Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: تاھا   ئايەت:
قَالَ كَذٰلِكَ اَتَتْكَ اٰیٰتُنَا فَنَسِیْتَهَا ۚ— وَكَذٰلِكَ الْیَوْمَ تُنْسٰی ۟
మహోన్నతుడైన అల్లాహ్ అతన్ని ఖండిస్తూ ఇలా పలుకుతాడు : ఇదే విధంగా నీవు ఇహలోకంలో చేశావు, మా సూచనలు నీ వద్దకు వచ్చినవి. అప్పుడు నీవు వాటి నుండి విముఖత చూపి వాటిని వదిలివేశావు. మరియు అలాగే ఈ రోజు నీవు శిక్షలో వదిలివేయబడతావు.
ئەرەپچە تەپسىرلەر:
وَكَذٰلِكَ نَجْزِیْ مَنْ اَسْرَفَ وَلَمْ یُؤْمِنْ بِاٰیٰتِ رَبِّهٖ ؕ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَدُّ وَاَبْقٰی ۟
నిషిద్ధ కోరికల్లో మునిగి ఉండి,తన ప్రభువు వద్ద నుండి వచ్చిన స్పష్టమైన ఆధారాలపై విశ్వాసము నుండి విముఖత చూపిన వాడిని మేము ఈ విధమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. పరలోకములో అల్లాహ్ విధించే శిక్ష ఇహలోకములోని,బర్జఖ్ లోని ఇరుకైన జీవితము కన్న ఎక్కువ భయంకరముగా,తీవ్రంగా,శాస్వతంగా ఉంటుంది.
ئەرەپچە تەپسىرلەر:
اَفَلَمْ یَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنَ الْقُرُوْنِ یَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّاُولِی النُّهٰی ۟۠
ఏమీ ముష్రికులకి మేము వారి కన్న ముందు తుదిముట్టించిన ఎన్నో సమాజాల వారు స్పష్టం కాలేదా ?. వారు వినాశనమునకు గురైన ఈ సమాజముల వారి నివాసములలోనే తిరుగుతున్నారు,వారికి సంభవించిన వాటి గుర్తులను కళ్ళారా చూస్తున్నారు. నిశ్ఛయంగా ఈ చాలా సమాజాల వారికి కలిగిన వినాశనము,విధ్వంసములో బుద్ధిమంతుల కొరకు గుణపాఠము కలదు.
ئەرەپچە تەپسىرلەر:
وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَكَانَ لِزَامًا وَّاَجَلٌ مُّسَمًّی ۟ؕ
ఓ ప్రవక్తా ఒక వేళ నీ ప్రభువు వాదన చేయక ముందే ఎవరిని శిక్షించడని నీ ప్రభువు వద్ద నుండి మాట ముందే జరగక ఉండి ఉంటే,అతని వద్ద వారి కొరకు గడువు ముందే నిర్ణయించకుండా ఉంటే వారిని తొందరగా శిక్షించే వాడు వారు దానికి అర్ఙులు కావటం వలన.
ئەرەپچە تەپسىرلەر:
فَاصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا ۚ— وَمِنْ اٰنَآئِ الَّیْلِ فَسَبِّحْ وَاَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضٰی ۟
ఓ ప్రవక్తా మీతో తిరస్కారులు పలికే అసత్యపు గుణాల పై సహనం పాటించండి. మరియు మీరు సూర్యుడు ఉదయించక మునుపు ఫజర్ నమాజులో,దాని అస్తమించక మునుపు అసర్ నమాజులో,రాత్రి వేళల్లో నుండి మగ్రిబ్,ఇషా నమాజులో,దినపు మొదటి ఘడియల ముగింపు తరువాత సూర్యుడు వాలేటప్పుడు జుహర్ నమాజులో,దినపు రెండవ ఘడియల ముగింపు తరువాత మగ్రిబ్ నమాజులో మీరు ఇష్టపడే ప్రతిఫలమును అల్లాహ్ వద్ద మీరు పొందుతారని ఆశిస్తూ మీ ప్రభువు స్థుతులను కొనియాడుతూ పరిశుద్ధతను పలకండి.
ئەرەپچە تەپسىرلەر:
وَلَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَیٰوةِ الدُّنْیَا ۙ۬— لِنَفْتِنَهُمْ فِیْهِ ؕ— وَرِزْقُ رَبِّكَ خَیْرٌ وَّاَبْقٰی ۟
ఈ అన్ని రకాల తిరస్కారుల కొరకు వారిని మేము పరీక్షించటానికి మేము ఇచ్చి ఉంచిన ప్రాపంచిక జీవిత వైభవాల్లోంచి వారు ప్రయోజనం చెందుతుతున్న వాటి వైపుకు మీరు చూడకండి. నిశ్ఛయంగా వాటిలో నుండి మేము వారి కొరకు తయారు చేసినది తరిగిపోవును. మరియు నీ ప్రభువు ప్రసాదించే ప్రతిఫలం దేని గురించైతే ఆయన నీకు వాగ్దానం చేశాడో చివరికి నీవు సంతుష్టపడ్డావో అది ఇహలోకంలో తరిగిపోయే, వారు ప్రయోజనం చెందే దాని కంటే ఎంతో మేలైనది,శాస్వతమైనది. ఎందుకంటే అది అంతమవ్వదు.
ئەرەپچە تەپسىرلەر:
وَاْمُرْ اَهْلَكَ بِالصَّلٰوةِ وَاصْطَبِرْ عَلَیْهَا ؕ— لَا نَسْـَٔلُكَ رِزْقًا ؕ— نَحْنُ نَرْزُقُكَ ؕ— وَالْعَاقِبَةُ لِلتَّقْوٰی ۟
ఓ ప్రవక్త మీరు మీ ఇంటివారిని నమాజు పాటించమని ఆదేశించండి. మరియు మీరూ దానిని పాటించటంలో సహనం చూపండి. మేము నీతో నీ స్వయం కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి ఆహారమును ఆశించము. మేమే నీకు ఆహారమును ప్రసాదించి పోషిస్తాము. ఇహ,పరలోకాల్లో ప్రశంసనీయమైన పరిణామము అల్లాహ్ తో భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండే భీతిపరుల కొరకు ఉన్నది.
ئەرەپچە تەپسىرلەر:
وَقَالُوْا لَوْلَا یَاْتِیْنَا بِاٰیَةٍ مِّنْ رَّبِّهٖ ؕ— اَوَلَمْ تَاْتِهِمْ بَیِّنَةُ مَا فِی الصُّحُفِ الْاُوْلٰی ۟
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు ఇలా పలికారు : ఎందుకని ముహమ్మద్ తన నిజాయితీ పై,తాను ప్రవక్త అన్న దానిపై సూచించే ఏదైన చిహ్నమును తన ప్రభువు వద్ద నుండి మా వద్దకు తీసుకుని రాడు ?. ఏమీ ఈ తిరస్కారులందరి వద్దకు ఆ ఖుర్ఆన్ ఏదైతే తన పూర్వ దివ్య గ్రంధములను దృవీకరించేదో రాలేదా ?!.
ئەرەپچە تەپسىرلەر:
وَلَوْ اَنَّاۤ اَهْلَكْنٰهُمْ بِعَذَابٍ مِّنْ قَبْلِهٖ لَقَالُوْا رَبَّنَا لَوْلَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ مِنْ قَبْلِ اَنْ نَّذِلَّ وَنَخْزٰی ۟
ఒక వేళ మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును తిరస్కరించిన వీరందరిని వారి వద్దకు మేము ఒక ప్రవక్తను పంపించక ముందు,ఏదైన గ్రంధమును మేము అవతరింపచేయక ముందు వారి అవిశ్వాసం వలన,వారి తిరస్కారము వలన వారిపై శిక్షను అవతరింపజేయటం ద్వారా వినాశనమునకు గురి చేసి ఉంటే ప్రళయదినాన వారు తమ అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుతూ ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు ఎందుకని ఇహలోకంలో మా వద్దకు ఒక ప్రవక్తని పంపించ లేదు ?. నీ శిక్ష వలన మాపై అవమానము,పరాభవము కలగక ముందే ఆయనను విశ్వసించి,ఆయన తీసుకుని వచ్చిన ఆయతులను అనుసరించి ఉండే వాళ్ళము.
ئەرەپچە تەپسىرلەر:
قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوْا ۚ— فَسَتَعْلَمُوْنَ مَنْ اَصْحٰبُ الصِّرَاطِ السَّوِیِّ وَمَنِ اهْتَدٰی ۟۠
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మనలో నుండి,మీలో నుండి ప్రతి ఒక్కరు అల్లాహ్ ఏమి చేస్తాడోనని నిరీక్షిస్తున్నారు. అయితే మీరు కూడా నిరీక్షించండి. ఖచ్చితంగా మీరు తొందరలోనే తెలుసుకుంటారు ఎవరు సన్మార్గ వంతులు,ఎవరు సన్మార్గం పొందుతారో మేమా లేదా మీరా ?.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من الأسباب المعينة على تحمل إيذاء المعرضين استثمار الأوقات الفاضلة في التسبيح بحمد الله.
విముఖులు పెట్టే బాధలను భరించటమునకు సహాయక కారణాల్లొంచి ఒకటి మంచి సమయములను అల్లాహ్ స్థుతులను పలుకుతూ పరిశుద్ధతను కొనియాడటంలో ఉపయోగించటం.

• ينبغي على العبد إذا رأى من نفسه طموحًا إلى زينة الدنيا وإقبالًا عليها أن يوازن بين زينتها الزائلة ونعيم الآخرة الدائم.
దాసుడు తన మనస్సును ప్రాపంచిక అలంకరణను ఆశిస్తూ దాని వైపు ముందడుగు వేస్తున్నట్లు చూస్తే అతడు అంతమైపోయే దాని అలంకరణకు శాస్వతంగా ఉండే పరలోక అనుగ్రహాలకు మధ్య తూలమేయాలి.

• على العبد أن يقيم الصلاة حق الإقامة، وإذا حَزَبَهُ أمْر صلى وأَمَر أهله بالصلاة، وصبر عليهم تأسيًا بالرسول صلى الله عليه وسلم.
దాసుడు నమాజును ఏ విధంగా పాటించే హక్కు ఉన్నదో ఆ విధంగా పాటించటం తప్పనిసరి. అతని ముందట ఏదైన విషయం వచ్చినప్పుడు అతడు నమాజు పాటించాలి.మరియు తమ ఇంటి వారికి నమాజు పాటించమని ఆదేశించాలి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను నమూనాగా తీసుకుని వాటిపై సహనం చూపాలి.

• العاقبة الجميلة المحمودة هي الجنة لأهل التقوى.
అందమైన,ప్రశంసనీయమైన పరిణామము అది స్వర్గము దైవ భీతి కలవారి కొరకు ఉన్నది.

 
مەنالار تەرجىمىسى سۈرە: تاھا
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش