የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (49) ምዕራፍ: ሱረቱ አል ከህፍ
وَوُضِعَ الْكِتٰبُ فَتَرَی الْمُجْرِمِیْنَ مُشْفِقِیْنَ مِمَّا فِیْهِ وَیَقُوْلُوْنَ یٰوَیْلَتَنَا مَالِ هٰذَا الْكِتٰبِ لَا یُغَادِرُ صَغِیْرَةً وَّلَا كَبِیْرَةً اِلَّاۤ اَحْصٰىهَا ۚ— وَوَجَدُوْا مَا عَمِلُوْا حَاضِرًا ؕ— وَلَا یَظْلِمُ رَبُّكَ اَحَدًا ۟۠
మరియు కర్మల పుస్తకాలు ఉంచబడుతాయి. తమ కర్మల పుస్తకమును తమ కుడి చేయితో తీసుకునే వారు ఉంటారు,దాన్నే ఎడమ చేతితో తీసుకునే వారు ఉంటారు. ఓ మానవుడా నీవు అవిశ్వాసపరులను అందులో ఉన్న వాటి నుండి భయపడుతుండగా చూస్తావు. ఎందుకంటే వారు ముందు చేసుకున్న అవిశ్వాస కార్యలను,పాప కార్యాలను అందులో తెలుసుకుంటారు. మరియు వారు ఇలా పలుకుతారు : అయ్యో మా పాడుగాను,మా ఆపదా ఈ పుస్తకమేమిటి మా చిన్న వాటినీ వదల లేదు, పెద్ద వాటిని వదల లేదు. కాని వాటన్నింటిని భద్రపరచి,లెక్కవేసి ఉంచింది. మరియు వారు తమ ఇహలోక జీవితంలో చేసుకున్న పాప కార్యాలన్నింటిని వ్రాయబడినవిగా,నిర్ధారించబడినవిగా పొందుతారు. ఓ ప్రవక్తా మీ ప్రభువు ఎవరిని హింసకు గురి చేయడు. ఏ పాపము లేకుండా ఆయన ఎవరినీ శిక్షించడు. విధేయత చూపేవాడికి తన పై విధేయత చూపిన దాని పుణ్యమును ఏమాత్రం తగ్గించడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• على العبد الإكثار من الباقيات الصالحات، وهي كل عمل صالح من قول أو فعل يبقى للآخرة.
దాసుడు శాస్వతంగా ఉండే సత్కార్యాలు చేయాలి. అవి ఆ ప్రతి సత్కార్యము మాటల్లోంచి కాని చేతల్లోంచి కాని ఏదైతే పరలోకంలో శాస్వతంగా ఉండిపోతుందో.

• على العبد تذكر أهوال القيامة، والعمل لهذا اليوم حتى ينجو من أهواله، وينعم بجنة الله ورضوانه.
ప్రళయదినపు భయాందోళనలను గుర్తు చేసుకుని ఆ దినపు భయాందోళనల నుండి బ్రతికి బయటపడి, అల్లాహ్ స్వర్గమును,ఆయన మన్నతను అనుభవించే వరకు ఆ రోజు కొరకు ఆచరణలు చేయటం దాసునిపై తప్పనిసరి.

• كَرَّم الله تعالى أبانا آدم عليه السلام والجنس البشري بأجمعه بأمره الملائكة أن تسجد له في بدء الخليقة سجود تحية وتكريم.
మహోన్నతుడైన అల్లాహ్ సృష్టి ఆరంభంలో దైవ దూతలందరిని మన తండ్రి అయిన ఆదం అలైహిస్సలాంనకు గౌరవప్రదమైన సాష్టాంగ నమస్కారము చేయమని ఆదేశించి ఆయనను,యావత్తు మానవజాతిని గౌరవించాడు.

• في الآيات الحث على اتخاذ الشيطان عدوًّا.
ఆయతుల్లో షైతానును శతృవుగా చేసుకోవటంపై ప్రోత్సహించటం జరిగింది.

 
የይዘት ትርጉም አንቀጽ: (49) ምዕራፍ: ሱረቱ አል ከህፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት