قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى ئايەت: (266) سۈرە: سۈرە بەقەرە
اَیَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— لَهٗ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ ۙ— وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّیَّةٌ ضُعَفَآءُ ۖۚ— فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِیْهِ نَارٌ فَاحْتَرَقَتْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟۠
మీలో ఎవరైనా ఖర్జూరపు చెట్లు మరియు ద్రాక్ష తీగలు కలిగి ఉండి, మంచి నీటి సెలయేళ్ళు ప్రవహిస్తూ, అన్నీ రకాల పళ్ళుఫలాలు కలిగి ఉన్న తోటను కలిగి ఉండాలని కోరుకుంటున్నారా ?. తోట యజమాని వృద్ధాప్యం వలన ఇక పై పని చేసి సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. అతని పిల్లలు మరీ తక్కువ వయస్సులో ఉండటం వలన పని చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు తీవ్రమైన మంటలతో కూడిన సుడిగాలి ఆ తోటను తాకింది. వృద్ధాప్యం మరియు బలహీనమైన చిన్న పిల్లలతో గడ్డుకాలం గడుపుతున్న అతడి అత్యంత అవసరమైన సమయంలోనే అది పూర్తిగా కాలిపోయింది. తన సంపదను ప్రజలకు చూపడానికి ఖర్చు చేసే వ్యక్తి పరిస్థితి ఈ మనిషి మాదిరిగానే ఉంటుంది. పునరుత్థాన దినమున అతడు అల్లాహ్ ముందు నిలబడిన తరువాత, అతనికి అత్యంత ఎక్కువగా అవసరమైన ఆ క్లిష్టసమయంలో అతని వద్ద పుణ్యఫలాలేవీ మిగిలి ఉండవు. ఈ విధంగా, మీరు శ్రద్ధగా ఆలోచించేందుకు, ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మీకు ఏమి ప్రయోజనకరంగా ఉంటుందో అల్లాహ్ మీకు వివరిస్తున్నాడు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• المؤمنون بالله تعالى حقًّا واثقون من وعد الله وثوابه، فهم ينفقون أموالهم ويبذلون بلا خوف ولا حزن ولا التفات إلى وساوس الشيطان كالتخويف بالفقر والحاجة.
అల్లాహ్ ను విశ్వసించే నిజమైన విశ్వాసులు ఆయన వాగ్దానం మరియు ప్రతిఫలం గురించి ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉంటారు: వారు తమ సంపదను ఎలాంటి భయం లేదా దుఃఖం లేకుండా,షైతాన్ దుష్ప్రేరణల వైపు చూడకుండా - ఉదాహరణకు పేదరికం,అవసరం గురించి భయపెట్టటం - ఖర్చు చేస్తారు.

• الإخلاص من أعظم ما يبارك الأعمال ويُنمِّيها.
చిత్తశుద్ధి ఆచరణలలో శుభాలను కలిగించే మరియు వాటిని పెంపొందించే గొప్ప సాధనం.

• أعظم الناس خسارة من يرائي بعمله الناس؛ لأنه ليس له من ثواب على عمله إلا مدحهم وثناؤهم.
తన మంచి పనులను, పుణ్యకార్యాలను ప్రజల ముందు ప్రదర్శించే వ్యక్తి అందరి కంటే ఎక్కువగా నష్టపోతాడు. ఎందుకంటే అతనికి లభించే ప్రతిఫలం కేవలం ప్రజల ప్రశంసలు మాత్రమే.

 
مەنالار تەرجىمىسى ئايەت: (266) سۈرە: سۈرە بەقەرە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - تەرجىمىلەر مۇندەرىجىسى

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

تاقاش