Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed * - Mealler fihristi

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Anlam tercümesi Sure: Sûratu'l-Hicr   Ayet:
وَلَقَدْ جَعَلْنَا فِی السَّمَآءِ بُرُوْجًا وَّزَیَّنّٰهَا لِلنّٰظِرِیْنَ ۟ۙ
మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.
Arapça tefsirler:
وَحَفِظْنٰهَا مِنْ كُلِّ شَیْطٰنٍ رَّجِیْمٍ ۟ۙ
మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా [1]
[1] ఇంకా చూడండి, 2:14 మరియు 37:7.
Arapça tefsirler:
اِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَاَتْبَعَهٗ شِهَابٌ مُّبِیْنٌ ۟
కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.[1]
[1] ఇంకా చూడండి, 37:10.
Arapça tefsirler:
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ شَیْءٍ مَّوْزُوْنٍ ۟
మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.
Arapça tefsirler:
وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ وَمَنْ لَّسْتُمْ لَهٗ بِرٰزِقِیْنَ ۟
మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]
[1] ఇంకా చూడండి, 11:6.
Arapça tefsirler:
وَاِنْ مِّنْ شَیْءٍ اِلَّا عِنْدَنَا خَزَآىِٕنُهٗ ؗ— وَمَا نُنَزِّلُهٗۤ اِلَّا بِقَدَرٍ مَّعْلُوْمٍ ۟
మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.
Arapça tefsirler:
وَاَرْسَلْنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسْقَیْنٰكُمُوْهُ ۚ— وَمَاۤ اَنْتُمْ لَهٗ بِخٰزِنِیْنَ ۟
మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!
Arapça tefsirler:
وَاِنَّا لَنَحْنُ نُحْیٖ وَنُمِیْتُ وَنَحْنُ الْوٰرِثُوْنَ ۟
మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.[1]
[1] ఇంకా చూడండి, 3:180 మరియు 57:10.
Arapça tefsirler:
وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِیْنَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَاْخِرِیْنَ ۟
మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.[1]
[1] 'ఎవరైతే ముందుగా (మా వద్దకు) వస్తారో మరియు ఎవరు వెనుక ఉండిపోతారో...తెలుసు'. ఈ రెండురకాల వ్యాఖ్యానాలు కూడ సరైనవే అని వ్యాఖ్యాతలు అంగీకరించారు. మరొక వ్యాఖ్యానం: 'మరియు వాస్తవానికి, మీలో ముందుకు సాగిపోయే వారెవరో మాకు తెలుసు మరియు వాస్తవానికి, వెనుకంజ వేసేవారెవరో కూడా మాకు తెలుసు.' అని కూడా ఇవ్వబడింది.
Arapça tefsirler:
وَاِنَّ رَبَّكَ هُوَ یَحْشُرُهُمْ ؕ— اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ ۟۠
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.
Arapça tefsirler:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟ۚ
మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.[1]
[1] మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు. వేర్వేరు చోట్లలో ఆ మట్టి స్థితిని బట్టి వేర్వేరు పేర్లు ఇవ్వబడ్డాయి. 1) సాధారణంగా ఎడిపోయిన (తడిలేని) మట్టిని తురాబ్ - దుమ్ము అని, 2) దానిని నీళ్ళు వేసి కలిపితే 'తీన్ - మట్టి అని, 3) అది చాలా నీళ్ళతో కలిపి వాసన వచ్చే బురదగా ఉంటె, 'హమఇన్ మస్నూన్ - జిగట బురద అని, 4) అది ఎండిపోయి శబ్దం చేస్తే, - 'స'ల్సాల్ - అని, 5) దానిని కాల్చితే, ఫ'ఖ్ఖార్ - పెంకు, అని పేర్లు ఇవ్వబడ్డాయి. (చూడండి, 55:14).
Arapça tefsirler:
وَالْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ ۟
మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.[1]
[1] అల్ - జిన్ను, జిన్నతున్ (బ.వ.) అంటే మానవుల కండ్లకు కనబడనిది అని అర్థము. అందుకే వారిని ఈ పేరుతో పిలుస్తారు. వారికి తెలివి ఉంది, మంచి చెడుల విచక్షణా శక్తి ఉంది. పొగలేని అగ్నిజ్వాలలతో సృష్టించబడ్డారు. వారు తింటారు, త్రాగుతారు. వారి సంతతి పెరుగుతుంది. వారికి మరణం ఉంది. వారి కర్మలను బట్టి వారికి, మానవుల వలె స్వర్గనరకాల ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. ('అబ్దుల్ మజీద్ దర్యాబాది, ర'హ్మ.) చూడండి 55:15 మరియు 6:100.
Arapça tefsirler:
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
Arapça tefsirler:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."[1]
[1] ఈ సాష్టాంగం కేవలం అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించటానికి చేయబడిన గౌరవప్రదమైన సాష్టాంగం. ఇది ఆరాధనార్థం చేసింది కాదు. ము'హమ్మద్ ('స'అస) షరీఅత్ లో గౌరవార్థం కూడా ఎవ్వరికైనను సాష్టాంగం చేయటం ధర్మసమ్మతం కాదు. ఇంకా చూడండి, 2:30-34 మరియు 7:11-18.
Arapça tefsirler:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -
Arapça tefsirler:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰۤی اَنْ یَّكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.[1]
[1] 'మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు, కాని నేనైతే అగ్నితో సృష్టించబడ్డాను, కాబట్టి నేను మానవుని కంటే ఉత్తముడను, నేనెందుకు అతనికి సజ్దా చేయాలి.' అని ఇబ్లీస్ అన్నాడు. దైవప్రవక్తలందరూ మట్టితోనే సృష్టించబడ్డ మానవులేనని ఖుర్ఆన్ విశదీకరించింది. దీనిని విశ్వసించక పోవడం మరియు మట్టితో సృష్టించబడ్డవారు అధములని భావించడం షై'తాన్ ను అనుసరించడమే! ఇంకా చూడండి, 7:11.
Arapça tefsirler:
 
Anlam tercümesi Sure: Sûratu'l-Hicr
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed - Mealler fihristi

Abdurrahim b. Muhammed tarafından tercüme edilmiştir.

Kapat