Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (23) Sure: Sûratu'n-Nisâ
حُرِّمَتْ عَلَیْكُمْ اُمَّهٰتُكُمْ وَبَنٰتُكُمْ وَاَخَوٰتُكُمْ وَعَمّٰتُكُمْ وَخٰلٰتُكُمْ وَبَنٰتُ الْاَخِ وَبَنٰتُ الْاُخْتِ وَاُمَّهٰتُكُمُ الّٰتِیْۤ اَرْضَعْنَكُمْ وَاَخَوٰتُكُمْ مِّنَ الرَّضَاعَةِ وَاُمَّهٰتُ نِسَآىِٕكُمْ وَرَبَآىِٕبُكُمُ الّٰتِیْ فِیْ حُجُوْرِكُمْ مِّنْ نِّسَآىِٕكُمُ الّٰتِیْ دَخَلْتُمْ بِهِنَّ ؗ— فَاِنْ لَّمْ تَكُوْنُوْا دَخَلْتُمْ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَیْكُمْ ؗ— وَحَلَآىِٕلُ اَبْنَآىِٕكُمُ الَّذِیْنَ مِنْ اَصْلَابِكُمْ ۙ— وَاَنْ تَجْمَعُوْا بَیْنَ الْاُخْتَیْنِ اِلَّا مَا قَدْ سَلَفَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟ۙ
అల్లాహ్ మీపై మీ తల్లులతో నికాహ్ ను నిషేధించాడు ఒకవేళ వారు ఆపై ఉన్న అంటే తల్లి యొక్క తల్లి మరియు ఆమె అమ్మమ్మ తండ్రి తరపు నుండి లేదా తల్లి తరపు నుండి. మరియు మీ కుమార్తెలతో (నికాహ్ ను నిషేధించాడు) ఒకవేళ వారు క్రిందకు దిగిన అంటే వారి కుమార్తెలు మరియు వారి కుమార్తె యొక్క కుమార్తెలు మరియు అలాగే కుమారుని కుమార్తెలు,కుమార్తె యొక్క కుమార్తెలు ఒకవేళ వారు క్రిందకు దిగిన మరియు మీ తల్లిదండ్రుల తరపు నుండి లేదా వారిద్దరిలో నుంచి ఒకరి తరపు నుండి మీ సోదరిలు మరియు మీ మేనత్తలు మరియు అలాగే మీ తండ్రుల మరియు మీ తల్లుల మేనత్తలు మరియు ఒక వేళ వారు ఆపై ఉన్న మరియు మీ పిన్నమ్మలు మరియు అలాగే మీ తండ్రుల మరియు మీ తల్లుల పిన్నమ్మలు ఒక వేళ వారు ఆపై ఉన్న మరియు సోదరుల,సోదరిల కుమార్తెలు మరియు వారి సంతానము ఒకవేళ వారు క్రిందకు దిగినా మరియు మీకు పాలు పట్టించిన మీ తల్లులు మరియు పాలు త్రాగటం వలన మీ సోదరులు మరియు మీ భార్యల తల్లులు ఒక వేళ మీరు వారితో సంభోగం చేసినా లేదా వారితో సంభోగం చేయక పోయినా సమానము. మరియు మీతో కాకుండా ఇతరులతో మీ భార్యల కుమార్తెలు ఎవరైతే మీ ఇంటిలో పోషించబడి,పెరిగిన వారు మరియు అలాగే వారు అందులో పెరగకపోయిన ఒక వేళ మీరు వారి తల్లులతో సంభోగం చేసిన. మరియు మీరు వారితో సంభోగం చేయకపోయి ఉంటే వారి కుమార్తెలతో వివాహం చేయటంలో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు మీ సొంత కుమారుల భార్యలతో నికాహ్ చేసుకోవటం మీపై నిషిద్ధం. ఒక వేళ మీరు వారితో సంభోగం చేయక పోయిన మరియు ఈ ఆదేశంలో పాలు త్రాగటం వలన మీ కుమారుల భార్యలు వస్తారు. మరియు ఇద్దరు సోదరిల మధ్య సమీకరించటం మీపై నిషేధము వారు బంధమును బట్టి లేదా పాలు త్రాగటం వలన అయితే. కాని అజ్ఞాన కాలంలో అందులో నుంచి ఏదైతే జరిగినదో అల్లాహ్ దాన్ని మన్నించి వేశాడు. నిశ్చయంగా అల్లాహ్ తన వైపు పశ్ఛాత్తాపముతో మరలే తన దాసులను మన్నించేవాడు. వారిపై కరుణించేవాడు. మరియు ఇదే విధంగా స్త్రీకి ఆమె మేనత్త మరియు పినతల్లి మధ్య సమీకరించటం యొక్క నిషిద్ధత సున్నత్ లో నిరూపితమైనది.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• إذا دخل الرجل بامرأته فقد ثبت مهرها، ولا يجوز له التعدي عليه أو الطمع فيه، حتى لو أراد فراقها وطلاقها.
ఒక వ్యక్తి తన భార్యతో సంభోగము చేసినప్పుడు ఆమె మహర్ అనివార్యమైపోతుంది. మరియు అతను ఆమెను వేరు చేసి విడాకులు తీసుకోవాలనుకున్నా దాన్ని (మహర్ ని) అతిక్రమించటం లేదా దానిలో అత్యాశ కలిగి ఉండటం అతనికి సమ్మతం కాదు.

• حرم الله تعالى نكاح زوجات الآباء؛ لأنه فاحشة تمقتها العقول الصحيحة والفطر السليمة.
అల్లాహ్ తఆలా తండ్రుల భార్యలతో వివాహమును నిషేధించాడు. ఎందుకంటే అది సరైన మనస్సులు మరియు సురక్షితమైన స్వభావములు అసహ్యించుకునే అశ్లీలమైనది.

• بين الله تعالى بيانًا مفصلًا من يحل نكاحه من النساء ومن يحرم، سواء أكان بسبب النسب أو المصاهرة أو الرضاع؛ تعظيمًا لشأن الأعراض، وصيانة لها من الاعتداء.
మహోన్నతుడైన అల్లాహ్ స్త్రీల్లోంచి ఎవరితో వివాహం చేయటం సమ్మతమో ఎవరితో నిషిద్ధమో క్లుప్తంగా స్పష్టపరిచాడు అది వంశం,వివాహం లేదా తల్లిపాలివ్వటం వల్ల కావచ్చు. ఆమెకు గౌరవంగా మరియు ఆమెను దుర్వినియోగం నుండి రక్షించడానికి.

 
Anlam tercümesi Ayet: (23) Sure: Sûratu'n-Nisâ
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat