የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (264) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُبْطِلُوْا صَدَقٰتِكُمْ بِالْمَنِّ وَالْاَذٰی ۙ— كَالَّذِیْ یُنْفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— فَمَثَلُهٗ كَمَثَلِ صَفْوَانٍ عَلَیْهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلْدًا ؕ— لَا یَقْدِرُوْنَ عَلٰی شَیْءٍ مِّمَّا كَسَبُوْا ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే ప్రజలారా! మీ దాతృత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ మరియు మీరు దానం ఇచ్చిన వ్యక్తిని బాధపెట్టడం ద్వారా మీ ప్రతిఫలాన్ని నాశనం చేసుకో వద్దు. అలాంటి తప్పు చేసే వ్యక్తి ప్రజలకు చూపడానికి మరియు ప్రశంసలు పొందటానికి ఖర్చు చేసిన వాడిగా, అల్లాహ్ పై విశ్వాసం మరియు పునరుత్థాన రోజున లభించబోయే ప్రతిఫలం మరియు శిక్షలపై విశ్వాసం లేనివాడిగా పరిగణించబడతాడు. దీని ఉపమానం, కొంత దుమ్మూ, ధూళి పడి ఉన్న మృదువైన రాయిని పోలి ఉన్నది: ఆ రాయిపై భారీ వర్షం పడినప్పుడు, దానిపై చేరిన దుమ్ము, ధూళి కొట్టుకు పోతుంది మరియు దానిపై ఏమీ లేకుండా, అది నున్నగా కనబడుతుంది. అదేవిధంగా, ఇతరులకు చూపించాలని చేసే పనుల మరియు దానధర్మాల ప్రతిఫలం అల్లాహ్ దృష్టిలో ఏమీ మిగలదు. అల్లాహ్ అవిశ్వాసులకు తను మెచ్చే వాటి వైపు మరియు వారికి ప్రయోజనం చేకూర్చే వాటి వైపు మార్గనిర్దేశం చేయడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• مراتب الإيمان بالله ومنازل اليقين به متفاوتة لا حد لها، وكلما ازداد العبد نظرًا في آيات الله الشرعية والكونية زاد إيمانًا ويقينًا.
విశ్వాసం యొక్క స్థాయిలు మరియు విశ్వాసం యొక్క దశలకు ఎలాంటి పరిమితి లేదు. దాసుడు అల్లాహ్ యొక్క షరయీ,విశ్వపు సూచనలను చూసినపప్పుడల్లా విశ్వసపరంగా,నమ్మకపరంగా అధికమవుతాడు.

• بَعْثُ الله تعالى للخلق بعد موتهم دليل ظاهر على كمال قدرته وتمام عظمته سبحانه.
ప్రజలు మరణించిన తరువాత మరలా వారి పునరుత్థానం అల్లాహ్ యొక్క పరిపూర్ణ సామర్థ్యం మరియు గొప్పతనానికి స్పష్టమైన నిదర్శనం.

• فضل الإنفاق في سبيل الله وعظم ثوابه، إذا صاحبته النية الصالحة، ولم يلحقه أذى ولا مِنّة محبطة للعمل.
ఎలాంటి చూపుగోలు మరియు చేసిన ఉపకారాన్ని ఎత్తి చూపడం వంటివి లేకుండా మంచి ఉద్దేశ్యంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే, దానికి బదులుగా గొప్ప అనుగ్రహం మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నది.

• من أحسن ما يقدمه المرء للناس حُسن الخلق من قول وفعل حَسَن، وعفو عن مسيء.
ఒక వ్యక్తి చేయగలిగే ఒక ఉత్తమ పని ఏమిటంటే, మంచి పలుకుల ద్వారా లేదా మంచి పనుల ద్వారా, ఇంకా తనకు చెడు చేసిన వ్యక్తిని క్షమించడం ద్వారా తన మంచి ప్రవర్తన ప్రదర్శించడం.

 
የይዘት ትርጉም አንቀጽ: (264) ምዕራፍ: ሱረቱ አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት