Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed * - Mealler fihristi

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Anlam tercümesi Sure: Sûratu'l-Ankebût   Ayet:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَلَنَجْزِیَنَّهُمْ اَحْسَنَ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము.
Arapça tefsirler:
وَوَصَّیْنَا الْاِنْسَانَ بِوَالِدَیْهِ حُسْنًا ؕ— وَاِنْ جٰهَدٰكَ لِتُشْرِكَ بِیْ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ؕ— اِلَیَّ مَرْجِعُكُمْ فَاُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము.[1] కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు.[2] మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను.
[1] ఖుర్ఆన్ లో కేవలం ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ఆరాధనే చేయాలనీ మరియు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలని అల్లాహ్ (సు.తా.) ఆదేశిస్తున్నాడు. తమ తల్లిదండ్రులను ఆదరించే వారే అల్లాహ్ (సు.తా.) యొక్క స్థానాన్ని అర్థం చేసుకో గలుగుతారు. చూడండి, 31:14-15.
[2] స'అద్ బిన్ అబీ-వఖ్ఖా'స్ (ర'ది.'అ) ఇస్లాం స్వీకరించినప్పుడు అతని తల్లి నీవు ఇస్లాం మరియు ము'హమ్మద్ (సఅస) ను వదలనంత వరకు నేను అన్నపానీయాలను ముట్టను అని మొండిపట్టు పట్టుతుంది. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడుతుంది. ('స.ముస్లిం, తిర్మిజీ')
Arapça tefsirler:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَنُدْخِلَنَّهُمْ فِی الصّٰلِحِیْنَ ۟
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము.
Arapça tefsirler:
وَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ فَاِذَاۤ اُوْذِیَ فِی اللّٰهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللّٰهِ ؕ— وَلَىِٕنْ جَآءَ نَصْرٌ مِّنْ رَّبِّكَ لَیَقُوْلُنَّ اِنَّا كُنَّا مَعَكُمْ ؕ— اَوَلَیْسَ اللّٰهُ بِاَعْلَمَ بِمَا فِیْ صُدُوْرِ الْعٰلَمِیْنَ ۟
మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): "మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము.[1] సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి?"
[1] ఇలాంటి భావమిచ్చే మరొక ఆయత్ కు చూడండి, 4:141.
Arapça tefsirler:
وَلَیَعْلَمَنَّ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَلَیَعْلَمَنَّ الْمُنٰفِقِیْنَ ۟
మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని స్పష్టపరుస్తాడు మరియు ఆయన కపట విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు.[1]
[1] అంటే అల్లాహ్ (సు.తా.) సుఖదుఃఖాలనిచ్చి విశ్వాసులెవరో మరియు కపట విశ్వాసులెవరో విశదం చేస్తాడు. ఎవరైతే ప్రతి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులై ఉంటారో వారే నిజమైన విశ్వాసులు. ఇంకా చూడండి, 15:23 మరియు 15:23, ఇది కపట విశ్వాసు(మునాఫిఖు)లను గురించి వచ్చిన మొదటి ఆయత్.
Arapça tefsirler:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوا اتَّبِعُوْا سَبِیْلَنَا وَلْنَحْمِلْ خَطٰیٰكُمْ ؕ— وَمَا هُمْ بِحٰمِلِیْنَ مِنْ خَطٰیٰهُمْ مِّنْ شَیْءٍ ؕ— اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము." అని అంటారు. వాస్తవానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు.[1]
[1] సత్యతిరస్కారులు: 'మీరు మా మార్గాన్ని అనుసరిస్తే మేము మీ పాపాలను భరిస్తాము.' అని అనే మాటలు అబద్ధాలని ఇక్కడ విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: "భారం మోసేవాడు, ఎవరి భారాన్ని మోయడు!" పునరుత్థాన దినమున స్నేహితుడు తన స్నేహితుని స్థితిని అడగడు, 70:10 మరియు దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు అడుగుకోరు, 35:18.
Arapça tefsirler:
وَلَیَحْمِلُنَّ اَثْقَالَهُمْ وَاَثْقَالًا مَّعَ اَثْقَالِهِمْ ؗ— وَلَیُسْـَٔلُنَّ یَوْمَ الْقِیٰمَةِ عَمَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟۠
మరియు నిశ్చయంగా, వారు తమ బరువులను మోస్తారు మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు.[1] మరియు నిశ్చయంగా, వారు పునరుత్థాన దినమున, తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నింపబడతారు.
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 16:25. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఇతరులను సన్మార్గానికి పిలచిన వారికి, వారు సన్మార్గాన్ని అనుసరిస్తే పునరుత్థానదినం వరకు వారంతా చేసే సత్కార్యాల ఫలితాల పుణ్యం దొరుకుతుంది. దుర్మార్గులకు, పాపకార్యాలకు, దుష్టకార్యాలకు ఆహ్వానించే వారు తమను అనుసరించిన వారి పాపభారాన్ని పునరుత్థాన దినం వరకు భరిస్తారు." ('స'హీ'హ్ బు'ఖారీ).
Arapça tefsirler:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَلَبِثَ فِیْهِمْ اَلْفَ سَنَةٍ اِلَّا خَمْسِیْنَ عَامًا ؕ— فَاَخَذَهُمُ الطُّوْفَانُ وَهُمْ ظٰلِمُوْنَ ۟
మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది.[1]
[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48 ఇక్కడ ఉద్దేశమేమిటంటే: ఒక ప్రవక్త ('అ.స.) కూడా తాను ప్రేమించేవారిని సన్మార్గానికి తేలేడు. ఇంకా చూడండి, 28:56 నూ'హ్ ('అ.స.) వారికి 950 సంవత్సరాలు ఇస్లాం ధర్మప్రచారం చేశారు. మార్గదర్శకత్వమంతా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వమే. చూడండి, 3:73.
Arapça tefsirler:
 
Anlam tercümesi Sure: Sûratu'l-Ankebût
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Tercüme - Abdurrahim B. Muhammed - Mealler fihristi

Abdurrahim b. Muhammed tarafından tercüme edilmiştir.

Kapat