Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߦߣߎߛߊ߫   ߟߝߊߙߌ ߘߏ߫:
وَمِنْهُمْ مَّنْ یَّنْظُرُ اِلَیْكَ ؕ— اَفَاَنْتَ تَهْدِی الْعُمْیَ وَلَوْ كَانُوْا لَا یُبْصِرُوْنَ ۟
మరియు ఓ ప్రవక్తా ముష్రికుల్లోంచి మీ వైపునకు అంతర్ దృష్టితో కాకుండా బాహ్య దృష్టితో చూసేవారు ఉన్నారు.అయితే ఏమి మీరు తమ దృష్టిని కోల్పోయిన వారికి చూపించగలరా ?.నిశ్చయంగా మీరు దాన్ని చేయలేరు.మరియు అలాగే మీరు అంతర్ దృష్టిని కోల్పోయిన వారికి సన్మార్గం చూపలేరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اِنَّ اللّٰهَ لَا یَظْلِمُ النَّاسَ شَیْـًٔا وَّلٰكِنَّ النَّاسَ اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకి అన్యాయం చేయటం నుండి పరిశుద్దుడు.ఆయన వారికి అణుమాత్రం కూడా అన్యాయం చేయడు.కాని వారందరు అసత్యానికి మద్దతివ్వటం వలన,అహంకారము వలన,మొండితనము వలన తమ స్వయం నిర్ణయంతో వినాశనమునకు గురై తమకే అన్యాయం చేసుకుంటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَوْمَ یَحْشُرُهُمْ كَاَنْ لَّمْ یَلْبَثُوْۤا اِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ یَتَعَارَفُوْنَ بَیْنَهُمْ ؕ— قَدْ خَسِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِ وَمَا كَانُوْا مُهْتَدِیْنَ ۟
అల్లాహ్ ప్రళయదినాన ప్రజలందరిని వారి లెక్క తీసుకోవటం కొరకు సమీకరించిన రోజున వారు తమ ఇహలోక జీవితంలో,తమ సమాధి జీవితములో ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని భావిస్తారు.వారు ఒకరినొకరు గుర్తుపడతారు.ఆ తరువాత వారు ప్రళయదిన భయానక స్థితులను చూసినప్పడు దాని తీవ్రత వలన వారి పరిచయం అంతమైపోతుంది.ప్రళయ దినాన తమ ప్రభువును కలుసుకోవటమును తిరస్కరించిన వారు నష్టమును చవిచూశారు.మరియు వారు నష్టము నుండి పరిరక్షించబడే వరకు ఇహలోకములో పునరుత్థాన దినము పై విశ్వాసమును కనబరచరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللّٰهُ شَهِیْدٌ عَلٰی مَا یَفْعَلُوْنَ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మేము వారికి వాగ్దానం చేసిన శిక్షల్లోంచి కొన్నింటిని మీ మరణం కన్న మునుపు మీకు మేము చూపించినా లేదా వాటికన్న ముందు మేము మిమ్మల్ని మరణింపజేసినా ఈ రెండు స్థితుల్లోను ప్రళయదినాన మన వైపు వారి మరలటం ఉంటుంది.ఆ తరువాత అల్లాహ్ వారు చేసే కర్మలను తెలుసుకుంటాడు.వాటిలోంచి ఏదీను ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే వారి కర్మలపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَلِكُلِّ اُمَّةٍ رَّسُوْلٌ ۚ— فَاِذَا جَآءَ رَسُوْلُهُمْ قُضِیَ بَیْنَهُمْ بِالْقِسْطِ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
గతించిన జాతివారిలోంచి ప్రతీ జాతి కొరకు ఒక ప్రవక్త వారి వైపునకు పంపించబడ్డాడు.అతనికి ఏ సందేశాలను చేరవేయమని ఆదేశమైనదో అతను వాటిని వారికి చేరవేసినప్పుడు వారు అతనిని తిరస్కరించారు.వారికి అతనికి మధ్య న్యాయపూరితంగా తీర్పునివ్వబడింది.అయితే అల్లాహ్ అతన్ని తన అనుగ్రహంతో విముక్తిని కలిగించాడు.మరియు వారిని న్యాయంగా తుదిముట్టించాడు.వారి కర్మల ప్రతిఫలం విషయంలో వారికి ఏమాత్రం అన్యాయం చేయబడదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఈ సత్యతిరస్కారులందరు వ్యతిరేకిస్తూ,చాలెంజ్ చేస్తూ ఇలా పలుకుతారు : ఒకవేళ మీరు వాగ్ధానం చేస్తున్న విషయంలో మీరు నీతిమంతులేనైతే మీరు మాకు వాగ్దానం చేసిన శిక్ష ఎప్పుడు ?.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِیْ ضَرًّا وَّلَا نَفْعًا اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ— لِكُلِّ اُمَّةٍ اَجَلٌ ؕ— اِذَا جَآءَ اَجَلُهُمْ فَلَا یَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّلَا یَسْتَقْدِمُوْنَ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నేను నా స్వయం కొరకు నష్టం కలిగించుకోవటానికి లేదా దాన్ని దాని నుండి దూరం చేయటానికి మరియు దానికి (మనస్సునకు) నేను ఎటువంటి లాభం చేయటమునకు గాని శక్తి లేదు అటువంటప్పుడు నేను ఎలా ఇతరులకు ప్రయోజనం చేయగలను లేదా హాని చేయగలను ?.కాని దాన్ని అల్లాహ్ తలచుకుంటే చేయగలడు.అయితే నేను ఎలా దాని ఆగోచరమును తెలుసుకోగలను .జాతుల్లోంచి ప్రతి జాతికి వినాశనము గురించి దాన్ని హెచ్చరించాడు దాని వినాశనమునకు సమయును నిర్ధారించాడు.అది అల్లాహ్ కి తప్ప ఇంకొకరికి తెలియదు.దాని వినాశన సమయం ఆసన్నమైతే దాని నుండి కొంచం సమయం కూడా వెనుకకు జరుగదు,ముందుకు నెట్టబడదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ اَرَءَیْتُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُهٗ بَیَاتًا اَوْ نَهَارًا مَّاذَا یَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُوْنَ ۟
ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేసే వీరందరితో ఇలా పలకండి : మీరు నాకు తెలుపండి అల్లాహ్ శిక్ష ఒక వేళ మీ వద్దకు రాత్రి లేదా పగటి యొక్క ఏదైన సమయంలో వస్తే (మీరు ఏమి చేయగలరు) ఈ శిక్ష నుండి మీరు దేని గురించి తొందర చేస్తున్నారు ?.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَثُمَّ اِذَا مَا وَقَعَ اٰمَنْتُمْ بِهٖ ؕ— آٰلْـٰٔنَ وَقَدْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ ۟
ఏమీ మీతో వాగ్దానం చేయబడిన శిక్ష మీపై వచ్చిపడిన తరువాత మీరు విశ్వసిస్తారా ? ఆ సమయంలో ఏ వ్యక్తికి అతని విశ్వాసం అతను ముందు నుంచి విశ్వసించనందు వలన ప్రయోజనం చేకూర్చదు.ఏమీ మీరు ఇప్పుడు విశ్వాసమును కనబరుస్తారా ?, వాస్తవానికి మీరు ముందు నుంచే శిక్షను తిరస్కరించే వైనముతో దాన్ని తొందరపడేవారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ثُمَّ قِیْلَ لِلَّذِیْنَ ظَلَمُوْا ذُوْقُوْا عَذَابَ الْخُلْدِ ۚ— هَلْ تُجْزَوْنَ اِلَّا بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟
వారిని శిక్షలో పడవేసి,వారు దాని నుండి బయటకు రావటానకి కోరిన తరువాత వారితో ఇలా అనబడుతుంది : పరలోకములో మీరు శాస్వతమైన శిక్షను అనుభవించండి.మీరు చేసుకున్న అవిశ్వాస,అవిధేయ కార్యాల ప్రతిఫలం తప్ప వేరేది మీరు ఇవ్వబడ్డారా ?!.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَسْتَنْۢبِـُٔوْنَكَ اَحَقٌّ هُوَ ؔؕ— قُلْ اِیْ وَرَبِّیْۤ اِنَّهٗ لَحَقٌّ ؔؕ— وَمَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ ۟۠
ఓ ప్రవక్తా మేము వాగ్దానం చేయబడిన ఈ శిక్ష సత్యమా ? అని ముష్రికులు మీతో అడుగుతారు.అయితే మీరు వారికి ఇలా సమాధానం ఇవ్వండి : అవును,అల్లాహ్ సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము.మరియు మీరు దాని నుండి విముక్తి పొందలేరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الإنسان هو الذي يورد نفسه موارد الهلاك، فالله مُنَزَّه عن الظلم.
మానవుడు అతడే తన స్వనిర్ణయంతో తనను వినాశనములో పడవేసుకుంటాడు. అల్లాహ్ మాత్రం అన్యాయము నుండి పరిశుద్ధుడు.

• مهمة الرسول هي التبليغ للمرسل إليهم، والله يتولى حسابهم وعقابهم بحكمته، فقد يعجله في حياة الرسول أو يؤخره بعد وفاته.
సందేశాలను చేరవేయటం ప్రవక్త బాధ్యత. మరియు అల్లాహ్ తన వివేకముతో వారి లెక్క తీసుకునే,వారిని శిక్షించే బాధ్యత వహిస్తాడు. కాబట్టి ఆయన ప్రవక్త జీవితంలోనే దాన్ని తొందరగా చేస్తాడు లేదా అతని మరణం తరువాత కొరకు దాన్ని ఆలస్యం చేస్తాడు.

• النفع والضر بيد الله عز وجل، فلا أحد من الخلق يملك لنفسه أو لغيره ضرًّا ولا نفعًا.
లాభము,నష్టము మహోన్నతుడు,ఆధిక్యుడైన అల్లాహ్ చేతిలో ఉన్నవి.ఆయన సృష్టితాల్లోంచి ఎవరికీ తన స్వయం కొరకు లేదా ఇతరుల కొరకు లాభమును కలిగించే,నష్టమును కలిగించే అధికారము లేదు.

• لا ينفع الإيمان صاحبه عند معاينة الموت.
తన మరణాన్ని వీక్షించినప్పుడు విశ్వాసమును తీసుకుని రావటం అతనికి ప్రయోజనం చేయదు.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߦߣߎߛߊ߫
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲