Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (197) Sure: Sûratu'l-Bakarah
اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ— فَمَنْ فَرَضَ فِیْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَ وَلَا جِدَالَ فِی الْحَجِّ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ یَّعْلَمْهُ اللّٰهُ ؔؕ— وَتَزَوَّدُوْا فَاِنَّ خَیْرَ الزَّادِ التَّقْوٰی ؗ— وَاتَّقُوْنِ یٰۤاُولِی الْاَلْبَابِ ۟
హజ్జ్ మాసములు నిర్ధారితమై ఉన్నాయి.షవ్వాల్ మాసము నుండి మొదలై జిల్ హిజ్జ మాసపు పదవ తారీకున ముగిస్తాయి.ఈ నెలలో ఎవరైతే హజ్జ్ చేయాలని నిర్ణయించుకుంటాడో దాని కొరకు ఇహ్రామ్ కట్టుకుంటాడో అతనిపై సంబోగము,దానికి సంబంధించిన రతి క్రీడలు (ముద్దు పెట్టుకోవటం,వాటేసుకోవటం) నిషేదము.ఆ సమయం,ప్రదేశము గొప్పతనము వలన పాప కార్యము చేసి అల్లాహ్ విధేయత నుండి దూరం అవకూడదని అతని హక్కులో తాకీదు చేయబడింది.కోపాలకి,తగాదాలకి దారితీసే వివాదాలు అతనిపై నిషేదం.మీరు ఏ మంచి కార్యం చేసిన దానిని అల్లాహ్ గుర్తించి దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.హజ్జ్ నిర్వర్తించడం కొరకు మీకు అవసరమైన తినే,త్రాగే వస్తువులను ఏర్పాటు చేసుకుని సహాయమును అర్ధించండి.మీ వ్యవహారాలన్నింటిలో దేని ద్వారానైతే మీరు సహాయమును అర్ధిస్తున్నారో అందులో ఉత్తమమైనది అల్లాహ్ భయభీతి అన్న విషయమును మీరు గుర్తించండి.ఓ సరైన బుద్ధి కలవారా మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నాకు భయపడుతూ ఉండండి.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• يجب على المؤمن التزود في سفر الدنيا وسفر الآخرة، ولذلك ذكر الله أن خير الزاد هو التقوى.
విశ్వాసపరుని పై ఇహలోక ప్రయాణపు,పరలోక ప్రయాణపు సామగ్రిని సమకూర్చుకోవటం తప్పనిసరి,అందుకనే అల్లాహ్ మేలైన సామగ్రి దైవభీతి అని తెలియపరచాడు.

• مشروعية الإكثار من ذكر الله تعالى عند إتمام نسك الحج.
హజ్జ్ కార్యాలు పరిపూర్ణమైనప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా చేయటం చట్టబద్దమైనది.

• اختلاف مقاصد الناس؛ فمنهم من جعل همّه الدنيا، فلا يسأل ربه غيرها، ومنهم من يسأله خير الدنيا والآخرة، وهذا هو الموفَّق.
మనుషుల యొక్క ఉద్దేశాలు వేరువేరు; అయితే వారిలోంచి కొందరు ఇహలోకమే తమ యొక్క ధ్యేయము చేసుకున్నారు,వారు తమ ప్రభువుతో అది కాక వేరేది అర్ధించరు,వారిలోంచి మరి కొందరు ఆయనతో ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.మరియు ఇదే ప్రసాదము.

 
Anlam tercümesi Ayet: (197) Sure: Sûratu'l-Bakarah
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat