Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Al'anfal   Aya:
فَلَمْ تَقْتُلُوْهُمْ وَلٰكِنَّ اللّٰهَ قَتَلَهُمْ ۪— وَمَا رَمَیْتَ اِذْ رَمَیْتَ وَلٰكِنَّ اللّٰهَ رَمٰی ۚ— وَلِیُبْلِیَ الْمُؤْمِنِیْنَ مِنْهُ بَلَآءً حَسَنًا ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా మీరు బదర్ యుధ్ధం రోజున ముష్రికులను మీ శక్తితో,మీ బలంతో హతమార్చ లేదు. కాని అల్లాహ్ ఈ విషయంలో మీకు సహకరించాడు. ఓ ప్రవక్తా మీరు వారిపై విసిరినప్పుడు మీరు విసరలేదు. కాని అల్లాహ్ మీ విసరటంను వారికి చేరవేసినప్పుడు అల్లాహ్ నే వారిపై విసిరాడు. విశ్వాసపరులు సంఖ్యా బలంలో,యుధ్ధ సామగ్రిలో తక్కువగా ఉన్నప్పటికి వారు కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు వారి శతృవులపై విజయమును కలిగించి వారికి అనుగ్రహము ప్రసాదించటం ద్వారా విశ్వాస పరులను పరీక్షించటం కొరకు. నిశ్చయంగా అల్లాహ్ మీ దుఆలను,మీ మాటలను వినే వాడును,మీ ఆచరణలను,అందులో మీకు ఉన్న ప్రయోజనమును తెలుసుకునే వాడును.
Tafsiran larabci:
ذٰلِكُمْ وَاَنَّ اللّٰهَ مُوْهِنُ كَیْدِ الْكٰفِرِیْنَ ۟
ఈ ప్రస్తావించబడినది ముష్రికులను హతమార్చటం,వారిపై విసరటం చివరికి వారు పరాభవం చెంది వెన్ను తిప్పి పారిపోవటం,విశ్వాసపరులకు వారి శతృవులపై విజయము ద్వారా అనుగ్రహించటం ఇది అల్లాహ్ వద్ద నుండి జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులు ఇస్లామ్ గురించి రచించిన వ్యూహాలను బలహీనపరిచేవాడు.
Tafsiran larabci:
اِنْ تَسْتَفْتِحُوْا فَقَدْ جَآءَكُمُ الْفَتْحُ ۚ— وَاِنْ تَنْتَهُوْا فَهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَاِنْ تَعُوْدُوْا نَعُدْ ۚ— وَلَنْ تُغْنِیَ عَنْكُمْ فِئَتُكُمْ شَیْـًٔا وَّلَوْ كَثُرَتْ ۙ— وَاَنَّ اللّٰهَ مَعَ الْمُؤْمِنِیْنَ ۟۠
ఓ ముష్రికులారా ఒక వేళ మీరు అల్లాహ్ తన శిక్షను,యాతనను హద్దులను మీరే దుర్మార్గులపై కురిపించాలని కోరుకుంటే నిశ్చయంగా అల్లాహ్ మీరు కోరుకున్న దానిని మీపై కురిపించాడు. అయితే మీ కొరకు ఏదైతే శిక్ష అవుతుందో ,దైవభీతి కల వారికి ఏదైతే గుణపాటం అవుతుందో దాన్ని మీపై కురిపించాడు. ఒక వేళ మీరు దాన్ని కోరటంను వదిలివేస్తే అది మీ కొరకు ఎంతో ఉత్తమం. ఒక్కొక్క సారి ఆయన మీకు గడువునిస్తాడు. మీతో ప్రతీకారము తీర్చుకోవటంలో తొందర చేయడు. ఒక వేళ మీరు దానిని కోరటం వైపునకు,విశ్వాసపరులతో పోరాటం వైపునకు మరలితే మేము మీపై శిక్షను కురిపించటం ద్వారా,విశ్వాసపరులకు సహాయం ద్వారా మరలుతాము. మీ జనసమూహం,మీ సహాయకులు ఒక వేళ వారి సంఖ్యాబలం,యుధ్ధ సామగ్రి ఎక్కువగా ఉండి విశ్వాసపరులు తక్కువగా ఉండటంతోపాటు మీకు దేనికి పనికి రారు. నిశ్చయంగా అల్లాహ్ సహకారము ద్వారా,మద్దతు ద్వారా విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు. అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో అతడిని ఓడించే వాడు ఎవడూ ఉండడు.
Tafsiran larabci:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَوَلَّوْا عَنْهُ وَاَنْتُمْ تَسْمَعُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు విధేయత చూపండి,అతని ప్రవక్తపై విధేయత చూపండి. ఆయన ఆదేశించిన వాటిని వ్యతిరేకిస్తూ,ఆయన వారించిన వాటిని చేస్తూ అల్లాహ్ ఆయతులు మీపై చదవబడుతున్నప్పుడు వింటూ కూడా ఆయన నుండి విముఖత చూపకండి.
Tafsiran larabci:
وَلَا تَكُوْنُوْا كَالَّذِیْنَ قَالُوْا سَمِعْنَا وَهُمْ لَا یَسْمَعُوْنَ ۟ۚ
ఓ విశ్వాసపరులారా మీరు ఆ కపటులు,ముష్రికుల వలె అయిపోకండి ఎవరిపైనైతే అల్లాహ్ ఆయతులు పఠించబడినప్పుడు వారు ఇలా అన్నారు : మాపై పఠించబడిన ఖుర్ఆన్ ఆయతులను మేము మా చెవులతో విన్నాము,వాస్తవానికి వారు విన్న వాటి ద్వారా ప్రయోజనం చెందటానికి వారు యోచన చేసేవిధంగా .హితబోధన గ్రహించే విధంగా వినలేదు.
Tafsiran larabci:
اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الصُّمُّ الْبُكْمُ الَّذِیْنَ لَا یَعْقِلُوْنَ ۟
నిశ్చయంగా సృష్టితాల్లోంచి నేలపై పాకేవి అల్లాహ్ వద్ద అత్యంత చెడ్డవైనవి వారు సత్యాన్ని స్వీకరించే ఉద్దేశముతో వినని చెవిటివారు,మాట్లాడని మూగవారు. వారందరు అల్లాహ్ నుండి ఆయన ఆదేశాలను,ఆయన వారించిన వాటిని గ్రహించలేదు.
Tafsiran larabci:
وَلَوْ عَلِمَ اللّٰهُ فِیْهِمْ خَیْرًا لَّاَسْمَعَهُمْ ؕ— وَلَوْ اَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ ۟
ఒకవేళ అల్లాహ్ ఈ తిరస్కరించే ముష్రికుల్లో ఏ కాస్త మంచితనం ఉందని గ్రహించినా వారికి వారు ప్రయోజనం చెందే వినికిడిని ప్రసాదించేవాడు. మరియు వారు ఆయన వద్ద ఉన్న వాదనలను,ఋజువులను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించేవారు. కాని ఆయన వారిలో ఎటువంటి మంచితనము లేదని గ్రహించాడు. ఒక వేళ ఆయన సుబహానహు వతఆలా వారికి వినే శక్తిని బాధ్యతగా,ప్రశంసగా ప్రసాదిస్తే వారు వ్యతిరేకిస్తూ విశ్వాసము నుండి మరలిపోతారు. మరియు వారు విముఖత చూపుతారు.
Tafsiran larabci:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اسْتَجِیْبُوْا لِلّٰهِ وَلِلرَّسُوْلِ اِذَا دَعَاكُمْ لِمَا یُحْیِیْكُمْ ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَحُوْلُ بَیْنَ الْمَرْءِ وَقَلْبِهٖ وَاَنَّهٗۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మీకు జీవనం ఉన్న సత్యం వైపునకు పిలిచినప్పుడు వారిరువురు ఆదేశించిన వాటిని పాటించి వారిరువురు వారించిన వాటికి దూరంగా ఉండి వారిని స్పందించండి. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువుపై సామర్ధ్యము కలవాడని నమ్మకమును కలిగి ఉండండి. అయితే మీరు సత్యాన్ని తిరస్కరించిన తరువాత దానిని మీరు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మీకు,మీరు సత్యాన్ని పాటించటమునకు మధ్య ఉంటాడు. అయితే మీరు చొరవతీసుకోండి. మరియు మీరు ప్రళయదినాన ఒక్కడైన అల్లాహ్ వైపునకే సమీకరించబడుతారని,మీరు ఇహలోకంలో చేసుకున్న ఆచరణల పరంగా మీకు ఆయన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని నమ్మకమును కలిగి ఉండండి.
Tafsiran larabci:
وَاتَّقُوْا فِتْنَةً لَّا تُصِیْبَنَّ الَّذِیْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
ఓ విశ్వాసపరులారా మీరు ఆ శిక్ష నుండి జాగ్రత్తపడండి అది కేవలం అవిధేయుడికి ఒక్కడికే సంభవించదు,కాని అది అతడికి,ఇతరులకి సంభవిస్తుంది. మరియు ఇది దుర్మార్గము బహిర్గతమైనప్పుడు జరుగుతుంది. అయితే అది మార్చబడదు. మరియు అల్లాహ్ తనపై అవిధేయత చూపే వాడిని కఠినంగా శిక్షించే వాడని మీరు నమ్మకమును కలిగి ఉండండి. ఆయనపై అవిధేయతకు పాల్పడటం నుండి జాగ్రత్తపడండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من كان الله معه فهو المنصور وإن كان ضعيفًا قليلًا عدده، وهذه المعية تكون بحسب ما قام به المؤمنون من أعمال الإيمان.
అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో ఒకవేళ అతడు సంఖ్యా బలంగా తక్కువగా ఉండి బలహీనుడైనా కూడా అతడు సహాయమును పొందే వాడవుతాడు. ఈ తోడు విశ్వాసపరులు విశ్వాస ఆచరణల్లో నుంచి ఆచరించే వాటికి తగ్గట్టుగా ఉంటుంది.

• المؤمن مطالب بالأخذ بالأسباب المادية، والقيام بالتكليف الذي كلفه الله، ثم يتوكل على الله، ويفوض الأمر إليه، أما تحقيق النتائج والأهداف فهو متروك لله عز وجل.
విశ్వాసపరుడు భౌతిక కారకాలను ఎంచుకుని,అల్లాహ్ అతనికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి ఆ తరువాత అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండాలి. మరియు ఆ విషయాన్ని ఆయనకే అప్పగించాలి. ఫలితాలను ,లక్ష్యాలను సాధించటం అన్నది అల్లాహ్ కే వశం.

• في الآيات دليل على أن الله تعالى لا يمنع الإيمان والخير إلا عمَّن لا خير فيه، وهو الذي لا يزكو لديه هذا الإيمان ولا يثمر عنده.
మహోన్నతుడైన అల్లాహ్ విశ్వాసమును,మేలును ఎవరిలోనైతే మంచి ఉండదో వారి నుండి ఆపివేస్తాడని.అతని వద్ద విశ్వాసము పెరగదు.మరియు అతని వద్ద విశ్వాసము ఫలించదని ఆయతుల్లో ఆధారమున్నది.

• على العبد أن يكثر من الدعاء: يا مقلب القلوب ثبِّت قلبي على دينك، يا مُصرِّف القلوب اصرف قلبي إلى طاعتك.
దాసుడు దుఆలలో ఈ దుఆను ఎక్కువగా చేయాలి : "యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక,యా ముసర్రిఫల్ ఖులూబ్ ఇస్రిఫ్ ఖల్బీ ఇలా తాఅతిక".(ఓ హృదయాలను త్రిప్పేవాడా నా హృదయమును నీ ధర్మముపై స్థిరముగా ఉండేటట్లు చేయి,ఓ హృదయాలను మరల్చేవాడా నా హృదయమును నీ విధేయత వైపునకు మరల్చు).

• أَمَرَ الله المؤمنين ألا يُقِرُّوا المنكر بين أظهرهم فيعُمَّهم العذاب.
విశ్వాసపరులు తమ ముందట చెడును అంగీకరించవద్దని ఆదేశించాడు. అలా అయితే శిక్ష వారిపై సాధారణమైపోతుంది.

 
Fassarar Ma'anoni Sura: Al'anfal
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa