Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: ئەھقاپ   ئايەت:
وَاذْكُرْ اَخَا عَادٍ اِذْ اَنْذَرَ قَوْمَهٗ بِالْاَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِنْ بَیْنِ یَدَیْهِ وَمِنْ خَلْفِهٖۤ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
ఓ ప్రవక్తా మీరు బంధములో ఆద్ సోదరుడైన హూద్ అలైహిస్సలాం తన జాతివారిని వారిపై వాటిల్లే శిక్ష గురించి హెచ్చరించినప్పటి వైనమును జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు వారు అరేబియా ద్వీపకల్పం యొక్క దక్షిణప్రాంతంలో తమ ఇళ్లల్లో ఉన్నారు. వాస్తవానికి హూద్ కన్న ముందు మరియు ఆయన తరువాత ప్రవక్తలు తమ జాతి వారిని హెచ్చరిస్తూ వారితో ఇలా పలుకుతూ గతించారు : మీరు ఒక్కడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు ఇతరులను ఆరాధించకండి. ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను మీ గురించి గొప్ప దినమైన ప్రళయదిన శిక్ష గురించి భయపడుతున్నాను.
ئەرەپچە تەپسىرلەر:
قَالُوْۤا اَجِئْتَنَا لِتَاْفِكَنَا عَنْ اٰلِهَتِنَا ۚ— فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : ఏమీ నీవు మమ్మల్ని మా దేవతల ఆరాధన నుండి దూరం చేయటానికి మా వద్దకు వచ్చావా ?! అది నీకు జరగదు. నీవు మాకు బేదిరిస్తున్న శిక్షను మా వద్దకు తీసుకునిరా ఒక వేళ నీవు బెదిరిస్తున్న విషయంలో సత్యవంతుడివేనైతే.
ئەرەپچە تەپسىرلەر:
قَالَ اِنَّمَا الْعِلْمُ عِنْدَ اللّٰهِ ؗ— وَاُبَلِّغُكُمْ مَّاۤ اُرْسِلْتُ بِهٖ وَلٰكِنِّیْۤ اَرٰىكُمْ قَوْمًا تَجْهَلُوْنَ ۟
ఆయన ఇలా సమాధానమిచ్చారు : శిక్ష వేళ యొక్క జ్ఞానము అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. మరియు నాకు దాని గురించి ఎటువంటి జ్ఞానం లేదు. నేను మాత్రం నాకు మీ వద్దకు ఇచ్చి పంపించిన సందేశాలను మీకు చేరవేసే ఒక ప్రవక్తను. కాని నేను మిమ్మల్ని, మీకు ప్రయోజనం ఉన్న వాటి విషయంలో అజ్ఞానులై దాన్ని వదిలివేసే మరియు మీకు నష్టం ఉన్న వాటిని పొందే జనులుగా చూస్తున్నాను.
ئەرەپچە تەپسىرلەر:
فَلَمَّا رَاَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ اَوْدِیَتِهِمْ ۙ— قَالُوْا هٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ؕ— بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُمْ بِهٖ ؕ— رِیْحٌ فِیْهَا عَذَابٌ اَلِیْمٌ ۟ۙ
మరి ఎప్పుడైతే వారు తొందర చేసిన శిక్ష వారి వద్దకు వచ్చినదో వారు దాన్ని ఆకాశపు ఒక వైపు ఒక మేఘము రూపంలో ప్రత్యక్షమై తమ లోయల వైపునకు వస్తుండగా చూసి ఇలా పలికారు : ఇది మాపై వర్షమును కురిపించటానికి ప్రత్యక్షమయింది. హూద్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : విషయము మీరు అనుకుంటున్నట్లు అది మీపై వర్షమును కురిపించే మేఘం కాదు. కాని అది మీరు తొందరగా కోరుకున్న శిక్ష. అది ఒక గాలి అందులో ఒక బాధాకరమైన శిక్ష కలదు.
ئەرەپچە تەپسىرلەر:
تُدَمِّرُ كُلَّ شَیْ بِاَمْرِ رَبِّهَا فَاَصْبَحُوْا لَا یُرٰۤی اِلَّا مَسٰكِنُهُمْ ؕ— كَذٰلِكَ نَجْزِی الْقَوْمَ الْمُجْرِمِیْنَ ۟
అల్లాహ్ దేనిని నాశనం చేయమని దానికి ఆదేశించాడో అది ఆ ప్రతీ దానిపై వీచి నాశనం చేస్తుంది. వారి నివాసుమున్న వారి ఇండ్లను వారు ముందు వాటిలో ఉన్నట్లు సాక్ష్యం పలకటమును మాత్రమే కనిపించబడును. తమ అవిశ్వాసం పై మరియు తమ పాపకార్యములపై మొండిగా వ్యవహరించే వారికి మేము ఇటువంటి బాధాకరమైన శిక్షను కలిగిస్తాము.
ئەرەپچە تەپسىرلەر:
وَلَقَدْ مَكَّنّٰهُمْ فِیْمَاۤ اِنْ مَّكَّنّٰكُمْ فِیْهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَّاَبْصَارًا وَّاَفْـِٕدَةً ۖؗ— فَمَاۤ اَغْنٰی عَنْهُمْ سَمْعُهُمْ وَلَاۤ اَبْصَارُهُمْ وَلَاۤ اَفْـِٕدَتُهُمْ مِّنْ شَیْءٍ اِذْ كَانُوْا یَجْحَدُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠
మరియు నిశ్ఛయంగా మేము మీకు ఇవ్వని సాధికారత సాధనాలను హూద్ జాతివారికి ప్రసాదించాము. మరియు మేము వారికి వినగలిగే వినికిడిని మరియు చూడగలిగే చూపును మరియు అర్ధం చేసుకునే హృదయములను చేశాము. అయితే వారి వినికిడి గాని వారి చూపులు గాని వారి బుద్దులు గాని వారికి ఏమాత్రం పనికి రాలేదు. వారి వద్దకు అల్లాహ్ శిక్ష వచ్చినప్పుడు అవి వారి నుండి తొలగించలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు. మరియు వారిపై వారి ప్రవక్త హూద్ అలైహిస్సలాం భయపెట్టిన శిక్షదేని గురించినయితే వారు హేళన చేసే వారో అది కురిసింది.
ئەرەپچە تەپسىرلەر:
وَلَقَدْ اَهْلَكْنَا مَا حَوْلَكُمْ مِّنَ الْقُرٰی وَصَرَّفْنَا الْاٰیٰتِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
ఓ మక్కా వాసులారా నిశ్ఛయంగా మేము మీ చుట్టు ప్రక్కల కల ఎన్నో బస్తీలను నాశనం చేశాము. నిశ్ఛయంగా మేము ఆద్ ను,సమూద్ ను,లూత్ జాతి వారిని మరియు మద్యన్ వారిని నాశనం చేశాము. మరియు మేము వారు తమ అవిశ్వాసము నుండి మరలుతారని ఆశిస్తూ వారి కొరకు రకరకాల వాదనలను,ఆధారాలను ఇచ్చాము.
ئەرەپچە تەپسىرلەر:
فَلَوْلَا نَصَرَهُمُ الَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ قُرْبَانًا اٰلِهَةً ؕ— بَلْ ضَلُّوْا عَنْهُمْ ۚ— وَذٰلِكَ اِفْكُهُمْ وَمَا كَانُوْا یَفْتَرُوْنَ ۟
అయితే వారు అల్లాహ్ ను వదిలి దేవతలుగా తయారు చేసుకుని,ఆరాధన ద్వారా,బలి ఇవ్వటం ద్వారా వారు దగ్గరత్వమును పొందిన విగ్రహాలు ఎందుకని వారికి సహాయం చేయలేదు ?! అవి వారికి ఖచ్చితంగా సహాయం చేయవు. అంతే కాదు వారికి వారు అత్యంత అవసరమైనప్పుడు వారు వారి నుండి అదృశ్యమైపోయారు. మరియు ఈ విగ్రహాలు వారికి ప్రయోజనం కలిగిస్తాయని మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని వారు ఏదైతే ఆశించారో అదంతా వారి అబద్దము మరియు వారి కల్పన.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• لا علم للرسل بالغيب إلا ما أطلعهم ربهم عليه منه.
ప్రవక్తలకు అగోచర విషయముల గురించి వారి ప్రభువు వారికి తెలిపినది తప్ప దాని నుండి వారికి తెలియదు.

• اغترار قوم هود حين ظنوا العذاب النازل بهم مطرًا، فلم يتوبوا قبل مباغتته لهم.
తమపై దిగే శిక్షను వర్షంగా భావించి హూద్ జాతి వారు మోసపోయారు. అది వారికి ఆశ్ఛర్యమునకు లోను చేయక ముందు వారు పశ్ఛాత్తాప్పడలేదు.

• قوة قوم عاد فوق قوة قريش، ومع ذلك أهلكهم الله.
ఆద్ జాతి వారి శక్తి ఖురేష్ శక్తి కన్న ఎక్కువ. అయినా కూడా అల్లాహ్ వారిని నాశనం చేశాడు.

• العاقل من يتعظ بغيره، والجاهل من يتعظ بنفسه.
ఇతరుల నుండి హితోపదేశం గ్రహించేవాడు బుద్ధిమంతుడు. మరియు తనను తాను హితోపదేశం చేసుకునేవాడు అజ్ఞాని.

 
مەنالار تەرجىمىسى سۈرە: ئەھقاپ
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش