Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Al'thariyat   Aya:
كَذٰلِكَ مَاۤ اَتَی الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا قَالُوْا سَاحِرٌ اَوْ مَجْنُوْنٌ ۟۫
మక్కా వాసులు తిరస్కరించిన ఈ తిరస్కారము వలె పూర్వ సమాజములూ తిరస్కరించారు. అయితే అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా అతని గురించి వారు ఇతడు మంత్రజాలకుడు లేదా పిచ్చివాడు అని అనకుండా ఉండలేదు.
Tafsiran larabci:
اَتَوَاصَوْا بِهٖ ۚ— بَلْ هُمْ قَوْمٌ طَاغُوْنَ ۟ۚ
ఏమీ అవిశ్వాసపరుల్లోంచి ముందు గతించిన వారు మరియు వారిలో నుండి తరువాత వచ్చేవారు ఒకరినొకరు ప్రవక్తలను తిరస్కరించటంపై తాకీదు చేసుకున్నారా ?!. లేదు కాని వారి ఈ తలబిరుసుతనంపై వారి సమీకరణము అయినది.
Tafsiran larabci:
فَتَوَلَّ عَنْهُمْ فَمَاۤ اَنْتَ بِمَلُوْمٍ ۟ؗ
ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరి నుండి విముఖత చూపండి. మీరు నిందించబడేవారు కాదు. వాస్తవానికి మీరు వారి వద్దకు ఇచ్చి పంపించబడ్డ సందేశములన్నింటిని వారికి చేరవేశారు.
Tafsiran larabci:
وَّذَكِّرْ فَاِنَّ الذِّكْرٰی تَنْفَعُ الْمُؤْمِنِیْنَ ۟
వారి నుండి మీ విముఖత చూపటం వారిని హితోపదేశం చేయటం నుండి మిమ్మల్ని ఆపకూడదు. కావున మీరు వారిని ఉపదేశము మరియు హితోపదేశం చేయండి. ఎందుకంటే హితోపదేశం చేయటం అల్లాహ్ పై విశ్వాసము కలవారికి ప్రయోజనం కలిగిస్తుంది.
Tafsiran larabci:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْاِنْسَ اِلَّا لِیَعْبُدُوْنِ ۟
నేను జిన్నులను మరియు మానవులను నా ఒక్కడి ఆరాధన కొరకు మాత్రమే సృష్టించుకున్నాను. మరియు నేను వారిని వారు నాకు సాటి కల్పించటానికి సృష్టించలేదు.
Tafsiran larabci:
مَاۤ اُرِیْدُ مِنْهُمْ مِّنْ رِّزْقٍ وَّمَاۤ اُرِیْدُ اَنْ یُّطْعِمُوْنِ ۟
మరియు నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు. మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా నేను వారి నుండి కోరటం లేదు.
Tafsiran larabci:
اِنَّ اللّٰهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِیْنُ ۟
నిశ్చయంగా అల్లాహ్ యే తన దాసులకు ఆహార ప్రధాత. కావున అందరు ఆయన ఆహారము అవసరము కలవారు. ఆయన తనను ఎవరు ఓడించని మహా శక్తిశాలి,మహాబలుడు. జిన్నులు మరియు మానవులందరు పరిశుద్ధుడైన ఆయన శక్తి ముందట తలఒగ్గుతారు.
Tafsiran larabci:
فَاِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا ذَنُوْبًا مِّثْلَ ذَنُوْبِ اَصْحٰبِهِمْ فَلَا یَسْتَعْجِلُوْنِ ۟
ఓ ప్రవక్తా నిశ్చయంగా మిమ్మల్ని తిరస్కరించి తమపై అన్యాయం చేసుకున్న వారికి పూర్వం గతించిన తమ సహచరులకు భాగం కలిగినట్లే శిక్ష నుండి భాగము కలదు. దానికి ఒక నిర్ణీత సమయం కలదు. దాని సమయం కన్నా ముందు వారు నన్ను దాన్ని తొందరగా కోరనవసరంలేదు.
Tafsiran larabci:
فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنْ یَّوْمِهِمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۟۠
అల్లాహ్ ను తిరస్కరించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారి కొరకు తమపై శిక్ష అవతరణ గురించి వాగ్దానం చేయబడిన ప్రళయదినమున వినాశనము మరియు నష్టము కలదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الكفر ملة واحدة وإن اختلفت وسائله وتنوع أهله ومكانه وزمانه.
అవిశ్వాసం ఒకే సమాజము ఒక వేళ దాని కారకాలు వేరైనా మరియు దాని వారు,దాని ప్రదేశము,దాని కాలము రకరకాలైనా సరే.

• شهادة الله لرسوله صلى الله عليه وسلم بتبليغ الرسالة.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు సందేశములను చేరవేయటం పై అల్లాహ్ యొక్క సాక్ష్యం.

• الحكمة من خلق الجن والإنس تحقيق عبادة الله بكل مظاهرها.
జిన్నుల మరియు మానవుల సృష్టి ఉద్దేశము అల్లాహ్ ఆరాధనను దాని సారుప్యములన్నింటి ద్వారా నిరూపించటం.

• سوف تتغير أحوال الكون يوم القيامة.
ప్రళయదినమున విశ్వము యొక్క పరిస్థితులు మారుతాయి.

 
Fassarar Ma'anoni Sura: Al'thariyat
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa