Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: ئەئراپ   ئايەت:
اِنَّ وَلِیِّ اللّٰهُ الَّذِیْ نَزَّلَ الْكِتٰبَ ۖؗ— وَهُوَ یَتَوَلَّی الصّٰلِحِیْنَ ۟
నిశ్చయంగా నా యొక్క సహాయకుడైన,నాకు తోడ్పడేవాడైన అల్లాహ్ ఏ నన్ను రక్షిస్తాడు. ఆయన తప్ప ఇంకొకరితో ఆశించను. మీ విగ్రహాల్లోంచి ఎవరితోను నేను భయపడను. ఆయనే ఖుర్ఆనును ప్రజలకు సన్మార్గం చూపే దానిగా నాపై అవతరింపజేశాడు. ఆయనే తన దాశుల్లోంచి సద్వర్తనులతో స్నేహం చేసి ఆయనే వారిని పరిరక్షిస్తాడు మరియు వారికి సహాయపడుతాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَالَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَكُمْ وَلَاۤ اَنْفُسَهُمْ یَنْصُرُوْنَ ۟
ఓ ముష్రికులారా మీరు ఈ విగ్రహాల్లోంచి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి మీకు సహాయం చేసే శక్తి లేదు. తమ స్వయానికి కూడా సహాయం చేసుకునే శక్తి లేదు. వారు నిస్సహాయులు.అటువంటప్పుడు మీరు అల్లాహ్ ని వదిలి వారిని ఎలా ఆరాధిస్తారు ?.
ئەرەپچە تەپسىرلەر:
وَاِنْ تَدْعُوْهُمْ اِلَی الْهُدٰی لَا یَسْمَعُوْا ؕ— وَتَرٰىهُمْ یَنْظُرُوْنَ اِلَیْكَ وَهُمْ لَا یُبْصِرُوْنَ ۟
ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని ఒక వేళ మీరు సన్మార్గం వైపునకు పిలిచినా వారు మీ పిలుపును వినలేరు. నీవు వారిని నీ ముందట నిలబడి శిల్పించబడిన కళ్ళతో చూస్తున్నట్లుగా భావిస్తావు. అవి స్ధిరంగా ఉన్నవి అవి చూడలేవు. వారు (ముష్రికులు) ఆదమ్ యొక్క సంతతి రూపంలో,జంతువుల రూపంలో విగ్రహాలను తయారు చేసేవారు. వాటికి చేతులు ,కాళ్లు,కళ్లు ఉండేవి. కాని అవి కదలలేని స్ధిర రాసులు.వాటిలో ఎటువంటి జీవము లేదు. ఎటువంటి కదలిక లేదు.
ئەرەپچە تەپسىرلەر:
خُذِ الْعَفْوَ وَاْمُرْ بِالْعُرْفِ وَاَعْرِضْ عَنِ الْجٰهِلِیْنَ ۟
ఓ ప్రవక్త ప్రజల మనసులు దేనిని అనుమతిస్తాయో వాటిని,వారిపై సౌలభ్యమైన కార్యాలు,గుణాలను వారి నుండి స్వీకరించండి. వారి మనస్సులు అంగీకరించని వాటిని వారిపై బాధ్యతగా వేయకండి. ఎందుకంటే అవి వారిలో ధ్వేషాన్ని పెంచుతాయి. ప్రతి మంచి మాట,మంచి కార్యము చేయటం గురించి మీరు ఆదేశించండి. మూర్ఖుల నుండి ముఖము త్రిప్పుకోండి. వారి మూర్ఖత్వముతో మీరు వారితో పోటీపడకండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని బాధపెట్టకండి. మిమ్మల్ని నిరాకరించిన వారిని నిరాకరించకండి.
ئەرەپچە تەپسىرلەر:
وَاِمَّا یَنْزَغَنَّكَ مِنَ الشَّیْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ ప్రవక్తా షైతాను మిమ్మల్ని దుష్ప్రేరణ ద్వార ,మంచి చేయటం నుండి నిరుత్సాహము ద్వారా ముట్టుకుంటాడని తెలిస్తే మీరు అల్లాహ్ ను వేడుకోండి,ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మీరు చెబుతున్న వాటిని ఆయన వినేవాడును,మీ వేడుకలను బాగా తెలిసిన వాడును. అయితే ఆయన షైతాను నుండి మిమ్మల్ని కాపాడుతాడు.
ئەرەپچە تەپسىرلەر:
اِنَّ الَّذِیْنَ اتَّقَوْا اِذَا مَسَّهُمْ طٰٓىِٕفٌ مِّنَ الشَّیْطٰنِ تَذَكَّرُوْا فَاِذَا هُمْ مُّبْصِرُوْنَ ۟ۚ
నిశ్చయంగా అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగిన వారికి పాపమునకు పాల్పడటానికి షైతాను తరపు నుండి దుష్ప్రేరణ కలిగినప్పుడు వారు అల్లాహ్ గొప్పతనమును,ఆయన పై అవిధేయతకు పాల్పడే వారి కొరకు ఆయన శిక్షను,విధేయత చూపే వారికి ఆయన పుణ్యమును గుర్తు చేసుకుంటారు. వారు తమ వలన జరిగిన పాపము నుండి మన్నింపు వేడుకుంటారు. తమ ప్రభువు వైపునకు మరలుతారు. అప్పుడు వారు సత్యముపై సక్రమంగా ఉంటారు. వారు ఉన్న దాని నుండి మేల్కొంటారు,విడనాడుతారు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِخْوَانُهُمْ یَمُدُّوْنَهُمْ فِی الْغَیِّ ثُمَّ لَا یُقْصِرُوْنَ ۟
పాపాత్ములు,అవిశ్వాసపరుల్లోంచి షైతానుల సోదరులకు షైతానులు పాపము వెనుక పాపము ద్వారా అపమార్గములో వారిని పెంచుకుంటూ పోతారు. మార్గవిహీనతకు గురి చేయటం నుండి,అప మార్గమునకు గురి చేయటం నుండి షైతానులు,మానవుల్లోంచి పాపాత్ములు ఆగరు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِذَا لَمْ تَاْتِهِمْ بِاٰیَةٍ قَالُوْا لَوْلَا اجْتَبَیْتَهَا ؕ— قُلْ اِنَّمَاۤ اَتَّبِعُ مَا یُوْحٰۤی اِلَیَّ مِنْ رَّبِّیْ ۚ— هٰذَا بَصَآىِٕرُ مِنْ رَّبِّكُمْ وَهُدًی وَّرَحْمَةٌ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఏదైన సూచనను తీసుకుని వచ్చినప్పుడు వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. దాని నుండి ముఖము తిప్పేస్తారు. ఒక వేళ మీరు వారి వద్దకు సూచనను తీసుకుని రాకపోతే వారు ఇలా అంటారు : మీరు మీ తరపు నుండి ఏదైన సూచనను కనిపెట్టలేరా,తయారు చేయలేరా?. ఓ ప్రవక్తా మీరు వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : నా తరపు నుండి ఏ ఒక సూచనను తీసుకు రావటం తగదు. కేవలం నేను అల్లాహ్ నా వైపు దైవవాణి ద్వారా తెలిపిన దానిని మాత్రమే అనుసరిస్తాను. నేను మీపై చదివిన ఈ ఖుర్ఆను మీ సృష్టికర్త అయిన,మీ వ్యవహారాలను పర్యాలోచనము చేసేవాడైన అల్లాహ్ తరపు నుండి వాదనలు,ఋజువులు (ఆధారాలు). మరియు ఆయన దాసుల్లోంచి విశ్వాస పరుల కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము. విశ్వాస పరులు కాని వారందరు మార్గ విహీనులు,నిర్భాగ్యులు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِذَا قُرِئَ الْقُرْاٰنُ فَاسْتَمِعُوْا لَهٗ وَاَنْصِتُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
ఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు మీరు దాని పారాయణంను శ్రద్ధగా వినండి. మరియు మీరు మాట్లాడకండి,అల్లాహ్ మీపై కనికరిస్తాడని ఆశిస్తూ అది కాకుండా వేరే దానిలో నిమగ్నమవకండి.
ئەرەپچە تەپسىرلەر:
وَاذْكُرْ رَّبَّكَ فِیْ نَفْسِكَ تَضَرُّعًا وَّخِیْفَةً وَّدُوْنَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْاٰصَالِ وَلَا تَكُنْ مِّنَ الْغٰفِلِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువైన అల్లాహ్ ను నిమమ్రతతో,అణుకువతో,భయభక్తితో స్మరించండి. మీ దుఆను మధ్యేమార్గంలో స్వరమును బిగ్గరకు,మెల్లగకు మధ్యలో దిన మొదటి వేళలో ఆరెండు వేళల గొప్పతనము వలన చేయండి. అల్లాహ్ స్మరణ నుండి పరధ్యానంలో ఉండేవారిలోంచి మీరు కాకండి.
ئەرەپچە تەپسىرلەر:
اِنَّ الَّذِیْنَ عِنْدَ رَبِّكَ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَیُسَبِّحُوْنَهٗ وَلَهٗ یَسْجُدُوْنَ ۟
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న వారు దైవదూతలు పరిశుద్ధుడైన ఆయన ఆరాధన చేయటం నుండి గర్వాన్ని చూపరు. కాని వారు దానిని అంగీకరిస్తూ అశ్రధ్ధ వహించకుండా అనుసరిస్తారు. వారు రాత్రింబవళ్ళు అల్లాహ్ కు తగని గుణాల నుండి ఆయన పరిశుధ్దతను తెలుపుతూ ఉంటారు. మరియు వారు ఆయన ఒక్కడికే సాష్టాంగపడుతూ ఉంటారు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• في الآيات بشارة للمسلمين المستقيمين على صراط نبيهم صلى الله عليه وسلم بأن ينصرهم الله كما نصر نبيه وأولياءه.
బుద్ధిమంతుడిపై మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన తప్పనిసరి. ఎందుకంటే ఆయనే ధర్మం యొక్క గొప్ప శాస్త్రాలు కలిగి ఉన్న గ్రంధాన్ని అవతరింపజేసి అతని కొరకు ప్రాపంచిక ప్రయోజనాలను సమకూర్చాడు. మరియు తన దాసుల్లోంచి నీతిమంతులైన వారికి తన రక్షణ,వారి కొరకే తన సహాయము,పరిరక్షణను కలిగించటం ద్వారా ఇహలోక ప్రయోజనాలను సమకూర్చాడు. వారితో శతృత్వమును చూపే వారి శతృత్వము వారికి నష్టం కలిగించదు.

• في الآيات جماع الأخلاق، فعلى العبد أن يعفو عمن ظلمه، ويعطي من حرمه، ويصل من قطعه.
తమ ప్రవక్త మార్గముపై సక్రమంగా ఉండే ముస్లిముల కొరకు అల్లాహ్ తన ప్రవక్త,తన స్నేహితులకు సహాయం చేసినట్లు వారికి సహాయం చేస్తాడన్న శుభవార్త ఆయతుల్లో ఉంది.

• على العبد إذا مَسَّه سوء من الشيطان - فأذنب بفعل محرم، أو ترك واجب - أن يستغفر الله تعالى، ويستدرك ما فرط منه بالتوبة النصوح والحسنات الماحية.
ఆయతుల్లో సుగుణాలు సమీకరించబడ్డాయి. దాసుడు తనపై దౌర్జన్యమునకు పాల్పడిన వారిని క్షమించి వదిలి వేయాలి,తనకు ఇవ్వని వాడికి ఇవ్వాలి,తన నుండి సంబంధము త్రెంచుకున్న వాడితో సంబంధము కలపాలి.

• الواجب على العاقل عبادة الله تعالى؛ لأنه هو الذي يحقق له منافع الدين بإنزال الكتاب المشتمل على العلوم العظيمة في الدّين، ومنافع الدنيا بتولّي الصالحين من عباده وحفظه لهم ونصرته إياهم، فلا تضرهم عداوة من عاداهم.
దాసుడు తనకి షైతాను తరపు నుండి చెడు వాటిల్లి నిషిద్ధకార్యమునకు పాల్పడి పాపము చేస్తే లేదా విధిగావించబడిన దానిని వదిలివేస్తే మహోన్నతుడైన అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవటం,నిజమైన పశ్చాత్తాపము చేసి,పాపాలను తుడిచివేసే సత్కార్యాలు చేసి తన ద్వారా జరిగిన తప్పిదమును విడనాడటం దాసుడిపై తప్పనిసరి.

 
مەنالار تەرجىمىسى سۈرە: ئەئراپ
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش