Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Kur'an-ı Kerim Meali * - Mealler fihristi

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Anlam tercümesi Sure: Sûretu'l-Fecr   Ayet:

సూరహ్ అల్-ఫజ్ర్

وَالْفَجْرِ ۟ۙ
ప్రాంతః కాలం సాక్షిగా![1]
[1] అంటే ప్రతి ఉదయం ఒక ప్రత్యేక ఉదయం కాదు.
Arapça tefsirler:
وَلَیَالٍ عَشْرٍ ۟ۙ
పది రాత్రుల సాక్షిగా![1]
[1] అంటే జు'ల్-'హజ్ యొక్క మొదటి పదిరాత్రులని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. వీటి ఘనత 'హదీస్' లలో ఉంది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "జు'ల్-'హజ్జ్ మొదటి పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ (సు.తా.)కు ఎంతో ఇష్టమైనవి - జిహాద్ కంటే కూడా - మానవుడు అమరగతి నొందిన జిహాద్ తప్ప! ('స'హీ'హ్ బు'ఖారీ).
Arapça tefsirler:
وَّالشَّفْعِ وَالْوَتْرِ ۟ۙ
సరి బేసీల సాక్షిగా!
Arapça tefsirler:
وَالَّیْلِ اِذَا یَسْرِ ۟ۚ
గడచిపోయే రాత్రి సాక్షిగా!
Arapça tefsirler:
هَلْ فِیْ ذٰلِكَ قَسَمٌ لِّذِیْ حِجْرٍ ۟ؕ
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]
[1] అంటే వీటన్నిటి ప్రమాణం చేయటం, అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటానికి చాలదా! 'హిజ్ రున్: ఆపటం, కాదనటం, బుద్ధి కూడా మానవుడిని చెడు కర్మల నుండి ఆపుతుంది.
Arapça tefsirler:
اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ۟
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1]
[1] వారి ప్రవక్త హూద్ ('అ.స.) చూడండి, 69:7-10 మరియు 7:65-72.
Arapça tefsirler:
اِرَمَ ذَاتِ الْعِمَادِ ۟
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]
[1] ఇరము: ఒక తెగ పేరు. దాని పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి: 'ఆద్ బిన్-'ఔస్ బిన్-ఇరమ బిన్ -సామ్ బిన్-నూ'హ్. (ఫత్హ్ అల్-ఖదీర్) వీరిని 'ఆద్ఊలా, అని కూడా అంటారు.వీరిని ఎత్తైన స్తంభాల (భవనాల) వారని కూడా అంటారు.
Arapça tefsirler:
الَّتِیْ لَمْ یُخْلَقْ مِثْلُهَا فِی الْبِلَادِ ۟
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1]
[1] 'ఆద్ జాతివారికి తమ బలసామర్థ్యాల మీద ఎంతో గర్వం ఉండేది. చూడండి, 41:15.
Arapça tefsirler:
وَثَمُوْدَ الَّذِیْنَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ۟
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1]
[1] వీరి ప్రవక్త 'సాలిహ్' ('అ.స.). చూడండి, 26:149.
Arapça tefsirler:
وَفِرْعَوْنَ ذِی الْاَوْتَادِ ۟
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1]
[1] అంటే పెద్ద సైన్యం గలవాడు, లేక ప్రజలను మేకులతో నాటి శిక్షించేవాడు. (ఫత్హ్ అల్-ఖదీర్)
Arapça tefsirler:
الَّذِیْنَ طَغَوْا فِی الْبِلَادِ ۟
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
Arapça tefsirler:
فَاَكْثَرُوْا فِیْهَا الْفَسَادَ ۟
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
Arapça tefsirler:
فَصَبَّ عَلَیْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ۟ۚۙ
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
Arapça tefsirler:
اِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ ۟ؕ
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
Arapça tefsirler:
فَاَمَّا الْاِنْسَانُ اِذَا مَا ابْتَلٰىهُ رَبُّهٗ فَاَكْرَمَهٗ وَنَعَّمَهٗ ۙ۬— فَیَقُوْلُ رَبِّیْۤ اَكْرَمَنِ ۟ؕ
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1]
[1] అల్లాహ్ (సు.తా.) ధనధాన్యాలు, సౌభాగ్యాలు, ఇచ్చినా పరీక్షించటానికే! మరియు పేదరికానికి గురిచేసినా, అదీ పరీక్షించటానికే!
Arapça tefsirler:
وَاَمَّاۤ اِذَا مَا ابْتَلٰىهُ فَقَدَرَ عَلَیْهِ رِزْقَهٗ ۙ۬— فَیَقُوْلُ رَبِّیْۤ اَهَانَنِ ۟ۚ
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1]
[1] చూఅల్లాహ్ (సు.తా.) తన సద్వర్తనులైన దాసులకు భోగభాగ్యాలు, ధనధాన్యాలు ప్రసాదించవచ్చు! లేక పేదరికానికీ గురిచేసి పరీక్షించవచ్చు. అదే విధంగా సత్యతిరస్కారులకు కూడా ఐశ్వర్యాలివ్వవచ్చు లేక పేదరికంతో పరీక్షించవచ్చు! సద్వర్తనులైన విశ్వాసులు ఐశ్వర్యవంతులుగా ఉంటే అల్లాహ్ (సు.తా.)కు కృతజ్ఞులుగా ఉంటారు. పేదరికానికి గురి అయితే సహనం వహిస్తారు.
Arapça tefsirler:
كَلَّا بَلْ لَّا تُكْرِمُوْنَ الْیَتِیْمَ ۟ۙ
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.
Arapça tefsirler:
وَلَا تَحٰٓضُّوْنَ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ۙ
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1]
[1] చూడండి, 107:3.
Arapça tefsirler:
وَتَاْكُلُوْنَ التُّرَاثَ اَكْلًا لَّمًّا ۟ۙ
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
Arapça tefsirler:
وَّتُحِبُّوْنَ الْمَالَ حُبًّا جَمًّا ۟ؕ
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు![1]
[1] జమ్మన్: కసీ'రన్, చాలా.
Arapça tefsirler:
كَلَّاۤ اِذَا دُكَّتِ الْاَرْضُ دَكًّا دَكًّا ۟ۙ
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
Arapça tefsirler:
وَّجَآءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ۟ۚ
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1]
[1] ఏడు ఆకాశాల దైవదూతలు ఏడు వరుసలలో నిలబడతారు.
Arapça tefsirler:
وَجِایْٓءَ یَوْمَىِٕذٍ بِجَهَنَّمَ ۙ۬— یَوْمَىِٕذٍ یَّتَذَكَّرُ الْاِنْسَانُ وَاَنّٰی لَهُ الذِّكْرٰی ۟ؕ
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
Arapça tefsirler:
یَقُوْلُ یٰلَیْتَنِیْ قَدَّمْتُ لِحَیَاتِیْ ۟ۚ
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
Arapça tefsirler:
فَیَوْمَىِٕذٍ لَّا یُعَذِّبُ عَذَابَهٗۤ اَحَدٌ ۟ۙ
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
Arapça tefsirler:
وَّلَا یُوْثِقُ وَثَاقَهٗۤ اَحَدٌ ۟ؕ
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1]
[1] చూడండి, 73:12-13.
Arapça tefsirler:
یٰۤاَیَّتُهَا النَّفْسُ الْمُطْمَىِٕنَّةُ ۟ۗۙ
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
Arapça tefsirler:
ارْجِعِیْۤ اِلٰی رَبِّكِ رَاضِیَةً مَّرْضِیَّةً ۟ۚ
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
Arapça tefsirler:
فَادْخُلِیْ فِیْ عِبٰدِیْ ۟ۙ
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
Arapça tefsirler:
وَادْخُلِیْ جَنَّتِیْ ۟۠
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"
Arapça tefsirler:
 
Anlam tercümesi Sure: Sûretu'l-Fecr
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Telugu Dilinde Kur'an-ı Kerim Meali - Mealler fihristi

Telugu Dilinde Kur'an-ı Kerim Meali- Tercüme Mevlana Abdurrahim b. Muhammed, Kral Medine-i Münevvere'deki Kral Fahd Kur'an-ı Kerim Basım Kompleksi tarafından yayınlanmıştır. Basım Yılı hicri 1434.

Kapat