Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi * - Mealler fihristi


Anlam tercümesi Sure: Sûretu'z-Zuhruf   Ayet:
وَالَّذِیْ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ ۚ— فَاَنْشَرْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ۚ— كَذٰلِكَ تُخْرَجُوْنَ ۟
మరియు ఆయనే మీకు సరి అగు,మీ జంతువులకు,మీ పంటలకు సరి అగు పరిమాణంలో ఆకాశము నుండి నీటిని కురిపించాడు. అప్పుడు మేము దాని ద్వారా ఎటువంటి మొక్కలు లేకుండా ఎండిపోయిన ప్రదేశమను జీవింపజేశాము. అల్లాహ్ ఈ శుష్క భూమిని (ఎండిపోయిన భూమిని) మొక్కలతో జీవింపజేసినట్లే మరల లేపటం కొరకు మిమ్మల్ని జీవింపజేస్తాడు.
Arapça tefsirler:
وَالَّذِیْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُمْ مِّنَ الْفُلْكِ وَالْاَنْعَامِ مَا تَرْكَبُوْنَ ۟ۙ
మరియు ఆయనే రాత్రి,పగలు,మగ,ఆడ మరియు మొదలగు వాటిలాంటి అన్ని రకాలను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు మీరు మీ ప్రయాణముల్లో మీరు సవారీ చేసే ఓడలను,జంతువులను తయారు చేశాడు. కావున మీరు సముద్రములో ఓడలపై సవారీ చేస్తున్నారు. మరియు భూమిలో మీ పశువులపై సవారీ చేస్తున్నారు.
Arapça tefsirler:
لِتَسْتَوٗا عَلٰی ظُهُوْرِهٖ ثُمَّ تَذْكُرُوْا نِعْمَةَ رَبِّكُمْ اِذَا اسْتَوَیْتُمْ عَلَیْهِ وَتَقُوْلُوْا سُبْحٰنَ الَّذِیْ سَخَّرَ لَنَا هٰذَا وَمَا كُنَّا لَهٗ مُقْرِنِیْنَ ۟ۙ
ఆయన వాటన్నింటిని మీ కొరకు చేశాడు; మీరు మీ ప్రయాణముల్లో స్వారీ చేసేవాటి విపులపై మీరు స్థిరంగా ఉంటారని, వాటి వీపులపై మీరు స్థిరంగా ఉన్నప్పుడు వాటిని మీ ఆదీనంలో చేసినందుకు మీ ప్రభువు అనుగ్రహమును జ్ఞప్తికి తెచ్చుకుంటారని మరియు మీ నాలుకలతో ఇలాపలుకుతారని ఆశిస్తూ : ఈ స్వారీని మా కొరకు సిద్ధం చేసి, మా ఆదీనంలో చేసిన ఆయన పరిశుద్ధుడు మరియు అతీతుడు. మేము దానిని నియంత్రించే వారము అయినాము. ఒక వేళ అల్లహ్ దాన్ని ఆదీనంలో చేసి ఉండకపోతే దాన్ని వశపరచుకునే మాకు శక్తి ఉండేదికాదు.
Arapça tefsirler:
وَاِنَّاۤ اِلٰی رَبِّنَا لَمُنْقَلِبُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మా మరణము తరువాత లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం కొరకు ఒక్కడైన మా ప్రభువు వైపునకు మరలుతాము.
Arapça tefsirler:
وَجَعَلُوْا لَهٗ مِنْ عِبَادِهٖ جُزْءًا ؕ— اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ مُّبِیْنٌ ۟ؕ۠
ముష్రికులు కొన్ని సృష్టి రాసులు పరిశుద్ధుడైన సృష్టికర్త నుండి జన్మించాయని ఆరోపించారు అందుకనే వారు ఇలా పలికారు : దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు. నిశ్చయంగా ఇలాంటి మాటలు పలికిన మనిషి పెద్ద అవిశ్వాసి,అవిశ్వాసమును,అపమార్గమును స్పష్టపరిచాడు.
Arapça tefsirler:
اَمِ اتَّخَذَ مِمَّا یَخْلُقُ بَنٰتٍ وَّاَصْفٰىكُمْ بِالْبَنِیْنَ ۟
ఓ ముష్రికులారా ఏమీ అల్లాహ్ తాను సృష్టించిన సంతానము నుండి ఆడ సంతానమును తన స్వయం కొరకు చేసుకుని,మీకు మగ సంతానమును ప్రత్యేకించుకున్నాడు అని పలుకుతున్నారా ?. మీరు చెప్పుకుంటున్న ఈ విభజన ఎటువంటి విభజన ?.
Arapça tefsirler:
وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِمَا ضَرَبَ لِلرَّحْمٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟
తన ప్రభువు వైపునకు అంటగట్టినటువంటి ఆడ సంతానము వారిలో నుండి ఎవరికైన కలిగిందని శుభవార్త ఇవ్వబడినప్పుడు బాధ,దుఃఖము యొక్క తీవ్రత వలన అతని ముఖము నల్లగా మారిపోయేది మరియు అతడు కోపముతో నిండిపోయేవాడు. అటువంటప్పుడు తనకు శుభవార్త ఇవ్వబడినప్పుడు తనకు బాధ కలిగించిన దాన్ని తన ప్రభువునకు ఎలా అంతగడుతాడు ?.
Arapça tefsirler:
اَوَمَنْ یُّنَشَّؤُا فِی الْحِلْیَةِ وَهُوَ فِی الْخِصَامِ غَیْرُ مُبِیْنٍ ۟
ఏమీ వారు అలంకరణలో పోషించబడిన దాన్ని తమ ప్రభువునకు అంటగడుతున్నారా, వాస్తవానికి అది తన ఆడతనం వలన తగువులాటలో మాటను స్పష్టపరచజాలదు ?.
Arapça tefsirler:
وَجَعَلُوا الْمَلٰٓىِٕكَةَ الَّذِیْنَ هُمْ عِبٰدُ الرَّحْمٰنِ اِنَاثًا ؕ— اَشَهِدُوْا خَلْقَهُمْ ؕ— سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَیُسْـَٔلُوْنَ ۟
మరియు వారు పరిశుద్ధుడైన కరుణామయుడి దాసులైన దైవదూతలను ఆడవారిగా నామకరణం చేశారు. ఏమీ వారు వారికి ఆడవారని స్పష్టమవటానికి అల్లాహ్ వారిని సృష్టించినప్పుడు వారు హాజరై ఉన్నారా ?. తొందరలోనే దైవదూతలు వారి ఈ సాక్ష్యమును వ్రాసి ఉంచుతారు. మరియు ప్రళయదినమున దాని గురించి ప్రశ్నించబడుతారు. మరియు తమ అసత్యం పలకటం వలన వాటి పరంగా శిక్షింపబడుతారు.
Arapça tefsirler:
وَقَالُوْا لَوْ شَآءَ الرَّحْمٰنُ مَا عَبَدْنٰهُمْ ؕ— مَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍ ۗ— اِنْ هُمْ اِلَّا یَخْرُصُوْنَ ۟ؕ
మరియు వారు విధివ్రాత ద్వారా వాదిస్తూ ఇలా పలుకుతారు : ఒక వేళ మేము దైవదూతలను ఆరాధించకూడదని అల్లాహ్ కోరుకుంటే మేము వారిని ఆరాధించేవారము కాదు. కాబట్టి మా నుండి అది జరగటం ఆయన మన్నతను సూచిస్తుంది. వారి ఈ మాట గురించి వారికి ఎటువంటి జ్ఞానం లేదు. వారు అబద్దము మాత్రం పలుకుతున్నారు.
Arapça tefsirler:
اَمْ اٰتَیْنٰهُمْ كِتٰبًا مِّنْ قَبْلِهٖ فَهُمْ بِهٖ مُسْتَمْسِكُوْنَ ۟
లేదా మేము ఈ ముష్రికులందరికి ఖుర్ఆన్ కన్న ముందు ఏదైన గ్రంధం ఇచ్చి ఉన్నామా అది వారి కొరకు అల్లాహేతరుల ఆరాధనకు అనుమతిస్తున్నదా ?. వారు ఆ గ్రంధమును అంటిపెట్టుకుని ఉండి దాని ద్వారా వాదిస్తున్నారు.
Arapça tefsirler:
بَلْ قَالُوْۤا اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّةٍ وَّاِنَّا عَلٰۤی اٰثٰرِهِمْ مُّهْتَدُوْنَ ۟
లేదు, అలా జరగలేదు. కాని వారు అనుకరణతో వాదిస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా మేము మా కన్న ముందు నుండి మా తాతముత్తాతలను ఒకే ధర్మం పై మరియు ఒకే సమాజము పై పొందాము. మరియు వారు విగ్రహాలను ఆరాధించేవారు. మరియు నిశ్చయంగా మేమూ వాటి ఆరాధన విషయంలో వారి అడుగుజాడలలోనే నడుస్తాము.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• كل نعمة تقتضي شكرًا.
ప్రతీ అనుగ్రహం కృతజ్ఞతను అనివార్యం చేస్తుంది.

• جور المشركين في تصوراتهم عن ربهم حين نسبوا الإناث إليه، وكَرِهوهنّ لأنفسهم.
తమ ప్రభువు గురించి తమ ఆలోచనల్లో ముష్రికుల దుర్మార్గము ఉన్నది అందుకనే వారు ఆడ సంతానమును ఆయనకు అంటగట్టి తమ స్వయం కొరకు వాటిని ఇష్టపడేవారు కాదు.

• بطلان الاحتجاج على المعاصي بالقدر.
పాపకార్యములపై విధివ్రాత ద్వారా వాదించటం నిర్వీర్యము.

• المشاهدة أحد الأسس لإثبات الحقائق.
దీర్ఘ దృష్టితో ఆలకించటం వాస్తవాలను నిరూపించే పునాదుల్లో ఒకటి.

 
Anlam tercümesi Sure: Sûretu'z-Zuhruf
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi - Mealler fihristi

Kur'an Araştırmaları Tefsir Merkezi Tarafından Yayınlanmıştır.

Kapat