Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: غاپىر   ئايەت:
اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ؗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
నిశ్చయంగా ప్రళయము దేనిలోనైతే అల్లాహ్ మృతులను లెక్కతీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపుతాడో ఖచ్ఛితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మంది ప్రజలు దాని రావటంపై విశ్వసించటంలేదు. అందుకనే వారు దాని కొరకు సిద్ధం చేసుకోవటంలేదు.
ئەرەپچە تەپسىرلەر:
وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۟۠
మరియు మీ ప్రభువు ఇలా పలికాడు : ఓ ప్రజలారా మీరు ఆరాధనలో మరియు అర్ధించటంలో నా ఒక్కడినే ప్రత్యేకించుకోండి. నేను మీ అర్ధనను స్వీకరించి, మీ నుండి మన్నించివేస్తాను మరియు మీపై కరుణిస్తాను. నిశ్చయంగా ఎవరైతే ఆరాధనను నా ఒక్కడికే ప్రత్యేకించటం నుండి అహంకారమును చూపుతారో వారు తొందరలోనే ప్రళయదినమున దిగజారి,అవమానమునకు గురై నరకములో ప్రవేశిస్తారు.
ئەرەپچە تەپسىرلەر:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
అల్లాహ్ యే మీ కొరకు రాత్రిని మీరు అందులో నివాసముండి విశ్రాంతి తీసుకోవటానికి చీకటిగా చేశాడు. మరియు పగలును అందులో మీరు పనులు చేసుకోవటానికి కాంతివంతంగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపట్ల ఎంతో పెద్ద అనుగ్రహుడు అప్పుడే ఆయన వారిపై తన బాహ్యపరమైన మరియు అంతరపరమైన అనుగ్రహములను కురిపించాడు. కానీ చాలా మంది ప్రజలు పరిశుద్ధుడైన ఆయనకు ఆయన అనుగ్రహించిన వాటిపై కృతజ్ఞతలు తెలుపుకోరు.
ئەرەپچە تەپسىرلەر:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَیْءٍ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟
మీ పై తన అనుగ్రహములను కలిగించిన వాడు ఆయనే అల్లాహ్ . ఆయన ప్రతీది సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అటువంటప్పుడు మీరు ఆయన ఆరాధన నుండి ఏ విధమైన లాభమునకు మరియు నష్టమునకు అధికారము లేని ఇతరుల ఆరాధన వైపునకు ఎలా మరలిపోతున్నారు.
ئەرەپچە تەپسىرلەر:
كَذٰلِكَ یُؤْفَكُ الَّذِیْنَ كَانُوْا بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟
వీరందరు అల్లాహ్ పై విశ్వాసము నుండి మరియు ఆయన ఒక్కడి ఆరాధన నుండి మరలిపోయినట్లే ప్రతీ కాలములో ప్రతీ చోట అల్లాహ్ తౌహీద్ పై సూచించే ఆయతులను నిరాకరించేవారు దాని నుండి మరలిపోతారు. వారు సత్యం వైపునకు మార్గం పొందరు. వారికి సన్మార్గము కొరకు సౌభాగ్యం కలిగించబడదు.
ئەرەپچە تەپسىرلەر:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ— فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రజలారా అల్లాహ్ యే మీ కొరకు భూమిని మీరు దానిపై నివాసముండటానికి నివాసస్థలంగా సిద్ధం చేసి ఉంచాడు. మరియు ఆయన ఆకాశమును మీ పై పడిపోవటం నుండి ఆగిపోయినట్లుగా పటిష్టమైవ కట్టడంగా చేశాడు. మరియు మీ తల్లుల గర్భములలో మీకు రూపమునిచ్చి మీ రూపములను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు ఆయన మీకు ధర్మ సమ్మతమైన ఆహారోపాధిని, వాటిలో శ్రేష్ఠమైనవి ప్రసాదించాడు. మీపై ఈ అనుగ్రహములను అనుగ్రహించిన వాడే అల్లాహ్ మీ ప్రభువు. కావున సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ శుభధాయకుడు. పరిశుద్ధుడైన ఆయన తప్ప ఇంకొకరు వారి కొరకు ప్రభువు లేడు.
ئەرەپچە تەپسىرلەر:
هُوَ الْحَیُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
ఆయన మరణించని సజీవుడు. ఆయన తప్ప ఇంకొకరు వాస్తవ ఆరాధ్యుడు లేడు. కావున మీరు ఆయనను ఆరాధన మరియు అర్ధన యొక్క వేడుకోవటమును ఆయన ఒక్కడి మన్నతను ఉద్ధేశించుకుని వేడుకోండి. మరియు మీరు ఆయనతో పాటు ఆయన సృష్టితాల్లోంచి ఇతరులను సాటి కల్పించకండి. పొగడ్తలన్నీ సృష్టితాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి.
ئەرەپچە تەپسىرلەر:
قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِیَ الْبَیِّنٰتُ مِنْ رَّبِّیْ ؗ— وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేని మరియు ఎటువంటి నష్టం కలిగించని మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాలను నేను ఆరాధించటం నుండి ఎప్పుడైతే వాటి ఆరాధన చేయటం అసత్యమని సూచించే స్పష్టమైన ఆధారాలు నా వద్దకు వచ్చాయో నిశ్చయంగా అల్లాహ్ నన్ను వారించాడు. మరియు అల్లాహ్ ఆయన ఒక్కడికే విధేయత చూపుతూ ఆరాధన చేయమని నన్ను ఆదేశించాడు. ఆయనే సృష్టిరాసులన్నింటికి ప్రభువు. ఆయన తప్ప ఇంకెవరూ వారికి ప్రభువు లేడు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• دخول الدعاء في مفهوم العبادة التي لا تصرف إلا إلى الله؛ لأن الدعاء هو عين العبادة.
దుఆ యొక్క ప్రవేశము ఆ ఆరాధన అర్ధములో ఉన్నది దేనినైతే కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయబడుతుంది. ఎందుకంటే దుఆ యే ఆరాధన యొక్క అసలు.

• نعم الله تقتضي من العباد الشكر.
అల్లాహ్ అనుగ్రహములు దాసుల నుండి కృతజ్ఞతలను అనివార్యం చేస్తుంది.

• ثبوت صفة الحياة لله.
అల్లాహ్ కొరకు జీవము యొక్క గుణము నిరూపణ.

• أهمية الإخلاص في العمل.
ఆచరణలో చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యత.

 
مەنالار تەرجىمىسى سۈرە: غاپىر
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش