የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (140) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ ؕ— وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఓ గ్రంధవహులార : నిశ్చయంగ ఇబ్రాహీము,ఇస్మాయీలు,ఇస్హాఖు,యాఖూబు,యాఖూబు సంతతి నుంచి వచ్చినప్రవక్తలు యూద ధర్మము లేదా క్రైస్తవ ధర్మము పై ఉండే వారని మీరు అంటున్నారా? ఓ ప్రవక్తా వారికే సమాధానమిస్తూ ఇలా చెప్పండి : మీకు బాగా తెలుసా లేదా అల్లాహ్ కు (బాగా తెలుసా)?! అయితే ఒకవేళ వారు (గ్రంధవహులు) వారి ధర్మం పై ఉన్నారు అని వాధిస్తే వారు ఆబద్ధము పలికారు;ఎందుకంటే వారిని ప్రవక్తగా చేసి పంపడము మరియు వారు మరణించడము తౌరాత్,ఇంజీలు అవతరణ ముందు జరిగింది!.దీన్ని బట్టి వారు అల్లాహ్,ఆయన ప్రవక్త పై ఆబద్ధము పలుకుతున్నారన్న విషయము అర్ధమవుతుంది.మరియు వారు నిశ్చయంగా తమ పై అవతరింపబడిన వాస్తవాన్ని దాచిపెట్టారు,తన వద్ద నిరూపించబడిన సాక్ష్యాన్నిదాచేవాడికన్నాపెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు, దానిని అతడు అల్లాహ్ తో నేర్చుకున్నాడు,గ్రంధవహులు చేసినట్లుగా,అల్లాహ్ మీ ఆచరణల పట్ల అశ్రద్ధవహించడు,వాటి పరంగానే అతడు మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن دعوى أهل الكتاب أنهم على الحق لا تنفعهم وهم يكفرون بما أنزل الله على نبيه محمد صلى الله عليه وسلم.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అవతరింప జేసిన దానిని తిరస్కరిస్తూ తాము సన్మార్గం పై ఉన్నామని గ్రంధవహుల వాదన వారికి ఏమాత్రం లాభం చేకూర్చదు.

• سُمِّي الدين صبغة لظهور أعماله وسَمْته على المسلم كما يظهر أثر الصبغ في الثوب.
ధర్మమునకు దాని ఆచరణలు బహిర్గతమవటం వలన రంగు పేరు ఇవ్వబడినది,ఒక బట్ట పై రంగు గుర్తు ఏ విధంగా బహిర్గతం అవుతుందో ఆ విధంగా ఒక ముస్లిం పై దాని (ధర్మం) గుర్తు బహిర్గతమవుతుంది.

• أن الله تعالى قد رَكَزَ في فطرةِ خلقه جميعًا الإقرارَ بربوبيته وألوهيته، وإنما يضلهم عنها الشيطان وأعوانه.
నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టిరాశులందరి స్వభావంలో తన రుబూబియత్ (సృష్టికర్త,పాలకుడు,సంరక్షకుడు) ,తన ఉలూహియత్ (ఏక దైవోపాసవ) ను స్వీకరించడమును పొందుపరచాడు, షైతాను,అతని సహాయకులు వారిని మార్గ భ్రష్టతకు లోను చేస్తారు.

 
የይዘት ትርጉም አንቀጽ: (140) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት