Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mealler fihristi


Anlam tercümesi Ayet: (17) Sure: Sûretu'l-Ahkâf
وَالَّذِیْ قَالَ لِوَالِدَیْهِ اُفٍّ لَّكُمَاۤ اَتَعِدٰنِنِیْۤ اَنْ اُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُوْنُ مِنْ قَبْلِیْ ۚ— وَهُمَا یَسْتَغِیْثٰنِ اللّٰهَ وَیْلَكَ اٰمِنْ ۖۗ— اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَیَقُوْلُ مَا هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
మరియు ఎవడైతే తన తల్లిదండ్రులతో ఇలా పలికాడో : మీకు వినాశనం కలుగు గాక. ఏమీ నేను మరణించిన తరువాత జీవింపజేయబడి నా సమాధి నుండి నేను వెలికి తీయబడుతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా ?! వాస్తవానికి చాలా తరాలు గతించిపోయాయి. మరియు వాటిలో జనం చనిపోయారు కాని వారిలో నుండి ఎవరూ జీవింపజేయబడి మరల లేపబడలేదు. మరియు అతని తల్లిదండ్రులు అల్లాహ్ తో తమ కుమారునకు విశ్వాసము కొరకు మార్గదర్శకత్వం చేయమని సహాయమును కోరేవారు. మరియు వారిద్దరు తమ కుమారునితో ఇలా పలికేవారు : ఒక వేళ నీవు మరణాంతరం లేపబడటమును విశ్వసించకపోతే నీకు వినాశనం కలుగును కాబట్టి నీవు దాన్ని విశ్వసించు. నిశ్చయంగా మరణాంతరం లేపబడటం గురించి అల్లాహ్ వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యము. మరణాంతరం లేపబడటము పట్ల తన తిరస్కారమును నవీనపరుస్తూ అతడు ఇలా పలుకుతాడు : మరణాంతరం లేపబడటం గురించి పలుకబడుతున్న ఈ మాటలు మాత్రం పూర్వికుల పుస్తకముల నుండి మరియు వారు వ్రాసిన వాటి నుండి అనుకరించబడినవి. అవి అల్లాహ్ నుండి నిరూపించబడలేదు.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• بيان مكانة بِرِّ الوالدين في الإسلام، بخاصة في حق الأم، والتحذير من العقوق.
ఇస్లాంలో తల్లదండ్రుల పట్ల మంచిగా మెలగటము యొక్క స్థానము ప్రకటన. ప్రత్యేకించి తల్లి హక్కు విషయంలో. మరియు వారి అవిధేయతకు పాల్పడటం నుండి హెచ్చరిక.

• بيان خطر التوسع في ملاذّ الدنيا؛ لأنها تشغل عن الآخرة.
ప్రాపంచిక సుఖభోగాల్లో పుష్కలత్వము యొక్క ప్రమాద ప్రకటన. ఎందుకంటే అది పరలోకం నుండి అశ్రద్ధ వహించేటట్లు చేస్తుంది.

• بيان الوعيد الشديد لأصحاب الكبر والفسوق.
అహంకారులకు మరియు అవిధేయులకు తీవ్ర హెచ్చరిక ప్రకటన.

 
Anlam tercümesi Ayet: (17) Sure: Sûretu'l-Ahkâf
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mealler fihristi

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Kapat