని పూర్తి చేయటం తప్పనిసరి.హరమ్ ప్రాంతములో ప్రవేశము నుండి ఆపబడిన వారు ఒక జంతువును జిబాహ్ చేసి ఇహ్రామ్ దీక్ష నుండి బయటకు రావటం ధర్మసమ్మతమే.

 
Fassarar Ma'anoni Aya: (196) Sura: Suratu Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa