Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Al'nour   Aya:

అన్-నూర్

daga cikin abunda Surar ta kunsa:
الدعوة إلى العفاف وحماية الأعراض.
పవిత్రత మరియు మానమర్యాదల పరిరక్షణ వైపు ఆహ్వానం

سُوْرَةٌ اَنْزَلْنٰهَا وَفَرَضْنٰهَا وَاَنْزَلْنَا فِیْهَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
ఈ సూరాను మేము అవతరింపజేశాము. మరియు మేము దానిలోని ఆదేశాలను ఆచరించటంను అనివార్యం చేశాము. మరియు మేము దానిలో స్పష్టమైన ఆయతులను వాటిలో కల ఆదేశాలను మీరు గుర్తు చేసుకుని వాటి ప్రకారం ఆచరిస్తారని ఆశిస్తూ అవతరింపజేశాము.
Tafsiran larabci:
اَلزَّانِیَةُ وَالزَّانِیْ فَاجْلِدُوْا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۪— وَّلَا تَاْخُذْكُمْ بِهِمَا رَاْفَةٌ فِیْ دِیْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ۚ— وَلْیَشْهَدْ عَذَابَهُمَا طَآىِٕفَةٌ مِّنَ الْمُؤْمِنِیْنَ ۟
వ్యభిచారకురాలు,వ్యభిచారకుడు ఇద్దరు అవివాహితులైతే వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మీరు వంద కొరడా దెబ్బలు కొట్టండి. ఒక వేళ మీరు అల్లాహ్ పై,అంతిమ దినంపై విశ్వాసమును కలిగి ఉంటే వారిద్దరి విషయంలో మీరు వారిపై శిక్ష విధించకుండా ఉండటానికి లేదా వారిపై దాన్ని తేలిక చేయటానికి మీకు వారిపై జాలి గాని దయ గాని కలగకూడదు. శిక్షను విధించేటప్పుడు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గం వారిద్దరి (శిక్ష) గురించి నలువైపుల వ్యాపించటానికి,వారిద్దరిని,ఇతరులను హెచ్చరించటానికి హాజరుకావాలి.
Tafsiran larabci:
اَلزَّانِیْ لَا یَنْكِحُ اِلَّا زَانِیَةً اَوْ مُشْرِكَةً ؗ— وَّالزَّانِیَةُ لَا یَنْكِحُهَاۤ اِلَّا زَانٍ اَوْ مُشْرِكٌ ۚ— وَحُرِّمَ ذٰلِكَ عَلَی الْمُؤْمِنِیْنَ ۟
వ్యభిచారము యొక్క విహీనతను స్పష్టపరచటం కొరకు అల్లాహ్ తెలిపాడు వ్యభిచారమునకు అలవాటు పడినవాడు తన లాంటి వ్యభిచారినిలో లేదా వ్యభిచారము నుండి దూరంగా ఉండని ముష్రిక్ స్త్రీలో మాత్రమే నికాహ్ యొక్క ఆశను కలిగి ఉంటాడు. వాస్తవానికి ఆమెతో వివాహం చేయటం సమ్మతం కాకపోయినా కూడా. మరియు వ్యభిచారమునకు అలవాటుపడిన స్త్రీ తన లాంటి వ్యభిచారము చేసే వ్యక్తిలో లేదా వ్యభిచారము నుండి దూరంగా ఉండని మష్రిక్ పురుషునిలో అతనితో వివాహం చేయటం సమ్మతం కాకపోయిన వివాహము యొక్క ఆశను కలిగి ఉంటుంది. మరియు వ్యభిచారము చేసే స్త్రీ తో నికాహ్ చేయటం,వ్యభిచారము చేసే వ్యక్తి యొక్క నికాహ్ చేయటం విశ్వాసపరులపై నిషేధము.
Tafsiran larabci:
وَالَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ ثُمَّ لَمْ یَاْتُوْا بِاَرْبَعَةِ شُهَدَآءَ فَاجْلِدُوْهُمْ ثَمٰنِیْنَ جَلْدَةً وَّلَا تَقْبَلُوْا لَهُمْ شَهَادَةً اَبَدًا ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే శీలవతులైన స్త్రీలపై అశ్లీలవతులని నింద మోపి (అలాగే శీలవతులైన పురుషులపై) తాము ఎవరిపైనైతే అశ్లీలవతులని నింద మోపారో దానిపై నలుగురు సాక్షులను తీసుకుని రాలేదో ఓ అధికారులారా వారిని ఎనబై కొరడా దెబ్బలను కొట్టండి. మరియు వారి సాక్ష్యమును ఎన్నటికీ స్వీకరించకండి. శీలవతులపై నిందమోపే అలాంటి వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు.
Tafsiran larabci:
اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْا ۚ— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
కానీ ఎవరైతే ఆ కార్యం చేయటానికి ముందడుగు వేసిన తరువాత అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడి,తమ కర్మలను సరి దిద్దుకుని ఉంటే నిశ్ఛయంగా అల్లాహ్ వారి పశ్ఛాత్తాపమును,వారి సాక్ష్యమును స్వీకరిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.
Tafsiran larabci:
وَالَّذِیْنَ یَرْمُوْنَ اَزْوَاجَهُمْ وَلَمْ یَكُنْ لَّهُمْ شُهَدَآءُ اِلَّاۤ اَنْفُسُهُمْ فَشَهَادَةُ اَحَدِهِمْ اَرْبَعُ شَهٰدٰتٍۢ بِاللّٰهِ ۙ— اِنَّهٗ لَمِنَ الصّٰدِقِیْنَ ۟
మరియు ఆ పురుషులు ఎవరైతే తమ భార్యలపై నింద మోపి వారిపై నిందమోపినది నిజం అవటంపై సాక్ష్యం ఇవ్వటానికి సాక్షులుగా స్వయంగా తాము తప్ప ఇతరులు లేని పక్షంలో వారిలో నుండి (భర్తల్లో నుండి) ఒకరు అల్లాహ్ పై నాలుగు సార్లు ప్రమాణం చేసి తన భార్యపై వ్యభిచారము గురించి నింద మోపిన దాని విషయంలో సత్య వంతుడని సాక్ష్యమివ్వాలి.
Tafsiran larabci:
وَالْخَامِسَةُ اَنَّ لَعْنَتَ اللّٰهِ عَلَیْهِ اِنْ كَانَ مِنَ الْكٰذِبِیْنَ ۟
ఆ తరువాత ఐదవసారి తన ప్రమాణంలో "ఆమెపై నింద మోపిన విషయంలో ఒక వేళ తాను అసత్యపరుడైతే శాపమునకు హక్కు దారుడని" తన స్వయంపై శాపమును అధికంగా చేసుకోవాలి.
Tafsiran larabci:
وَیَدْرَؤُا عَنْهَا الْعَذَابَ اَنْ تَشْهَدَ اَرْبَعَ شَهٰدٰتٍۢ بِاللّٰهِ ۙ— اِنَّهٗ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۙ
దీనితో ఆమె వ్యభిచార శిక్ష విధించబడటానికి అర్హులైపోతుంది. మరియు ఆమె ఈ శిక్షను తన నుండి తొలగించటానికి అల్లాహ్ పై నాలుగు ప్రమాణాలు చేసి అతను తనపై నింద మోపిన విషయంలో అసత్యపరుడని సాక్ష్యమివ్వాలి.
Tafsiran larabci:
وَالْخَامِسَةَ اَنَّ غَضَبَ اللّٰهِ عَلَیْهَاۤ اِنْ كَانَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఆ తరువాత ఐదవసారి తన ప్రమాణంలో "ఆమెపై నింద మోపిన విషయంలో ఒక వేళ అతను సత్యవంతుడైతే తనపై అల్లాహ్ ఆగ్రహము కురవాలని" తన స్వయంపై శాపమును అధికంగా చేసుకోవాలి.
Tafsiran larabci:
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ وَاَنَّ اللّٰهَ تَوَّابٌ حَكِیْمٌ ۟۠
ఓ ప్రజలారా మీపై అల్లాహ్ అనుగ్రహము మరియు మీపై ఆయన కారుణ్యము లేకుంటే,ఆయన తన దాసుల్లోంచి తౌబా చేసేవారి తౌబాను స్వీకరిస్తాడని,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడని (కాకపోతే) మీ పాపములపై శీఘ్రంగా శిక్షించేవాడు మరియు దానితో మిమ్మల్ని పరాభవమునకు లోను చేసేవాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• التمهيد للحديث عن الأمور العظام بما يؤذن بعظمها.
గొప్ప విషయాల గురించి వాటి గొప్పతనమును ప్రకటించటం ద్వారా మాట్లాడటం కొరకు సిద్ధం కావటం.

• الزاني يفقد الاحترام والرحمة في المجتمع المسلم.
వ్యభిచారి మస్లిం సముదాయంలో గౌరవమును,కారుణ్యమును కోల్పోతాడు.

• الحصار الاجتماعي على الزناة وسيلة لتحصين المجتمع منهم، ووسيلة لردعهم عن الزنى.
వ్యభిచారకులపై సామాజిక దిగ్బంధనం వారి నుండి సమాజమును రక్షించటానికి ఒక మార్గము మరియు వ్యభిచారము నుండి వారిని అరికట్టడానికి ఒక మార్గం.

• تنويع عقوبة القاذف إلى عقوبة مادية (الحد)، ومعنوية (رد شهادته، والحكم عليه بالفسق) دليل على خطورة هذا الفعل.
నిందమోపే వారి శిక్ష రకరకాలుగా శారీరక శిక్ష (హద్ద్),నైతిక శిక్ష (అతని సాక్ష్యమును రద్దుపరచటం, అతడు విధేయత నుండి వైదొలిగాడని ఆదేశం జారీ చేయటం) రూపములో ఉండటం ఈ కార్యం (నిందమోపటం) భయంకరమైనదనటానికి ఒక ఆధారము.

• لا يثبت الزنى إلا ببينة، وادعاؤه دونها قذف.
వ్యభిచారమనేది స్పష్టమైన ఆధారముతో నిరూపితమవుతుంది. అది లేకుండా దాని వాదన నింద అవుతుంది.

 
Fassarar Ma'anoni Sura: Al'nour
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa