የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (231) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ سَرِّحُوْهُنَّ بِمَعْرُوْفٍ ۪— وَلَا تُمْسِكُوْهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوْا ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ— وَلَا تَتَّخِذُوْۤا اٰیٰتِ اللّٰهِ هُزُوًا ؗ— وَّاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ وَمَاۤ اَنْزَلَ عَلَیْكُمْ مِّنَ الْكِتٰبِ وَالْحِكْمَةِ یَعِظُكُمْ بِهٖ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
మరియు మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చి వారికి వారి గడువు ముగింపు ఆసన్నమైనప్పుడు వారిని మేలుతో మీ వివాహ బంధంలో మరల్చుకోండి లేదా మేలుతో వారిని వారి గడువు పూర్తి అయ్యేవరకు వదిలి వేయండి.వారిపై ధ్వేషమును ప్రదర్శించటానికి,వారికి నష్టం కలిగించటానికి మీరు అజ్ఞాన కాలంలో చేసే విధంగా వివాహ బంధంలో మరల్చుకోకండి.ఎవరైతే ఈ విధంగా వారికి నష్టం కలిగించే ఉద్దేశంతో చేస్తారో వారు తమ పై పాపాన్ని,శిక్షను పిలుపునిచ్చి దుర్మార్గమునకు పాల్పడ్డారు.మీరు అల్లాహ్ ఆయతులతో ఆట్లాడటం,వాటి పై ధైర్యాన్ని ప్రదర్శించి వాటిని పరిహాసంగా చేయకండి.మీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి .వాటిలో గొప్పదైన మీ పై అవతరించిన ఖుర్ఆన్,సున్నతును గుర్తు చేసుకోండి.మీ కొరకు కోరికను పెంచడాన్ని,భయపెట్టడానికి దాని ద్వారా మీకు హితోపదేశం చేస్తున్నాడు.ఆయన ఆదేశాలను పాటిస్తు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడండి.అల్లాహ్ సర్వజ్ఞుడని తెలుసుకోండి.ఆయన నుండి ఏ వస్తువు దాగి ఉండదు.త్వరలోనే అతడు మీ ఆచరణలపై మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• نهي الرجال عن ظلم النساء سواء كان بِعَضْلِ مَوْلِيَّتِه عن الزواج، أو إجبارها على ما لا تريد.
తమ ఆదీనంలో ఉన్న స్త్రీని వివాహం నుండి ఆపటం ద్వారా కాని లేదా ఆమెకు ఇష్టం లేని విషయంలో బలవంతం చేయటం ద్వారా కాని స్త్రీలను హింసించటం నుండి మగ వారికి వారింపు.

• حَفِظَ الشرع للأم حق الرضاع، وإن كانت مطلقة من زوجها، وعليه أن ينفق عليها ما دامت ترضع ولده.
తన భర్త నుండి విడాకులివ్వబడిన తల్లి కొరకు పాలును పట్టించే హక్కును ధర్మం సంరక్షించింది.మరియు ఆమె అతని పిల్లవాడికి పాలు పట్టిస్తున్నంత వరకు ఆమెపై ఖర్చు చేసే బాధ్యత అతనిపై (భర్త) ఉన్నది.

• نهى الله تعالى الزوجين عن اتخاذ الأولاد وسيلة يقصد بها أحدهما الإضرار بالآخر.
అల్లాహ్ తఆలా భార్యాభర్తలిద్దరు ఒకరు ఇంకొకరిని సంతానమును నష్టం చేసే కారకంగా తయారు చేసుకోవటం నుండి వారించాడు.

• الحث على أن تكون كل الشؤون المتعلقة بالحياة الزوجية مبنية على التشاور والتراضي بين الزوجين.
వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతీ విషయం భార్యాభర్తలిద్దరి పరస్పర సంప్రతింపులు,పరస్పర అంగీకారంతో జరగాలని ప్రోత్సహించడం జరిగింది.

 
የይዘት ትርጉም አንቀጽ: (231) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት