Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: مائىدە   ئايەت:
وَلَوْ اَنَّ اَهْلَ الْكِتٰبِ اٰمَنُوْا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَلَاَدْخَلْنٰهُمْ جَنّٰتِ النَّعِیْمِ ۟
మరియు ఒక వేళ యూదులు మరియు క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించి మరియు పాప కార్యముల నుండి దూరంగా ఉండి అల్లాహ్ కు భయపడి ఉంటే మేము వారు పాల్పడిన పాపములను వారి నుండి ప్రక్షాళణ చేస్తాము ఒక వేళ అవి అధికంగా ఉన్నా సరే. మరియు మేము వారిని ప్రళయదినమున అనుగ్రహాలు కల స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాము. వారు అందులో ఉన్న అంతము కాని సుఖభోగాలను అనుభవిస్తారు.
ئەرەپچە تەپسىرلەر:
وَلَوْ اَنَّهُمْ اَقَامُوا التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِمْ مِّنْ رَّبِّهِمْ لَاَكَلُوْا مِنْ فَوْقِهِمْ وَمِنْ تَحْتِ اَرْجُلِهِمْ ؕ— مِنْهُمْ اُمَّةٌ مُّقْتَصِدَةٌ ؕ— وَكَثِیْرٌ مِّنْهُمْ سَآءَ مَا یَعْمَلُوْنَ ۟۠
మరియు ఒక వేళ యూదులు తౌరాతులో ఉన్న దాని ప్రకారం ఆచరిస్తే మరియు క్రైస్తవులు ఇంజీలులో ఉన్న దాని ప్రకారం ఆచరిస్తే మరియు వారందరు తమపై అవతరింపబడిన ఖుర్ఆన్ ప్రకారం ఆచరిస్తే నేను వారి కొరకు ఆహారోపాధి కారకాలైన వర్షమును కురిపించటం మరియు భూమిని మొలకెత్తించటమును శులభతరం చేస్తాము. గ్రంధవహుల్లోంచి కొంత మంది సత్యముపై సరిగా, నిలకడగా ఉన్నారు. వారిలో నుండి చాలా మంది ఆచరణ వారి విశ్వాసం లేకపోవటం వలన చెడుగా ఉన్నది.
ئەرەپچە تەپسىرلەر:
یٰۤاَیُّهَا الرَّسُوْلُ بَلِّغْ مَاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ ؕ— وَاِنْ لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهٗ ؕ— وَاللّٰهُ یَعْصِمُكَ مِنَ النَّاسِ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟
ఓ ప్రవక్తా మీ ప్రభువు వద్ద నుండి మీ వైపునకు అవతరింపబడిని దాన్ని పరిపూర్ణంగా తెలియపరచండి. అందులో నుంచి ఏదీ మీరు దాయకండి. ఒక వేళ మీరు అందులో నుండి ఏదైన దాచితే మీరు మీ ప్రభువు సందేశమును చేరవేసినవారు కాదు. (వాస్తవానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు చేరవేయమని ఆదేశించిన వాటన్నింటిని చేరవేశారు. అయితే ఎవరైన దీనికి విరుద్ధంగా భావిస్తే అది అల్లాహ్ పై పెద్ద నిందే.) ఈ రోజు తరువాత అల్లాహ్ మిమ్మల్ని ప్రజల నుండి కాపాడుతాడు. వారు మీకు చెడును కలిగించలేరు. సందేశములను చేరవేయటం మాత్రం మీపై బాధ్యత కలదు. సన్మార్గమును కోరని అవిశ్వాసపరులకు అల్లాహ్ సన్మార్గమును పొందే భాగ్యమును కలిగించడు.
ئەرەپچە تەپسىرلەر:
قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لَسْتُمْ عَلٰی شَیْءٍ حَتّٰی تُقِیْمُوا التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ وَمَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ ؕ— وَلَیَزِیْدَنَّ كَثِیْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ طُغْیَانًا وَّكُفْرًا ۚ— فَلَا تَاْسَ عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : ఓ యూదులు మరియు క్రైస్తవులారా మీరు తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్నవాటిని మరియు మీపై అవతరింపబడినటువంటి ఖుర్ఆన్ ను దాన్ని విశ్వసిస్తేనే మరియు దానిలో ఉన్నవాటిని ఆచరిస్తేనే తప్ప మీ విశ్వాసము సరికాదు ఆచరించనంత వరకు మీరు గుర్తించబడిన ధర్మము పై లేరు. మరియు గ్రంధవహుల్లోంచి చాలా మందిని వారికి ఉన్న అసూయ వలన మీ ప్రభువు తరుపు నుండి మీపై అవతరింపబడినది తలబిరుసుతనంపై తలబిరుసుతనాన్ని మరియు అవిశ్వాసంపై అవిశ్వాసమును అధికం చేస్తుంది. కావున మీరు ఈ అవిశ్వాసపరులందరిపై విచారించకండి ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే విశ్వాసపరుల్లో వారి అవసరం లేకుండా చేసింది.
ئەرەپچە تەپسىرلەر:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالصّٰبِـُٔوْنَ وَالنَّصٰرٰی مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
నిశ్ఛయంగా విశ్వాసపరులు,యూదులు,కొంతమంది ప్రవక్తలను అనుసరించిన వారిలో నుంచి ఒక వర్గమైన సాబియీలు మరియు క్రైస్తవులు వారిలో నుండి ఎవరైనా అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తే తాము ఎదుర్కొనే వాటి విషయంలో వారిపై ఎటువంటి భయం ఉండదు. మరియు ప్రాపంచిక భాగముల్లోంచి తాము కోల్పోయిన వాటిపై వారికి దుఃఖము కలగదు.
ئەرەپچە تەپسىرلەر:
لَقَدْ اَخَذْنَا مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَاَرْسَلْنَاۤ اِلَیْهِمْ رُسُلًا ؕ— كُلَّمَا جَآءَهُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰۤی اَنْفُسُهُمْ ۙ— فَرِیْقًا كَذَّبُوْا وَفَرِیْقًا یَّقْتُلُوْنَ ۟ۗ
నిశ్చయంగా మేము ఇస్రాయీలు సంతతి వారితో వినటం మరియు విధేయత చూపటం పై దృఢమైన ప్రమాణములను తీసుకున్నాము. మరియు మేము అల్లాహ్ షరీఅత్ ను వారికి చేరవేయటానికి వారి వైపు ప్రవక్తలను పంపించాము. అయితే వారు తమతో తీసుకోబడిన వాటిలో నుండి భంగపరిచారు. మరియు తమ మనో వాంఛలు నిర్దేశించినటువంటి తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి నుండి విముఖత చూపటం మరియు వారిలో నుండి కొందరిని తిరస్కరించటం మరియు కొందరిని హతమర్చటంను అనుసరించారు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• العمل بما أنزل الله تعالى سبب لتكفير السيئات ودخول الجنة وسعة الأرزاق.
మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటి ప్రకారం ఆచరించటం పాపముల విమోచనం కొరకు మరియు స్వర్గంలో ప్రవేశము కొరకు మరియు ఆహారోపాధులలో విస్తృత కొరకు ఒక కారణం.

• توجيه الدعاة إلى أن التبليغ المُعتَدَّ به والمُبْرِئ للذمة هو ما كان كاملًا غير منقوص، وفي ضوء ما ورد به الوحي.
గుర్తింపబడే సందేశ ప్రచారము మరియు బాధ్యత నుండి ఉపశమనం కలిగించే దాని వైపునకు సందేశ ప్రచారకులను మరల్చటం అది ఎటువంటి తరగుదల లేకుండా పరిపూర్ణమైనదై ఉండాలి మరియు దైవ వాణి ప్రకారం ఉండాలి.

• لا يُعْتد بأي معتقد ما لم يُقِمْ صاحبه دليلًا على أنه من عند الله تعالى.
ఏ విశ్వాసం కూడా దాన్ని తీసుకుని వచ్చిన వారు అది అల్లాహ్ తరపు నుండి అని నిరూపించనంతవరకు షుమారు చేయబడదు.

 
مەنالار تەرجىمىسى سۈرە: مائىدە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش