Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: تۇر   ئايەت:
اَمْ تَاْمُرُهُمْ اَحْلَامُهُمْ بِهٰذَاۤ اَمْ هُمْ قَوْمٌ طَاغُوْنَ ۟ۚ
ఏమీ వారి మాట నిశ్చయంగా అతడు జ్యోతిష్యుడు,పిచ్చివాడు అని వారి మనస్సులు వారిని ఆదేశిస్తున్నాయా ?! వారు ఒక వ్యక్తిలో ఇమడని వాటి మధ్య సమీకరిస్తున్నారు. అంతే కాదు వారు హద్దులను అతిక్రమించిన జనులు. కావున వారు ఏ ధర్మ శాసనం వైపునకు గాని ఏ బుద్ధి వైపున గాని మరలరు.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ یَقُوْلُوْنَ تَقَوَّلَهٗ ۚ— بَلْ لَّا یُؤْمِنُوْنَ ۟ۚ
లేదా వారు నిశ్చయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను అల్లుకున్నాడు అని, అది దివ్య వాణి ద్వారా అవతరింపబడలేదని అంటున్నారా ?! ఆయన దాన్ని అల్లుకోలేదు. కాని వారే దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపుతున్నారు అప్పుడే వారు ఆయన దాన్ని అల్లుకున్నాడు అని చెబుతున్నారు.
ئەرەپچە تەپسىرلەر:
فَلْیَاْتُوْا بِحَدِیْثٍ مِّثْلِهٖۤ اِنْ كَانُوْا صٰدِقِیْنَ ۟ؕ
అయితే వారు దాని లాంటి వాక్కును తీసుకుని రావాలి ఒక వేళ అది అల్లించబడి ఉంటే,ఒక వేళ వారు ఆయన అల్లుకున్నారు అన్న తమ వాదనలో సత్యవంతులే అయితే.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ خُلِقُوْا مِنْ غَیْرِ شَیْءٍ اَمْ هُمُ الْخٰلِقُوْنَ ۟ؕ
లేదా వారు ఏ సృష్టి కర్త సృష్టించకుండానే సృష్టించబడ్డారా ?! లేదా వారు తమను స్వయంగా సృష్టించుకున్నారా ?! ఎటువంటి సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రావటం సంభవం కాదు. మరియు ఏ సృష్టి సృష్టించబడదు. అటువంటప్పుడు వారు తమ సృష్టికర్తను ఎందుకు ఆరాధించటంలేదు ?!
ئەرەپچە تەپسىرلەر:
اَمْ خَلَقُوا السَّمٰوٰتِ وَالْاَرْضَ ۚ— بَلْ لَّا یُوْقِنُوْنَ ۟ؕ
లేదా వారు ఆకాశములను మరియు భూమిని సృష్టించారా ?! అలా కాదు అల్లాహ్ వారి సృష్టికర్త అని విశ్వసించటంలేదు. ఒక వేళ వారు దానిని విశ్వసిస్తే ఆయన ఏకత్వమును చాటేవారు మరియు ఆయన ప్రవక్తను విశ్వసించేవారు.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ عِنْدَهُمْ خَزَآىِٕنُ رَبِّكَ اَمْ هُمُ الْمُصَۜیْطِرُوْنَ ۟ؕ
లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క ఆహార నిక్షేపాలున్నాయా దాన్ని వారు తాము తలచిన వారికి ప్రసాదించటానికి, మరియు దైవదౌత్యమున్నదా దాన్ని వారు తాము తలచిన వారికి ఇవ్వటానికి మరియు దాన్ని ఆపటానికి ?! లేదా వారు తమ ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించే అధికారులా ?!
ئەرەپچە تەپسىرلەر:
اَمْ لَهُمْ سُلَّمٌ یَّسْتَمِعُوْنَ فِیْهِ ۚ— فَلْیَاْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ؕ
లేదా వారి కొరకు ఏదైన నిచ్చెన ఉన్నదా దాని ద్వారా వారు ఆకాశముపై ఎక్కి అక్కడ వారు సత్యంపై ఉన్నారని అల్లాహ్ అవతరింపజేసిన ఏదైన దైవవాణిని వింటున్నారా ?! వారిలో నుండి ఆ దైవవాణి విన్నవారు తాము సత్యంపై ఉన్నామని వాదిస్తున్న విషయంతో తమను మిమ్మల్ని దృవీకరించే ఏదైన స్పష్టమైన వాదనను తీసుకుని రావాలి.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ لَهُ الْبَنٰتُ وَلَكُمُ الْبَنُوْنَ ۟ؕ
లేదా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయనకు మీకు ఇష్టంలేని కుమార్తెలు మరియు మీకు మీరు ఇష్టపడే కుమారులా ?!
ئەرەپچە تەپسىرلەر:
اَمْ تَسْـَٔلُهُمْ اَجْرًا فَهُمْ مِّنْ مَّغْرَمٍ مُّثْقَلُوْنَ ۟ؕ
లేదా ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు వద్ద నుండి వారికి చేరవేసిన వాటిపై మీరు వారి నుండి ఏదైన ప్రతిఫలం అడుగుతున్నారా ?! దాని వలన వారు తాము మోయలేని భారమును మోసే బాధ్యులవుతున్నారు.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ عِنْدَهُمُ الْغَیْبُ فَهُمْ یَكْتُبُوْنَ ۟ؕ
లేదా వారి వద్ద అగోచర జ్ఞానమున్నదా వారు తాము తెలుసుకున్న అగోచర విషయాలను ప్రజల కొరకు వ్రాసుకుని వాటిలో నుండి తాము తలచిన వాటిని వారికి తెలియపరుస్తున్నారా ?!
ئەرەپچە تەپسىرلەر:
اَمْ یُرِیْدُوْنَ كَیْدًا ؕ— فَالَّذِیْنَ كَفَرُوْا هُمُ الْمَكِیْدُوْنَ ۟ؕ
లేదా ఈ తిరస్కారులందరు మీ గురించి మరియు మీ ధర్మం గురించి ఏదైన కుట్రను పన్నుతున్నారా ?! అయితే మీరు అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచిన వారే తమ కుట్రకు గురవుతారు మీరు కాదు.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ لَهُمْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ ۟
లేదా వారి కొరకు అల్లాహ్ కాక వేరే ఆరాధ్యదైవమున్నాడా ?! అల్లాహ్ వారు ఆయనకు అంటగడుతున్న భాగస్వాముల నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. పైన పేర్కొనబడినవన్నీ జరగలేదు. మరియు ఏవిధంగాను ఊహించబడవు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِنْ یَّرَوْا كِسْفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا یَّقُوْلُوْا سَحَابٌ مَّرْكُوْمٌ ۟
మరియు ఒక వేళ వారు ఆకాశము నుండి ఏదైన తునకను రాలటమును చూస్తే దాని గురించి ఇలా పలికేవారు : ఇది ఎప్పటిలాగే ఒకదానిపై ఒకటి పేరుకున్న ఒక మేఘము. వారు హితబోధన గ్రహించరు మరియు విశ్వసించరు.
ئەرەپچە تەپسىرلەر:
فَذَرْهُمْ حَتّٰی یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ فِیْهِ یُصْعَقُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా తాము శిక్షింపబడే రోజును వారు పొందనంతవరకు తమ వ్యతిరేకతలో మరియు తమ తిరస్కారములో వారిని మీరు వదిలివేయండి.
ئەرەپچە تەپسىرلەر:
یَوْمَ لَا یُغْنِیْ عَنْهُمْ كَیْدُهُمْ شَیْـًٔا وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟ؕ
ఆ రోజు వారి కుట్ర వారికి కొంచము గాని లేదా ఎక్కువ గాని ప్రయోజనం కలిగించదు. మరియు వారు తమను శిక్ష నుండి రక్షించుకుని సహాయము చేసుకోలేరు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا عَذَابًا دُوْنَ ذٰلِكَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా షిర్కు ద్వారా మరియు పాపకార్యముల ద్వారా తమకు అన్యాయం చేసుకున్న వారికి పరలోక శిక్ష కన్న ముందు ఇహలోకంలో హతమార్చటం,బందీ చేయటం ద్వారా మరియు బర్జఖ్ లో సమాధి శిక్ష ద్వారా శిక్ష కలదు. మరియు వారిలో చాలామందికి అది తెలియదు. అందుకనే వారు తమ అవిశ్వాసంపై స్థిరంగా ఉన్నారు.
ئەرەپچە تەپسىرلەر:
وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَاِنَّكَ بِاَعْیُنِنَا وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِیْنَ تَقُوْمُ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు తీర్పుపై మరియు తన ధర్మ ఆదేశముపై సహనం చూపండి. నిశ్చయంగా మీరు మా చూపుల ముందు,మా పర్యవేక్షణలో ఉన్నారు. మరియు మీరు మీ నిదుర నుండి మేల్కొన్నప్పుడు మీ ప్రభువు యొక్క పరిశుద్ధతను స్థుతుల ద్వారా కొనియాడండి.
ئەرەپچە تەپسىرلەر:
وَمِنَ الَّیْلِ فَسَبِّحْهُ وَاِدْبَارَ النُّجُوْمِ ۟۠
మరియు రాత్రి నీ ప్రభువు యొక్క పరిశుద్ధతను కొనియాడి ఆయన కొరకు నమాజును పాటించు. మరియు నక్షత్రములు పగటి వెలుగులో అస్తమించి మరలేవేళ ఫజర్ నమాజును పాటించు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం.

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత.

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ.

 
مەنالار تەرجىمىسى سۈرە: تۇر
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش