የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (58) ምዕራፍ: ሱረቱ አልን ኑር
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِیَسْتَاْذِنْكُمُ الَّذِیْنَ مَلَكَتْ اَیْمَانُكُمْ وَالَّذِیْنَ لَمْ یَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلٰثَ مَرّٰتٍ ؕ— مِنْ قَبْلِ صَلٰوةِ الْفَجْرِ وَحِیْنَ تَضَعُوْنَ ثِیَابَكُمْ مِّنَ الظَّهِیْرَةِ وَمِنْ بَعْدِ صَلٰوةِ الْعِشَآءِ ۫ؕ— ثَلٰثُ عَوْرٰتٍ لَّكُمْ ؕ— لَیْسَ عَلَیْكُمْ وَلَا عَلَیْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ؕ— طَوّٰفُوْنَ عَلَیْكُمْ بَعْضُكُمْ عَلٰی بَعْضٍ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీ బానిస పురుషులు,మీ బానిస స్త్రీలు,ప్రజ్ఞా వయస్సుకు చేరని స్వతంతృలైన పిల్లలు మూడు వేళల్లో మీతో అనుమతి తీసుకోవాలి అవి : 1) ప్రొద్దున నమాజు కన్నముందు నిద్ర బట్టలను మార్చి మేల్కొనే బట్టలు వేసుకునే వేళ, 2) మద్యాహ్న నమాజు తరువాత మీరు విశ్రాంతి కొరకు మీ వస్త్రములను విడిచిన వేళ, 3) ఇషా నమాజు తరువాత ఎందుకంటే అది మీ నిద్ర సమయము మరియు మేల్కొన్నప్పుడు వేసుకున్న బట్టలను విడిచి నిద్ర బట్టలు తొడుగుకునే సమయము. ఈ మూడు మీ పరదా సమయములు. ఆ సమయాలలో వారు మీ వద్దకు మీ అనుమతి తరువాతే రావాలి. వేరే సమయములలో అనుమతి లేకుండా వారు మీ వద్దకు వస్తే మీ పై ఎటువంటి పాపం లేదు. వారు ఎక్కువగా వస్తూ పోవు వారు. మీరు ఒకరి వద్దకు ఒకరు వచ్చి పోయేవారు. అనుమతితో తప్ప అన్ని సమయాలలో ప్రవేశించకుండా వారిని నిరోధించలేము. ఏ విధంగానైతే అల్లాహ్ మీకు అనుమతి తీసుకునే ఆదేశాలను స్పష్టపరచాడో మీ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన ఆదేశములను సూచించే ఆయతులను మీ కొరకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనాల గురించి బాగా తెలిసినవాడు,వారి కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• اتباع الرسول صلى الله عليه وسلم علامة الاهتداء.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం సన్మార్గం పొందటమునకు సూచన.

• على الداعية بذل الجهد في الدعوة، والنتائج بيد الله.
ధర్మ ప్రచారంలో శ్రమను ధారపోయటం ప్రచారకుని బాధ్యత. మరియు ఫలితాలు అల్లాహ్ చేతిలో ఉన్నవి.

• الإيمان والعمل الصالح سبب التمكين في الأرض والأمن.
విశ్వాసం,సత్కార్యము భూమిపై సాధికారతకు మరియు భద్రతకు కారణం.

• تأديب العبيد والأطفال على الاستئذان في أوقات ظهور عورات الناس.
ప్రజల సిగ్గు ప్రదేశాలు బహిర్గతమయ్యే వేళల్లో అనుమతి తీసుకోవటంపై బానిసల,పిల్లల యొక్క క్రమశిక్షణ.

 
የይዘት ትርጉም አንቀጽ: (58) ምዕራፍ: ሱረቱ አልን ኑር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት