Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Alhadid   Aya:
یَوْمَ تَرَی الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ یَسْعٰی نُوْرُهُمْ بَیْنَ اَیْدِیْهِمْ وَبِاَیْمَانِهِمْ بُشْرٰىكُمُ الْیَوْمَ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟ۚ
ఆ రోజున మీరు విశ్వాసపర పురషులను,విశ్వాసపర స్త్రీలను వారి వెలుగు వారి ముందున మరియు వారి కుడి వైపుల నుండి ముందుకు సాగటమును చూస్తారు. ఆ రోజు వారితో ఇలా పలకబడును : ఈ రోజు మీకు భవనముల క్రింది నుండి మరియు వృక్షముల క్రింది నుండి సెలయేరులు ప్రవహించే స్వర్గ వనముల శుభవార్త ఇవ్వబడును. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ప్రతిఫలం ఎటువంటి సాఫల్యముకు సమానము కాని గొప్ప సాఫల్యము.
Tafsiran larabci:
یَوْمَ یَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالْمُنٰفِقٰتُ لِلَّذِیْنَ اٰمَنُوا انْظُرُوْنَا نَقْتَبِسْ مِنْ نُّوْرِكُمْ ۚ— قِیْلَ ارْجِعُوْا وَرَآءَكُمْ فَالْتَمِسُوْا نُوْرًا ؕ— فَضُرِبَ بَیْنَهُمْ بِسُوْرٍ لَّهٗ بَابٌ ؕ— بَاطِنُهٗ فِیْهِ الرَّحْمَةُ وَظَاهِرُهٗ مِنْ قِبَلِهِ الْعَذَابُ ۟ؕ
ఆ రోజు కపట విశ్వాస పురషులు మరియు కపట విశ్వాస స్త్రీలు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : మార్గమును దాటటానికి మాకు సహాయపడే మీ వెలుగును మేము పుచ్చుకుంటామని ఆశిస్తూ మీరు మా కోసం నిరీక్షించండి. మరియు కపటవిశ్వాసులతో వారిని హేళన చేస్తూ ఇలా పలకబడును : మీరు మీ వెనుకకు మరలి మీరు వెలుగును పొందే ఏదైన కాంతిని వెతకండి. అప్పుడు వారి మధ్య ఒక అడ్డు గోడ ఏర్పరచబడును. ఆ గోడకు ఒక ద్వారముండును. దాని లోపలి వైపు విశ్వాసపరులకు దగ్గర ఉన్న భాగములో కారుణ్యముండును. మరియు దాని వెలుపల వైపు కపట విశ్వాసులకు దగ్గర ఉన్న భాగములో శిక్ష ఉండును.
Tafsiran larabci:
یُنَادُوْنَهُمْ اَلَمْ نَكُنْ مَّعَكُمْ ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنَّكُمْ فَتَنْتُمْ اَنْفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْاَمَانِیُّ حَتّٰی جَآءَ اَمْرُ اللّٰهِ وَغَرَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ ۟
కపటులు విశ్వాసపరులను ఇలా పలుకుతూ పిలుపునిస్తారు : ఏమీ మేము ఇస్లాం పై,విధేయత చూపటంపై మీతో పాటు లేమా ?! ముస్లిములు వారితో ఇలా పలుకుతారు : ఎందుకు కాదు మీరు మాతో పాటు ఉన్నారు. కాని మీరు మీ మనస్సులను కపటత్వముతో పరీక్షకు గురి చేసుకుని వాటిని నాశనం చేసుకున్నారు. మరియు మీరు విశ్వాసపరుల విషయంలో వారు ఓడిపోతే మీరు మీ అవిశ్వాసమును బహిరంగ పరచాలని నిరీక్షించారు. మరియు విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము విషయంలో మరియు మరణాంతరం లేపబడటం విషయంలో మీరు సందేహపడ్డారు. మరియు మీ అబద్దపు ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి చివరికి మీరు దానిపై ఉన్న స్థితిలోనే మీకు మరణం వచ్చినది. మరియు షైతాను అల్లాహ్ విషయంలో మిమ్మల్ని మోసం చేశాడు.
Tafsiran larabci:
فَالْیَوْمَ لَا یُؤْخَذُ مِنْكُمْ فِدْیَةٌ وَّلَا مِنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— مَاْوٰىكُمُ النَّارُ ؕ— هِیَ مَوْلٰىكُمْ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
ఓ కపటవిశ్వాసులారా ఈ రోజు మీ నుండి అల్లాహ్ శిక్షకు బదులుగా ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు అల్లాహ్ పట్ల బహిరంగంగా అవిశ్వాసమునకు ఒడిగట్టే వారి నుండి ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు మీ పరిణామము మరియు అవిశ్వాసుల పరిణామం నరకాగ్ని అవుతుంది. అది మీకు తగినది. మరియు మీరు దానికి యోగ్యులు. మరియు అది ఎంతో చెడ్డ పరిణామము.
Tafsiran larabci:
اَلَمْ یَاْنِ لِلَّذِیْنَ اٰمَنُوْۤا اَنْ تَخْشَعَ قُلُوْبُهُمْ لِذِكْرِ اللّٰهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ ۙ— وَلَا یَكُوْنُوْا كَالَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلُ فَطَالَ عَلَیْهِمُ الْاَمَدُ فَقَسَتْ قُلُوْبُهُمْ ؕ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
ఏమీ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి వారి హృదయములు పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ కొరకు, ఆయన ఖుర్ఆన్ నుండి అవతరింపజేసిన వాగ్దానము,హెచ్చరికల నుండి మృధువుగా,మనశ్శాంతి పొందే సమయం రాలేదా ?. మరియు వారి హృదయములు కఠినంగా మారిపోవటంలో తౌరాత్ ఇవ్వబడిన యూదులు,ఇంజీల్ ఇవ్వబడిన క్రైస్తవుల మాదిరిగా కాకూడదు. వారికి మరియు వారి ప్రవక్తలు పంపించబడటానికి మధ్య చాలా కాలం గడిచిపోయినది అప్పుడు దాని వలన వారి హృదయములు కఠినంగా మారిపోయినవి. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి ఆయన పై అవిధేయత వైపునకు వైదొలిగిపోయారు.
Tafsiran larabci:
اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ— قَدْ بَیَّنَّا لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
అల్లాహ్ భూమిని అది ఎండిపోయిన తరువాత దాన్ని మొలకెత్తించి జీవింపజేస్తాడని మీరు తెలుసుకోండి. ఓ ప్రజలారా వాస్తవానికి మేము అల్లాహ్ సామర్ధ్యమును మరియు ఆయన ఏకత్వమును సూచించే ఆధారాలను మరియు ఋజువులను మీరు వాటిని అర్ధం చేసుకుని భూమిని దాని మరణం తరువాత జీవింపజేసిన వాడు మిమ్మల్ని మీ మరణం తరువాత మరల లేపటంపై సామర్ధ్యం కలవాడని మరియు మీ హృదయములను వాటి కఠినమైపోయిన తరువత మృధువుగా చేసే సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీకు స్పష్టపరిచాము.
Tafsiran larabci:
اِنَّ الْمُصَّدِّقِیْنَ وَالْمُصَّدِّقٰتِ وَاَقْرَضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا یُّضٰعَفُ لَهُمْ وَلَهُمْ اَجْرٌ كَرِیْمٌ ۟
నిశ్చయంగా తమ సంపదల నుండి కొంత దాన్ని దానం చేసే పురుషులు మరియు తమ సంపదల నుండి కొంత దాన్ని దానం చేసే స్త్రీలు వారు దాన్ని తమ మనస్సులకు మంచిగా అనిపించిన దాన్ని దాతృత్వాన్ని పదేపదే చాటుకోకుండా మరియు (గ్రహీతల మనస్సులను) నొప్పించకుండా ధానం చేస్తారు. వారి కర్మల పుణ్యము వారి కొరకు రెట్టింపు చేయబడును ఏ విధంగానంటే ఒక పుణ్యము పది వంతుల నుండి ఏడు వందల వంతులకు ఇంకా అధిక వంతుల వరకు అధికం చేయబడును. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద ఆదరణీయమైన ప్రతిఫలముండును అది స్వర్గము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• امتنان الله على المؤمنين بإعطائهم نورًا يسعى أمامهم وعن أيمانهم.
విశ్వాసపరులపై అల్లాహ్ యొక్క ఉపకారము వారికి వారి ముందు మరియు వారి కుడి ప్రక్క పరిగెత్తే కాంతిని ప్రసాదించటం.

• المعاصي والنفاق سبب للظلمة والهلاك يوم القيامة.
పాప కార్యములు మరియు కపటత్వము ప్రళయదినమున చీకటికి మరియు వినాశనమునకు కారణము.

• التربُّص بالمؤمنين والشك في البعث، والانخداع بالأماني، والاغترار بالشيطان: من صفات المنافقين.
విశ్వాసపరుల విషయంలో (శిక్ష విషయంలో) వేచి ఉండటం,మరణాంతరం లేపబడే విషయంలో సందేహపడటం,కోరికలతో మోసపోవటం మరియు షైతాను ద్వారా మోసపోవటం కపట విశ్వాసుల లక్షణాలు.

• خطر الغفلة المؤدية لقسوة القلوب.
హృదయముల కాఠిన్యమునకు దారి తీసే నిర్లక్ష్యము యొక్క ప్రమాదము.

 
Fassarar Ma'anoni Sura: Alhadid
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa