የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (219) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
یَسْـَٔلُوْنَكَ عَنِ الْخَمْرِ وَالْمَیْسِرِ ؕ— قُلْ فِیْهِمَاۤ اِثْمٌ كَبِیْرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ ؗ— وَاِثْمُهُمَاۤ اَكْبَرُ مِنْ نَّفْعِهِمَا ؕ— وَیَسْـَٔلُوْنَكَ مَاذَا یُنْفِقُوْنَ ؕ۬— قُلِ الْعَفْوَؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟ۙ
ఓ ప్రవక్త మీ అనుచరులు (కమర్) మధ్యపానమును త్రాగటం,దాని క్రియవిక్రయాల ఆదేశము ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నారు (బుద్ధిని కప్పివేసి మతిని పోగొట్టే ప్రతి పదార్థమును కమర్ అంటారు).మరియు జూదము (ఖిమార్) గురించి దాని ఆదేశము ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నారు (ఖిమార్ అంటే పోటీల ద్వారా డబ్బును తీసుకోవటం,పోటీలో పాల్గొనే ఇరు వర్గాల తరుపు నుండి డబ్బు పెట్టడం జరుగుతుంది,వారిలోంచి గెలిచిన వారికి మొత్తం డబ్బు వెళుతుంది).వారినే సమాధానమిస్తూ తెలియజేయండి :బుద్ధిని,ధనాన్ని కోల్పోవటం ద్వారా,ద్వేషాలు,వైరాల్లో పడిపోవటం ద్వారా ఆరెండింటిలో (మధ్యపానము,జూదము) ధార్మిక,ప్రాపంచిక నష్టాలు,చెడులు ఎక్కువగా ఉన్నవి,ఆ రెండింటిలో ఆర్ధిక లాభాలు తక్కువగానే ఉంటాయి.వాటి వలన కలిగే నష్టము,వాటి వలన కలిగే పాపము వాటి లాభము కన్న అధికమే,వాటి నష్టము లాభము కన్న ఎక్కువగా ఉన్నది.అయితే బుద్ధి మంతుడు దాని నుండి దూరంగా ఉంటాడు.అల్లాహ్ తరపు నుంచి వచ్చిన ఈ ప్రకటన మధ్యపానమును నిషేధించినది.ఓ ప్రవక్త మీ అనుచరులు తమ సంపద నుండి స్వచ్చందంగా,విరాళంగా ఏమి ఖర్చు చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు.వారికే సమాధానమిస్తూ తెలపండి మీ అవసరానికి మించి ఉన్న సంపద నుండి మీరు ఖర్చు చేయండి (ఈ ఆదేశము మొదట్లో ఉండేది ఆతరువాత అల్లాహ్ ప్రత్యేక సంపదలో నుంచి నిర్ధారిత ధనం నుండు జకాత్ ను విధిగా చెల్లించమని ఆదేశించాడు).ఇలాంటి ప్రకటనలో ఎటువంటి సందేహము లేదు.అల్లాహ్ మీ కొరకు ధర్మ ఆదేశాలను మీరు యోచించటం కొరకు వివరిస్తున్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الجهل بعواقب الأمور قد يجعل المرء يكره ما ينفعه ويحب ما يضره، وعلى المرء أن يسأل الله الهداية للرشاد.
కార్యాల పర్యావసనాల గురించి అజ్ఞానం మనిషిని అతనికి లాభం చేసే వాటిని అసహ్యించుకునే విధంగా,తనకు నష్టం చేసే వాటిని ఇష్టపడేటట్లుగా చేస్తుంది.మనిషి అల్లాహ్ తో సరైన మార్గమును చూపించమని తప్పని సరిగా వేడుకోవాలి.

• جاء الإسلام بتعظيم الحرمات والنهي عن الاعتداء عليها، ومن أعظمها صد الناس عن سبيل الله تعالى.
గౌరప్రదమైన వస్తువులను గౌరవించటానికి,వాటి విషయంలో హద్దుమీరటం నుండి వారించటానికి ఇస్లాం వచ్చినది. వాటిలోంచి (హద్దుమీరే విషయాల్లోంచి) పెద్దది ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపటం.

• لا يزال الكفار أبدًا حربًا على الإسلام وأهله حتَّى يخرجوهم من دينهم إن استطاعوا، والله موهن كيد الكافرين.
సత్య తిరస్కారులు ఇస్లాంకు వ్యతిరేకంగా,ముస్లింలకు వ్యతిరేకంగా వారిని వారి ధర్మం నుండి తీసివేయటం కొరకు యుద్దం చేస్తూనే ఉంటారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల కుట్రలను బలహీన పరుస్తాడు.

• الإيمان بالله تعالى، والهجرة إليه، والجهاد في سبيله؛ أعظم الوسائل التي ينال بها المرء رحمة الله ومغفرته.
అల్లాహ్ పై విశ్వాసం,ఆయన వైపునకు మరలటం,ఆయన మార్గంలో ధర్మ పోరాటం చేయటం మనిషికి అల్లాహ్ కారుణ్యాన్ని,ఆయన మన్నింపుని పొందటం కొరకు గొప్ప కారకాలు.

• حرّمت الشريعة كل ما فيه ضرر غالب وإن كان فيه بعض المنافع؛ مراعاة لمصلحة العباد.
నష్టం ఎక్కువగా ఉన్న విషయాలు ఒక వేళ అందులో కొద్దిపాటి లాభం ఉన్నా కూడా వాటిని దాసుల శ్రేయస్సు కొరకు ధర్మం నిషేదించినది.

 
የይዘት ትርጉም አንቀጽ: (219) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት