Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߦߛߎߝߎ߫   ߟߝߊߙߌ ߘߏ߫:
فَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ جَعَلَ السِّقَایَةَ فِیْ رَحْلِ اَخِیْهِ ثُمَّ اَذَّنَ مُؤَذِّنٌ اَیَّتُهَا الْعِیْرُ اِنَّكُمْ لَسٰرِقُوْنَ ۟
యూసుఫ్ తన సోదరుల ఒంటెలపై ఆహారమును ఎత్తిపెట్టమని తన సేవకులను ఆదేశించినప్పుడు ఆహారమును కోరుతూ వచ్చిన వారి కొరకు ఆహారమును కొలిచి ఇచ్చే రాజుగారి పాత్రను తన సోదరుడిని తనతో పాటు అట్టిపెట్టి ఉంచుకోవటానికి వారికి తెలియకుండా తన సొంత సోదరుని సామానులో పెట్టేశాడు. వారు తమ ఇంటి వారి వద్దకు మరలతున్నప్పుడు వారి వెనుక నుండే ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు : ఓ ఒంటెలపై ఆహారమును ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవారా నిశ్చయంగా మీరు దొంగలు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا وَاَقْبَلُوْا عَلَیْهِمْ مَّاذَا تَفْقِدُوْنَ ۟
దాని వెంటనే యూసుఫ్ సోదరులు ప్రకటించిన వ్యక్తి మరియు అతని తోపాటు ఉన్న అతని సహచరుల వైపు తిరిగి మీ వద్ద నుండి ఏ వస్తువు పోయింది చివరికి మీరు మాపై దొంగతనము నింద వేస్తున్నారు ? అని అన్నారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَنْ جَآءَ بِهٖ حِمْلُ بَعِیْرٍ وَّاَنَا بِهٖ زَعِیْمٌ ۟
ప్రకటించేవాడు మరియు అతనితోపాటు అతని సహచరులు యూసుఫ్ అలైహిస్సలాం సోదరునితో ఇలా పలికారు : మా వద్ద నుండి రాజు గారి ఆ పాత్ర దేనితోనైతే ఆయన కొలిచే వారో పోయినది.మరియు తనిఖీ చేయక ముందు రాజు గారి పాత్రను తీసుకుని వచ్చిన వారి కొరకు బహుమానం ఉన్నది.మరియు అది ఒక ఒంటె మోసే బరువంత.మరియు నేను దానికి అతని కొరకు పూచీదారునిగా ఉన్నాను.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا تَاللّٰهِ لَقَدْ عَلِمْتُمْ مَّا جِئْنَا لِنُفْسِدَ فِی الْاَرْضِ وَمَا كُنَّا سٰرِقِیْنَ ۟
యూసుఫ్ సోదరులు వారితో ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా మా చిత్తశుద్ధి మరియు మా నిర్దోషత్వము (అమాయకత్వము) మీకు తెలుసు ఎలాగంటే మీరు దాన్ని మా పరిస్థితుల నుండి గమనించారు.మరియు నిశ్చయంగా మేము మిసర్ ప్రాంతములో అరాచకమును సృష్టించటానికి రాలేదు. మరియు మేము మా జీవితములో దొంగలము కాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا فَمَا جَزَآؤُهٗۤ اِنْ كُنْتُمْ كٰذِبِیْنَ ۟
ప్రకటించేవాడు మరియు అతని సహచరులు ఇలా పలికారు : ఒక వేళ దొంగతనము నుండి నిర్దోషత్వ మీ వాదనలో మీరు అబధ్ధపరులైతే మీ వద్ద దొంగతనము చేసిన వారికి శిక్ష ఏమిటి ?.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا جَزَآؤُهٗ مَنْ وُّجِدَ فِیْ رَحْلِهٖ فَهُوَ جَزَآؤُهٗ ؕ— كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟
యూసుఫ్ సోదరులు వారికి ఇలా సమాధానమిచ్చారు : మా వద్ద దొంగతనం చేసిన వారికి శిక్ష ఏమిటంటే ఎవరి సామానులో దొంగలించబడిన వస్తువు దొరుకుతుందో అతన్ని ఎవరి వస్తువు దొంగలించబడినదో వారికి బానిసగా అప్పజెప్పాలి వారు అతన్ని బానిస చేసుకుంటారు. బానిసగా చేయటం ద్వారా ఈ విధంగా మేము దొంగతనం చేసిన వారికి ఈ విధమైన శిక్షను ప్రతిఫలంగా ప్రసాధిస్తాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
فَبَدَاَ بِاَوْعِیَتِهِمْ قَبْلَ وِعَآءِ اَخِیْهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِّعَآءِ اَخِیْهِ ؕ— كَذٰلِكَ كِدْنَا لِیُوْسُفَ ؕ— مَا كَانَ لِیَاْخُذَ اَخَاهُ فِیْ دِیْنِ الْمَلِكِ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ— وَفَوْقَ كُلِّ ذِیْ عِلْمٍ عَلِیْمٌ ۟
అయితే వారు వారి సామానును తనిఖీ చేయటానికి వారిని యూసుఫ్ వద్దకు తరలించారు.అప్పుడు ఆయన పధకమును బహిర్గతం కాకుండా ఉండటానికి తన సొంత సోదరుని సామానును వెతికే ముందు తన సవతి సోదరుల సామానును వెతకటమును మొదలు పెట్టారు. ఆ తరువాత తన సొంత సోదరుని సామానును వెతికారు.మరియు రాజు కొలిచే పాత్రను దాని నుండి తీశారు.అతని సోదరుని సామానులో కొలిచే పాత్రను పెట్టే ఉపాయం ద్వారా యూసుఫ్ కొరకు మేము పధకం వేసినట్లే అతని సోదరులు దొంగను బానిసగా చేసుకునే తమ దేశ శిక్షను తీసుకుని రావటం ద్వారా అతని కొరకు ఇంకో పధకం వేశాము.ఈ విషయం సాధ్యం కాదు ఒక వేళ దొంగతనం చేసిన వారి కొరకు రాజు శిక్ష అయిన కొట్టడం మరియు జరిమాన విధించటం అమలు చేస్తే .కాని అల్లాహ్ ఇంకో ఉపాయం తలిస్తే అతడు దాన్ని చేసే సామర్ధ్యం కలవాడు.మా దాసుల్లోంచి మేము ఎవరిని కోరుకుంటే వారి స్థానములను పెంచగలము.ఏ విధంగానైతే మేము యూసుఫ్ స్థానమును పెంచామో.ప్రతీ జ్ఞానము కలవాడి పైన అతని కంటే ఎక్కువ జ్ఞానం కలవాడు ఉంటాడు. అందరి జ్ఞానముపై అన్ని విషయాల జ్ఞానము కల అల్లాహ్ జ్ఞానము ఉన్నది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْۤا اِنْ یَّسْرِقْ فَقَدْ سَرَقَ اَخٌ لَّهٗ مِنْ قَبْلُ ۚ— فَاَسَرَّهَا یُوْسُفُ فِیْ نَفْسِهٖ وَلَمْ یُبْدِهَا لَهُمْ ۚ— قَالَ اَنْتُمْ شَرٌّ مَّكَانًا ۚ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا تَصِفُوْنَ ۟
యూసుఫ్ సోదరులు ఇలా పలికారు : ఒక వేళ ఇతను దొంగతనం చేశాడంటే ఆశ్చర్యం కాదు.ఇతని దొంగతనం కన్న ముందు ఇతని సొంత సోదరుడు కూడా దొంగతనం చేసి ఉన్నాడు.అంటే యూసుఫ్ అలైహిస్సలాం.అయితే యూసుఫ్ వారి ఈ మాటల వలన కలిగిన తన బాధను దాచిపెట్టారు,దాన్ని వారి ముందు బహిర్గతం చేయలేదు. తన మనసులో ఇలా అనుకున్నారు : మీ నుండి ముందు జరిగిన అసూయ,కీడు కలిగించటం ఆ చెడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షంగా కనబడుతుంది.మరియు మీ నుండి బహిర్గతమైన ఈ కల్పితము అల్లాహ్ కి బాగా తెలుసు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ اِنَّ لَهٗۤ اَبًا شَیْخًا كَبِیْرًا فَخُذْ اَحَدَنَا مَكَانَهٗ ۚ— اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ ۟
యూసుఫ్ సోదరులు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ అజీజు నిశ్చయంగా అతనికి వయసు మీరిన వృద్దుడైన తండ్రి కలడు ఆయన అతడిని ఎక్కువగా ఇష్టపడుతాడు.అయితే నీవు అతనికి బదులుగా మనలో నుంచి ఒకరిని అట్టిపెట్టుకో.నిశ్చయంగా మా విషయంలో,ఇతరుల విషయంలో నిన్ను మేము ఉపకారము చేసేవారిలోంచి భావిస్తున్నాము.అయితే నీవు మాకు అదే ఉపకారము చేయి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• جواز الحيلة التي يُتَوصَّل بها لإحقاق الحق، بشرط عدم الإضرار بالغير.
ఇతరులకు హాని కలిగించని షరతుతో సత్యాన్ని దృవీకరించటానికి పధకమును రచించటం ధర్మసమ్మతము.

• يجوز لصاحب الضالة أو الحاجة الضائعة رصد جُعْل «مكافأة» مع تعيين قدره وصفته لمن عاونه على ردها.
వస్తువును పోగొట్టుకున్నా లేదా అవసరమైన వస్తువును కోల్పోయిన వ్యక్తి కొరకు దాన్ని తిరిగి అప్పగించిన వ్యక్తికి పరిమాణమును, గుణమును తెలిపి ప్రతిఫలము నిర్ణయించటం ధర్మసమ్మతము.

• التغافل عن الأذى والإسرار به في النفس من محاسن الأخلاق.
బాధలను పట్టించుకోకుండా వాటిని మనస్సులో దాచుకోవటం మంచి గుణాల్లోంచిది.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߦߛߎߝߎ߫
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲