Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: نەجم   ئايەت:
اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَیُسَمُّوْنَ الْمَلٰٓىِٕكَةَ تَسْمِیَةَ الْاُ ۟
నిశ్చయంగా పరలోక నివాసములో మరల లేపబడటం గురించి విశ్వసించని వారు దైవదూతలను వారు అల్లాహ్ కుమార్తెలు అన్న తమ విశ్వాసముతో స్త్రీల పేర్లను పెట్టుకున్నారు. అల్లాహ్ వారి మాటల నుండి ఎంతో మహోన్నతుడు.
ئەرەپچە تەپسىرلەر:
وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ— وَاِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْـًٔا ۟ۚ
మరియు వారికి వారిని స్త్రీలుగా పేర్లు పెట్టుకోటానికి ఎటువంటి ఆధారపూరితమైన జ్ఞానం లేదు. వారు ఈ విషయంలో ఊహగానాలను మరియు భ్రమను మాత్రమే అనుసరిస్తున్నారు. భ్రమ సత్యం విషయంలో దాని స్థానములో నిలబడనంతవరకు ప్రయోజనం కలిగించదు.
ئەرەپچە تەپسىرلەر:
فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰی ۙ۬— عَنْ ذِكْرِنَا وَلَمْ یُرِدْ اِلَّا الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ స్మరణ నుండి వీపు త్రిప్పుకుని,దాని గురించి పట్టించుకోని మరియు ఇహలోక జీవితమునే ఆశించే వ్యక్తి నుండి మీరు ముఖం త్రిప్పుకోండి. అతడు తన పరలోకం కొరకు ఆచరించడు. ఎందుకంటే అతడు దాన్ని విశ్వసించడు.
ئەرەپچە تەپسىرلەر:
ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰی ۟
ఈ ముష్రికులందరు దైవదూతలను స్త్రీల పేర్లు పెట్టి ఏదైతే పలుకుతున్నారో వారు చేరే వారి జ్ఞాన పరిధి. ఎందుకంటే వారు అజ్ఞానులు. వారు వాస్తవమునకు చేరలేదు. ఓ ప్రవక్తా నిశ్చయంగా సత్య మార్గము నుండి మరలిపోయిన వారి గురించి మీ ప్రభువుకే బాగా తెలుసు. మరియు ఆయన మార్గమును పొందే వారి గురించి ఆయనకే బాగా తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
ئەرەپچە تەپسىرلەر:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۙ— لِیَجْزِیَ الَّذِیْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَیَجْزِیَ الَّذِیْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰی ۟ۚ
ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అధికారక పరంగా, సృష్టి పరంగా మరియు కార్య నిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఇహలోకము దుష్కర్మలు చేసిన వారికి యోగ్యమైన శిక్షను కలిగించటానికి మరియు సత్కర్మలు చేసిన విశ్వాసపరులకు స్వర్గమును ప్రసాదించటానికి.
ئەرەپچە تەپسىرلەر:
اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ— اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ— هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ— فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ— هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰی ۟۠
మరియు ఎవరైతే చిన్న పాపములు కాకుండా పెద్ద పాపముల నుండి మరియు అసహ్యకరమైన పాపముల నుండి దూరంగా ఉంటారో ఇవి (చిన్న పాపములు) పెద్ద పాపములను వదిలి వేయటం వలన,విధేయత కార్యములను అధికంగా చేయటం వలన మన్నించబడుతాయి. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు విశాలమైన మన్నింపు కలవాడు. ఆయన తన దాసుల పాపములను వారు వాటి నుండి మన్నింపు వేడుకున్నప్పుడు మన్నిస్తాడు. పరిశుద్ధుడైన ఆయనకు మీ స్థితులను గురించి మరియు మీ వ్యవహారముల గురించి మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించబడినప్పుడు మరియు మీరు మీ మాతృ గర్భముల్లో పిండములుగా ఉండి పుట్టుక తరువాత సృష్టించబడినప్పుడు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పై మీరు స్వయంగా దైవభీతిపరులని గొప్పగా చెప్పుకోకండి. పరిశుద్ధుడైన ఆయనకు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడే వారి గురించి బాగా తెలుసు.
ئەرەپچە تەپسىرلەر:
اَفَرَءَیْتَ الَّذِیْ تَوَلّٰی ۟ۙ
ఇస్లాం నుండి అది దగ్గరైన తరువాత విముఖత చూపిన వాడి దుర్భర స్థితిని మీరు చూశారా ?.
ئەرەپچە تەپسىرلەر:
وَاَعْطٰی قَلِیْلًا وَّاَكْدٰی ۟
మరియు అతడు సంపద నుండి కొద్దిగా ఇచ్చి ఆ తరువాత ఆగిపోయాడు ఎందుకంటే పిసినారితనం అతని తీరు. అయినా కూడా అతడు తన గొప్పలు చెప్పుకునేవాడు.
ئەرەپچە تەپسىرلەر:
اَعِنْدَهٗ عِلْمُ الْغَیْبِ فَهُوَ یَرٰی ۟
ఏమీ అతను చూడటానికి మరియు అగోచర విషయాలు మాట్లాడటానికి అతని వద్ద అగోచర జ్ఞానమున్నదా ?!.
ئەرەپچە تەپسىرلەر:
اَمْ لَمْ یُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰی ۟ۙ
లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడా ? లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్న ఇతడికి అల్లాహ్ మూసాపై అవతరింపజేసిన మొదటి గ్రంధముల్లో ఉన్న వాటి గురించి తెలియపరచబడలేదా ?.
ئەرەپچە تەپسىرلەر:
وَاِبْرٰهِیْمَ الَّذِیْ وَ ۟ۙ
మరియు తన ప్రభువు తనకు ఇచ్చిన బాధ్యతలన్నింటిని నెరవేర్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం గ్రంధముల్లో.
ئەرەپچە تەپسىرلەر:
اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ۟ۙ
ఏ మనిషి ఇతరుల పాప బరువును మోయడని.
ئەرەپچە تەپسىرلەر:
وَاَنْ لَّیْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰی ۟ۙ
మరియు మనిషికి తాను చేసుకున్న కర్మల ప్రతిఫలం మాత్రమే ఉంటుందని.
ئەرەپچە تەپسىرلەر:
وَاَنَّ سَعْیَهٗ سَوْفَ یُرٰی ۟
మరియు అతడు తొందరలోనే తన కర్మను ప్రళయదినమున కళ్ళారా చూపబడుతుందని.
ئەرەپچە تەپسىرلەر:
ثُمَّ یُجْزٰىهُ الْجَزَآءَ الْاَوْفٰی ۟ۙ
ఆ తరువాత అతని కర్మ ప్రతిఫలం ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది.
ئەرەپچە تەپسىرلەر:
وَاَنَّ اِلٰی رَبِّكَ الْمُنْتَهٰی ۟ۙ
ఓ ప్రవక్తా దాసుని మరలే చోటు,వారి గమ్య స్థానము వారి మరణము తరువాత నీ ప్రభువు వైపే ఉంటుందని.
ئەرەپچە تەپسىرلەر:
وَاَنَّهٗ هُوَ اَضْحَكَ وَاَبْكٰی ۟ۙ
మరియు ఆయనే తాను నవ్వింపదలచిన వారికి నవ్వించే వాడని మరియు తాను బాధ కలిగించదలచిన వాడిని ఏడ్పిస్తాడని.
ئەرەپچە تەپسىرلەر:
وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَاَحْیَا ۟ۙ
మరియు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్న వారికి మరణమును కలిగిస్తాడని మరియు మృతులను మరణాంతరం లేపి జీవింపజేస్తాడని.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• انقسام الذنوب إلى كبائر وصغائر.
మహాపరాదాలు పెద్దవి మరియు చిన్నవి గా విభజించబడటం.

• خطورة التقوُّل على الله بغير علم.
ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ పై అబద్దమును కల్పించటం యొక్క ప్రమాదం.

• النهي عن تزكية النفس.
తనను తాను గొప్పలు చెప్పుకోవటం నిషేధించబడినది.

 
مەنالار تەرجىمىسى سۈرە: نەجم
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش