የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (101) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
وَلَقَدْ اٰتَیْنَا مُوْسٰی تِسْعَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ فَسْـَٔلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ اِذْ جَآءَهُمْ فَقَالَ لَهٗ فِرْعَوْنُ اِنِّیْ لَاَظُنُّكَ یٰمُوْسٰی مَسْحُوْرًا ۟
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు ఆయన కొరకు సాక్ష్యం పలికే తొమ్మిది స్పష్టమైన మహిమలను (ఆధారాలను) ప్రసాధించాము.అవి 1-చేతి కర్ర, 2-చేయి (యదే బైజా), 3-కరువుకాటకాలు, 4-ఆహార ధాన్యాల్లో,ఫలాల్లో కొరత, 5-తుఫాను,6-మిడుతల దండు, 7-పేలు, 8-కప్పలు, 9-రక్తము. అయితే ఓ ప్రవక్తా మీరు యూదులను మూసా వారి పూర్వికుల వద్దకు ఈ మహిమలను తీసుకుని వచ్చినప్పటి వైనమును గురించి అడగండి. అప్పుడు ఫిర్ఔన్ ఆయనతో ఇలా అన్నాడు : ఓ మూసా నీవు తీసుకుని వచ్చిన ఈ వింతల వలన నేను నిన్ను చేతబడి (మంత్రజాలము) చేయబడిన ఒక వ్యక్తిగా భావిస్తున్నాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الله تعالى هو المنفرد بالهداية والإضلال، فمن يهده فهو المهتدي على الحقيقة، ومن يضلله ويخذله فلا هادي له.
మహోన్నతుడైన అల్లాహ్ సన్మార్గం చూపటానికి,అపమార్గము చూపటానికి ఆయన ఒక్కడే. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో వాస్తవానికి అతనే సన్మార్గం పొందాడు. మరియు ఆయన ఎవరికైతే అపమార్గము చూపి పరాభవమునకు గురి చేస్తాడో అతనికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు.

• مأوى الكفار ومستقرهم ومقامهم جهنم، كلما سكنت نارها زادها الله نارًا تلتهب.
అవిశ్వాసపరులు శరణం తీసుకునే చోటు,వారి నివాసము,వారి స్థానము నరకము. దాని అగ్ని ఆరిపోయినప్పుడల్లా అల్లాహ్ దాన్ని అగ్ని జ్వాలలగా అధికం చేస్తాడు.

• وجوب الاعتصام بالله عند تهديد الطغاة والمُسْتَبدين.
నిరంకుశులు,హద్దు మీరేవారు బెదిరించినప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించటం తప్పనిసరి.

• الطغاة والمُسْتَبدون يلجؤون إلى استخدام السلطة والقوة عندما يواجهون أهل الحق؛ لأنهم لا يستطيعون مواجهتهم بالحجة والبيان.
హద్దుమీరేవారు,నిరంకుశులు సత్యవంతులను ఎదుర్కొన్నప్పుడు అధికారమును,బలమును ఉపయోగించుకోవటానికి ఆశ్రయిస్తారు ఎందుకంటే వారు వాదనతో,ఆధారంతో వారిని ఎదుర్కోలేరు.

 
የይዘት ትርጉም አንቀጽ: (101) ምዕራፍ: ሱረቱ አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት