Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi * - Mealler fihristi


Anlam tercümesi Sure: Sûratu'l-Mâide   Ayet:
مِنْ اَجْلِ ذٰلِكَ ؔۛۚ— كَتَبْنَا عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ اَنَّهٗ مَنْ قَتَلَ نَفْسًا بِغَیْرِ نَفْسٍ اَوْ فَسَادٍ فِی الْاَرْضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیْعًا ؕ— وَمَنْ اَحْیَاهَا فَكَاَنَّمَاۤ اَحْیَا النَّاسَ جَمِیْعًا ؕ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِالْبَیِّنٰتِ ؗ— ثُمَّ اِنَّ كَثِیْرًا مِّنْهُمْ بَعْدَ ذٰلِكَ فِی الْاَرْضِ لَمُسْرِفُوْنَ ۟
ఖాబీల్ తన సోదరుడిని హతమార్చిన వైనము ద్వారా మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఎవరైతే ప్రాణమునకు బదులుగా కాకుండా లేదా అవిశ్వాసము ద్వారా భూమిపై ఉపద్రవమును సృష్టించుటకు లేదా పోరాడటానికి ఒక ప్రాణమును హతమార్చితే అతడు సమస్త మానవాళిని హతమార్చాడని మనము తెలియపరిచాము. ఎందుకంటే అతని వద్ద దోషికి మరియు నిర్దోషికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. మరియు ఎవరైతే మహోన్నతుడైన అల్లాహ్ ఏ ప్రాణమునైతే నిషేధించాడో దాన్ని హతమార్చటము యొక్క నిషేదమును విశ్వసిస్తూ ఆ ప్రాణమును హతమార్చటం నుండి ఆగిపోయి దాన్ని హతమార్చడో అతడు సమస్త మానవాళిని జీవింపజేసినట్లు. ఎందుకంటే అతని చర్యలో వారందరి శ్రేయస్సు ఉన్నది. మరియు నిశ్చయంగా బనీ ఇస్రాయీలు వద్దకు మా ప్రవక్తలు స్పష్టమైన వాదనలను మరియు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. అయినా కూడా నిశ్ఛయంగా వారిలో నుండి చాలా మంది పాపకార్యములకు పాల్పడి మరియు తమ ప్రవక్తలను విబేధించి అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారు.
Arapça tefsirler:
اِنَّمَا جَزٰٓؤُا الَّذِیْنَ یُحَارِبُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَیَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا اَنْ یُّقَتَّلُوْۤا اَوْ یُصَلَّبُوْۤا اَوْ تُقَطَّعَ اَیْدِیْهِمْ وَاَرْجُلُهُمْ مِّنْ خِلَافٍ اَوْ یُنْفَوْا مِنَ الْاَرْضِ ؕ— ذٰلِكَ لَهُمْ خِزْیٌ فِی الدُّنْیَا وَلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟ۙ
ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్దం చేస్తారో మరియు దానిని శతృత్వముతో మరియు హతమార్చటం ద్వారా,సంపదలను లాక్కొని,దారిని కోసి భూమిలో ఉపద్రవాన్ని రేకెత్తించటంతో బహిర్గతం చేస్తారో వారి శిక్ష వారిని శిలువ వేయకుండా హతమార్చటం లేదా కట్టెపై,అటువంటి వాటిపై శిలువ వేసి వారిని హతమార్చటం లేదా వారి ఎడమ కాలితో పాటు కుడి చేతిని నరకటం ఆ తరువాత మరల చేస్తే అతని కుడి కాలితో సహా ఎడమ చేతిని నరకటం లేదా దేశ బహిష్కరణ చేయటం. ఈ శిక్ష వారికి ఇహలోకములో అవమానము మరియు వారి కొరకు పరలోకంలో పెద్ద శిక్ష ఉన్నది.
Arapça tefsirler:
اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ قَبْلِ اَنْ تَقْدِرُوْا عَلَیْهِمْ ۚ— فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
కాని ఈ యుద్దం చేసే వారిలో నుండి ఓ విజ్ఞులారా మీరు వారిపై ఆధిక్యతను కనబరచక ముందు పశ్చాత్తాప్పడి మరలితే మీరు తెలుసుకోండి అల్లాహ్ వారిని పశ్చాత్తాపము తరువాత మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును, వారి నుండి శిక్షను తొలగించటం వారి కల ఆయన కారుణ్యము.
Arapça tefsirler:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابْتَغُوْۤا اِلَیْهِ الْوَسِیْلَةَ وَجَاهِدُوْا فِیْ سَبِیْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు మీరు ఆయన మీకు ఆదేశించిన వాటిని నెరవేర్చటం ద్వారా ఆయన మిమ్మల్ని వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన సాన్నిధ్యమును కోరుకోండి. మరియు మీరు ఆయన మన్నతలను ఆశిస్తూ అవిశ్వాసపరులతో పోరాడండి. బహుశా మీరు వాటిని పాటిస్తే మీరు ఆశించినవి పొందుతారు మరియు మీరు భయపడే వాటి నుండి బ్రతికి బయటపడుతారు.
Arapça tefsirler:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لِیَفْتَدُوْا بِهٖ مِنْ عَذَابِ یَوْمِ الْقِیٰمَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
నిశ్చయంగా అల్లాహ్ ను ఆయన ప్రవక్తను అవిశ్వసించేవారు ఒక వేళ వారిలో నుండి ప్రతి ఒక్కరికి భూమిలో ఉన్నదంతా మరియు దానికి తోడు దానంత అధికారమే ఉంటే ప్రళయదినమున అల్లాహ్ శిక్ష నుండి తమను ఆపటానికి దాన్ని వారు ప్రవేశపెట్టేవారు. ఆ పరిహారం వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.
Arapça tefsirler:
Bu sayfadaki ayetlerin faydaları:
• حرمة النفس البشرية، وأن من صانها وأحياها فكأنما فعل ذلك بجميع البشر، وأن من أتلف نفسًا بشرية أو آذاها من غير حق فكأنما فعل ذلك بالناس جميعًا.
మానవ ప్రాణము యొక్క పవిత్రత. ఎవరైతే దాన్ని పరిరక్షించి దాన్ని జీవింపజేస్తాడో అతడు అలా మానవులందరితో వ్యవహరించినట్లు. మరియు ఎవరైతే ఏ మానవ ప్రాణమును వ్యర్ధ పరచి దాన్ని అన్యాయంగా బాధించి ఉంటే అతడు అలా ప్రజలందరితో వ్యవహరించినట్లే.

• عقوبة الذين يحاربون الله ورسوله ممن يفسدون بالقتل وانتهاب الأموال وقطع الطرق هي: القتل بلا صلب، أو مع الصلب، أو قطع الأطرف من خلاف، أو بتغريبهم من البلاد؛ وهذا على حسب ما صدر منهم.
హతమార్చటం ద్వారా,సంపదలను కాజేయటం ద్వారా ,దారిని కోయటం ద్వారా ఉపద్రవాలను రేకెత్తించే వారిలో నుంచి అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో యుద్దం చేసేవారి శిక్ష అది ఏమిటంటే : శిలువ వేయకుండా హతమార్చటం లేదా శిలువ వేసి హతమార్చటం లేదా కాళ్ళు చేతులను వ్యతిరేక దిశలో నరికివేయటం లేదా వారిని దేశబహిష్కరణ చేయటం; మరియు ఇది వారి నుండి జరిగిన దానికి తగిన విధంగా ఉంటుంది.

• توبة المفسدين من المحاربين وقاطعي الطريق قبل قدرة السلطان عليهم توجب العفو.
పోట్లాడే మరియు దారిని కోసే ఉపద్రవాలను సృష్టించే వారు ఆధిక్యత వహించే వ్యక్తి వారిపై ఆధిక్యతను చూపకముందే వారి పశ్ఛాత్తాపము మన్నింపును తప్పనిసరి చేస్తుంది.

 
Anlam tercümesi Sure: Sûratu'l-Mâide
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Muhtasar Kur'an-ı Kerim Tefsiri Telugu Tercümesi - Mealler fihristi

Kur'an Araştırmaları Tefsir Merkezi Tarafından Yayınlanmıştır.

Kapat