Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi * - Mealler fihristi


Anlam tercümesi Sure: Sûratu'l-Hicr   Ayet:

అల్-హిజ్ర్

Surenin hedefleri:
توعد المستهزئين بالقرآن، والوعد بحفظه تأييدًا للنبي وتثبيتًا له.
ఖుర్ఆన్ ను అపహాస్యం చేసేవారిని హెచ్చరించటం మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు మద్దతుగా మరియు ఆయనకు స్థిరపరచటం కొరకు ఖుర్ఆన్ పరిరక్షణ వాగ్దానం చేయటం.

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ وَقُرْاٰنٍ مُّبِیْنٍ ۟
{అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. ఉన్నతమైన స్థానము కల ఈ ఆయతులు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడ్డాయి అనటము పై నిరూపిస్తున్నాయి. ఇవి ఏకేశ్వరోపాసన,ధర్మ శాసనాలను స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.
Arapça tefsirler:
رُبَمَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ كَانُوْا مُسْلِمِیْنَ ۟
అవిశ్వాసపరులు వారికి విషయం స్పష్టమైనప్పుడే,ఇహలోకములో వారు పాల్పడిన అవిశ్వాసము అసత్యమని తేటతెల్లమైనప్పుడే వారు ముస్లిములైపోతే బాగుండేదని ప్రళయదినాన ఆశిస్తారు.
Arapça tefsirler:
ذَرْهُمْ یَاْكُلُوْا وَیَتَمَتَّعُوْا وَیُلْهِهِمُ الْاَمَلُ فَسَوْفَ یَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరిని పశువుల్లాగా తింటూఉండగా మరియు అంతమైపోయే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తుండగా వదిలివేయండి. మరియు సుదీర్ఝ ఆశలు వారిని విశ్వాసము నుండి సత్కర్మల నుండి దూరం చేస్తాయి. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో వచ్చినప్పుడు వారు ఉన్నది నష్టం లోనే అని తెలుసుకుంటారు.
Arapça tefsirler:
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُوْمٌ ۟
మరియు మేము దుర్మార్గులైన బస్తీల్లోంచి ఏదైన బస్తీ పై వినాశనమును దించితే దాని కొరకు నిర్ణీత గడువు అల్లాహ్ జ్ఞానంలో ఉంటుంది. అది దాని నుండి ముందూ జరగదు వెనుకకు నెట్టబడదు.
Arapça tefsirler:
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟
జాతుల వారిలోంచి ఏ జాతిపై దాని వినాశనము దాని గడువు సమయం రాక ముందు రాదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు దాని నుండి వినాశనము వెనుకకు నెట్టడం జరగదు. అయితే దుర్మార్గులు అల్లాహ్ వారికి ఇచ్చిన గడువుతో మోసపోకూడదు.
Arapça tefsirler:
وَقَالُوْا یٰۤاَیُّهَا الَّذِیْ نُزِّلَ عَلَیْهِ الذِّكْرُ اِنَّكَ لَمَجْنُوْنٌ ۟ؕ
మక్కా వాసుల్లోంచి అవిశ్వాసపరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికారు : ఓ తనపై ఖుర్ఆన్ అవతరింపబడినది అని వాదించేవాడా నిశ్చయంగా నీవు నీ ఈ వాదనలో పిచ్చాళ్ళ మరలే లాగా మరలుతున్న పిచ్చివాడువు.
Arapça tefsirler:
لَوْ مَا تَاْتِیْنَا بِالْمَلٰٓىِٕكَةِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
నీవు సత్యవంతుల్లోంచి అయితే నీవు పంపించబడ్డ సందేశహరుడని మరియు మాపై శిక్ష అవతరిస్తుందని నీ కొరకు సాక్ష్యం పలికే దైవదూతలను మా వద్దకు ఎందుకని తీసుకునిరావు.
Arapça tefsirler:
مَا نُنَزِّلُ الْمَلٰٓىِٕكَةَ اِلَّا بِالْحَقِّ وَمَا كَانُوْۤا اِذًا مُّنْظَرِیْنَ ۟
అల్లాహ్ ఎవరైతే దైవదూతలు రావాలని ఆయనకు సూచించారో వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : శిక్ష ద్వారా మిమ్మల్ని వినాశనమునకు గురి చేసే సమయం ఆసన్నమయినప్పుడు జ్ఞానం ద్వారా అవసరమయ్యే దాని ప్రకారం తప్ప మేము దైవదూతలను దించము. మేము దైవదూతలను తీసుకుని వచ్చినప్పుడు వారు విశ్వసించకుండా ఉంటే వారు గడువు ఇవ్వబడిన వారిలోంచి అవ్వరు. అంతే కాక వారు శీఘ్రంగా శిక్షకు గురి అవుతారు.
Arapça tefsirler:
اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟
నిశ్చయంగా మేమే ఈ ఖుర్ఆన్ ను ప్రజల కొరకు హితబోధనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై అవతరింపజేశాము. మరియు మేమే ఖుర్ఆన్ ను హెచ్చు,తగ్గులు మరియు మార్పు,చేర్పుల నుండి పరిరక్షించే వాళ్ళము.
Arapça tefsirler:
وَلَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ شِیَعِ الْاَوَّلِیْنَ ۟
మరియు ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మీకన్న ముందు పూర్వ అవిశ్వాసపరులైన వర్గాల్లో ప్రవక్తలను పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు. అయితే మీ జాతి వారు మీకు తిరస్కరించటంలో ప్రవక్తల్లోంచి మీరు కొత్త కాదు.
Arapça tefsirler:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
పూర్వ అవిశ్వాసపరుల వర్గాల వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని తిరస్కరించారు. మరియు వారు అతన్ని పరిహసించారు.
Arapça tefsirler:
كَذٰلِكَ نَسْلُكُهٗ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ۙ
ఈ జాతుల వారి హృదయముల్లో మేము తిరస్కారమును ప్రవేశపెట్టినట్లే దాన్ని అలాగే మేము మక్కా బహుదైవారాధకుల హృదయాల్లో వారి విముఖత ద్వారా మరియు వారి మొండితనము ద్వారా ప్రవేశపెడతాము.
Arapça tefsirler:
لَا یُؤْمِنُوْنَ بِهٖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْاَوَّلِیْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను వారు విశ్వసించటం లేదు. తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించిన వారిని వినాశనంచేసే విషయంలో అల్లాహ్ సంప్రదాయం జరిగింది. అయితే మిమ్మల్ని తిరస్కరించేవారు గుణపాఠం నేర్చుకోవాలి.
Arapça tefsirler:
وَلَوْ فَتَحْنَا عَلَیْهِمْ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوْا فِیْهِ یَعْرُجُوْنَ ۟ۙ
ఈ తిరస్కారులందరు మొండి పట్టుదల కలిగి ఉంటారు చివరికి ఒక వేళ స్పష్టమైన ఆధారాలతో సత్యము వారి ముందు స్పష్టమైనా అప్పుడు ఒక వేళ మేము వారి కొరకు ఆకాశములో ఒక ద్వారాన్ని తెరిస్తే వారు ఎక్కుతూ పోతూ కూడా
Arapça tefsirler:
لَقَالُوْۤا اِنَّمَا سُكِّرَتْ اَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُوْرُوْنَ ۟۠
వారు నమ్మలేదు.మరియు వారు ఇలా పలికారు : కేవలం మా కళ్ళు చూపు నుండి బంధించబడ్డాయి.అంతే కాదు మేము చూసినది మంత్రజాల ప్రభావము. అప్పుడు మేము మంత్రజాలము చేయబడ్డాము.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• القرآن الكريم جامع بين صفة الكمال في كل شيء، والوضوح والبيان.
పవిత్ర ఖుర్ఆన్ ప్రతీ వస్తువులో పరిపూర్ణతను,స్పష్టతను,ప్రకటనను మిళితము చేస్తుంది.

• يهتم الكفار عادة بالماديات، فتراهم مُنْغَمِسين في الشهوات والأهواء، مغترين بالأماني الزائفة، منشغلين بالدنيا عن الآخرة.
అవిశ్వాసపరులు సాధారణంగా సిద్ధాంతాలను అనుసరిస్తారు. అయితే మీరు వారిని కోరికల్లో,మనోవాంచనల్లో మునిగి ఉండగా,అవాస్తవ ఆకాంక్షలతో మోసపోతుండగా,పరలోకమునకు బదులుగా ఇహలోక విషయాల్లో నిమగ్నమై ఉండగా చూస్తారు.

• هلاك الأمم مُقَدَّر بتاريخ معين، ومقرر في أجل محدد، لا تأخير فيه ولا تقديم، وإن الله لا يَعْجَلُ لعجلة أحد.
జాతుల వినాశనం ఒక నిర్ణీత తేదీలో అంచనా వేయబడింది.మరియు అది ఒక నిర్దిష్ట సమయంలో నిర్ణయించబడుతుంది. అందులో ఎటువంటి ఆలస్యము చేయటము గాని తొందర చేయటము గాని ఉండదు.మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరు తొందరపెట్టినా తొందరపడడు.

• تكفل الله تعالى بحفظ القرآن الكريم من التغيير والتبديل، والزيادة والنقص، إلى يوم القيامة.
మహోన్నతుడైన అల్లాహ్ ఎటువంటి మార్పు,చేర్పులు జరగకుండా మరియు హెచ్చు,తగ్గులు జరగకుండా ప్రళయదినం వరకు పవిత్ర ఖుర్ఆన్ యొక్క పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు.

 
Anlam tercümesi Sure: Sûratu'l-Hicr
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi - Mealler fihristi

Kur'an Araştırmaları Tefsir Merkezi Tarafından Yayınlanmıştır.

Kapat