Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Suratu Al'anbiyaa   Aya:

సూరహ్ అల్-అంబియా

daga cikin abunda Surar ta kunsa:
إثبات الرسالة وبيان وحدة غاية الأنبياء وعناية الله بهم.
దైవదౌత్యమును రుజువు చేయడం మరియు ప్రవక్తల యొక్క ఒకే లక్ష్యమును తెలపటం మరియు వారి పట్ల అల్లాహ్ శ్రద్ధను పేర్కొనడం.

اِقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِیْ غَفْلَةٍ مُّعْرِضُوْنَ ۟ۚ
ప్రళయదినాన ప్రజల కొరకు వారి కర్మలపై వారి లెక్క దగ్గరైనది. వారు ఇహలోకములో మునిగి ఉండటం వలన పరలోకము నుండి విముఖత చూపుతూ పరధ్యానంలో పడి ఉన్నస్థితిలో ఉన్నారు.
Tafsiran larabci:
مَا یَاْتِیْهِمْ مِّنْ ذِكْرٍ مِّنْ رَّبِّهِمْ مُّحْدَثٍ اِلَّا اسْتَمَعُوْهُ وَهُمْ یَلْعَبُوْنَ ۟ۙ
వారి వద్దకు వారి ప్రభువు వద్ద నుండి ఖుర్ఆన్ లో ఏదైన కొత్త సందేశము అవతరించి వస్తే వారు దాన్ని ప్రయోజనం చెందని విధంగా మాత్రమే వింటారు,అంతే కాక అందులో ఉన్న వాటిని పట్టించుకోకుండా ఆడుకుంటూ వింటారు.
Tafsiran larabci:
لَاهِیَةً قُلُوْبُهُمْ ؕ— وَاَسَرُّوا النَّجْوَی ۖۗ— الَّذِیْنَ ظَلَمُوْا ۖۗ— هَلْ هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۚ— اَفَتَاْتُوْنَ السِّحْرَ وَاَنْتُمْ تُبْصِرُوْنَ ۟
వారు దాన్ని వింటారు వాస్తవానికి వారి హృదయములు దాని నుండి పరధ్యానంలో పడి ఉన్నాయి. మరియు దుర్మార్గులు ఆ సందేశమును తిరస్కరించటం ద్వారా దాచారు దేని గురించైతే వారు రహస్య మంతనాలు చేస్తూ పలికారు : తాను ప్రవక్తనని వాదించే ఇతడు మీలాంటి ఒక మనిషి మాత్రమే,మీకు అతనికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. మరియు అతను తీసుకుని వచ్చినది మంత్రజాలము. అతడు మీలాంటి ఒక మనిషి అని,అతను తీసుకుని వచ్చినది మంత్రజాలము అని మీకు తెలిసికూడా అతనినే మీరు అనుసరిస్తారా ?!.
Tafsiran larabci:
قٰلَ رَبِّیْ یَعْلَمُ الْقَوْلَ فِی السَّمَآءِ وَالْاَرْضِ ؗ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు : మీరు దాచి పెట్టిన మాట నా ప్రభువుకు తెలుసు. భూమ్యాకాశముల్లో పలికే వారితో వెలువడే ప్రతీ మాట ఆయనకు తెలుసు. మరియు ఆయన తన దాసుల మాటలను బాగా వినే వాడును,వారి కర్మలను బాగా తెలిసిన వాడును. మరియు ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును తొందరలోనే ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
بَلْ قَالُوْۤا اَضْغَاثُ اَحْلَامٍ بَلِ افْتَرٰىهُ بَلْ هُوَ شَاعِرٌ ۖۚ— فَلْیَاْتِنَا بِاٰیَةٍ كَمَاۤ اُرْسِلَ الْاَوَّلُوْنَ ۟
అంతే కాక వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాని విషయంలో సందేహించుకున్నారు. కొన్ని సార్లు వారు ఎటువంటి వివరణ లేని మిశ్రమ కలలు అన్నారు. కొన్ని సార్లు వారు కాదు కాదు అతను దాన్ని ఎటువంటి మూలం లేకుండా కల్పించుకున్నాడు అన్నారు. కొన్ని సార్లు వారు అతడు కవి అన్నారు. ఒక వేళ అతను తన వాదనలో సత్యవంతుడే అయితే పూర్వ ప్రవక్తల లాంటి ఏదైన మహిమను మా వద్దకు తీసుకుని రావాలి. నిశ్ఛయంగా వారు మూసా యొక్క చేతి కర్ర,సాలెహ్ యొక్క ఒంటె లాంటి మహిమలను తీసుకుని వచ్చారు.
Tafsiran larabci:
مَاۤ اٰمَنَتْ قَبْلَهُمْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا ۚ— اَفَهُمْ یُؤْمِنُوْنَ ۟
ఈ ప్రతిపాదించిన వారందరి కన్నా ముందు ఏ బస్తీ విశ్వసించలేదు. వారు సూచనల అవతరణ గురించి ప్రతిపాదించారు,అప్పుడు వారు ప్రతిపాదించిన విధంగా వారికి అవి ప్రసాదించబడినవి,కానీ వారు వాటిని తిరస్కరించారు. అప్పుడు మేమువారిని తుదిముట్టించాము. అయితే వీరందరూ విశ్వసిస్తారా ?!.
Tafsiran larabci:
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ فَسْـَٔلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా మేము మీ కన్నా మునుపు పంపించిన వారందరు మానవుల్లోంచి మగవారు మాత్రమే,మేము వారికి దైవవాణిని చేరవేశాము. మేము వారిని దైవ దూతలగా పంపించలేదు. అది మీకు తెలియకపోతే మీ కన్నా ముందు నుండి ఉన్న గ్రంధవహులను మీరు అడగండి.
Tafsiran larabci:
وَمَا جَعَلْنٰهُمْ جَسَدًا لَّا یَاْكُلُوْنَ الطَّعَامَ وَمَا كَانُوْا خٰلِدِیْنَ ۟
మేము వారి వద్దకు పంపించిన ప్రవక్తలను ఆహారమును తినని శరీరాలు కలవారిగా చేయలేదు. కాని వారు ఇతరులు తినేటట్లుగా తినేవారు.మరియు వారు మరణించకుండా ఇహలోకములో శాస్వతంగా ఉండరు.
Tafsiran larabci:
ثُمَّ صَدَقْنٰهُمُ الْوَعْدَ فَاَنْجَیْنٰهُمْ وَمَنْ نَّشَآءُ وَاَهْلَكْنَا الْمُسْرِفِیْنَ ۟
ఆ తరువాత మా ప్రవక్తల కొరకు మేము చేసిన వాగ్దానమును వినాశనం నుండి మేము వారిని రక్షించినప్పుడు,విశ్వాసపరుల్లోంచి మేము కోరిన వారిని రక్షించినప్పుడు పూర్తి చేశాము. మరియు మేము అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము ద్వారా,తమ పాప కార్యములకు పాల్పడటం ద్వారా హద్దు మీరిన వారిని తుదిముట్టించాము.
Tafsiran larabci:
لَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكُمْ كِتٰبًا فِیْهِ ذِكْرُكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟۠
నిశ్ఛయంగా మేము మీ వైపునకు ఖుర్ఆన్ ను అవతరింపజేశాము ఒక వేళ మీరు దాన్ని విశ్వసించి అందులో ఉన్న వాటిని ఆచరిస్తే అందులో మీకు గౌరవము,మీకు గర్వము ఉన్నది. అయితే ఏమీ మీరు దానిని అర్ధం చేసుకోరా ?! .అయితే మీరు దానిపై విశ్వాసమును కనబరచటానికి,అందులో ఉన్న వాటిని ఆచరించటానికి త్వరపడండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• قُرْب القيامة مما يستوجب الاستعداد لها.
ప్రళయం యొక్క దగ్గరవటం దానికి సన్నాహాలు చేయటమును అనివార్యం చేస్తుంది.

• انشغال القلوب باللهو يصرفها عن الحق.
హృదయాలు ఆటల్లో మునిగి ఉండటం వాటిని సత్యము నుండి మరల్చి వేస్తుంది.

• إحاطة علم الله بما يصدر من عباده من قول أو فعل.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన దాసుల నుండి వెలువడే మాటని లేదా చేతని చుట్టుముట్టి ఉంటుంది.

• اختلاف المشركين في الموقف من النبي صلى الله عليه وسلم يدل على تخبطهم واضطرابهم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వైఖరి విషయంలో ముష్రికుల విభేదము వారి అంతర్ధృష్టి లేకపోటం,వారి గందరగోళము పై సూచిస్తుంది.

• أن الله مع رسله والمؤمنين بالتأييد والعون على الأعداء.
నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తలకి,విశ్వాసపరులకి శతృవులకి విరుద్ధంగా మద్దతు ద్వారా,సహయము ద్వారా తోడుగా ఉంటాడు.

• القرآن شرف وعز لمن آمن به وعمل به.
ఖుర్ఆన్ దానిని విశ్వసించి,దాని ప్రకారం ఆచరించిన వారి కొరకు గౌరవము,కీర్తి.

وَكَمْ قَصَمْنَا مِنْ قَرْیَةٍ كَانَتْ ظَالِمَةً وَّاَنْشَاْنَا بَعْدَهَا قَوْمًا اٰخَرِیْنَ ۟
ఎన్నో బస్తీలను అవిశ్వాసముతో తమ దుర్మార్గము వలన మేము తుదిముట్టించాము. మరియు వాటి తరువాత ఇతర జాతుల వారిని మేము సృష్టించాము.
Tafsiran larabci:
فَلَمَّاۤ اَحَسُّوْا بَاْسَنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَرْكُضُوْنَ ۟ؕ
వినాశనమునకు గురయ్యేవారు ఎప్పుడైతే కూకటి వ్రేళ్ళ నుండి పెకిలించే మా శిక్ష చూస్తారో అప్పుడు వారు తమ బస్తీ నుండి వినాశనము నుండి శీఘ్రంగా పారిపోతారు.
Tafsiran larabci:
لَا تَرْكُضُوْا وَارْجِعُوْۤا اِلٰی مَاۤ اُتْرِفْتُمْ فِیْهِ وَمَسٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْـَٔلُوْنَ ۟
అప్పుడు వారిని హేళన పధ్ధతిలో ఇలా పిలవబడుతుంది : మీరు పారిపోకండి, మీరు అనుభవిస్తున్న మీ సుఖసంపదల వైపునకు ,మీ నివాసముల వైపునకు మరలండి. బహుశా మీరు మీ ఇహలోకము నుండి కొద్దిగా ప్రశ్నించబడుతారు.
Tafsiran larabci:
قَالُوْا یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
ఈ దుర్మార్గులందరు తమ పాపమును అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : అయ్యో మా వినాశనం,మా నష్టం నిశ్ఛయంగా అల్లాహ్ పట్ల మా అవిశ్వాసం వలన మేము దుర్మార్గుల్లోంచి అయిపోయాము.
Tafsiran larabci:
فَمَا زَالَتْ تِّلْكَ دَعْوٰىهُمْ حَتّٰی جَعَلْنٰهُمْ حَصِیْدًا خٰمِدِیْنَ ۟
వారు నిర్విరామంగా తమ పాపములను అంగీకరిస్తూ,తమపై వినాశనము కొరకు పదేపదే శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. చివరికి మేము వారిని కోయబడిన పైరు వలే వారికి ఎటువంటి చలనము లేక మరణించిన వారి వలె చేశాము.
Tafsiran larabci:
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا لٰعِبِیْنَ ۟
మరియు మేము ఆకాశములను,భూమిని,వాటి మధ్య ఉన్న వాటిని ఆటగా,వ్యర్ధంగా సృష్టించలేదు. కానీ వాటిని మేము మా సామర్ధ్యముపై సూచించటానికి సృష్టించాము.
Tafsiran larabci:
لَوْ اَرَدْنَاۤ اَنْ نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنٰهُ مِنْ لَّدُنَّاۤ ۖۗ— اِنْ كُنَّا فٰعِلِیْنَ ۟
ఒక వేళ మేము భార్యను గాని సంతానమును గాని చేయదలచుకుంటే దాన్ని మా వద్ద ఉన్న వాటిలోంచి చేసుకునే వారము. మేము దాని నుండి అతీతులము కాబట్టి అలా చేయము.
Tafsiran larabci:
بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَی الْبَاطِلِ فَیَدْمَغُهٗ فَاِذَا هُوَ زَاهِقٌ ؕ— وَلَكُمُ الْوَیْلُ مِمَّا تَصِفُوْنَ ۟
కాని మేము మా ప్రవక్తల వైపు దైవ వాణి ద్వార చేరవేసిన సత్యముతో అవిశ్వాసపరుల అసత్యముపై విసిరి కొడతాము. అప్పుడు అది దాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. అప్పుడు వారి అసత్యము నశించిపోతుంది. ఆయన భార్యను,సంతానమును చేసుకున్నాడని పలికే వారా ఆయనకు తగని దానిని ఆయనకొరకు మీరు కల్పించటం వలన మీ కొరకు వినాశనం కలదు.
Tafsiran larabci:
وَلَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَنْ عِنْدَهٗ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَلَا یَسْتَحْسِرُوْنَ ۟ۚ
ఆకాశముల అధికారము,భూమి యొక్క అధికారము పరిశుద్ధుడైన,ఒక్కడైన ఆయనకే చెందుతుంది. ఆయన వద్ద ఉన్న దైవ దూతలు ఆయన ఆరాధన చేయటం నుండి గర్వించరు,దాని నుండి వారు అలసిపోరు.
Tafsiran larabci:
یُسَبِّحُوْنَ الَّیْلَ وَالنَّهَارَ لَا یَفْتُرُوْنَ ۟
వారు ఎల్లప్పుడు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడతూ ఉంటారు. దాని నుండి వారు విసిగిపోరు.
Tafsiran larabci:
اَمِ اتَّخَذُوْۤا اٰلِهَةً مِّنَ الْاَرْضِ هُمْ یُنْشِرُوْنَ ۟
కాని ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవాలను చేసుకున్నారు. వారు మృతులను జీవింపజేయలేరు. అటువంటప్పుడు వారు దాని నుండి అశక్తులైన వారిని ఎలా ఆరాధిస్తున్నారు ?!.
Tafsiran larabci:
لَوْ كَانَ فِیْهِمَاۤ اٰلِهَةٌ اِلَّا اللّٰهُ لَفَسَدَتَا ۚ— فَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ ۟
ఒక వేళ భూమ్యాకాశముల్లో అల్లాహ్ తప్ప అనేక ఆరాధ్యదైవాలు ఉంటే అధికారములో ఆరాధ్య దైవాల తగువులాట వలన అవి రెండు నాశనమైపోయేవి. మరియు దానికి విరుద్ధముగా జరిగినది. సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ముష్రికులు ఏదైతే ఆయనపై అబద్దముగా ఆయనకు భాగస్వాములు ఉన్నారని తెలుపుతున్నారో దాని నుండి అతీతుడు.
Tafsiran larabci:
لَا یُسْـَٔلُ عَمَّا یَفْعَلُ وَهُمْ یُسْـَٔلُوْنَ ۟
మరియు అల్లాహ్ తన అధికారములో,తన నిర్ణయములో ప్రత్యేకుడు. ఆయన నిర్ణయించిన దాని గురించి,ఆయన తీర్పునిచ్చిన దాని గురించి ఆయనను ఎవరు ప్రశ్నించరు. మరియు ఆయన తన దాసులను వారి కర్మల గురించి ప్రశ్నిస్తాడు, వాటిపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ ۚ— هٰذَا ذِكْرُ مَنْ مَّعِیَ وَذِكْرُ مَنْ قَبْلِیْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۙ— الْحَقَّ فَهُمْ مُّعْرِضُوْنَ ۟
కానీ వారందరు అల్లాహ్ ను వదిలి ఆరాధ్యదైవాలను చేసుకున్నారు. ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఆరాధనకు వారు అర్హత కలవారని మీ ఆధారమును తీసుకుని రండి. ఇది నాపై అవతరింపబడిన గ్రంధము. మరియు ప్రవక్తలపై అవతరింపబడిన గ్రంధములు మీకు వాటిలో ఎటువంటి అవసరం లేదు. అంతే కాదు చాలామంది ముష్రికులు అజ్ఞానమును,అనుకరణను ఆధారంగా తీసుకున్నారు. అయితే వారు సత్యమును స్వీకరించటం నుండి విముఖత చూపుతున్నారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الظلم سبب في الهلاك على مستوى الأفراد والجماعات.
దుర్మార్గము వ్యక్తుల,సమూహాల స్థాయిలో వినాశనమునకు కారణమయింది.

• ما خلق الله شيئًا عبثًا؛ لأنه سبحانه مُنَزَّه عن العبث.
అల్లాహ్ దేనిని కూడా వ్యర్ధముగా సృష్టించలేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన ఆయన వ్యర్ధముగా సృష్టించటం నుండి అతీతుడు.

• غلبة الحق، ودحر الباطل سُنَّة إلهية.
సత్యము యొక్క గెలుపు,అసత్యము యొక్క ఓటమి ఒక దైవ సాంప్రదాయము.

• إبطال عقيدة الشرك بدليل التَّمَانُع.
అభ్యంతర ఆధారం ద్వారా షిర్కు విశ్వాసమును వ్యర్ధము చేయటం.

وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِیْۤ اِلَیْهِ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدُوْنِ ۟
ఓ ప్రవక్తా మేము మీకన్నా ముందు ఏ ప్రవక్తను పంపినా "నేను తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరు కాబట్టి మీరు నన్నే ఆరాధించండి,నాతోపాటు దేనినీ సాటి కల్పించకండి" అని మాత్రమే అతనికి దైవ వాణి ద్వారా తెలియజేశాము.
Tafsiran larabci:
وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ— بَلْ عِبَادٌ مُّكْرَمُوْنَ ۟ۙ
ముష్రికులు అల్లాహ్ దైవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడు అన్నారు. పరిశుద్ధుడైన ఆయన అతీతుడు,వారు పలుకుతున్న అబద్దము నుండి పరిశుద్ధుడు. అంతే కాదు దైవదూతలు అల్లాహ్ కు దాసులు,ఆయనచే గౌరవించబడినవారు,ఆయనకు దగ్గర చేయబడినవారు.
Tafsiran larabci:
لَا یَسْبِقُوْنَهٗ بِالْقَوْلِ وَهُمْ بِاَمْرِهٖ یَعْمَلُوْنَ ۟
వారు తమ ప్రభువు కన్నా ముందు ఏదీ మాట్లాడరు. ఆయన వారికి ఆదేశించనంత వరకు ఆయనతో మాట్లాడరు. మరియు వారు ఆయన ఆదేశమును పాలిస్తారు. ఏ ఆదేశములోను వారు ఆయనని విబేధించరు.
Tafsiran larabci:
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا یَشْفَعُوْنَ ۙ— اِلَّا لِمَنِ ارْتَضٰی وَهُمْ مِّنْ خَشْیَتِهٖ مُشْفِقُوْنَ ۟
వారి మునుపటి ఆచరణలు,వాటి తదుపరి ఆచరణలు ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ఎవరి కొరకు సిఫారసు చేయటాన్ని అంగీకరిస్తాడో వారి కొరకు ఆయన అనుమతితో మాత్రమే వారు సిఫారసు కోరగలరు. మరియు వారు పరిశుద్ధుడైన ఆయన భయము వలన జాగ్రత్తపడుతుంటారు. ఏ ఆదేశంలో గాని ఏ వారింపులో గాని వారు ఆయనను విబేధించరు.
Tafsiran larabci:
وَمَنْ یَّقُلْ مِنْهُمْ اِنِّیْۤ اِلٰهٌ مِّنْ دُوْنِهٖ فَذٰلِكَ نَجْزِیْهِ جَهَنَّمَ ؕ— كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟۠
మరియు దైవ దూతల్లోంచి ఎవరైన ఊహానుసారం నిశ్ఛయంగా నేను అల్లాహ్ కాకుండా ఒక ఆరాధ్య దైవము అని పలికితే అప్పుడు నిశ్ఛయంగా మేము అతని మాట వలన అతనికి ప్రళయ దినాన నరకము శిక్షను ప్రతిఫలంగా ఇస్తాము. అతడు అందులో శాస్వతంగా ఉంటాడు. మరియు ఈ ప్రతిఫలము లాంటి ప్రతిఫలమును అవిశ్వాసము వలన,అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం వలన దుర్మార్గులైన వారికి మేము ప్రసాదిస్తాము.
Tafsiran larabci:
اَوَلَمْ یَرَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّ السَّمٰوٰتِ وَالْاَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنٰهُمَا ؕ— وَجَعَلْنَا مِنَ الْمَآءِ كُلَّ شَیْءٍ حَیٍّ ؕ— اَفَلَا یُؤْمِنُوْنَ ۟
ఏమీ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారికి ఆకాశములూ,భూమి రెండూ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఉండేవని తెలియదా. దాని నుండి వర్షం కురవటానికి వాటి మధ్య ఎటువంటి ఖాళీ ఉండేది కాదు. అప్పుడు మేము ఆ రెండింటి మధ్య వేరు చేశాము. మరియు మేము ఆకాశము నుండి భూమి పైకి కురిసిన నీటితో జంతువుల్లోంచి,మొక్కల్లోంచి ప్రతీ దానిని పుట్టించాము. అయితే వారు దీని నుండి గుణపాఠం నేర్చుకొని ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచరా ?!.
Tafsiran larabci:
وَجَعَلْنَا فِی الْاَرْضِ رَوَاسِیَ اَنْ تَمِیْدَ بِهِمْ وَجَعَلْنَا فِیْهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
మరియు భూమిలో తనపై ఉన్న వారిని తీసుకుని ప్రకంపించకుండా ఉండటానికి స్థిరమైన పర్వతాలను పుట్టించాము. మరియు మేము అందులో విశాలమైన మార్గాలను, దారులను వారు తమ ప్రయాణాల్లో తమ లక్ష్యాలను చేరటానికి మార్గములను పొండటానికి తయారు చేశాము.
Tafsiran larabci:
وَجَعَلْنَا السَّمَآءَ سَقْفًا مَّحْفُوْظًا ۖۚ— وَّهُمْ عَنْ اٰیٰتِهَا مُعْرِضُوْنَ ۟
మరియు మేము ఆకాశమును ఎటువంటి స్థంభాలు లేకుండా కూడా పడిపోవటం నుండి భద్రంగా ఉండే కప్పుగా సృష్టించాము మరియు దొంగచాటుగా వినటం నుండి భద్రంగా ఉండే విధంగా చేశాము. మరియు ముష్రికులు ఆకాశములో ఉన్న సూర్యుడు,చంద్రుడు లాంటి సూచనల పట్ల విముఖత చూపుతున్నారు,గుణపాఠము నేర్చుకోవటం లేదు.
Tafsiran larabci:
وَهُوَ الَّذِیْ خَلَقَ الَّیْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ فِیْ فَلَكٍ یَّسْبَحُوْنَ ۟
మరియు ఒక్కడైన అల్లాహ్ ఆయనే రాత్రిని విశ్రాంతి కొరకు సృష్టించాడు. మరియు పగలును జీవనోపాధిని సంపాదించటం కొరకు సృష్టించాడు. మరియు ఆయన సూర్యుడిని పగటి సూచనగా,చంద్రుడిని రాత్రి సూచనగా సృష్టించాడు. సూర్య,చంద్రుల్లోంచి ప్రతి ఒక్కటి తన ప్రత్యేక కక్ష్యలో పయనిస్తున్నది. అది దాని నుండి మరలదు,ఒక వైపునకు వాలదు.
Tafsiran larabci:
وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّنْ قَبْلِكَ الْخُلْدَ ؕ— اَفَاۡىِٕنْ مِّتَّ فَهُمُ الْخٰلِدُوْنَ ۟
ఓ ప్రవక్తా మీకన్న ముందు మేము మానవుల్లోంచి ఏ ఒక్కరి కొరకు కూడా ఈ జీవితంలో శాస్వతంగా ఉండేటట్లు చేయలేదే ?. అయితే ఈ జీవితంలో మీ ఆయుష్షు పూర్తయి మీరు చనిపోతారా. అప్పుడు మీ తరువాత వీరందరు శాస్వతంగా ఉంటారా ?!. ఖచ్చితంగా అలా జరుగదు.
Tafsiran larabci:
كُلُّ نَفْسٍ ذَآىِٕقَةُ الْمَوْتِ ؕ— وَنَبْلُوْكُمْ بِالشَّرِّ وَالْخَیْرِ فِتْنَةً ؕ— وَاِلَیْنَا تُرْجَعُوْنَ ۟
ప్రతీ మనిషి అతడు విశ్వాసపరుడైనా గాని అవిశ్వాసపరుడైనా గాని ఇహలోకములో మరణ రుచిని చూస్తాడు. ఓ ప్రజలారా మేము మిమ్మల్ని ఇహలోక జీవితంలో బాధ్యతల ద్వారా,సుఖభోగాల ద్వారా,ప్రతీకారము ద్వారా పరీక్షిస్తాము. ఆ తరువాత మీరు మీ మరణము తరువాత ఇతరుల వైపున కాకుండా మా వైపునకే మరలించబడుతారు. అప్పుడు మేము మీ ఆచరణల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• تنزيه الله عن الولد.
అల్లాహ్ సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు.

• منزلة الملائكة عند الله أنهم عباد خلقهم لطاعته، لا يوصفون بالذكورة ولا الأنوثة، بل عباد مكرمون.
అల్లాహ్ వద్ద దైవదూతల స్థానము ఏమిటంటే తనపై విధేయత చూపటం కొరకు ఆయన సృష్టించిన దాసులు, వారు మగవారిగా గాని ఆడవారిగా గాని వర్ణించబడలేదు. అంతే కాదు వారు గౌరవనీయులైన దాసులు.

• خُلِقت السماوات والأرض وفق سُنَّة التدرج، فقد خُلِقتا مُلْتزِقتين، ثم فُصِل بينهما.
ఆకాశములు మరియు భూమి నెమ్మది నెమ్మదిగా క్రమ క్రమమైన పధ్ధతిలో సృష్టించబడినవి. అవి రెండూ ఒక దానితో ఒకటి కలిసిన విధంగా సృష్టించబడినవి. ఆ తరువాత వాటి మధ్య వేరు చేయటం జరిగింది.

• الابتلاء كما يكون بالشر يكون بالخير.
కీడు ద్వారా పరీక్ష ఉన్నట్లే మేలు ద్వారా పరీక్ష ఉంటుంది.

وَاِذَا رَاٰكَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ— اَهٰذَا الَّذِیْ یَذْكُرُ اٰلِهَتَكُمْ ۚ— وَهُمْ بِذِكْرِ الرَّحْمٰنِ هُمْ كٰفِرُوْنَ ۟
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని మాత్రం పరిహాసంగా తీసుకుని తమను అనుసరించే వారిలో తమ మాట ద్వారా ధ్వేషాన్ని రగిలిస్తూ ఇలా పలికే వారు ఏమిటీ ఇతడు మీరు ఆరాధించే మీ ఆరాధ్య దైవాలను దూషిస్తున్నాడా ?!. మరియు వారు మిమ్మల్ని పరిహాసంగా చేసుకోవటంతోపాటు వారి పై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ ను తిరస్కరించేవారు, ఆయన వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోయారు. అయితే వారు అన్ని చెడులను సమీకరించుకోవటం వలన వారు ఎక్కువ లోపమునకు హక్కుదారులు.
Tafsiran larabci:
خُلِقَ الْاِنْسَانُ مِنْ عَجَلٍ ؕ— سَاُورِیْكُمْ اٰیٰتِیْ فَلَا تَسْتَعْجِلُوْنِ ۟
మానవుడు తొందరపాటు జీవిగా పుట్టించబడ్డాడు. అయితే అతను విషయాలు జరగకముందే తొందర చేస్తాడు. మరియు శిక్ష గురించి ముష్రికులు తొందర చేయటం అందులో నుంచే. ఓ తొందర చేసేవారా నేను త్వరలోనే మీరు తొందర చేస్తున్న నా శిక్షను మీకు చూపిస్తాను. ఆయితే మీరు దాన్ని తొందరగా అవటమును కోరకండి.
Tafsiran larabci:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు తొందరపడుతూ ఇలా పలికే వారు : ఓ ముస్లిములారా మీరు మాకు దేని గురించి అయితే బెదిరిస్తున్నారో మరణాంతరం లేపబడటంలోంచి ఒక వేళ మీరు అది జరిగే విషయంలో మీరు బెదిరిస్తున్న దానిలో సత్యవంతులే అయితే అది ఎప్పుడు జరుగునో తెలపండి ?!.
Tafsiran larabci:
لَوْ یَعْلَمُ الَّذِیْنَ كَفَرُوْا حِیْنَ لَا یَكُفُّوْنَ عَنْ وُّجُوْهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُوْرِهِمْ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟
ఒక వేళ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు వీరందరు తమ ముఖముల నుండి,తమ వీపుల నుండి నరకాగ్నిని తొలగించుకోలేనప్పటి వైనమును,వారి నుండి శిక్షను తొలగించటం ద్వారా వారికి సహాయపడు వాడు ఎవడూ లేడని తెలుసుకుని ఒకవేళ దాన్ని నమ్మితే వారు శిక్ష గురించి తొందర చేయరు.
Tafsiran larabci:
بَلْ تَاْتِیْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا یَسْتَطِیْعُوْنَ رَدَّهَا وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟
వారు శిక్షించబడే ఈ అగ్ని వారికి తెలిసినట్లు వారి వద్దకు రాదు. కాని అది వారి వద్దకు అకస్మాత్తుగా వస్తుంది. అయితే వారు దాన్ని తమ నుండి నిర్మూలించుకోలేరు. వారు పశ్ఛాత్తాప్పడి వారికి కారుణ్యము కలిగెంత వరకు వారికి గడువు ఇవ్వబడదు.
Tafsiran larabci:
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِیْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠
మరియు ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మీతో ఎగతాళి చేస్తే ఈ విషయంలో మీరు మొదటి వారు కాదు. నిశ్ఛయంగా మీకన్న మనుపు ప్రవక్తలూ ఎగతాళి చేయబడ్డారు. అయితే వారితో ఎగతాళి చేసిన అవిశ్వాసపరులకు ఆ శిక్ష దేని గురించి అయితే వారిని ఇహలోకంలో వారి ప్రవక్తలు భయపెట్టినప్పుడు వారు ఎగతాళి చేసే వారో చుట్టుకుంది.
Tafsiran larabci:
قُلْ مَنْ یَّكْلَؤُكُمْ بِالَّیْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمٰنِ ؕ— بَلْ هُمْ عَنْ ذِكْرِ رَبِّهِمْ مُّعْرِضُوْنَ ۟
ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేసే వీరందరితో ఇలా పలకండి : కరుణామయుడు మీపై శిక్షను అవతరింపజేయదలిస్తే,మిమ్మల్ని తుదిముట్టించదలిస్తే దాని నుండి రేయింబవళ్ళు మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ?. కానీ వారు తమ ప్రభువు యొక్క హితోపదేశముల నుండి,ఆయన వాదనల నుండి విముఖత చూపుతున్నారు, అజ్ఞానము,బుద్ధిలేమి వలన వారు వాటిలో నుండి కొంచెము కూడా యోచన చేయటం లేదు.
Tafsiran larabci:
اَمْ لَهُمْ اٰلِهَةٌ تَمْنَعُهُمْ مِّنْ دُوْنِنَا ؕ— لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَ اَنْفُسِهِمْ وَلَا هُمْ مِّنَّا یُصْحَبُوْنَ ۟
లేదా వారి కొరకు మా శిక్ష నుండి ఆపే దైవాలు ఎవరైన ఉన్నారా ?. వారు తమ నుండి కీడును తొలగించుకోవటం ద్వారా,తమకు లాభం చేసుకోవటం ద్వారా తమకు తామే సహాయం చేసుకోలేరు. మరియు ఎవరైతే తమ స్వయం కొరకు సహాయం చేసుకోలేడో వాడు ఎలా ఇతరులకు సహాయం చేయగలడు ?. మరియు వారు మా శిక్ష నుండి రక్షించబడలేరు.
Tafsiran larabci:
بَلْ مَتَّعْنَا هٰۤؤُلَآءِ وَاٰبَآءَهُمْ حَتّٰی طَالَ عَلَیْهِمُ الْعُمُرُ ؕ— اَفَلَا یَرَوْنَ اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ— اَفَهُمُ الْغٰلِبُوْنَ ۟
అయినా మేము ఈ అవిశ్వాసపరులందరికి జీవనోపాధిని కల్పించాము. మరియు వారి తాత ముత్తాతలపై మా అనుగ్రహాలను వ్యాపింపజేసి జీవనోపాధిని కల్పించాము. వారిని నెమ్మది నెమ్మదిగా తీసుకుని వెళ్ళటానికి. చివరికి వారి కాలము పొడుగయి వారు దానితో మోసపోయారు. వారు తమ అవిశ్వాసముపైనే ఉన్నారు. ఏమీ మా అనుగ్రహాల వలన మోసపోయి మా శిక్ష గురించి తొందర చేసే వీరందరు మేము భూమిని దాని వాసులపై మా అధికారము ద్వారా దాని నలువైపుల నుండి తగ్గించుకుంటూ వస్తున్నది చూడటం లేదా, ఇతరులపై వచ్చిపడినది వారిపై పడనంత వరకు వారు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి ?!. వీరందరు గెలుపొందేవారు కాదు. కాని వారే ఓడిపోయేవారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• بيان كفر من يستهزئ بالرسول، سواء بالقول أو الفعل أو الإشارة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల హేళన చేసే వాడి అవిశ్వాస ప్రకటన అది మాట ద్వారా గాని లేదా చేతల ద్వారా గాని లేదా సైగ ద్వారా గాని సమానమే.

• من طبع الإنسان الاستعجال، والأناة خلق فاضل.
తొందరపాటు మానవుని స్వభావములో నుంచిది.నెమ్మదత్వము ఒక మంచి గుణము.

• لا يحفظ من عذاب الله إلا الله.
అల్లాహ్ శిక్ష నుండి అల్లాహ్ మాత్రమే రక్షించగలడు.

• مآل الباطل الزوال، ومآل الحق البقاء.
అసత్యము యొక్క పరిణామము పతనము మరియు సత్యము యొక్క పరిణామము శాస్వతము.

قُلْ اِنَّمَاۤ اُنْذِرُكُمْ بِالْوَحْیِ ۖؗ— وَلَا یَسْمَعُ الصُّمُّ الدُّعَآءَ اِذَا مَا یُنْذَرُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా నేను మిమ్మల్ని ఆ దైవ వాణి ఆధారంగా దేనినైతే నా ప్రభువు నా వైపు అవతరింపజేశాడో దాని ద్వారా అల్లాహ్ శిక్ష నుండి భయపెడుతున్నాను. సత్యమును వినటం నుండి చెవిటివారైపోయిన వారు అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టబడినప్పుడు దేని వైపునైతే వారు పిలవబడుతున్నారో దాన్ని స్వీకరించే ఉద్దేశముతో వినలేరు.
Tafsiran larabci:
وَلَىِٕنْ مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَیَقُوْلُنَّ یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ శిక్ష గురించి తొందర చేసే వీరందరికి నీ ప్రభువు యొక్క శిక్ష నుండి కొంత భాగము ముట్టుకుంటే అప్పుడు వారు తప్పకుండా ఇలా అంటారు : అయ్యో మా వినాశనము,మా నష్టము నిశ్ఛయంగా మేము అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించటం ద్వారా దుర్మార్గులమైపోయాము.
Tafsiran larabci:
وَنَضَعُ الْمَوَازِیْنَ الْقِسْطَ لِیَوْمِ الْقِیٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَیْـًٔا ؕ— وَاِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ اَتَیْنَا بِهَا ؕ— وَكَفٰی بِنَا حٰسِبِیْنَ ۟
మరియు మేము ప్రళయదిన వాసుల కొరకు న్యాయపూరితమైన తూకములను వాటి ద్వారా వారి కర్మలను తూకమేయటానికి ఏర్పాటు చేస్తాము. ఆ రోజు ఏ మనిషిని అతని పుణ్యాలను తగ్గించి లేదా అతని పాపాలను అధికం చేసి హింసించటం జరగదు. ఒక వేళ తూకమేయబడేది ఆవ గింజంత బరువంత కొద్దిగా ఉన్నా మేము దాన్ని తీసుకుని వస్తాము. మరియు మా దాసుల కర్మలను లెక్క వేయటానికి మేము చాలు.
Tafsiran larabci:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسٰی وَهٰرُوْنَ الْفُرْقَانَ وَضِیَآءً وَّذِكْرًا لِّلْمُتَّقِیْنَ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము మూసా,హారూన్ అలైహిమస్సలాంనకు తౌరాతును సత్య అసత్యాల మధ్య,హలాల్,హరాంల మధ్య వ్యత్యాసమును చూపే దానిగా,దాని పట్ల విశ్వాసమును కనబరిచే వారికి మార్గదర్శకముగా మరియు తమ ప్రభువు పట్ల భీతి కలిగిన వారి కొరకు హితోపదేశముగా ప్రసాదించాము.
Tafsiran larabci:
الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَیْبِ وَهُمْ مِّنَ السَّاعَةِ مُشْفِقُوْنَ ۟
ఎవరైతే తమ ఆ ప్రభువు యొక్క శిక్ష నుండి భయపడుతారో ఎవరినైతే వారు చూడకుండానే విశ్వసించారో వారు ప్రళయము నుండి భయపడుతారు.
Tafsiran larabci:
وَهٰذَا ذِكْرٌ مُّبٰرَكٌ اَنْزَلْنٰهُ ؕ— اَفَاَنْتُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟۠
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ దాని ద్వారా హితబోధన గ్రహించదలచిన వాడి కొరకు ఒక జ్ఞాపికము,హితబోధన,చాలా ప్రయోజనకరమైనది,మేలైనది ఇలా అయినా కూడా మీరు దాన్ని తిరస్కరిస్తున్నారా ?!. దానిని స్వీకరించకుండా,దాని ప్రకారం ఆచరించకుండా ?!.
Tafsiran larabci:
وَلَقَدْ اٰتَیْنَاۤ اِبْرٰهِیْمَ رُشْدَهٗ مِنْ قَبْلُ وَكُنَّا بِهٖ عٰلِمِیْنَ ۟ۚ
మరియు నిశ్ఛయంగా మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఆయన బాల్యములోనే ఆయన జాతి వారిపై వాదనను (హుజ్జత్) ప్రసాదించాము. మరియు మేము ఆయన గురించి తెలిసినవారము. అప్పుడు మా జ్ఞానములో వాదన నుండి ఆయన జాతి వారిపై ఆయన దేనికి అర్హులో అది మేము ఆయనకు ప్రసాదించాము.
Tafsiran larabci:
اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَا هٰذِهِ التَّمَاثِیْلُ الَّتِیْۤ اَنْتُمْ لَهَا عٰكِفُوْنَ ۟
అప్పుడు ఆయన తన తండ్రి ఆజర్ తో,తన జాతి వారితో ఇలా పలికారు : మీ చేతులతో మీరు తయారు చేసుకున్న ఈ విగ్రహాలు ,వేటి ఆరాధన మీరు చేస్తున్నారో ఇవి ఏమిటి ?.
Tafsiran larabci:
قَالُوْا وَجَدْنَاۤ اٰبَآءَنَا لَهَا عٰبِدِیْنَ ۟
ఆయనకి ఆయన జాతివారు మేము మా తాతముత్తాతలను వాటిని ఆరాధిస్తుండగా చూశాము. మరియు వారిని నమూనాగా తీసుకుని మేము వాటిని ఆరాధిస్తున్నాము అని అన్నారు.
Tafsiran larabci:
قَالَ لَقَدْ كُنْتُمْ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నిశ్ఛయంగా ఓ అనుసరించేవారా మీరు అనుసరించబడిన మీ తాతముత్తాతలు సత్యము యొక్క స్పష్టమైన మార్గము నుండి వైదొలిగి అపమార్గములో ఉన్నారు.
Tafsiran larabci:
قَالُوْۤا اَجِئْتَنَا بِالْحَقِّ اَمْ اَنْتَ مِنَ اللّٰعِبِیْنَ ۟
ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : నీవు ఏదైతే పలికావో అప్పుడు మా వద్దకు సత్యాన్ని తీసుకుని వచ్చావా లేదా నీవు ఆషామాషీగా అంటున్నావా ?.
Tafsiran larabci:
قَالَ بَلْ رَّبُّكُمْ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ الَّذِیْ فَطَرَهُنَّ ۖؗ— وَاَنَا عَلٰی ذٰلِكُمْ مِّنَ الشّٰهِدِیْنَ ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : కాని నేను మీ వద్దకు వాస్తవాన్ని తీసుకుని వచ్చాను, ఆషామాషీని తీసుకురాలేదు. అయితే నీ ప్రభువు ఆయన భూమ్యాకాశముల ప్రభువు ఎవరైతే వాటిని పూర్వ నమూనా లేకుండా సృష్టించాడో. మరియు నేను ఆయన మీ ప్రభువు అని, భూమ్యాకాశముల ప్రభువు అని సాక్ష్యం పలికే వారిలోంచి వాడిని. మరియు మీ విగ్రహాలకు వాటిలో నుండి ఏ భాగము లేదు.
Tafsiran larabci:
وَتَاللّٰهِ لَاَكِیْدَنَّ اَصْنَامَكُمْ بَعْدَ اَنْ تُوَلُّوْا مُدْبِرِیْنَ ۟
మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన జాతి వారు ఆయన మాట విననప్పుడు ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా మీరు మీ పండుగ కొరకు మీ విగ్రహాలకు దూరంగా వెళ్ళిన తరువాత నేను మీ విగ్రహాల కొరకు మీకు ఇష్టం లేని దాని యుక్తి పన్నుతాను.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• نَفْع الإقرار بالذنب مشروط بمصاحبة التوبة قبل فوات أوانها.
పశ్ఛాత్తాపము దాని సమయం అయిపోకముందే చేయటంతో పాటు పాపమును అంగీకరించటం ,షరతుతో కూడుకున్నది ప్రయోజనకరమైనది.

• إثبات العدل لله، ونفي الظلم عنه.
న్యాయమును అల్లాహ్ కొరకు నిరూపించటం,హింసను ఆయన నుండి జరగటంను తిరస్కరించటం.

• أهمية قوة الحجة في الدعوة إلى الله.
అల్లాహ్ వైపునకు పిలవటంలో ఆధారము యోక్క బలము ప్రాముఖ్యత.

• ضرر التقليد الأعمى.
గుడ్డిగా అనుకరించటం యొక్క నష్టము.

• التدرج في تغيير المنكر، والبدء بالأسهل فالأسهل، فقد بدأ إبراهيم بتغيير منكر قومه بالقول والصدع بالحجة، ثم انتقل إلى التغيير بالفعل.
చెడును మార్చటంలో క్రమక్రమంగా వ్యవహరించాలి. సులభమైన వాటితో మొదలుపెడితే సులభమవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారి చెడును మార్చటమును మాటలతో, ఆధారముతో భయపెట్టటముతో మొదలుపెట్టారు. ఆ తరువాత కార్యచరణ ద్వారా చెడును మార్చటం వైపునకు మరలారు.

فَجَعَلَهُمْ جُذٰذًا اِلَّا كَبِیْرًا لَّهُمْ لَعَلَّهُمْ اِلَیْهِ یَرْجِعُوْنَ ۟
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విగ్రహాలను చిన్నచిన్న ముక్కలు అయ్యే వరకు విరగ్గొట్టారు. మరియు వాటి పెద్ద విగ్రహమును వారు తిరిగి దాని వద్దకు వచ్చి దానితో వాటిని విరగ్గొట్టిన వారి గురించి వారు అడుగుతారని ఆశించి వదిలి వేశారు.
Tafsiran larabci:
قَالُوْا مَنْ فَعَلَ هٰذَا بِاٰلِهَتِنَاۤ اِنَّهٗ لَمِنَ الظّٰلِمِیْنَ ۟
వారు తిరిగి వచ్చి తమ విగ్రహాలను విరిగి ఉండగా చూసినప్పుడు వారు ఒకరినొకరు ఇలా అడిగారు : మా విగ్రహాలను ఎవరు విరగ్గొట్టారు ?. ఎవరైతే వాటిని విరగ్గొట్టాడో అతడు గౌరవానికి,పవిత్రతకు అర్హులైన వాటిని కించపరచినప్పుడు దుర్మార్గుల్లోంచి వాడు.
Tafsiran larabci:
قَالُوْا سَمِعْنَا فَتًی یَّذْكُرُهُمْ یُقَالُ لَهٗۤ اِبْرٰهِیْمُ ۟ؕ
వారిలో నుండి కొందరు ఇలా పలికారు : మేము ఒక యువకుడిని వాటి గురించి చెడుగా ప్రస్తావిస్తుండగా,వారి లోపాలను తెలుపుతుండగా విన్నాము. అతడిని ఇబ్రాహీం అని పిలుస్తారు. బహుశా వాటిని విరగ్గొట్టినవాడు అతడే నేమో.
Tafsiran larabci:
قَالُوْا فَاْتُوْا بِهٖ عَلٰۤی اَعْیُنِ النَّاسِ لَعَلَّهُمْ یَشْهَدُوْنَ ۟
వారి నాయకులు ఇలా పలికారు : మీరు ఇబ్రాహీంను ప్రజల కళ్ళముందుకు,దృష్టికి తీసుకుని రండి బహుశా వారు అతను చేసిన దాన్ని అంగీకరిస్తుండగా చూస్తారు,అప్పుడు అతని అంగీకారము మీ కొరకు దానికి ఒక ఋజువు అవుతుంది.
Tafsiran larabci:
قَالُوْۤا ءَاَنْتَ فَعَلْتَ هٰذَا بِاٰلِهَتِنَا یٰۤاِبْرٰهِیْمُ ۟ؕ
అప్పుడు వారు ఇబ్రాహీం అలైహిస్సలాంను తీసుకుని వచ్చి అతనితో ఇలా అడిగారు : ఓ ఇబ్రాహీం మా విగ్రహాలపట్ల ఈ దుష్చర్యకు పాల్పడినవాడవు నీవేనా ?!.
Tafsiran larabci:
قَالَ بَلْ فَعَلَهٗ ۖۗ— كَبِیْرُهُمْ هٰذَا فَسْـَٔلُوْهُمْ اِنْ كَانُوْا یَنْطِقُوْنَ ۟
ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై వ్యంగ్యంగా,ప్రజల దృష్టి ముందు వారి విగ్రహాల అశక్తతను బహిరంగపరుస్తూ ఇలా పలికారు : దాన్ని నేను చేయలేదు కాని దాన్ని విగ్రహాల్లో పెద్ద విగ్రహం చేసింది,కావున మీరు మీ విగ్రహాలను అడగండి ఒక వేళ అవి మాట్లాడగలిగితే.
Tafsiran larabci:
فَرَجَعُوْۤا اِلٰۤی اَنْفُسِهِمْ فَقَالُوْۤا اِنَّكُمْ اَنْتُمُ الظّٰلِمُوْنَ ۟ۙ
అప్పుడు వారు యోచన చూస్తూ,దీర్ఘంగా ఆలోచిస్తూ తమ స్వయం వైపునకు మరలారు. అప్పుడు వారికి తమ విగ్రహాలు లాభం కలిగించవని,నష్టం కలిగించవని స్పష్టమయింది. అయితే వారు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించినప్పుడు దుర్మార్గులైపోయారు.
Tafsiran larabci:
ثُمَّ نُكِسُوْا عَلٰی رُءُوْسِهِمْ ۚ— لَقَدْ عَلِمْتَ مَا هٰۤؤُلَآءِ یَنْطِقُوْنَ ۟
ఆ తరువాత వారు విబేధించటానికి,తిరస్కరించటానికి మరలి వచ్చి ఇలా పలికారు : ఓ ఇబ్రాహీం ఈ విగ్రహాలు మాట్లాడవని నీకు ఖచ్చితంగా తెలుసు. అటువంటప్పుడు నీవు ఎలా మమ్మల్ని వాటితో అడగమని ఆదేశిస్తున్నావు ?. వారు దాన్ని తమకి ఆధారంగా తీసుకోదలచారు కాని అది వారికి వ్యతిరేకంగా ఆధారమయింది.
Tafsiran larabci:
قَالَ اَفَتَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُكُمْ شَیْـًٔا وَّلَا یَضُرُّكُمْ ۟ؕ
ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఖండిస్తూ ఇలా పలికారు : మీరు అల్లాహ్ ను వదిలి మీకు ఏమి లాభం చేకూర్చని,నష్టం చేకూర్చని కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారా ?. వారు తమ స్వయం నుండి నష్టమును తొలగించటం నుండి లేదా తమ కొరకు లాభం తీసుకుని రావటం నుండి అశక్తులు.
Tafsiran larabci:
اُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
మీ కొరకు ధూత్కారము,మీరు అల్లాహ్ ను వదిలి, లాభం చేకూర్చని,నష్టం కలిగించని ఈ విగ్రహాలను మీరు ఆరాధించటమునకు ధూత్కారము. అయితే మీరు వాటిని ఆరాధించటమును వదిలి వేయటానికి ఇది మీకు తెలియదా ?!.
Tafsiran larabci:
قَالُوْا حَرِّقُوْهُ وَانْصُرُوْۤا اٰلِهَتَكُمْ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟
వారు అతడిని వాదనతో ఎదుర్కోలేనప్పుడు బలవంతం చేయటం వైపునకు వారు మగ్గు చూపి ఇలా పలికారు : మీరు మీ ఆ విగ్రహాల కొరకు వేటినైతే అతను శిధిలం చేశాడో,విరగ్గొట్టాడో సహాయముగా ఇబ్రాహీంను అగ్నితో కాల్చి వేయండి. ఒక వేళ మీరు నిరోదక శిక్షగా దానిని చేసే వారే అయితే.
Tafsiran larabci:
قُلْنَا یٰنَارُ كُوْنِیْ بَرْدًا وَّسَلٰمًا عَلٰۤی اِبْرٰهِیْمَ ۟ۙ
అయితే వారు అగ్నిని రాజేశి ఆయనను అందులో విసిరేశారు. అప్పుడు మేము ఇలా పలికాము : ఓ అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగాను,సురక్షితంగాను మారిపో. అప్పుడు అది అలాగే అయిపోయింది. అప్పుడు ఆయనకు బాధ కలగలేదు.
Tafsiran larabci:
وَاَرَادُوْا بِهٖ كَیْدًا فَجَعَلْنٰهُمُ الْاَخْسَرِیْنَ ۟ۚ
ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి వారు ఆయనను కాల్చి వేయటం ద్వారా ఆయనకు కీడు చేయాలనుకున్నారు. అప్పుడు మేము వారి కుట్రను బెడసి కొట్టి వారినే మేము వినాశనమునకు గురయ్యే వారిగా,ఓటమి పాలయ్యే వారిగా చేశాము.
Tafsiran larabci:
وَنَجَّیْنٰهُ وَلُوْطًا اِلَی الْاَرْضِ الَّتِیْ بٰرَكْنَا فِیْهَا لِلْعٰلَمِیْنَ ۟
మరియు మేము ఆయనను రక్షించాము,లూత్ అలైహిస్సలాంను రక్షించాము. మరియు మేము వారిద్దరిని ప్రవక్తలను పంపించటము ద్వారా,సృష్టితాల కొరకు ఆహారపదార్ధములను వ్యాపింపజేయటం ద్వారా మేము శుభాలను కురిపించిన ప్రాంతమైన షామ్ (సిరియా) వైపునకు తీసుకుని వెళ్ళాము.
Tafsiran larabci:
وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ ؕ— وَیَعْقُوْبَ نَافِلَةً ؕ— وَكُلًّا جَعَلْنَا صٰلِحِیْنَ ۟
మరియు మేము ఆయన తనకు ఒక కుమారుడిని ప్రసాదించమని తన ప్రభువుతో వేడుకున్నప్పుడు ఆయనకు ఇస్హాఖ్ ను ప్రసాదించాము. మరియు ఆయనకు మేము అదనంగా యాఖూబ్ ను ప్రసాదించాము. మరియు ఇబ్రాహీం,ఆయన ఇద్దరు కుమారులైన ఇస్హాఖ్,యాఖూబ్ లో నుండి ప్రతి ఒక్కరిని మేము సద్వర్తనలుగా,అల్లాహ్ కు విధేయులుగా చేశాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• جواز استخدام الحيلة لإظهار الحق وإبطال الباطل.
సత్యమును బహిరంగపరచి అసత్యమును వ్యర్ధము చేయటం కొరకు వ్యూహమును ఉపయోగించటం ధర్మసమ్మతమే.

• تعلّق أهل الباطل بحجج يحسبونها لهم، وهي عليهم.
అసత్యపరులు వాదనలతో అవి తమకోసమే అని భావించి జతకట్టారు. అవి వారికి వ్యతిరేకంగా ఉన్నవి.

• التعنيف في القول وسيلة من وسائل التغيير للمنكر إن لم يترتّب عليه ضرر أكبر.
మాటలో కఠినత్వం ఒక వేళ అది ఎక్కువ నష్టం కలిగించనిదైతే చెడును నిర్మూలించే కారకాల్లోంచి ఒక కారకం.

• اللجوء لاستخدام القوة برهان على العجز عن المواجهة بالحجة.
బలాన్ని ఉపయోగించటానికి ఆశ్రయించడం వాదనను (ఆధారమును) ఎదుర్కొనటం నుండి అసమర్ధతకు ఆధారము.

• نَصْر الله لعباده المؤمنين، وإنقاذه لهم من المحن من حيث لا يحتسبون.
అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసపరులైన తన దాసుల కొరకు ఉంటుంది. మరియు కష్టము నుండి వారి కొరకు ఆయన రక్షణ వారు అనుకోని చోటు నుండి ఉంటుంది.

وَجَعَلْنٰهُمْ اَىِٕمَّةً یَّهْدُوْنَ بِاَمْرِنَا وَاَوْحَیْنَاۤ اِلَیْهِمْ فِعْلَ الْخَیْرٰتِ وَاِقَامَ الصَّلٰوةِ وَاِیْتَآءَ الزَّكٰوةِ ۚ— وَكَانُوْا لَنَا عٰبِدِیْنَ ۟ۙ
మరియు మేము వారిని నాయకులుగా (అయిమ్మ) తీర్చిదిద్దాము మంచిలో ప్రజలు వారితో మార్గము పొందుతారు. వారు ప్రజలను ఒకే అల్లాహ్ ఆరాధన వైపునకు మహోన్నతుడైన ఆయన ఆదేశముతో పిలుస్తారు. మరియు మేము వారి వైపునకు సత్కార్యములు చేయమని,నమాజులను వాటి పరిపూర్ణ పధ్ధతిలో పాఠించమని,జకాత్ ను చెల్లించమని దైవవాణి ద్వారా తెలియపరచాము. మరియు వారు మాకు లోబడి ఉన్నారు.
Tafsiran larabci:
وَلُوْطًا اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا وَّنَجَّیْنٰهُ مِنَ الْقَرْیَةِ الَّتِیْ كَانَتْ تَّعْمَلُ الْخَبٰٓىِٕثَ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فٰسِقِیْنَ ۟ۙ
మరియు మేము లూత్ అలైహిస్సలాంనకు ప్రత్యర్ధుల మధ్య తీర్పునిచ్చి నిర్ణయాలు తీసుకునే అధికారమును ప్రసాదించాము. మరియు మేము అతని ధర్మ విషయంలో జ్ఞానమును ప్రసాదించాము. మరియు మేము ఆయనను ఆ శిక్ష నుండి దేనినైతే మేము ఆయన నగరము (సద్దూమ్) పై కురిపించామో దాని నుండి రక్షించాము. అక్కడి వాసులు అశ్లీల కార్యలను చేసేవారు. నిశ్ఛయంగా వారు తమ ప్రభువు విధేయత నుండి వైదొలగి చెడును కలిగిన జాతివారు.
Tafsiran larabci:
وَاَدْخَلْنٰهُ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهٗ مِنَ الصّٰلِحِیْنَ ۟۠
అతని జాతి వారికి కలిగిన శిక్ష నుండి మేము అతనిని రక్షించినప్పుడు అతన్ని మేము మా కారుణ్యంలో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా అతడు మా ఆదేశములను పాఠించి,మేము వారించిన వాటికి దూరంగా ఉండే పుణ్యాత్ములలోంచి వాడు.
Tafsiran larabci:
وَنُوْحًا اِذْ نَادٰی مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهٗ فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗ مِنَ الْكَرْبِ الْعَظِیْمِ ۟ۚ
మరియు ఓ ప్రవక్తా మీరు నూహ్ అలైహిస్సలాం గాధను ఇబ్రాహీం,లూత్ అలైహిమస్సలాం కన్న ముందు ఆయన అల్లాహ్ ను పిలిచివప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఆయన కోరిన దాన్ని ఆయనకు ప్రసాదించి ఆయన (ప్రార్ధనను) మేము అంగీకరించాము. అప్పుడు మేము ఆయన్నీ రక్షించాము. మరియు విశ్వసించిన ఆయన ఇంటి వారిని మేము మహా విపత్తు నుండి రక్షించాము.
Tafsiran larabci:
وَنَصَرْنٰهُ مِنَ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۟
మరియు ఆయన నిజాయితీని సూచించే ఆయతుల ద్వారా మేము ఆయనకు మద్దతిచ్చిన వాటిని తిరస్కరించిన జాతి వారి కుట్ర నుండి ఆయనని మేము రక్షించాము. నిశ్ఛయంగా వారు చెడ్డ,దుష్ట జాతివారు. అయితే మేము వారందరిని ముంచి నాశనము చేశాము.
Tafsiran larabci:
وَدَاوٗدَ وَسُلَیْمٰنَ اِذْ یَحْكُمٰنِ فِی الْحَرْثِ اِذْ نَفَشَتْ فِیْهِ غَنَمُ الْقَوْمِ ۚ— وَكُنَّا لِحُكْمِهِمْ شٰهِدِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు దావూద్,అతని కుమారుడు సులైమాన్ అలైహిమస్సలాం వారి వద్దకు తీసుకుని రాబడిన ఇద్దరి ప్రత్యర్ధుల విషయంలో వారిరువురు ఒక వివాదం విషయంలో తీర్పునిచ్చినప్పటి గాధను గుర్తు చేసుకోండి. ఇద్దరు ప్రత్యర్ధుల్లోంచి ఒకరి మేకలు ఒక రాత్రి ఇంకొకరి చేనులో పడి దాన్ని పాడు చేశాయి. మరియు మేము దావూద్,సులైమాను తీర్పుకి సాక్షులుగా ఉన్నాము. వారిరువురి తీర్పులో నుండి ఏదీ మా నుండి అదృశ్యం కాలేదు.
Tafsiran larabci:
فَفَهَّمْنٰهَا سُلَیْمٰنَ ۚ— وَكُلًّا اٰتَیْنَا حُكْمًا وَّعِلْمًا ؗ— وَّسَخَّرْنَا مَعَ دَاوٗدَ الْجِبَالَ یُسَبِّحْنَ وَالطَّیْرَ ؕ— وَكُنَّا فٰعِلِیْنَ ۟
అప్పుడు మేము సులైమానుకు ఆయన తండ్రి దావూదుకు కాకుండా తీర్పు యొక్క అవగాహనను కలిగించాము. దావూద్,సులైమానులో నుండి ప్రతి ఒక్కరికి మేము దైవ దౌత్యమును,ధర్మ ఆదేశాల జ్ఞానమును ప్రసాదించాము. సులైమాన్ అలైహిస్సలాం ఒక్కడికే దాన్ని మేము ప్రత్యేకించ లేదు. మరియు మేము పర్వతములను దావూదుతో పాటు విధేయత చూపే విధంగా చేశాము. అవి ఆయన స్థుతులు పలకటంతో పాటు స్థుతులు పలికేవి. మరియు మేము పక్షులను ఆయన కొరకు విధేయులగా చేశాము. మరియు అవగాహన కల్పించటం,తీర్పు నివ్వటమును,జ్ఞానమును ,ఆదీనంలో చేయటమును ప్రసాదించటం చేసేవారము మేమే.
Tafsiran larabci:
وَعَلَّمْنٰهُ صَنْعَةَ لَبُوْسٍ لَّكُمْ لِتُحْصِنَكُمْ مِّنْ بَاْسِكُمْ ۚ— فَهَلْ اَنْتُمْ شٰكِرُوْنَ ۟
మరియు మేము సులైమానుకు కాకుండా దావుద్ కి మీ శరీరాలపై ఆయుధాల దాడి నుండి మిమ్మల్ని రక్షించటం కొరకు కవచములను తయారు చేయటమును నేర్పించాము. ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన ఈ అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటారా ?!.
Tafsiran larabci:
وَلِسُلَیْمٰنَ الرِّیْحَ عَاصِفَةً تَجْرِیْ بِاَمْرِهٖۤ اِلَی الْاَرْضِ الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَكُنَّا بِكُلِّ شَیْءٍ عٰلِمِیْنَ ۟
మరియు మేము సులైమాను కొరకు తీవ్రంగా వీచే గాలిని ఆదీనంలో చేశాము. ఆయన దాన్ని ఆదేశించినప్పుడు ఆది ఆయన ఆదేశం మేరకు మేము దైవ ప్రవక్తలను పంపించటం ద్వారా,ఆహారోపాధిని వ్యాపింపచేయటం ద్వారా మేము శుభాలను కలిగించి షామ్ ప్రాంతము వైపునకు వీస్తుంది. మరియు మాకు ప్రతీది తెలుసు. అందులో నుండి ఏదీ మాపై గోప్యంగా ఉండదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• فعل الخير والصلاة والزكاة، مما اتفقت عليه الشرائع السماوية.
మంచిని చేయటం,నమాజు పాటించటం,జకాతు ఇవ్వటం దివ్య ధర్మములన్ని అంగీకరించిన వాటిలోంచివి.

• ارتكاب الفواحش سبب في وقوع العذاب المُسْتَأْصِل.
అశ్లీల కార్యాలకు పాల్పడటం కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష వాటిల్లటానికి కారణమవుతుంది.

• الصلاح سبب في الدخول في رحمة الله.
మంచితనము అల్లాహ్ కారుణ్యములోకి ప్రవేశించటంలో కారణమవుతుంది.

• الدعاء سبب في النجاة من الكروب.
దుఆ బాధల నుండి విముక్తి కలిగించటంలో కారణమవుతుంది.

وَمِنَ الشَّیٰطِیْنِ مَنْ یَّغُوْصُوْنَ لَهٗ وَیَعْمَلُوْنَ عَمَلًا دُوْنَ ذٰلِكَ ۚ— وَكُنَّا لَهُمْ حٰفِظِیْنَ ۟ۙ
మరియు మేము షైతానుల్లోంచి కొందరిని ఆదీనంలో చేశాము. ఆయన కొరకు సముద్రంలో మునిగి ముత్యాలను,ఇతరవాటిని తీసేవారు ఉన్నారు. మరియు వారు ఇతర కార్యములు నిర్మాణాలు చేయటం లాంటి కార్యాలూ చేస్తారు. మరియు మేము వారి సంఖ్యలను,వారి కార్యాలను కనిపెట్టుకుని ఉంటాము. వాటిలో నుండి ఏదీ మా నుండి తప్పి పోదు.
Tafsiran larabci:
وَاَیُّوْبَ اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الضُّرُّ وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟ۚۖ
ఓ ప్రవక్తా తనకు ఆపద కలిగినప్పుడు పరిశుద్ధుడైన తన ప్రభువును ఇలా పలుకుతూ అర్ధించినప్పటి అయ్యూబ్ అలైహిస్సలాం గాధను గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా రోగము ద్వారా,ఇంటి వారిని కోల్పోవటం ద్వారా నాపై ఆపద కలిగినది. మరియు నీవు కరుణామయులందరిలో కెల్లా గొప్ప కరుణామయుడివి. అందులో నుండి నాకు కలిగిన దాన్ని నా నుండి దూరం చేయి.
Tafsiran larabci:
فَاسْتَجَبْنَا لَهٗ فَكَشَفْنَا مَا بِهٖ مِنْ ضُرٍّ وَّاٰتَیْنٰهُ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَذِكْرٰی لِلْعٰبِدِیْنَ ۟
అప్పుడు మేము ఆయన దుఆను స్వీకరించి ఆయనకు కలిగిన కీడును ఆయన నుండి మేము తొలగించాము. ఆయన కోల్పోయిన ఆయన ఇంటి వారిని,ఆయన సంతానమును ఆయనకు ప్రసాదించాము. మరియు మేము వారితో పాటు వారిని పోలిన వారిని ఆయనకు ప్రసాదించాము.ఇదంతా మేము మా వద్ద నుండి కారుణ్యముగా,ఆరాధన ద్వారా అల్లాహ్ కొరకు విధేయత చూపే ప్రతి ఒక్కరి కొరకు,అయ్యూబ్ సహనం పాటించినట్లు సహనం పాటించటానికి హితబోధనగా చేశాము.
Tafsiran larabci:
وَاِسْمٰعِیْلَ وَاِدْرِیْسَ وَذَا الْكِفْلِ ؕ— كُلٌّ مِّنَ الصّٰبِرِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇస్మాయీలు,ఇద్రీసు,జుల్ కిఫ్ల్ అలైహిముస్సలాములను గుర్తు చేసుకోండి. వారందరిలో నుండి ప్రతి ఒక్కరు ఆపదపై,అల్లాహ్ వారికిచ్చిన బాధ్యతను నెరవేర్చటం పై సహనం చూపే వారిలోంచి వారు.
Tafsiran larabci:
وَاَدْخَلْنٰهُمْ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهُمْ مِّنَ الصّٰلِحِیْنَ ۟
మరియు మేము వారందరిని మా కారుణ్యములో ప్రవేశింపజేశి వారిని దైవ ప్రవక్తలుగా చేశాము. మరియు మేము వారిని స్వర్గములో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా వారు తమ ప్రభువు యొక్క విధేయతలో ఆచరించిన అల్లాహ్ దాసుల్లోంచి వారు. మరియు వారి అంతర్గతములు,వారి బహిర్గతములు మంచిగా అయినవి.
Tafsiran larabci:
وَذَا النُّوْنِ اِذْ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ اَنْ لَّنْ نَّقْدِرَ عَلَیْهِ فَنَادٰی فِی الظُّلُمٰتِ اَنْ لَّاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ سُبْحٰنَكَ ۖۗ— اِنِّیْ كُنْتُ مِنَ الظّٰلِمِیْنَ ۟ۚۖ
ఓ ప్రవక్తా మీరు చేప వారైన యూనుస్ అలైహిస్సలాం గాధను ఆయన తన ప్రభువు అనుమతి లేకండా అతని జాతి వారు అవిధేయతలో కొనసాగటం వలన వారిపై కోపముతో వెళ్ళినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అతడు అలా వెళ్ళిపోవటంపై అతనిని శిక్షించటం ద్వారా మేము అతనిని ఇబ్బంది పెట్టమని అతడు భావించాడు. అయితే అతడిని చేప మింగినప్పుడు అతడు తీవ్ర ఇబ్బంది,బంధీ వలన బాధించబడ్డాడు. అప్పుడు అతడు రాత్రి,సముద్రం,చేప కడుపు చీకట్లలో తన అపరాధమును అంగీకరిస్తూ అల్లాహ్ యందు తన తరపు నుండి పశ్ఛాత్తాప్పడుతూ మొర పెట్టుకున్నాడు. అప్పుడు అతను ఇలా పలికాడు : నీవు తప్ప ఎవరూ వాస్తవ అరాధ్య దైవం లేడు. నీవు అతీతుడివి,పరిశుద్ధుడివి. నిశ్ఛయంగా నేను దుర్మార్గుల్లోంచి వాడిని.
Tafsiran larabci:
فَاسْتَجَبْنَا لَهٗ ۙ— وَنَجَّیْنٰهُ مِنَ الْغَمِّ ؕ— وَكَذٰلِكَ نُـجِی الْمُؤْمِنِیْنَ ۟
అప్పుడు మేము అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతడిని చీకట్లలో నుంచి,చేప కడుపులో నుంచి వెలికి తీసి తీవ్ర దుఃఖము నుండి అతడికి విముక్తిని కలిగించాము. యూనుస్ ను ఈ దుఃఖము నుండి విముక్తి కలిగించినట్లే విశ్వాసపరులను వారు దుఃఖములో పడి అల్లాహ్ తో మొర పెట్టుకున్నప్పుడు మేము విముక్తిని కలిగిస్తాము.
Tafsiran larabci:
وَزَكَرِیَّاۤ اِذْ نَادٰی رَبَّهٗ رَبِّ لَا تَذَرْنِیْ فَرْدًا وَّاَنْتَ خَیْرُ الْوٰرِثِیْنَ ۟ۚۖ
ఓ ప్రవక్తా జకరియా అలైహిస్సలాం గాధను ఆయన పరిశుద్ధుడైన తన ప్రభువును ఇలా పలుకుతూ మొర పెట్టుకున్నప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నీవు నన్ను ఎటువంటి సంతానము లేకుండా ఒంటరి వాడిని చేయకు. వాస్తవానికి నీవు ఉత్తమంగా ఉంచే వాడివి. అయితే నీవు నా తరువాత ఉండే ఒక కుమారుడిని నాకు ప్రసాదించు.
Tafsiran larabci:
فَاسْتَجَبْنَا لَهٗ ؗ— وَوَهَبْنَا لَهٗ یَحْیٰی وَاَصْلَحْنَا لَهٗ زَوْجَهٗ ؕ— اِنَّهُمْ كَانُوْا یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَیَدْعُوْنَنَا رَغَبًا وَّرَهَبًا ؕ— وَكَانُوْا لَنَا خٰشِعِیْنَ ۟
అప్పుడు మేము అతని దుఆను స్వీకరించి,అతనికి కుమారుడిగా యహ్యాను ప్రసాదించాము. మరియు అతని భార్యను మేము యోగ్యురాలిగా చేశాము. అప్పుడు ఆమె సంతానమును జన్మనివ్వలేనిది అయి కూడా సంతానమును జన్మనిచ్చేదిగా అయిపోయినది. నిశ్ఛయంగా జకరియా,అతని భార్య,అతని కుమారుడు సత్కార్యములు చేయటమునకు త్వరపడే వారు. మరియు వారు మా వద్ద ఉన్న పుణ్యమును ఆశిస్తూ, మా వద్ద ఉన్న శిక్ష నుండి భయపడుతూ మమ్మల్ని వేడుకునేవారు. మరియు వారు మా కొరకు వినమ్రులై ఉండేవారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الصلاح سبب للرحمة.
మంచితనం కారుణ్యమునకు కారణమవుతుంది

• الالتجاء إلى الله وسيلة لكشف الكروب.
అల్లాహ్ ను ఆశ్రయించటం ఆపదలను (వేదనలను) దూరం చేయటానికి మార్గము.

• فضل طلب الولد الصالح ليبقى بعد الإنسان إذا مات.
మనిషి చనిపోయిన తరువాత ఉండటానికి సంతానమును కోరటం యొక్క ప్రాముఖ్యత.

• الإقرار بالذنب، والشعور بالاضطرار لله وشكوى الحال له، وطاعة الله في الرخاء من أسباب إجابة الدعاء وكشف الضر.
పాపము చేసినట్లు అంగీకరించటం, అల్లాహ్ అవసరము ఉన్నట్లు భావన ఉండటం,పరిస్థితుల ఫిర్యాదు ఆయనతో చేయటం,మేలిమిలో అల్లాహ్ కు విధేయత చూపటం దూఆ స్వీకృతం చేసే, నష్టమును తొలగించే కారకముల్లోంచివి.

وَالَّتِیْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِیْهَا مِنْ رُّوْحِنَا وَجَعَلْنٰهَا وَابْنَهَاۤ اٰیَةً لِّلْعٰلَمِیْنَ ۟
ఓ ప్రవక్తా వ్యభిచారము నుండి తన శీలాన్ని కాపాడుకున్న మర్యమ్ అలైహస్సలాం గాధను గుర్తు చేసుకోండి. అప్పుడు అల్లాహ్ ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాడు. అప్పుడు ఆయన ఆమెలో ఊదితే ఆమె ఈసా అలైహిస్సలాంను గర్భంగా దాల్చింది. మరియు ఆమె,ఆమె కుమారుడు ఈసా అలైహిమస్సలాం ఇద్దరు ప్రజల కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై, మరియు తండ్రి లేకుండా అతడు ఆయనను పుట్టించినప్పుడు అతడిని ఏదీ అశక్తుడిని చేయలేదు అన్న దానిపై ఒక సూచన అయ్యారు.
Tafsiran larabci:
اِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً ۖؗ— وَّاَنَا رَبُّكُمْ فَاعْبُدُوْنِ ۟
ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ ఈ ధర్మము ఒకే ఒక ధర్మము. అది ఇస్లాం ధర్మమైన తౌహీదు (ఏక దైవ ధర్మం). మరియు నేను మీ ప్రభువును. అయితే నీవు ఆరాధనను నా ఒక్కడి కొరకే ప్రత్యేకించు.
Tafsiran larabci:
وَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ ؕ— كُلٌّ اِلَیْنَا رٰجِعُوْنَ ۟۠
మరియు ప్రజలు వేరు వేరు అయిపోయారు. అప్పుడు వారిలో నుండి ఒకే దైవమును విశ్వసించేవాడు,బహుదైవారాధకుడు,అవిశ్వాసపరుడు,విశ్వాసపరుడు అయిపోయారు. వేరు వేరు అయిన వీరందరు ప్రళయదినాన మా ఒక్కరి వైపునకే మరలి వస్తారు. అప్పుడు మేము వారిని వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
Tafsiran larabci:
فَمَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْیِهٖ ۚ— وَاِنَّا لَهٗ كٰتِبُوْنَ ۟
వారిలో నుంచి ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై,అంతిమ దినముపై విశ్వాసమును కనబరుస్తూ సత్కార్యములు చేస్తాడో అతని సత్కర్మ తిరస్కరించబడదు. అంతే కాదు అల్లాహ్ అతని పుణ్యమును ఆదరించి దాన్ని రెట్టింపు చేస్తాడు. మరియు అతడు మరణాంతరం లేపబడిన రోజు దాన్ని తన కర్మల పత్రంలో పొందుతాడు. అప్పుడు దానితో సంతోషిస్తాడు.
Tafsiran larabci:
وَحَرٰمٌ عَلٰی قَرْیَةٍ اَهْلَكْنٰهَاۤ اَنَّهُمْ لَا یَرْجِعُوْنَ ۟
మరియు ఇది ఒక గ్రామ ప్రజలకు అసాధ్యం. వారు పశ్ఛాత్తాప్పడి వారి తౌబా స్వీకరించబడటానికి ఇహలోకము వైపునకు వారు మరలటమును వారి అవిశ్వాసం వలన మేము వారిపై నిషేదించాము.
Tafsiran larabci:
حَتّٰۤی اِذَا فُتِحَتْ یَاْجُوْجُ وَمَاْجُوْجُ وَهُمْ مِّنْ كُلِّ حَدَبٍ یَّنْسِلُوْنَ ۟
యాజూజ్,మాజూజ్ అడ్డు కట్ట తెరవబడేంత వరకు ఎన్నటికి వారు మరలరు. మరియు వారు ఆ రోజు భూమి నుండి ప్రతి ఎత్తైన ప్రదేశము నుండి వేగముగా బయలుదేరి వస్తారు.
Tafsiran larabci:
وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَاِذَا هِیَ شَاخِصَةٌ اَبْصَارُ الَّذِیْنَ كَفَرُوْا ؕ— یٰوَیْلَنَا قَدْ كُنَّا فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا بَلْ كُنَّا ظٰلِمِیْنَ ۟
వారు బయటకి రావటంతో ప్రళయదినం దగ్గరపడింది. మరియు దాని భయాందోళనలు,దాని తీవ్రతలు బహిర్గతమైనవి. అప్పుడు దాని భయాందోళనల తీవ్రత వలన అవిశ్వాసపరుల కళ్ళు తెరుచుకుని ఉండిపోయి వారు ఇలా పలికారు : అయ్యో మా దౌర్భాగ్యం నిశ్ఛయంగా మేము ఇహలోకంలో ఆటల్లో,ఈ గొప్ప దినము కొరకు సిద్ధం అవటం నుండి అశ్రద్ధలో పడి ఉన్నాము. అంతే కాదు మేము అవిశ్వాసము,పాప కార్యలకు పాల్పడటం వలన దుర్మార్గులమైపోయాము.
Tafsiran larabci:
اِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ حَصَبُ جَهَنَّمَ ؕ— اَنْتُمْ لَهَا وٰرِدُوْنَ ۟
ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు, మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే విగ్రహాలు,మీ ఆరాధన నుండి సంతుష్టపడిన జిన్నులు,మానవులు నరకమునకు ఇంధనమవుతారు,మీరూ,మీ ఆరాధ్య దైవాలు అందులో ప్రవేశిస్తారు.
Tafsiran larabci:
لَوْ كَانَ هٰۤؤُلَآءِ اٰلِهَةً مَّا وَرَدُوْهَا ؕ— وَكُلٌّ فِیْهَا خٰلِدُوْنَ ۟
ఒక వేళ ఈ ఆరాధించబడేవి వాస్తవంగా ఆరాధించబడే దైవాలే అయితే వారు తమను ఆరాధించే వారితోపాటు నరకంలో ప్రవేశించేవారు కాదు. మరియు ఆరాధించేవారిలో నుండి,ఆరాధించబడే వారిలో నుండి ప్రతి ఒక్కరు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో నుంచి బయటకు రాకుండా అందులో వారు శాస్వతంగా నివాసముంటారు.
Tafsiran larabci:
لَهُمْ فِیْهَا زَفِیْرٌ وَّهُمْ فِیْهَا لَا یَسْمَعُوْنَ ۟
అందులో వారికి కలిగిన బాధల వలన వారికి తీవ్రమైన మూలగటం ఉంటుంది. మరియు వారు నరకాగ్నిలో వారికి కలిగిన భయాందోళనల తీవ్రత వలన శబ్ధములను వినలేరు.
Tafsiran larabci:
اِنَّ الَّذِیْنَ سَبَقَتْ لَهُمْ مِّنَّا الْحُسْنٰۤی ۙ— اُولٰٓىِٕكَ عَنْهَا مُبْعَدُوْنَ ۟ۙ
ఎప్పుడైతే ముష్రికులు ఆరాధన చేయబడిన ఈసా,దైవదూతలు తొందరలోనే నరకంలో ప్రవేశిస్తారని పలికారో అల్లాహ్ ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ యొక్క జ్ఞానములో ఈసా అలైహిస్సలాం లాంటి సద్వర్తనులు నరకము నుండి దూరంగా ఉంచబడతారని ముందే తెలపబడినది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• التنويه بالعفاف وبيان فضله.
పవిత్రతను గమనించి దాని యోగ్యతను వివరించడం.

• اتفاق الرسالات السماوية في التوحيد وأسس العبادات.
తౌహీదు,ఆరాధనల పునాదుల విషయంలో దివ్య సందేశాల ఏకీభావం.

• فَتْح سد يأجوج ومأجوج من علامات الساعة الكبرى.
యాజూజ్,మాజూజ్ యొక్క అడ్డుగోడ తెరవటం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లోంచిది.

• الغفلة عن الاستعداد ليوم القيامة سبب لمعاناة أهوالها.
ప్రళయ దినం కొరకు సిధ్ధం చేయటం నుండి నిర్లక్ష్యం దాని భయాందోళనల బాధలకు ఒక కారణం.

لَا یَسْمَعُوْنَ حَسِیْسَهَا ۚ— وَهُمْ فِیْ مَا اشْتَهَتْ اَنْفُسُهُمْ خٰلِدُوْنَ ۟ۚ
వారి చెవుల వరకు నరకము యొక్క ధ్వని చేరదు. మరియు వారు అందులో తమ మనస్సులు కోరిన అనుగ్రహాల్లో,రుచులలో నివాసముంటారు. వారి అనుగ్రహాలు ఎన్నటికి అంతమవవు.
Tafsiran larabci:
لَا یَحْزُنُهُمُ الْفَزَعُ الْاَكْبَرُ وَتَتَلَقّٰىهُمُ الْمَلٰٓىِٕكَةُ ؕ— هٰذَا یَوْمُكُمُ الَّذِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ ۟
నరకాగ్ని తన వాసులపై నుండి చుట్టుముట్టినప్పుడు పెద్ద భయాందోళన వారికి భయమును కలిగించదు. మరియు దైవదూతలు వారికి ఇలా అభినందనలు తెలుపుతూ ఆహ్వానిస్తారు : ఇహలోకములో మీతో వాగ్దానం చేయబడిన,అందులో మీరు పొందే అనుగ్రహాల గురించి మీకు శుభవార్త ఇవ్వబడిన మీ రోజు ఇది.
Tafsiran larabci:
یَوْمَ نَطْوِی السَّمَآءَ كَطَیِّ السِّجِلِّ لِلْكُتُبِ ؕ— كَمَا بَدَاْنَاۤ اَوَّلَ خَلْقٍ نُّعِیْدُهٗ ؕ— وَعْدًا عَلَیْنَا ؕ— اِنَّا كُنَّا فٰعِلِیْنَ ۟
ఆ రోజు మేము ఆకాశమును పత్రికను దానిలో ఉన్నవాటితో సహా చుట్టేసినట్లు చుట్టేస్తాము. మరియు మేము సృష్టితాలను వారు మొదటిసారి పుట్టించబడిన వారి రూపముల్లోనే సమీకరిస్తాము. మేము ఎటువంటి విబేధము లేని ఇలాంటి వాగ్దానమును చేశాము. నిశ్ఛయంగా మేము చేసిన వాగ్దానమును నెరవేరుస్తాము.
Tafsiran larabci:
وَلَقَدْ كَتَبْنَا فِی الزَّبُوْرِ مِنْ بَعْدِ الذِّكْرِ اَنَّ الْاَرْضَ یَرِثُهَا عِبَادِیَ الصّٰلِحُوْنَ ۟
మేము లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ విధేయతలో ఆచరించే సజ్జనులైన అల్లాహ్ దాసులు భూమికి వారసులవుతారని,వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతివారని వ్రాసిన తరువాతే మేము ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధాలలో వ్రాశాము.
Tafsiran larabci:
اِنَّ فِیْ هٰذَا لَبَلٰغًا لِّقَوْمٍ عٰبِدِیْنَ ۟ؕ
నిశ్చయంగా మేము అవతరింపజేసిన హితబోధనలో తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటితో తమ ప్రభువు ఆరాధన చేసే వారికి సందేశం ఉన్నది. వారే దానితో ప్రయోజనం చెందుతారు.
Tafsiran larabci:
وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا رَحْمَةً لِّلْعٰلَمِیْنَ ۟
ఓ ముహమ్మద్ ప్రజలందరి సన్మార్గము,వారిని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటంపై మీలో ఉన్న అత్యాశ గుణము వలన మిమ్మల్ని మేము ప్రవక్తగానే కాకుండా సృష్టితాలందరి కొరకు కారుణ్యమూర్తిగా పంపించాము.
Tafsiran larabci:
قُلْ اِنَّمَا یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَهَلْ اَنْتُمْ مُّسْلِمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : నా ప్రభువు తరపు నుండి మీ సత్య ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అని,ఆయనతో పాటు ఎవరు సాటి లేరని,ఆయనే అల్లాహ్ అని నాపై దైవ వాణి అవతరించింది. అయితే మీరు ఆయనను విశ్వసించటానికి,ఆయనపై విధేయతతో ఆచరించటానికి విధేయులవ్వండి.
Tafsiran larabci:
فَاِنْ تَوَلَّوْا فَقُلْ اٰذَنْتُكُمْ عَلٰی سَوَآءٍ ؕ— وَاِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ اَمْ بَعِیْدٌ مَّا تُوْعَدُوْنَ ۟
ఒక వేళ వీరందరు మీరు వారి వద్దకు తీసుకుని వచ్చిన దాని నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : నేను,మీరు సమానమైన విషయంపై ఉన్నామని,మీకూ నాకు మధ్య విరోధమున్నదని మీకు నేను తెలియపరచాను. మరియు అల్లాహ్ వాగ్దానం చేసిన తన శిక్ష మీపై ఎప్పుడు దిగుతుందో నాకు తెలియదు.
Tafsiran larabci:
اِنَّهٗ یَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَیَعْلَمُ مَا تَكْتُمُوْنَ ۟
నిశ్చయంగా మీరు బహిర్గతంగా పలికినది అల్లాహ్ కి తెలుసు,మరియు మీరు గోప్యంగా ఉంచినదీ ఆయనకు తెలుసు. వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
وَاِنْ اَدْرِیْ لَعَلَّهٗ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
మరియు బహుశా శిక్ష విషయంలో మీకు గడువివ్వటం మీకు పరీక్షేమో,మీరు మీ అవిశ్వాసంలో,మీ మార్గ భ్రష్టతలో పెరిగిపోవటం కొరకు అల్లాహ్ యొక్క జ్ఞానంలో నిర్ణయించబడిన ఒక గడువు వరకు వదిలిపెట్టటం,మీకు ప్రయోజనం కలిగించటమేమో నాకు తెలియదు.
Tafsiran larabci:
قٰلَ رَبِّ احْكُمْ بِالْحَقِّ ؕ— وَرَبُّنَا الرَّحْمٰنُ الْمُسْتَعَانُ عَلٰی مَا تَصِفُوْنَ ۟۠
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో మొర పెట్టుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు మాకు, అవిశ్వాసంపై మొండి తనం కలిగిన నా జాతి వారి మధ్య సత్యంతో కూడుకున్న తీర్పునివ్వు. మీరు పలికే అవిశ్వాసము,తిరస్కారపు మాటల నుండి కరుణామయుడు అయిన మా ప్రభువుతో మేము సహాయమును కోరుతున్నాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الصلاح سبب للتمكين في الأرض.
మంచితనం భూమిలో సాధికారతకు ఒక కారణం.

• بعثة النبي صلى الله عليه وسلم وشرعه وسنته رحمة للعالمين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్యం,అయన ధర్మం,ఆయన విధానం సర్వలోకాల వారి కొరకు ఒక కారుణ్యము.

• الرسول صلى الله عليه وسلم لا يعلم الغيب.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు.

• علم الله بما يصدر من عباده من قول.
అల్లాహ్ తన దాసుల నుండి వెలువడే మాటలను తెలుసుకోవటం.

 
Fassarar Ma'anoni Sura: Suratu Al'anbiyaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa