Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: ھۇد   ئايەت:
فَلَمَّا جَآءَ اَمْرُنَا جَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهَا حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۙ۬— مَّنْضُوْدٍ ۟ۙ
లూత్ జాతి వారిని తుదిముట్టిస్తూ మా ఆదేశం వచ్చినప్పుడు మేము వారి బస్తీలను తలకిందులుగా చేసి వారిపై తిప్పి వేశాము.మరియు మేము వారిపై మట్టితో పటిష్టంగా తయారు చేయబడిన రాళ్ళను ఒకదానిపై ఒకటి వరుసగా కురిపించాము.
ئەرەپچە تەپسىرلەر:
مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ ؕ— وَمَا هِیَ مِنَ الظّٰلِمِیْنَ بِبَعِیْدٍ ۟۠
ఈ రాళ్ళు అల్లాహ్ వద్ద నుండి ఒక ప్రత్యేకమైన గుర్తు వేయబడి ఉంటాయి.మరియు ఈ రాళ్ళు ఖురైష్ జాతి వారిలోంచి దుర్మార్గులు,ఇతరుల నుండి దూరంగా లేవు.అంతేకాదు అల్లాహ్ వాటిని వారిపై ఎప్పుడు అవతరించాలని నిర్ధారిస్తే అవి దిగటానికి దగ్గరలో ఉన్నవి.
ئەرەپچە تەپسىرلەر:
وَاِلٰی مَدْیَنَ اَخَاهُمْ شُعَیْبًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— وَلَا تَنْقُصُوا الْمِكْیَالَ وَالْمِیْزَانَ اِنِّیْۤ اَرٰىكُمْ بِخَیْرٍ وَّاِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ مُّحِیْطٍ ۟
మరియు మేము మద్యన్ వారి వైపునకు వారి సోదరుడు షుఐహ్ ను ప్రవక్తగా పంపించినాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి ప్రజలారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం ఆయన తప్ప ఇంకొకడు లేడు. మీరు ప్రజల కొరకు కొలచినప్పుడు లేదా వారి కొరకు తూకము వేసినప్పుడు కొలతల్లో,తూనికల్లో తగ్గించకండి. నిశ్చయంగా నేను మిమ్మల్ని పుష్కలమైన ఆహారోపాధిలో,సుఖభోగాల్లో చూస్తున్నాను. అయితే మీరు మీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను పాపకార్యాల ద్వారా మార్చుకోకండి. మరియు నిశ్చయంగా నేను ఆరోజు చుట్టుముట్టుకునే శిక్ష గురించి మీపై భయపడుతున్నాను. అది మీలో నుంచి ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. మీరు దాని నుండి ఎటువంటి పారిపోయే స్థలమును,శరణాలయమును పొందలేరు.
ئەرەپچە تەپسىرلەر:
وَیٰقَوْمِ اَوْفُوا الْمِكْیَالَ وَالْمِیْزَانَ بِالْقِسْطِ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟
ఓ నా జాతి వారా మీరు ఒక వేళ ఇతరుల కొరకు కొలిస్తే లేదా తూకము వేస్తే న్యాయపూరితంగా కొలతలను,తూనీకలను పూర్తి చేయండి.మరియు మీరు ప్రజల హక్కుల్లోంచి కొద్దిగా కూడా తూనికల్లో హెచ్చుతగ్గులు చేసి,దగా చేసి,మోసం చేసి తక్కువ చేసి ఇవ్వకండి.భువిలో హత్యచేయటం,ఇతర పాపకార్యాల ద్వారా అల్లకల్లోలాలను సృష్టించకండి.
ئەرەپچە تەپسىرلەر:
بَقِیَّتُ اللّٰهِ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۚ۬— وَمَاۤ اَنَا عَلَیْكُمْ بِحَفِیْظٍ ۟
అల్లాహ్ న్యాయపరంగా ప్రజల హక్కులను పూర్తి చేసిన తరువాత మీ కొరకు మిగిల్చిన హలాల్ సంపద కొలతల్లో,తూనికల్లో హెచ్చు తగ్గులు చేయటం ద్వారా,భూమిలో అల్లకల్లోలాలను సృష్టించటం ద్వారా అధికంగా పొందిన దాని కన్న ఎక్కువ ప్రయోజనకరమైనది,శుభకరమైనది.ఒక వేళ మీరు సత్య విశ్వాసవంతులే అయితే ఈ మిగిలిన దానితో సంతృప్తి చెందండి.మరియు నేను మీ కర్మలను లెక్క వేయటానికి,వాటి పరంగా మీ లెక్క తీసుకోవటానికి మీపై పర్యవేక్షకుడిగా లేను. రహస్యాల గురించి జ్ఞానం కలవాడు మాత్రమే వాటిపై పర్యవేక్షకుడు.
ئەرەپچە تەپسىرلەر:
قَالُوْا یٰشُعَیْبُ اَصَلٰوتُكَ تَاْمُرُكَ اَنْ نَّتْرُكَ مَا یَعْبُدُ اٰبَآؤُنَاۤ اَوْ اَنْ نَّفْعَلَ فِیْۤ اَمْوَالِنَا مَا نَشٰٓؤُا ؕ— اِنَّكَ لَاَنْتَ الْحَلِیْمُ الرَّشِیْدُ ۟
షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా పలికారు : ఓ షుఐబ్ అల్లాహ్ కొరకు నీవు చదివే నమాజు మా తాత ముత్తాతలు ఆరాధించిన విగ్రహాలను ఆరాధించటమును మేము వదిలివేయాలని నీకు ఆదేశిస్తున్నదా మరియు మేము కోరిన చోట మా సంపదను మేము ఖర్చు చేయటమును,వాటిని మేము కోరిన విధంగా పెంచటమును మేము వదిలేయాలని నిన్ను ఆదేశిస్తున్నదా ?.నిశ్చయంగా నీవే సహన శీలుడివి,ఉదాత్తుడివి.మరియు నిశ్చయంగా నీవే బుద్ధిమంతుడివి,వివేకవంతుడివి ఏ విధంగానైతే మేము నిన్ను ఈ సందేశము ఇవ్వక మునుపు గుర్తించేవారమో.అయితే నీకు ఏమి పట్టుకుంది ?.
ئەرەپچە تەپسىرلەر:
قَالَ یٰقَوْمِ اَرَءَیْتُمْ اِنْ كُنْتُ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَرَزَقَنِیْ مِنْهُ رِزْقًا حَسَنًا ؕ— وَمَاۤ اُرِیْدُ اَنْ اُخَالِفَكُمْ اِلٰی مَاۤ اَنْهٰىكُمْ عَنْهُ ؕ— اِنْ اُرِیْدُ اِلَّا الْاِصْلَاحَ مَا اسْتَطَعْتُ ؕ— وَمَا تَوْفِیْقِیْۤ اِلَّا بِاللّٰهِ ؕ— عَلَیْهِ تَوَكَّلْتُ وَاِلَیْهِ اُنِیْبُ ۟
షుఐబ్ తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతివారా ఒక వేళ నేను నా ప్రభువు వద్ద నుండి ఏదైన స్పష్టమైన నిదర్శనంపై,ఆయన వద్ద నుండి ఏదైన ఆధారంపై ఉండి మరియు ఆయన తన వద్ద నుండి నాకు హలాల్ ఆహారాన్ని,ఆయన వద్ద నుండి దైవ దౌత్యమును ప్రసాధించి ఉంటే మీ పరిస్థితి గురించి నాకు తెలియపరచండి.నేను మిమ్మల్ని ఒక విషయం నుండి వారించి దాన్ని చేయటంలో మీకు వ్యతిరేకంగా చేయదల్చుకో లేదు.నా శక్తి మేరకు మిమ్మల్ని మీ ప్రభువు ఏకత్వం వైపునకు ఆయన విధేయత వైపునకు పిలిచి మీ సంస్కరణ మాత్రమే కోరుతున్నాను.దాన్ని పొందే నాకు భాగ్యము పరిశుద్ధుడైన అల్లాహ్ ద్వారానే జరుగును.ఆయన ఒక్కడిపైనే నేను నా వ్యవహారాలన్నింటిలో నమ్మకమును కలిగి ఉన్నాను మరియు ఆయన వైపునకే నేను మరలుతాను.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من سنن الله إهلاك الظالمين بأشد العقوبات وأفظعها.
కఠినమైన,భయంకరమైన శిక్షల ద్వారా దుర్మార్గులను హతమార్చటం అల్లాహ్ సాంప్రదాయము.

• حرمة نقص الكيل والوزن وبخس الناس حقوقهم.
కొలతల్లో,తూనికల్లో తగ్గించటం,ప్రజల హక్కులను కాలరాయటం నిషిద్ధం.

• وجوب الرضا بالحلال وإن قل.
హలాల్ వాటితో సంతోష పడటం అనివార్యం ఒక వేళ అది కొద్దిగా అయినా సరే.

• فضل الأمر بالمعروف والنهي عن المنكر، ووجوب العمل بما يأمر الله به، والانتهاء عما ينهى عنه.
మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించటం యొక్క ఘనత మరియు ఆల్లాహ్ ఆదేశించిన వాటిని ఆచరించటం,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండటం తప్పనిసరి.

 
مەنالار تەرجىمىسى سۈرە: ھۇد
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش