Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (255) Sure: Sûratu'l-Bakarah
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— اَلْحَیُّ الْقَیُّوْمُ ۚ۬— لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌ ؕ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— مَنْ ذَا الَّذِیْ یَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖ ؕ— یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ ۚ— وَلَا یُحِیْطُوْنَ بِشَیْءٍ مِّنْ عِلْمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ— وَسِعَ كُرْسِیُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ ۚ— وَلَا یَـُٔوْدُهٗ حِفْظُهُمَا ۚ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟
కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధింప బడటానికి అర్హుడు. కేవలం ఆయన మాత్రమే ఎలాంటి మరణమూ లేదా లోపమూ లేకుండా సంపూర్ణంగా జీవించేవాడు. ఆయన స్వయంగా ఉనికిలో ఉన్నాడు మరియు ఆయనకు తన సృష్టిలోని దేని అవసరమూ / ఎవ్వరి అవసరమూ లేదు. ఆయన ద్వారానే సృష్టి ఉనికిలో ఉన్నది మరియు సృష్టికి ఎల్లప్పుడూ ఆయన అవసరం ఉన్నది. తన జీవితం మరియు ఉనికి యొక్క పరిపూర్ణత కారణంగా ఆయనకు కునుకూ పట్టదు, నిదురా రాదు. భూమ్యాకాశాలను కేవలం ఆయన మాత్రమే నియంత్రిస్తాడు. ఆయన సమ్మతి మరియు అనుమతి లేకుండా, ఎవ్వరూ ఆయన సమక్షంలో సిఫారసు చేయలేరు. పూర్వం ఏమి జరిగిందో మరియు భవిష్యత్తులో ఏమి జరగ బోతుందో ఆయన బాగా ఎరుగును. ఆయన అపారమైన జ్ఞానంలో సృష్టికి ఎలాంటి భాగస్వామ్యముూ లేదు, ఒకవేళ అందులో నుండి ఏదైనా కొంతభాగం వారికి ప్రసాదించ దలిస్తే తప్ప. ఆయన కుర్సీ సువిశాలమైన భూమ్యాకాశాలను ఆవరించి ఉన్నది. భూమ్యాకాశాలను రక్షించడం ఆయనకు ఏ మాత్రం కష్టం కాదు. ఆయన తన స్వభావము మరియు లక్షణాలలో ఉన్నతుడు, తన ఆధిపత్యము మరియు అధికారములలో ఘనుడు.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• أن الله تعالى قد فاضل بين رسله وأنبيائه، بعلمه وحكمته سبحانه.
అల్లాహ్ తన జ్ఞానం మరియు వివేకంతో తన ప్రవక్తలకు మరియు సందేశహరులకు వేర్వేరు స్థానాలు కేటాయించాడు.

• إثبات صفة الكلام لله تعالى على ما يليق بجلاله، وأنه قد كلم بعض رسله كموسى ومحمد عليهما الصلاة والسلام.
అల్లాహ్ కొరకు ఆయన ఔన్నత్యమునకు తగిన విధంగా మాట్లాడే గుణము నిరూపణ. ఆయన నేరుగా కొందరు ప్రవక్తలతో మాట్లాడినాడు, ఉదాహరణకు మూసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం).

• الإيمان والهدى والكفر والضلال كلها بمشيئة الله وتقديره، فله الحكمة البالغة، ولو شاء لهدى الخلق جميعًا.
విశ్వాసం, మార్గదర్శకత్వం, అవిశ్వాసం మరియు సన్మార్గాన్ని విడిచి పెట్టడం మొదలైనవన్నీ అల్లాహ్ యొక్క చిత్తం మరియు ఆజ్ఞలపై ఆధారపడి ఉంటాయి. పరిపూర్ణమైన వివేకం కేవలం ఆయనకే చెందును: ఒకవేళ ఆయన తలుచుకుంటే, మొత్తం సృష్టికి మార్గనిర్దేశం చేసి ఉండేవాడు.

• آية الكرسي هي أعظم آية في كتاب الله، لما تضمنته من ربوبية الله وألوهيته وبيان أوصافه .
ఖుర్ఆన్ లోని అతి గొప్ప వచనం ఆయతుల్ కుర్సీ (2:255) వచనం, ఎందుకంటే అందులో అల్లాహ్ యొక్క ఏకత్వ (ఉలూహియా) లక్షణం మరియు ఆరాధింప బడే హక్కు కేవలం ఆయన మాత్రమే కలిగి ఉన్నాడనే (రుబూబియా) నిర్ధారణ, అలాగే ఆయనకు చెందిన కొన్ని దివ్యలక్షణాల స్పష్టీకరణ ప్రస్తావించ బడింది.

• اتباع الإسلام والدخول فيه يجب أن يكون عن رضًا وقَبول، فلا إكراه في دين الله تعالى.
అల్లాహ్ మార్గంలో ఎటువంటి బలవంతం, నిర్బంధం లేనందున ఇస్లాం ధర్మంలో ప్రవేశించి ముస్లిం కావాలనే నిర్ణయం పూర్తిగా తన హృదయపూర్వక అంగీకారం మరియు సుముఖతలపై ఆధారపడి ఉండాలి.

• الاستمساك بكتاب الله وسُنَّة رسوله أعظم وسيلة للسعادة في الدنيا، والفوز في الآخرة.
ఖుర్ఆన్ మరియు ప్రవక్త యొక్క సున్నతులను గట్టిగా పట్టుకోవడమే ఈ ప్రపంచంలో సుఖసంతోషాల్నిచ్చే మరియు మరణానంతర జీవితంలో విజయం సాధించి పెట్టే ఉత్తమ మార్గము.

 
Anlam tercümesi Ayet: (255) Sure: Sûratu'l-Bakarah
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat