Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል ሒጅር   አንቀጽ:
وَلَقَدْ جَعَلْنَا فِی السَّمَآءِ بُرُوْجًا وَّزَیَّنّٰهَا لِلنّٰظِرِیْنَ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము ప్రజలు భూమిలో,సముద్రములో తమ ప్రయాణముల్లో దారిని పొందే పెద్ద పెద్ద నక్షత్రాలను ఆకాశములో సృష్టించాము. మరియు దాన్ని చూసేవారి కొరకు,దాన్ని దర్శించేవారి కొరకు వారు దాని ద్వారా పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యము పై ఆధారమును పొందటం కొరకు దానిని అందముగా చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَحَفِظْنٰهَا مِنْ كُلِّ شَیْطٰنٍ رَّجِیْمٍ ۟ۙ
మరియు మేము ఆకాశమును అల్లాహ్ కారుణ్యము నుంచి బహిష్కరించబడిన ప్రతీ షైతాను నుండి రక్షించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَاَتْبَعَهٗ شِهَابٌ مُّبِیْنٌ ۟
కానీ ఎవరైతే మలయిల్ ఆలా దైవ దూతలను దొంగ చాటుగా వింటాడో అతడిని కాంతివంతమైన అగ్ని జ్వాల వెంటాడుతుంది. మరియు అతన్ని దహించివేస్తుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ شَیْءٍ مَّوْزُوْنٍ ۟
మరియు మేము భూమిని ప్రజలు దానిపై నివాసం ఏర్పరచుకోవటం కొరకు విస్తరింపజేశాము.మరియు అది ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా ఉండటానికి అందులో మేము స్థిరమైన పర్వతాలను నాటాము.మరియు అందులో విజ్ఞతను నిర్ణయిచటం ద్వారా నిర్ధారించబడిన,నిర్ణయించబడిన రకరకాల మొక్కలను మొలకెత్తించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ وَمَنْ لَّسْتُمْ لَهٗ بِرٰزِقِیْنَ ۟
ఓ ప్రజలారా మేము మీ కొరకు ఇహలోకములో మీరు జీవించి ఉన్నంత వరకు మీకు జీవనాన్ని కలిగించే తినే వస్తువులను,త్రాగే వస్తువులను భూమిలో తయారు చేశాము. మీరే కాకుండా ప్రజల్లోంచి,జంతువుల్లోంచి వారికి జీవనాన్ని కలిగించే ఆహారోపాధిని మీరు ఏర్పాటు చేయలేని వారి కొరకు మేము తయారు చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِنْ مِّنْ شَیْءٍ اِلَّا عِنْدَنَا خَزَآىِٕنُهٗ ؗ— وَمَا نُنَزِّلُهٗۤ اِلَّا بِقَدَرٍ مَّعْلُوْمٍ ۟
మరియు ప్రజలు,పశువులు ప్రయోజనం చెందే వస్తువులను సృష్టించటంలో,వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం చేయటంలో మేమే సామర్ధ్యం కలవారము.మరియు వాటిలో నుంచి మేము సృష్టించే వాటిని మా విజ్ఞత మరియు మా ఇచ్ఛ నిర్ణయించే నిర్ణీత పరిణామం ద్వారా మాత్రమే మేము సృష్టిస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَرْسَلْنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسْقَیْنٰكُمُوْهُ ۚ— وَمَاۤ اَنْتُمْ لَهٗ بِخٰزِنِیْنَ ۟
మరియు మేము మేఘములను సంపర్కముచేసే గాలులను పంపాము. అప్పుడు వాటి ద్వారా సంపర్కము చెందిన మేఘముల ద్వారా మేము వర్షమును కురిపించాము. మేము మీకు వర్షపు నీటిని త్రాపించాము. ఓ ప్రజలారా మీరు ఈ నీటిని సెలయేర్లు,బావులు అవటానికి భూమిలో నిల్వచేయలేరు. అల్లాహ్ మాత్రమే దానిని అందులో నిల్వచేస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِنَّا لَنَحْنُ نُحْیٖ وَنُمِیْتُ وَنَحْنُ الْوٰرِثُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మృతులను ఉనికిలో లేని స్థితి నుండి వారిని సృష్టించటం ద్వారా,వారిని మరణం తరువాత లేపటం ద్వారా జీవింప చేశాము. మరియు జీవించి ఉన్నవారిని వారి గడువు పూర్తయిన తరువాత మేము మరణింపజేస్తాము.మరియు మేమే భూమికి,దానిపై ఉన్న వాటికి వారసులుగా మిగులుతాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِیْنَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَاْخِرِیْنَ ۟
వాస్తవానికి మీలో నుండి పుట్టుకలో,మరణంలో ముందు గతించిన వారి గురించి మాకు తెలుసు.ఆ రెండింటిలో తరువాత వచ్చే వారి గురించి మాకు తెలుసు.అందులో నుంచి ఏదీ మాపై గోప్యంగా లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِنَّ رَبَّكَ هُوَ یَحْشُرُهُمْ ؕ— اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు సత్కర్మలు చేసిన వాడికి అతని సత్కర్మకు దుష్కర్మకు పాల్పడే వాడికి అతని దుష్కర్మకు ప్రతిఫలమును ప్రసాదించటానికి వారందరిని ప్రళయదినాన సమావేశపరుస్తాడు. నిశ్చయంగా ఆయన తన పర్యాలోచనలో వివేచనాపరుడు. ఆయనపై ఏదీ గోప్యంగా లేని సర్వజ్ఞుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟ۚ
మరియు నిశ్చయంగా మేము ఆదమ్ ను పొడి బంకమట్టితో సృష్టించాము. ఒక వేళ దాన్ని తట్టితే శభ్ధం చేస్తుంది.మరియు అతను సృష్టించబడిన ఈ మట్టి నల్లనిది, అది ఎక్కువ కాలం ఉండిపోవటం వలన వాసన మారిపోయింది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ ۟
మరియు మేము జిన్నుల తండ్రిని ఆదం అలైహిస్సలాంను సృష్టించక మునుపు తీవ్ర వేడి గల అగ్నితో సృష్టించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
ఓ ప్రవక్తా నీ ప్రభువు దైవ దూతలతో మరియు వారితోపాటు ఉన్న ఇబ్లీసుతో ఇలా పలకినప్పటి వైనమును నీవు గుర్తు చేసుకో : నిశ్చయంగా నేను తట్టినప్పుడు మ్రోగే,వాసనను మార్చే నల్లటి పొడి బంక మట్టితో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
నేను అతని రూపమును చక్కదిద్ది అతన్ని సృష్టించటంను పూర్తి చేసినప్పుడు మీరు నా ఆదేశమును పాటిస్తూ,అతనికి నమస్కరిస్తూ అతనికి సాష్టాంగపడండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దైవదూతలందరు తమ ప్రభువు తమకు ఆదేశించినట్లే ఆయనకి సాష్టాంగపడి విధేయత చూపారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰۤی اَنْ یَّكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
కాని దైవదూతలతోపాటు ఉండి కూడా వారిలో నుంచి కాని ఇబ్లీసు దైవదూతలతోపాటు ఆదంకి సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ينبغي للعبد التأمل والنظر في السماء وزينتها والاستدلال بها على باريها.
దాసుడు ఆకాశములో,దాని అలంకరణలో చూడటం,యోచన చేయటం మరియు వాటి ద్వారా దాన్ని సృష్టించిన వాడి గురించి ఆధారం చూపటం అవసరం.

• جميع الأرزاق وأصناف الأقدار لا يملكها أحد إلا الله، فخزائنها بيده يعطي من يشاء، ويمنع من يشاء، بحسب حكمته ورحمته.
అన్ని జీవనోపాధులు, అన్ని రకాల విధివ్రాతలు అల్లాహ్ తప్ప ఇంకెవరికి వాటి అధికారము లేదు.వాటి నిధులు ఆయన చేతిలో ఉన్నవి.తన విజ్ఞతకు,తన కారుణ్యమునకు తగ్గట్టుగా తాను తలచుకున్నవారికి ఇస్తాడు మరియు తాను తలచుకున్న వారికి ఆపుతాడు.

• الأرض مخلوقة ممهدة منبسطة تتناسب مع إمكان الحياة البشرية عليها، وهي مثبّتة بالجبال الرواسي؛ لئلا تتحرك بأهلها، وفيها من النباتات المختلفة ذات المقادير المعلومة على وفق الحكمة والمصلحة.
భూమి చదును చేయబడిన,విస్తరించబడిన సృష్టి దానితోపాటు దానిపై మానవుని జీవన అవకాశమునకు అనుకూలంగా ఉన్నది. మరియు దానిపై నివాసము ఉన్న వారిని తీసుకుని కదలకుండా ఉండటానికి అది ఎత్తైన పర్వతాలతో స్థిరపరచబడినది.అందులో జ్ఞానం,ఆసక్తి ప్రకారం నిర్ణీత,నిర్ధారితమైన రకరకాల మొక్కలు కలవు.

• الأمر للملائكة بالسجود لآدم فيه تكريم للجنس البشري.
దైవదూతలు ఆదంనకు సాష్టాంగపడే ఆదేశం అందులో మానవ జాతికి గౌరవము కలదు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል ሒጅር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት