Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (11) Sure: Sûratu'n-Nisâ
یُوْصِیْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْ ۗ— لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِ ۚ— فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَیْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۚ— وَاِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ؕ— وَلِاَبَوَیْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ— فَاِنْ لَّمْ یَكُنْ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ ۚ— فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ— اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ لَا تَدْرُوْنَ اَیُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا ؕ— فَرِیْضَةً مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟
మీ పిల్లలు పొందే వారసత్వఆస్తి విషయంలో అల్లాహ్ మీకు వసియ్యతు చేస్తూ’ఆదేశిస్తున్నాడు-ఒక కొడుకుకు ఇద్దరు కూతుళ్ళ వాటా ఇవ్వబడుతుంది. ఒకవేళ మృతుడికి కుమారులు లేకుండా కేవలం కూతుళ్ళు మాత్రమే ఉంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడూ2/3 వంతు ఆస్తిలో లభిస్తుంది,ఒకటే కూతురు ఉంటే ఆస్తిలో సగం లభిస్తుంది,మరియు మృతుని తల్లిదండ్రులలో ప్రతీఒక్కరికి అతను వదిలిన ఆస్తి నుంచి 1/6 లభిస్తుంది. మృతునికి కొడుకు లేదా కూతురు ఉన్నపక్షంలో కూడా,మృతునికి తల్లిదండ్రులు తప్ప ఏ సంతానం లేని పక్షంలో వారే ఆస్తికి హక్కుదారులు అవుతారు,అప్పుడు తల్లికి 1/3 వ వంతు మరియు తండ్రికి మిగిలిన మొత్తం లభిస్తుంది. ఒకవేళ మృతునికి ఇద్దరు లేక ఎక్కువ సొంతసోదరులు లేదా వరుస సోదరులు మగ లేక ఆడ ఉన్నట్లైతే తల్లి కి ఖచ్చితంగా 1/6 లభిస్తుంది,మిగతామొత్తం అస్బా కారణంగా తండ్రికి లభిస్తుంది. సహోధరులకు అందులో ఎటువంటి వాటా లభించదు.- అయితే ఈ మొత్తం ఆస్తిపంపకం అనేది మృతుడు చేసిన వసియ్యతును (ఆ వసియ్యతు తన ఆస్తిలో 1/3 వాటా కు మించకూడదనే నిభందనతో )పూర్తిచేయాలి,మరియు అతని పై ఉన్న అప్పులు చెల్లించిన తరువాత పంచబడుతుంది. అల్లాహ్ ఆస్తిపంపకాన్ని ఈ విధంగా నిశ్చయం చేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులలో మరియు సంతానంలో ఇహపరలోకాల ప్రయోజన పరంగా సామీప్యులు ఎవరు అనేది మీకు తెలియదు. మృతుడు ఒకరిని వారసుడిగా మేలైనవాడుగా భావిస్తాడు తన పూర్తి ఆస్తిని అతనికి ఇచ్చేస్తాడు,లేదా ఒకరిని చెడుగా భావిస్తాడు అతన్ని ఆస్తి నుంచి దూరంచేస్తాడు,కానీ పరిస్థితి అతను భావించిన దానికి భిన్నంగా ఉంటుంది,ఈ విషయంలో పరిపూర్ణంగా తెలిసినవాడు అల్లాహ్’యే అతని వద్ద ఏ విషయం దాగి ఉండదు,అంచేత ఆస్తిపంపకాన్ని వివరించిన ప్రకారంగా పంచాలి,దీన్ని ఆయన విధిగా చేశాడు మరియు తనదాసులపై తప్పనిసరి చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు,తనదాసుల ప్రయోజనాలలో ఏ విషయం ఆయన వద్ద దాగిలేదు,మరియు షరీఅతు రచనలలో మరియు దాన్ని నిర్వహించడంలో మహా వివేకవంతుడు.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• دلت أحكام المواريث على أن الشريعة أعطت الرجال والنساء حقوقهم مراعية العدل بينهم وتحقيق المصلحة بينهم.
‘ఇస్లామీయ షరీఅతు పురుషులకు మరియు మహిళలకు మధ్య హక్కులను న్యాయంగా ఇచ్చింది మరియు వారి మధ్య సత్ప్రయోజనాన్ని స్థాపించింది’అని వారసత్వఆదేశాలు’సాక్ష్యపరుస్తున్నాయి.

• التغليظ الشديد في حرمة أموال اليتامى، والنهي عن التعدي عليها، وعن تضييعها على أي وجه كان.
అనాధల సొమ్ము యొక్క పవిత్రతలో తీవ్రమైన హెచ్చరిక ఉంది,దానిని అతిక్రమించకూడదని.ఏ రకంగా కూడా వృధా చేయకూడదని నిషేధించబడింది.

• لما كان المال من أكثر أسباب النزاع بين الناس تولى الله تعالى قسمته في أحكام المواريث.
ప్రజల మధ్య సంఘర్షణకు గల కారణాల్లో ప్రధాన కారణం డబ్బు,అంచేత అల్లాహ్ వారసత్వ ఆదేశాలలో దాని విభజన’ను విశదీకరించాడు.

 
Anlam tercümesi Ayet: (11) Sure: Sûratu'n-Nisâ
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat