Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (97) ምዕራፍ: አል ኢስራዕ
وَمَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ— وَمَنْ یُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ اَوْلِیَآءَ مِنْ دُوْنِهٖ ؕ— وَنَحْشُرُهُمْ یَوْمَ الْقِیٰمَةِ عَلٰی وُجُوْهِهِمْ عُمْیًا وَّبُكْمًا وَّصُمًّا ؕ— مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— كُلَّمَا خَبَتْ زِدْنٰهُمْ سَعِیْرًا ۟
వాస్తవానికి అల్లాహ్ ఎవరికి సన్మార్గమును పొందే సౌభాగ్యమును ప్రసాధిస్తాడో వాడే సన్మార్గంపై ఉన్నాడు. దాని నుండి ఆయన ఎవరిని పరాభవమునకు లోను చేసి మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో ఓ ప్రవక్తా మీరు వారి కొరకు సత్యం వైపునకు దారి చూపే,వారి నుండి చెడును నిర్మూలించే,వారికి ప్రయోజనమును తీసుకుని వచ్చే రక్షకులను పొందరు. మరియు మేము వారిని ప్రళయ దినాన వారు చూడకుండా,మాట్లాడకుండా,వినకుండా వారి ముఖములపై ఈడ్చబడినట్లు ఉన్న స్థితిలో సమీకరిస్తాము. వారు ఆశ్రమం పొందే వారి నివాసము నరకము. దాని జ్వాలలు చల్లారినప్పుడల్లా మేము వారిపై మండించటమును అధికం చేస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الله تعالى هو المنفرد بالهداية والإضلال، فمن يهده فهو المهتدي على الحقيقة، ومن يضلله ويخذله فلا هادي له.
మహోన్నతుడైన అల్లాహ్ సన్మార్గం చూపటానికి,అపమార్గము చూపటానికి ఆయన ఒక్కడే. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో వాస్తవానికి అతనే సన్మార్గం పొందాడు. మరియు ఆయన ఎవరికైతే అపమార్గము చూపి పరాభవమునకు గురి చేస్తాడో అతనికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు.

• مأوى الكفار ومستقرهم ومقامهم جهنم، كلما سكنت نارها زادها الله نارًا تلتهب.
అవిశ్వాసపరులు శరణం తీసుకునే చోటు,వారి నివాసము,వారి స్థానము నరకము. దాని అగ్ని ఆరిపోయినప్పుడల్లా అల్లాహ్ దాన్ని అగ్ని జ్వాలలగా అధికం చేస్తాడు.

• وجوب الاعتصام بالله عند تهديد الطغاة والمُسْتَبدين.
నిరంకుశులు,హద్దు మీరేవారు బెదిరించినప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించటం తప్పనిసరి.

• الطغاة والمُسْتَبدون يلجؤون إلى استخدام السلطة والقوة عندما يواجهون أهل الحق؛ لأنهم لا يستطيعون مواجهتهم بالحجة والبيان.
హద్దుమీరేవారు,నిరంకుశులు సత్యవంతులను ఎదుర్కొన్నప్పుడు అధికారమును,బలమును ఉపయోగించుకోవటానికి ఆశ్రయిస్తారు ఎందుకంటే వారు వాదనతో,ఆధారంతో వారిని ఎదుర్కోలేరు.

 
የይዘት ትርጉም አንቀጽ: (97) ምዕራፍ: አል ኢስራዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት